Karthika Deepam September 16th Update: వారంలో కథ ముగించేస్తానన్న దీప, వెయిటింగ్ అన్న మోనిత - ఇకపై గతం గుర్తుచేసుకునేదే లే అన్న కార్తీక్
Karthika Deepam September 16th Update: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...
Karthika Deepam September 16th Episode 1459 (కార్తీకదీపం సెప్టెంబరు 16 ఎపిసోడ్)
మీ భర్త గతం మర్చిపోయాడంట కదా..ఇక్కడికి కొంత దూరంలో ప్రకృతి వైద్యశాల ఉంది.. మందిస్తాం అంటారు.. ఇలాంటి కబుర్లు చెప్పి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారని తెలుసు మీరు వెళ్లండని మండిపడుతుంది మోనిత. ఏంటో ఎవరైనా గతం గుర్తుచేసేందుకు మందిస్తాం అంటే సంతోషించి తీసుకొస్తారు ఈవిడేంటో అనుకుంటూ బయటకు వెళతారు. ఇదంతా విన్న దీప.. వాళ్లతో మాట్లాడుతుంది. ఆ మందు తీసుకునేందుకు తాను వస్తానంటుంది. ఆ మందుకోసం రెండు రోజులు అక్కడే ఉండాలని చెబుతారు. సరేనన్న దీప వాళ్ల దగ్గర ఫోన్ నంబర్ తీసుకుంటుంది.. ఆ తర్వాత వాళ్ల అన్నయ్య దగ్గరకు వెళ్లిన దీప..జరిగినదంతా చెబుతుంది. ఆయుర్వేదం మంచిదే కదమ్మా వినియోగించడం మంచిదే అంటాడు. ఏ హాస్పిటల్ అది అని అడిగితే ఫోన్ నంబర్ ఇచ్చారని చెబుతుంది దీప. కాల్ చేసిన డాక్టర్...ఇదెక్కడి హాస్పిటల్ అని అడిగితే.. హాస్పిటల్ కాదు ప్రకృతి చికిత్సాలయం అని చెప్పి..మందుకి సూర్యరశ్మి తగలకూడదని చెబుతారు. నువ్వెళ్లమ్మా అంటాడు డాక్టర్ అన్నయ్య..
కార్తీక్-మోనిత: కార్తీక్ ఒంట్లో ఎలా ఉందని అడుగుతుంది మోనిత.. ట్యాబ్లెట్ వేసుకున్నా కదా బావుంది అంటుంది. దొంగ ఏడుపు మొదలెడుతుంది మోనిత..
మోనిత:బాబుని కూడా దూరం చేసుకుని నీకోసమే బతుకుతున్నా..కానీ..గతం గుర్తుచేసుకునేందుకు ప్రయత్నించి ఏదో అయిపోతున్నావ్..నీకేమైనా అయితే నేనేం అయిపోవాలి కార్తీక్ అని దొంగ ఏడుపు ఏడుస్తుంది. నీకు గతం ఎందుకు.. మన బిడ్డ కూడా వస్తే మనం ముగ్గురం చాలు ఇక ఆ గతం గురించి ఆలోచించడం మానెయ్ కార్తీక్
కార్తీక్: నువ్వు ఏడవకు మోనిత..ఆలోచించను. బాబు చెన్నైలో ఉన్నాడన్నావ్ ఎప్పుడు తీసుకొస్తావ్...
మోనిత: వంటలక్కని గుర్తుపెట్టుకున్నట్టే బాబుని కూడా గుర్తుపెట్టుకున్నాడన్నమాట.. వాడిని తీసుకొస్తే సమస్య తీరిపోతుంది..
నీ ఆరోగ్యం బాగాలేదుకదా అని ఆలోచిస్తున్నా..
కార్తీక్: అలా అయితే నేను కూడా వస్తాను
మోనిత: ఇప్పుడు నువ్వు జర్నీ చేయడం అనవసరం కార్తీక్..శివని నీ దగ్గర పెట్టి వెళతాను...
Also Read: దీపతో ఫోన్లో మాట్లాడిన శౌర్య, ఆనంద్ కోసం ఓ వైపు మోనిత-మరోవైపు హిమ ఆరాటం!
