News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Karthika Deepam September 15th Update: దీపతో ఫోన్లో మాట్లాడిన శౌర్య, ఆనంద్ కోసం ఓ వైపు మోనిత-మరోవైపు హిమ ఆరాటం!

Karthika Deepam September 15th Update: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ మలుపులు తిరుగుతోంది. కార్తీక్ నుంచి మోనితను కాపాడుకునే ప్రయత్నాల్లో ఉంది వంటలక్క...

FOLLOW US: 
Share:

Karthika Deepam September 15th Episode 1458 (కార్తీకదీపం సెప్టెంబరు 15 ఎపిసోడ్)

వంటలక్కపై కోపంతో అరుస్తుంటాడు కార్తీక్. లోపలకు రండి డాక్టర్ బాబు అని పిలిస్తే..నువ్వే బయటకు రా అని కేకలేస్తాడు. మోనితకి ఆరోగ్యం బాలేదని చెబితే..మీ అన్నయ్యని తీసుకొచ్చి ఏకంగా వంటే చేయొద్దని చెబుతావా...అంటే నువ్వు మా ఇంట్లో వంటమనిషిగా చేరిపోదామానా అని ఫైర్ అవుతాడు..
దీప: మీకు గతం గుర్తొస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి
కార్తీక్: మోనిత నువ్వు మంచిదానివి కాదని చెప్పింది నేను వినలేదు..
దీప: అది కాదు డాక్టర్ బాబు..
కార్తీక్: మోనితకు పెట్టిన టిఫిన్లో ఏదో కలిపావ్, నన్ను దక్కించుకునేందుకు చూస్తున్నావని మోనిత అంటోంది.. అసలు నీతో మాట్లాడకుండా ఉండాల్సింది..గుళ్లో ప్రమాణం చేశాక నీ పొరపాటు లేదని వెనకేసుకుని వచ్చాను... ఇప్పుడు నువ్వు చేసింది చూస్తుంటే టిఫిన్లో ఏదో కలిపావని అనుమానం వస్తోంది..
దీప: లేదు డాక్టర్ బాబు
కార్తీక్: మాట్లాడకుండా ఉన్నావంటే ఏదో ఉంది..నాకు పెళ్లైంది..మోనిత నా భార్య..తెలిసి కూడా పరాయి స్త్రీ భర్తని ఎలా కోరుకుంటున్నావ్..ఏడవకు..ఏమీ తెలియని అమాయకురాలిలా కనిపిస్తావ్ కానీ చేసే పనులు మాత్రం వేరు.. అన్ని విషయాలు మరిచిపోతాను కానీ నీ విషయాలు మాత్రం గుర్తుంటాయి.. కానీ మోనిత ఏమంటోందో తెలుసా.. వంటలక్కపై ఏదో ఉంది ఆవిడ ఏం చేసినా ఏమీ అనడం లేదంటోంది మోనిత.. నీ ప్రవర్తన కూడా ఆవిడ అనుమానాలకు తగ్గట్టే ఉంది.
దీప: నేనెప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు..
కార్తీక్: నాకు మెమొరీ ప్రాబ్లెమ్ నీకు కాదు కదా..మోనితకు తప్ప నా జీవితంలో మరో స్త్రీకి చోటులేదు..నాపై ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు..నాకోసం పిచ్చి పనులు చేయొద్దు..అర్థం అయిందా..మళ్లీ మళ్లీ ఇది నాతో చెప్పించుకోవద్దు...

Also Read: వసు ఎందుకలా చేసిందో అర్థంకాని అయోమయంలో రిషి, షాక్ అయిన దేవయాని, గౌతమ్!

మోనిత
ఏ రకంగా ఆలోచించినా ఆనంద్ ని తీసుకురావడం మంచిదే అనిపిస్తోంది. ఆనంద్ కార్తీక్ లోకం అయితే నేను లోకంగా మారుతా..కానీ నేను వెళ్లి ఆనంద్ ని తీసుకొచ్చేలోగా దీప దగ్గరైపోతే అదీ సమస్య... పోనీ కార్తీక్ ని తీసుకెళదాం అనుకుంటే అక్కడంతా కార్తీక్ ని గుర్తుపట్టేస్తారు అది మరీ సమస్య... కార్తీక్ నా చేయి జారిపోతాడు.. కార్తీక్ నన్ను వదలి వెళ్లకుండా ఆనంద్ నా దగ్గరకు వచ్చేలా చేయాలి... పోనీ.. లక్ష్మణ్ ని తెమ్మందామంటే అదింకా ప్రమాదం..ఏం చేద్దాం.. అదెలా సాధ్యం అవుతుంది...ఒకే ఒక దారి ఉంది.. నేను ఆనంద్ కోసం వెళ్లినప్పుడు దీప ఇక్కడ ఉండకుండా చేయాలి.. కానీ దీపను ఎక్కడికి పంపించాలి ఎలా పంపించాలి...

