News
News
X

Karthika Deepam July 26 Update Episode 1414 : హిమ-నిరుపమ్-శౌర్య అంతా ఒకే ఇంట్లో, ఊహల్లో తేలుతున్న ప్రేమ్ -మరో కుట్రకు సిద్ధమైన శోభ

Karthika Deepam july 26 Episode 1414: బుల్లితెర ప్రేక్షకుల్ని మెప్పిస్తోన్న ‘కార్తీకదీపం’ సీరియల్ లో ప్రస్తుతం హిమ-జ్వాల(శౌర్య) చుట్టూ కథ నడుస్తోంది. ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

FOLLOW US: 

కార్తీకదీపం జులై 26 మంగళవారం ఎపిసోడ్ (Karthika Deepam july 26 Episode 1414)

ఎవరెన్ని చెప్పినా పెళ్లి జరగడం ఖాయం అని క్లారిటీ ఇచ్చేస్తాడు నిరుపమ్.
నిరుపమ్:నువ్వు ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నావ్ కదా హిమా.. నీకో మంచి అవకాశం ఇస్తాను. ఇప్పటికిప్పుడు శౌర్యతో నన్ను పెళ్లిచేసుకుంటాను అనిపించు ఓ సారి.. నేను శౌర్య మెడలో తాళికట్టేస్తాను
సౌందర్య: ఏం మాట్లాడుతున్నావురా
నిరుపమ్: లేదు అమ్మమ్మా..ఈ కన్ఫ్యూజన్ కి ఫుల్ స్టాప్ పెట్టాలి. శౌర్యకి ఇప్పుడు నేనంటే ఇష్టం లేదు, నాకు శౌర్య అంటే ఎప్పుడూ ఇష్టం లేదు. మా ఇద్దరికీ క్లారిటీ ఉంది మధ్యలో నీకెందుకు. వెళ్లు శౌర్యని ఒప్పిస్తావా.. జీవితం అంటే మ్యాజిక్ కాదు వాస్తవంగా ఆలోచించు. మనసులోంచి అన్నీ తీసెయ్. 
అటు ప్రేమ్ వెయిట్ చేస్తుండగా కార్లో వస్తుంది హిమ...నీ సమస్యేంటో చెప్పు పరిష్కరిస్తాను అంటాడు ప్రేమ్
హిమ: శౌర్యకు నాపై కోపం రోజురోజుకీ పెరిగిపోతోంది..నిరుపమ్ బావని, శౌర్యని కలపాలని ప్రయత్నిస్తున్నా వాళ్లు రోజురోజుకీ దూరమైపోతున్నారు
ప్రేమ్: ఈ టెన్షన్ తీరాలంటే మనం ఐస్ క్రీం పార్లర్ కి వెళదాం పదా
హిమ: నేను టెన్షన్ పడుతుంటే నువ్వేంటి ఇలా మాట్లాడుతున్నావ్
ప్రేమ్: నేను ప్లాన్ చేస్తానులే నువ్వు కంగారుపడకు..నేను ఏం చేసినా నీకు ఓకేనా
హిమ: వాళ్లిద్దరూ కలుస్తాను అంటే నువ్వేం చేసినా నాకు ఓకే..
ప్రేమ్: నువ్వు ఇదేమాటపై ఉండు అద్భుతమైన ప్లాన్ రెడీ చేసి పెడతాను..వాళ్లిద్దర్నీ కలిపే పూచీ నాది..

Also Read: లగేజ్ తీసుకుని అత్తారింటికి వచ్చేసిన నిరుపమ్-షాక్ లో సౌందర్య కుటుంబం, శోభ ఈవిల్ ప్లాన్