దీప-మోనిత: మరోవైపు దీప ఇంటికి తాళం వేస్తుంటే చూసి మోనిత నవ్వుకుంటుంది... అంత తెలివైనదానివి ఇంత తెలివైనదానివి అంటావ్ ఇంత ఈజీగా ఫూల్ అయిపోయావ్ ఏంటి..నువ్వెళ్లి వచ్చేలోగా నేనువెళ్లి ఆనంద్ ని తీసుకొచ్చేస్తాను అనుకుంటుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్యా కొద్దిసేపు ఎప్పటిలానే డిస్కషన్ నడుస్తుంది. గతం గుర్తొచ్చి నా దగ్గరకు వచ్చే రోజు వస్తుందని దీప.. గతం గుర్తొస్తుందంటావా వంటలక్కా అని మోనిత అంటారు. ( అంటే ఈ మందు ప్లాన్ అంతా మోనితదే) వారంలో కథ ముగిస్తానని దీప.. నేను అందుకోసమే ఎదురుచూస్తున్నానని దీప సవాల్ చేసుకుంటారు... ( ఇంత పిచ్చిగా ఎలా నమ్మేశావ్ దీపక్కా..మొదటి సారి నిన్ను చూస్తే పాపం అనిపిస్తోంది అనుకుంటుంది మోనిత).
దీప-శౌర్య: ప్రకృతి ఆశ్రమానికి బయలుదేరిన దీప..ఆటో వెనుక శౌర్య రాసిన..అమ్మా-నాన్న ఎక్కుడున్నారని రాసి ఉన్న ఆటో చూసి శౌర్యని గుర్తుచేసుకుంటుంది. అంటే అమ్మా నాన్న లేరా...ఉన్నా దూరంగా ఉన్నారా అనుకుంటుంది. ఇంతలో ఇంద్రుడికి కాల్ చేసిన జ్వాల(శౌర్య)..పిన్ని సరుకులు చెప్పింది లిస్ట్ రాసుకో అంటుంది. నీకు జలుబు తగ్గలేదమ్మా గొంతుకూడా గుర్తుపట్టలేకుండా ఉందంటాడు... ఇంతలో ఆ లిస్టు నేను రాస్తాను ఆటో తియ్యు అంటుంది దీప. ఆ ఫోన్ దీప తీసుకుంటుంది. ఇది అమ్మ గొంతులా ఉందే అనుకుంటూ ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అనుకుని ఎవరామె అని అడుగుతుంది. అది దీప గొంతే అని శౌర్య గుర్తుపట్టేస్తుంది కానీ ( ఈ సౌండ్ కి గొంతు సరిగ్గా తెలియడం లేదు అనుకుంటుంది). శౌర్య సరుకుల లిస్ట్ చెబుతుంది దీప రాస్తుంది.
ఆ తర్వాత బస్టాండ్ దగ్గర దిగుతుంది దీప.. ఏ ఊరు వెళుతున్నారమ్మా అని అడుగుతాడు ఇంద్రుడు... దీప ప్రకృతి వైద్యశాల గురించి చెబుతుంది. ఇదంతా విన్న ఇంద్రుడు...మీకెవరో తప్పుడు సమచారం ఇచ్చారు, ఆ పక్కనే మా ఊరుందని చెబుతాడు ఇంద్రుడు. అప్పుడు దీప ఆలోచనలో పడుతుంది.. డాక్టర్ బాబుకి గతం గుర్తుచేసేందుకు ప్రయత్నించిన ప్రతిసారీ కంగారుపడేది కానీ ఈ సారి ఆల్ ది బెస్ట్ చెప్పిందంటే ఇదంతా మోనిత ప్లానే అని క్లారిటీ వచ్చేస్తుంది.
Also Read: వసుధారకు చాలా చాలా ద గ్గ ర గా రిషి, ఈగోమాస్టర్లో మరో యాంగిల్!
శౌర్య-ఇంద్రుడు: అటు శౌర్య మాత్రం..తనతో ఫోన్లో మాట్లాడింది అమ్మేనా అనుకుంటూ మళ్లీ ఇంద్రుడికి కాల్ చేస్తుంది. ఇందాక నీతో మాట్లాడిన ఆవిడ ఫొటో పంపించవా అని అడిగితే.. ఆమెను దింపేశానమ్మా అంటుంది. ఆవిడే మా అమ్మ అనిపించింది బాబాయ్ అని అందుకే అడిగానంటుంది. నువ్వు అమ్మకోసం వెతికినట్టే ఆవిడ మీ అమ్మే అయిఉంటే పిల్లల కోసం వెతికేది..వాళ్లాయనకి ఆరోగ్యం బాలేదని మందుకోసం వెళుతోందని చెప్పి కాల్ కట్ చేస్తాడు ఇంద్రుడు...
అసలు విషయం తెలుసుకున్న దీప..వెనక్కు తిరిగి వచ్చేస్తుంది. మందుకోసం వెళతానన్నావ్ కదా వెళ్లలేదా అని డాక్టర్ అన్నయ్య అడిగితే.. మోనిత నన్ను ఊరునుంచి బయటకు పంపించేందుకు ఆడిన నాటకం అని చెబుతుంది.. వాళ్లంతా షాక్ అవుతారు..