Karthika Deepam July 27 Update Episode 1415: నిరుపమ్-శౌర్యకి ప్రైవసీ కల్పించిన హిమ, మోనితలా తాళి కట్టుకుంటానన్న శోభ
Karthika Deepam july 27 Episode 1415: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...
కార్తీకదీపం జులై 27 బుధవారం ఎపిసోడ్ (Karthika Deepam july 27 Episode 1415)
శోభ ఇంటికి రావడంతో నిరుపమ్ ఇంట్లోంచి వెళ్లిపోతాడు. ఈ విషయంపై స్వప్న ఇంట్లో పెద్ద రచ్చే చేస్తుంది. నేను ఓడిపోకూడదంటే నిరుపమ్ ని ఎలాగైనా ఇక్కడకు తీసుకురావాలని భర్త సత్యానికి చెబుతుంది. ఇంట్లో పెద్ద రచ్చ జరుగుతుంటే శోభ మాత్రం బయట కూర్చుని నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంది.
ఇప్పుడేం చేద్దాం అని ఆనందరావు-సౌందర్య ఆలోచిస్తారు. పెళ్లి పెళ్లి అని హిమ వెంట నిరుపమ్ పడుతుంటే శౌర్య మరింత ఫీలవుతుందని సౌందర్య అంటుంది.సాధ్యమైనంత వరకూ బావకు దూరంగా ఉండకపోతే శౌర్య ఫీలవుతుందని హిమ అనుకుంటుంది. ఇంతలో నిరుపమ్ వచ్చి నీకోసం ఏం తెచ్చానో చూడు. నా ఆలోచన నా మనసు నీకు అర్థం కావడం లేదు. ఎప్పుడూ నిన్ను చుడిదార్లో చూడడమేనా నీకోసం జీన్స్ టీషర్ట్ తీసుకొచ్చాను
హిమ: వద్దు బావా నాకు నచ్చవు..
నిరుపమ్: నాకు నచ్చుతాయి హిమా..కాబోయే వైఫ్ ని ఇలా ఫ్యాషన్ డ్రెస్సులో చూడడం తప్పా .బావుంటుంది..వెళ్లు ట్రై చేయి..చూడు హిమా నువ్వు ఎన్ని అబద్ధాలు చెప్పినా ఏం చేసినా ఒక్కమాటైనా అన్నానా అలేదు కదా..క్యాన్సర్ అని పెద్ద అబద్ధం చెప్పినా ఎందుకు కోపం రాలేదో తెలుసా ప్రేమ..ఇదే ప్రేమతో చిన్న కోరిక అడిగితే నో అనడం కరెక్ట్ కాదు.
హిమ: ఎందుకిలా ప్రవర్తిస్తున్నావ్
నిరుపమ్: క్లినిక్ లోనే డాక్టర్ ని ఇక్కడ మాత్రం లవ్ ని. నాకు కోపం వస్తే డైరెక్ట్ గా శౌర్య దగ్గరకు వెళతాను. ఈ డ్రెస్సు హిమకు తీసుకొచ్చాను నువ్వైనా చెప్పవా ప్లీజ్
హిమ: నువ్వు నిజంగానే ఇడియట్ వి బావా..ఇప్పుడే వస్తాను..నన్ను నిజంగా ఇబ్బంది పెడుతున్నావ్ బావా..
Also Read: హిమ-నిరుపమ్-శౌర్య అంతా ఒకే ఇంట్లో, ఊహల్లో తేలుతున్న ప్రేమ్ -మరో కుట్రకు సిద్ధమైన శోభ
నిరుపమ్ ఇచ్చిన జీన్స్, టీషర్ట్ వేసుకుని వస్తుంది హిమ. నిన్ను ఇలా చూసి నా సెలెక్షన్ సూపర్ అని నేనే అనుకోవాలి తెలుసా అంటూ ఐ లవ్ యూ హిమా అని అరుస్తాడు. అప్పుడే అక్కడకు వస్తుంది శౌర్య. నిరుపమ్ ఫుల్ హ్యాపీగా ఉంటాడు. శౌర్య కోపంగా..హిమ టెన్షన్ గా ఉంటారు.
శౌర్య: రూమ్ లో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది శౌర్య. రావద్దంటూనే వచ్చాను..ఉండకూడదు అంటూనే ఉన్నాను. ఇప్పుడు మాత్రం అస్సలు ఆగకూడదంటూ బ్యాగ్ సర్దుకుని బయలుదేరుతుంది..
ఆనందరావు సౌందర్య కూడా బ్యాగ్ సర్దుకుని బయలుదేరుతారు..ఇన్నాళ్లూ మమ్మల్ని వదిలిపెట్టి నువ్వున్నావ్ కానీ నిన్ను వదిలిపెట్టి మేం ఉండలేం. ఇన్నాళ్లూ శౌర్యని వదిలేసి బతికాం..ఇప్పుడు హిమను వదిలేసి బతుకుదాం.