నిరుపమ్ అని పిలుస్తూ హాల్లోకి వచ్చిన స్వప్న..హాల్లో సూట్ కేస్ తో సహా వచ్చిన శోభను చూస్తుంది. మీరు రమ్మన్నారనే వచ్చేశాను ఆంటీ అంటుంది.
స్వప్న: నువ్వు వాడి కళ్ల ఎదురుగా ఉంటే నిరుపమ్ మనసు మారుతుందేమో
శోభ: హిమపై కోపంతో ఇదంతా చేస్తున్నారా..నాపై ప్రేమతోనా..
స్వప్న: నువ్వు ఎప్పుడో అడుగుతావు అనుకున్నాను ఆలస్యంగా అడిగావ్. నా స్నేహితురాలు నీ గురించి చెప్పిన విషయం నీకు తెలియదా
శోభ: నిరుపమ్ ని పెళ్లిచేసుకోవాలన్నది ఎప్పటినుంచో ఉన్న ప్లాన్... నువ్వు చెప్పావని కాదు నాకోసమే నేను వచ్చాను
స్వప్న: నా ఫ్రెండ్ కు నేను ఇచ్చిన మాటకు నేను కట్టుబడి ఉన్నాను
శోభ: తొక్కేంకాదు..నీ మాటపై నాకు నమ్మకం లేకే నా ప్రయత్నాలు నేను చేసుకునేందుకు ఇక్కడకు వచ్చాను
ఇంతలో అక్కడకు వచ్చిన నిరుపమ్ శోభను చూసి ఆశ్చర్యపోతాడు... శోభ కొన్ని రోజులు మనింట్లోనే ఉంటుంది ఆ తర్వాత మన ఫ్యామిలీ మెంబర్ అవుతుందిలే అంటుంది స్వప్న. సరే మమ్మీ అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు నిరుపమ్...

Also Read: రాయలేని కవితలు అన్నీ కళ్లతోటి పలికిస్తున్నా అన్న వసు, పనిష్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైన రిషి
శౌర్య బయట నిల్చుని ఉండగా..హిమ ఎక్కడినుంచో వెళ్లొస్తుంది.
శౌర్య: చిన్నప్పటి నుంచీ నాపై నీకు ఎందుకే ఇంత ద్వేషం. నువ్వేమో నానమ్మ, తాతయ్య, డాడీ దగ్గర హాయిగా పెరిగావ్.. నేను అమ్మ ఎన్నో కష్టాలు పడ్డాం, నాన్నను కలిశాంలే అని సంతోష పడేలోగా దూరం చేశావ్. నీ మొహం చూడొద్దని వెళ్లిపోయాను అప్పటి నుంచీ నా జీవితంలో ఆనందం లేదు. డాక్టర్ సాబ్ ని చూడగానే ఏదో తెలియని ఆనందం దాన్ని కూడా దూరం చేశావ్ కదా..
హిమ:నువ్వు అనుకునేది నిజం కాదు..
శౌర్య: కళ్లతో చూశాను, చెవులతో విన్నాను నిజం కాదనకు..ఎప్పుడూ నటించడమేనా
హిమ: మీ ఇద్దరూ ఒక్కటవ్వాలని నేను
శౌర్య: మేం ఇద్దరం ఒక్కటైపోతామనే ప్రతిసారీ మమ్మల్ని దూరం పెడుతూ వచ్చావ్. బయటకు సాఫ్ట్ గా కనిపిస్తూ లోకాన్ని నమ్మిస్తావ్.. నీ నటన గురించి నాకు తెలుసు. నీపై నాకు కోపం మాత్రమే ఉంది కానీ నీకు నేనంటే ద్వేషం...
హిమ: నీపై నాకు ద్వేషం ఎందుకు
శౌర్య: డాక్టర్ సాబ్ ని మనసులోంచి తీసేశానో లేదో అని అనుమానం..ఎప్పుడోసారి మళ్లీ పెళ్లిచేసుకుంటానని భయం.. నా పెళ్లి నీ బాధ్యత అన్నావ్..ఇద్దర్నీ ఒక్కటి చేస్తాను అన్నావ్..గుట్టుచప్పుడు కాకుండా పెళ్లి ఫిక్స్ చేసుకున్నావ్.. ఇంతకన్నా గొప్ప మోసం ఏముంటుంద.. పిచ్చి పిచ్చి ప్లాన్లు మళ్లీ వేశావో ఈ ఇంట్లో ఉండను
హిమ: ఏడుస్తూ నిల్చుండిపోతుంది...