దీప-డాక్టర్ అమ్మ-డాక్టర్ అన్నయ్య
దీప: నా భర్త నుంచి దూరం చేయడమే కాకుండా అది నన్నే తిట్టేలా చేస్తోంది..
డాక్టర్ అన్నయ్య: ఇలా జరుగుతుందని నాకు ముందే తెలుసు..బాధపడకమ్మా
దీప: ప్రేమ పంచుకోవాల్సిన భర్తతో మాటలు పడాల్సిన పరిస్థితి వస్తే ఏ ఆడది భరించగలదు
డాక్టర్ అమ్మ: ఆయన చిన్న పిల్లాడితో సమానం..ఈ రోజు అన్నమాటలు రేపటికి గుర్తుండదు
డాక్టర్ అన్నయ్య: ఆయనకు మరుపు అనే సమస్య ఉందికాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారు...
దీప: నా భర్త..డాక్టర్ బాబుగా ఏమైనా అననీ అన్నయ్యా..కానీ..మోనిత చేతిలో కీలుబొమ్మలా మారి మాట్లాడుతుంటే కష్టంగా ఉంటోంది..
అన్నయ్య: పూర్తి స్పృహలో ఉన్నప్పుడే మోనితను ధైర్యంగా ఎదుర్కొన్నావ్...నువ్వు పూర్తిస్థాయిలో ప్రయత్నం చేయి. కానీ మోనిత సామాన్యురాలు కాదు..ఆమె దగ్గర్నుంచి డాక్టర్ బాబుని బయటకు తీసుకురావడం అంత సులువేం కాదు. తనని తక్కువ అంచనా అస్సలు వేయొద్దు.. నీజీవితానికి పట్టిన దీర్ఘకాలిక రోగం మోనిత..దానికి నువ్వే వైద్యం చేసుకోవాలి...

Also Read:  మన బాబు దొరికాడంటూ కార్తీక్ ని కట్టిపడేసిన మోనిత, వంటలక్కని మళ్లీ అనుమానించిన డాక్టర్ బాబు
ఆనందరావు-హిమ: మోనిత ఆంటీ తమ్ముడిని వదిలేయడం ఏంటి..అక్కడెక్కడో ఉండడం ఏంటి..మనం తెచ్చేసుకుందాం తాతయ్యా అని హిమ అడుగుతుంది. నేను అడిగితే ఇవ్వనన్నారు నానమ్మతో మాట్లాడి తెచ్చుకుందాం తాతయ్యా అంటుంది.
ఆనందరావు: తీసుకురావడం సమస్య కాదు కానీ.. ఈ బాబు ఎవరని అడిగితే అబద్ధం చెప్పాలి. పెద్దోడికి ఇద్దరు కూతుర్లు కదా..ఈ బాబు ఎవరు అంటే మోనిత కొడుకు అని చెప్పాల..అదెంత తలవంపులు తెస్తుందో...

వారణాసి-జ్వాల: నీకు లంచ్ బాక్స్ పెట్టాను వారణాసి..జ్వాలమ్మా నిద్రలేవకముందే వెళ్లు అంటుంది చంద్రమ్మ. ఇంతలో జ్వాల (శౌర్య) అక్కడకు వస్తుంది. అమ్మా నాన్నలు కనిపిస్తే మిమ్మల్ని వదిలి వాళ్లతో వెళ్లిపోతానని బాధపడుతున్నారా...దానికోసం అయితే ఆలోచించవద్దు పిన్నీ హైదరాబాద్ లో మా ఇల్లు ఎంత పెద్దదో చూశారు కదా అక్కడే అందరంకలసి ఉందాం అంటుంది శౌర్య. ఎమోషన్ అయిన చంద్రమ్మ..నువ్వెక్కడున్నా సంతోషంగా ఉంటే చాలమ్మా వెళ్లిరా అంటుంది... ఇంకా వాళ్ల అమ్మా నాన్న బతికే ఉన్నారనే ఆలోచనలో ఉందని బాధపడుతుంది చంద్రమ్మ...