శౌర్య: నువ్వు ఇన్ డైరెక్ట్ గా బ్లాక్ మెయిల్ చేస్తున్నారా
సౌందర్య: బ్లాక్ మెయిల్ కాదు..అనుకోని సమస్యలు వస్తున్నాయ్ అధి మేం కూడా గమనిస్తున్నాం. అన్నీ సర్దుకునేలా చేద్దాం. నువ్వు ఎంత గొడవైనా చేయి కానీ ఇంట్లోంచి వెళతానని మాత్రం అనొద్దు
ఆనందరావు: మమ్మల్ని వదిలేసి వెళ్లకమ్మా
శౌర్య: సరే అంటుంది
Also Read: వసుధార కన్నీళ్లు చూసి అల్లాడిపోయిన రిషి, రెచ్చిపోయిన సాక్షికి ఇచ్చి పడేసిన గౌతమ్
కారిడార్లో తిరుగుతూ శోభ ఆలోచనలో పడుతుంది. స్వప్నాంటీని నమ్ముకుంటే లాభం లేదు నేనే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అనుకుంటుంది. ఏం తింటావ్, ఏం చేయమంటావ్ అని స్వప్న వచ్చి అడిగితే.. తినడం ఇంపార్టెంట్ కాదు నేను ఓ నిర్ణయానికి వచ్చానంటుంది శోభ.
శోభ: మీ బ్రదర్ కార్తీక్ ని ఓ అమ్మాయి ప్రేమించి తనకు తానే తాళి కట్టుకుంది కదా..నేను అలాగే చేయమంటారా..
స్వప్న: నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావ్..రెండు రోజులు ఆగి చూడు ఏం చేస్తానో చూద్దుగానివి
అటు హాస్పిటల్లో కూర్చున్న హిమ..నిరుపమ్ మాటల్ని తలుచుకుంటుంది..
హిమ: బావ ఇంటికి ఎందుకు వచ్చాడో అర్థం కావడం లేదు..రాకుండా ఉంటే బావుండేది..శౌర్య మనసు ఇంకాడిస్టబ్ అవుతుందేమో... ఈ సిట్యుయేషన్ ని నేనెందుకు అనుకూలంగా మార్చుకోకూడదు అనుకుంటూ సౌందర్యకి కాల్ చేస్తుంది. ఎందుకు, ఏంటి అని వివరాలు అడగకుండా తాతయ్యని తీసుకుని హాస్పిటల్ కి రా అంటుంది.
సౌందర్య: మా హెల్త్ బాగానే ఉంది కదా ఎందుకు రావాలి
హిమ: మీరు తప్పనిసరిగా రావాలి నేను మళ్లీ కాల్ చేయను అని కాల్ కట్ చేస్తుంది. నానమ్మ-తాతయ్య వాళ్లు ఇంట్లోంచి బయటకు వస్తే నిరుపమ్ బావ శౌర్యకి ప్రైవసీ ఉంటుంది.
అప్పుడే శౌర్య ఆటోలో బయలుదేరుతుంది కానీ ఆటో ఆగిపోతుంది..
మెట్లపై నుంచి కిందకు దిగిన నిరుపమ్..అమ్మమ్మా తాతయ్య అని పిలుస్తాడు..ఎవ్వరూ లేరేంటి అనుకుంటూ బయలుదేరుతుండగా శౌర్య ఎదురవుతుంది..నానమ్మ, తాతయ్య ఇంట్లో లేరని శౌర్య అంటే..సరే నేను హాస్పిటల్ కి వెళుతున్నా అనేసి వెళ్లిపోతాడు..
శౌర్య: ఒకరికి ఒకరం తెలియనప్పుడు దగ్గరగా ఉన్నాం..తెలిసిన తర్వాత దూరమైపోయాం అనుకుంటూ.. ఆటోకి ఏమైందో ఏంటో ఇంత పెద్దకొంపలో నేను ఒక్కదాన్నే ఉండాలా
నిరుపమ్: జ్వాలగా ఉన్నప్పుడు తన తనలా ఉండేది..ఎప్పుడైతే నేను తన ప్రేమను కాదన్నానో అప్పుడే మారిపోయింది. జ్వాల శౌర్యగా మారిన తర్వాత తనలో ఆ చురుకుదనం కూడా పోయింది. నిరుపమ్ కారు టైర్ కూడా పంచరవడంతో నిరుపమ్ కూడా లోపలకు వెళ్లి కూర్చుంటాడు.
కారు టైరు పంచరైంది నీ ఆటోలో డ్రాప్ చేస్తావా అంటే..నా ఆటో కూడా పాడైపోయింది అందుకే వచ్చి కూర్చున్నాను. ఇద్దరూ కాసేపు మాట్లాడుకుంటారు. క్యాబ్ బుక్ చేశాను పది నిముషాల్లో వస్తుందని నిరుపమ్ అంటే..నాకెందుకు చెబుతున్నావ్ నేను రాను అంటుంది..
Also Read: లగేజ్ తీసుకుని అత్తారింటికి వచ్చేసిన నిరుపమ్-షాక్ లో సౌందర్య కుటుంబం, శోభ ఈవిల్ ప్లాన్
రేపటి( గురువారం) ఎపిసోడ్ లో
కాఫీ తీసుకొచ్చి నిరుపమ్ కి ఇస్తుంది శౌర్య. నువ్వు తాగు అంటే వద్దంటుంది. అప్పుడే అక్కడకు వచ్చిన స్వప్న.. ఏం జరుగుతోందిరా దీన్ని కూడా కట్టబెట్టాలని చూస్తున్నారా అని ఫైర్ అవుతుంది. ఇక ఆపుతావా అని శౌర్య మొదలెడుతుంది...