Also Read: పసుపు తాడు తీసుకొచ్చి షాక్ ఇచ్చిన రౌడీబేబి, నిరుపమ్ మూడు ముళ్లు వేసేది హిమకా-శౌర్యకా!
శౌర్యకి జడ వేస్తూ...రాత్రి పూట జడ వేయొద్దంటారు అంటుంది సౌందర్య. అయితే వద్దులే అనేసి వెళ్లిపోతుంటే ఎందుకే ప్రతిదానికీ అలుగుతావ్ అంటుంది. ఇన్నాళ్లూ ఎవరున్నారని అలగడానికి అంటుంది శౌర్య...
సౌందర్య: ఇన్నాళ్ల కష్టాల సంగతి వదిలెయ్..నీకోరికలు ఏమైనా ఉంటే చెప్పు తీరుస్తాను. సాధ్యం కానివి అడగొద్దు...
శౌర్య:   ఈ ఇంట్లో నా కళ్లముందు నాటకాలు చాలా జరుగుతున్నాయ్ వాటిని ఆపమని చెప్పు
సౌందర్య: మనం చూసే విధానాన్ని బట్టి ఉంటుంది
శౌర్య: నాకు జ్ఞానబోధ చేయకు..అవుతందా లేదా చెప్పు
ఇంతలో నిరుపమ్ బ్యాగ్ సర్దుకుని ఇంటికి వస్తాడు...
హిమ: బావా ఏంటిది..
నిరుపమ్: ఇక్కడే ఉండాలని వచ్చేశాను హిమా..ప్రతిక్షణం నిన్ను చూస్తూ ఉండొచ్చు కదా అంటూ లోపలకు వస్తాడు
సూట్ కేసు ఓ చేతిలో, హిమ చేతిని మరో చేత్తో పట్టుకుని లోపలకు ఎంట్రీ ఇచ్చిన నిరుపమ్ ని చూసి షాక్ అవుతుంది శౌర్య... 
నిరుపమ్: అమ్మమ్మా ఇకనుంచి నేనుకూడా కొన్నాళ్లు ఇక్కడే ఉంటాను
శౌర్య: నేను చెప్పాను కదా నానమ్మా నాటకాలు జరుగుతున్నాయని అందులో ఇది కూడా ఒకటేమో...
సౌందర్య: నువ్వు ఇక్కడ ఉండడం ఏంటి
నిరుపమ్: మా ఇంటికి శోభ వచ్చింది..మా ఇంట్లో కొన్నాళ్లు ఉంటానంది..నీకు మా మమ్మీ సంగతి తెలుసుకదా.. తన తలకు రివాల్వర్ పెట్టుకుని శోభను పెళ్లిచేసుకోపోతే చస్తానని బెదిరించినా బెదిరిస్తుంది. అలాంటి పరిస్థితి వస్తే ఏం చేస్తానో ఏమో అని వచ్చేశాను..
శౌర్య: ఇన్ని వేషాలు వేసేబదులు వీళ్లిద్దరూ తొందరగా పెళ్లి చేసుకుంటే అయిపోతుంది కదా
నిరుపమ్: నేను రావడం నీకు హ్యాపీనే కదా హిమా...నాకు తెలుసు నువ్వు సంతోష పడతావని..
హిమ: నువ్వు మాట్లాడే మాటలకు శౌర్య నన్నింకా అపార్థం చేసుకుంటుంది అనుకుంటుంది
సౌందర్య: వీడిక్కడి వచ్చాడంటే శౌర్య ఫీలవుతుంది..ఆ స్వప్న సంగతి సరేసరి ఎంత రచ్చ చేస్తుందో ఏమో...
ఇదంతా చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది శౌర్య...

Also Read: స్టోర్ రూమ్ లో వలలో చిక్కుకున్న రిషి-వసు, వీడియో షూట్ చేసి కుట్రకు తెరతీసిన సాక్షి