మనసులో ఎంత బాధఉన్నా వంటలో మాత్రం అస్సలు తేడా రానివ్వవమ్మా..నిజంగా కార్తీక్ చాలా మిస్సవుతున్నాడు. అన్నయ్యా డాక్టర్ బాబుని ఇక్కడకు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పిద్దామా అని దీప అడుగుతుంది... 
డాక్టర్ అన్నయ్య: ఇది బలవంతంగా చేసే ట్రీట్మెంట్ కాదు.. పేషెంట్ సహకరించి గతం గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేయాలి. ఇప్పుడురిస్క్ చేస్తే కార్తీక్ దీపకు పూర్తిగా దూరమైపోతాడు.. మోనిత తన భార్య అనుకుంటున్నాడు కాబట్టి దీపకి ఈ అవసరం ఏంటి.. మోనితకి ఎందుకు చెప్పొద్దని నిలదీస్తాడు..అప్పుడు దీపపై పూర్తిగా చెడు అభిప్రాయం ఏర్పరుచు కుంటాడు. 
దీప: గతం గుర్తుకురావడం నాలుగు రోజులు ఆలస్యం అయినా పర్వాలేదు కానీడాక్టర్ బాబు నన్ను మర్చిపోకూడదు...
అన్నయ్య: నీ ప్రేమతో మాత్రమే తనకి గతం గుర్తుచేయాలి...కాదని బలవంతంగా ఎలాంటి ప్రయత్నం చేసినా ప్రమాదమే...
దీప: పిల్లలు ఓ దగ్గర, నేనో దగ్గర, ఆయనో దగ్గర...ఉన్నాం. ప్రేమతోనే ఆయన్ని దక్కించుకుంటాను....

మీ భర్త గతం మర్చిపోయాడంట కదా..ఇక్కడికి కొంత దూరంలో ప్రకృతి వైద్యశాల ఉంది.. మందిస్తాం అంటారు.. ఇలాంటి కబుర్లు చెప్పి డబ్బులు గుంజే ప్రయత్నం చేస్తారని తెలుసు మీరు వెళ్లండంటుంది మోనిత. డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తాం అంటారు... ఎపిసోడ్ ముగిసింది

రేపటి(శుక్రవారం) ఎపిసోడ్ లో
'అమ్మా నాన్న ఎక్కడున్నారు'అని రాసి ఉన్న ఆటో దగ్గరకే వస్తుంది దీప. ఇంతలో శౌర్య..ఇంద్రుడికి కాల్ చేసి సరుకులు తీసుకురమ్మని చెబుతుంది. అప్పుడు దీప..బస్ కి టైమ్ అవుతోంది ఆ సరుకుల లిస్ట్ నేనురాస్తానని ఫోన్ తీసుకుంటుంది... అట్నుంచి శౌర్య..ఇది అమ్మ గొంతులా ఉందే అని గుర్తుపట్టేస్తుంది...

Published at : 15 Sep 2022 08:29 AM (IST) Tags: Karthika Deepam Serial karthika deepam latest episode Nirupam Sobha Shetty premi archana doctor babu vantalakka monitha soundarya Karthika Deepam September 15th update Karthika Deepam Today Episode 1458

ఇవి కూడా చూడండి

Naga Panchami Today Episode మోక్ష కంటే ముందు తానే చనిపోవాలని నిర్ణయించుకున్న పంచమి!

Naga Panchami Today Episode మోక్ష కంటే ముందు తానే చనిపోవాలని నిర్ణయించుకున్న పంచమి!

Bigg Boss 7 Telugu: శోభాను కాలితో తన్నిన అమర్‌దీప్ - ఓట్లపై మోనిత ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రియాంకతో వాదన

Bigg Boss 7 Telugu: శోభాను కాలితో తన్నిన అమర్‌దీప్ - ఓట్లపై మోనిత ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రియాంకతో వాదన

Bigg Boss 17: ‘బిగ్ బాస్’లో ముద్దులు పెట్టుకున్న కంటెస్టెంట్స్, రాత్రయితే రచ్చే - తిట్టిపోస్తున్న జనం

Bigg Boss 17: ‘బిగ్ బాస్’లో ముద్దులు పెట్టుకున్న కంటెస్టెంట్స్, రాత్రయితే రచ్చే - తిట్టిపోస్తున్న జనం

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్‌లో తడిచి ముద్దయిన కంటెస్టెంట్స్ - పార్టీయా? పనిష్మెంటా?

Bigg Boss 7 Telugu: ‘బిగ్ బాస్’ హౌస్‌లో తడిచి ముద్దయిన కంటెస్టెంట్స్ - పార్టీయా? పనిష్మెంటా?

Dinesh Phadnis : CID సీరియల్ నటుడు ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూసిన ‘ప్రణీత్’

Dinesh Phadnis : CID సీరియల్ నటుడు ఇక లేరు - అనారోగ్యంతో కన్నుమూసిన ‘ప్రణీత్’

టాప్ స్టోరీస్

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
×