నీ ఇష్టమే నా ఇష్టం బావా అన్న హిమ మాటలు తలుచుకుంటూ ప్రేమ్ మురిసిపోతుంటాడు. హిమకు నేనంటే ఇష్టమే నేనే దద్దమ్మని. డౌటే లేదు హిమకు నాపై లవ్ ఉంది..అందుకే నిరుపమ్ ని కాదంది. శౌర్య-నిరుపమ్ ని ఒక్కటి చేస్తే నా పెళ్లికి లైన్ క్లియర్ అయినట్టే అనుకుంటాడు. ఇంతలో కాల్ చేసిన హిమ..నీకో విషయం తెలుసా నిరుపమ్ బావ లగేజీతో మా ఇంటికి వచ్చాడని చెబుతుంది. మీ ఇంటికి లగేజ్ తో రావడం ఏంటి అంటాడు ప్రేమ్. కొన్నాళ్లు మా ఇంట్లోనే ఉంటానంటున్నాడని చెబుతుంది. ఇక్కడుండాల్సిన వాడు అక్కడికి వచ్చాడు..ఎక్కడో ఉండాల్సిన శోభ ఇక్కడకు వచ్చాడు..అసలు వాడికేమైంది మీ ఇంటికి బట్టలు సర్దుకుని రావడం ఏంటన్న ప్రేమ్ తో..సిట్యుయేషన్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియడం లేదంటే.. ప్రేమ్ ఉన్నాడుగా నువ్వు టెన్షన్ పడకు అని చెబుతాడు. ఇలాగే హిమ నాకు కాల్ చేస్తూ ఉండాలి..నేను హిమా ఇలాగే మాట్లాడుతూ మరింత క్లోజ్ అవుతాం అన్నమాట...బావ ఇంటికి వచ్చాడు కానీ శోభ అక్కడకు ఎందుకు వచ్చినట్టు.. శోభ-స్వప్నత్త ఇద్దరూ బ్లాక్ మెయిల్ చేసైనా నిరుపమ్ బావని పెళ్లికి వప్పిస్తారా ఏం చేయాలిప్పుడు....

Published at : 26 Jul 2022 08:24 AM (IST) Tags: karthika deepam latest episode karthika Deepam Serial Today Episode Amulya Gowda Kerthi Kesav Bhat amulya gowda Manoj kumar Manas Nagulapalli keerthi Karthika Deepam july 26 Episode 1414

సంబంధిత కథనాలు

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Janaki Kalaganaledu August 10th Update: కొత్త క్యారెక్టర్ ఎంట్రీ, దొంగల్ని చితక్కొట్టిన జానకి - జ్ఞానంబ సర్‌ప్రైజ్ - నోరెళ్ళబెట్టిన మల్లిక

Gruhalakshmi August 10th Update: తులసి సామ్రాట్ తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేస్తోంది అంటున్న లాస్య- ఫ్లైట్ ఎక్కుతున్నందుకు సంబరపడుతున్న తులసి

Gruhalakshmi August 10th Update: తులసి సామ్రాట్ తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేస్తోంది అంటున్న లాస్య- ఫ్లైట్ ఎక్కుతున్నందుకు సంబరపడుతున్న తులసి

Guppedantha Manasu ఆగస్టు 10 ఎపిసోడ్: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు

Guppedantha Manasu ఆగస్టు 10 ఎపిసోడ్: పరధ్యానం కాదు మీ ధ్యానమే సార్ అన్న వసు, జోరందుకున్న రిషి-సాక్షి పెళ్లి పనులు

Karthika Deepam Serial ఆగస్టు 10 ఎపిసోడ్: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!

Karthika Deepam Serial ఆగస్టు 10 ఎపిసోడ్: శోభ బండారం బయటపెట్టి స్వప్న కళ్లు తెరిపించిన శౌర్య, మరి హిమ మాట నిలబెట్టుకుంటుందా!

Devatha August 10th Update: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి

Devatha August 10th Update: నీ మనసులో నా స్థానం ఏంటని ఆదిత్యని నిలదీసిన సత్య- తన బతుకులో తన పెనిమిటే ఉన్నాడని మాధవకి వార్నింగ్ ఇచ్చిన రుక్మిణి

టాప్ స్టోరీస్

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం ! నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

Nitish PM Plan : మోదీకి దీటుగా ప్రధాని అభ్యర్థి కావడమే లక్ష్యం !  నితీష్ మాస్టర్ ప్లాన్ అదే !

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

SR Sekhar : నేను మహేష్ ఫ్యాన్, పవన్ సినిమాకు పని చేశా - కుల వ్యాఖ్యల వివాదంపై నితిన్ 'మాచర్ల' దర్శకుడు

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

Asia Cup, India's Predicted 11: పాక్‌ మ్యాచ్‌కు భారత జట్టిదే! ఆ మాజీ క్రికెటర్‌ అంచనా నిజమవుతుందా?

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!

OnePlus Ace Pro: 16 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో వన్‌ప్లస్ కొత్త ఫోన్ - 19 నిమిషాల్లో ఫుల్ చార్జ్!