Guppedantha Manasu జులై 25 ఎపిసోడ్: రాయలేని కవితలు అన్నీ కళ్లతోటి పలికిస్తున్నా అన్న వసు, పనిష్మెంట్ ఇచ్చేందుకు సిద్ధమైన రిషి
Guppedantha Manasu July 25 Episode 511:గుప్పెడంతమనసు సీరియల్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. రిషి ప్రేమను రిజెక్ట్ చేసిన వసు ఇప్పుడు అదే ప్రేమకోసం తాపత్రయ పడుతోంది. జులై 25 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే
గుప్పెడంతమనసు జులై 25 సోమవారం ఎపిసోడ్ (Guppedantha Manasu July 25 Episode 511)
దేవయాని ఇంట్లో
కాఫీ రుచి అదిరిపోయిందమ్మా..ఏంటీ మార్పు అంటాడు మహేంద్ర.
దేవయాని: ఈ మధ్య చాలా మారుతునన్నాయి మహేంద్ర..ధరణి మారింది, ఇంట్లో చాలా మారాయి
మహేంద్ర-జగతి: మార్పు మంచిదే అయినప్పుడు స్వాగతించాలి కదా
గౌతమ్: ఈ ప్రకృతిలో అన్నీ మారుతుంటాయి కామన్ కదా
దేవయాని: అందరూ కొత్తగా ప్రవర్తిస్తున్నారు..రిషి ఇంకా లేవలేదా
ధరణి: పొద్దున్నే కాలేజీకి వెళ్లిపోయాడు అత్తయ్యగారు
దేవయాని: నాకు కనిపించలేదు..
ధరణి: నేను పొద్దున్నే లేస్తాను కదా అత్తయ్యగారు..
దేవయాని: నేను పొద్దున్నే లేవలేదని సెటైర్ వేస్తున్నావా..ఏం ధరణి కాఫీలు అయిపోయాయి కదా టిఫిన్ ప్రస్తావన తీసుకురాలేదేంటి..
ధరణి:ఇంతమంది పెద్దవాళ్లున్నారు కదా నేనెందుకు మాట్లాడటం
గౌతమ్: ఇంట్లో అందరికన్నా ధరణి వదిన ఎక్కువ పని చేస్తుంది..తక్కువ మాట్లాడుతుంది
దేవయాని: పొద్దున్న వెళ్లి రాత్రికి వచ్చే మీకు మధ్యలో ఏం జరుగుతుందో ఏం తెలుసు
ధరణి: సగం జీవితం వంటగదిలో..మిగిలిన సగం జీవితం మా అత్తయ్యగారి సేవలో గడుపుతున్నా
కాసేపు దేవయానితో ఆడుకుంటారంతా..అక్కడి నుంచి కోపంగా వెళ్లిపోతుంది దేవయాని. ధరణి నువ్వు ఇలాగే ధైర్యంగా ఉండాలని చెబుతారు మహేంద్ర-జగతి
Also Read: లగేజ్ తీసుకుని అత్తారింటికి వచ్చేసిన నిరుపమ్-షాక్ లో సౌందర్య కుటుంబం, శోభ ఈవిల్ ప్లాన్
కాలేజీ దగ్గర ఆటో దిగిన వసుధార..చదువుల పండుగను విజయవంతం చేయాలని ఆలోచిస్తూ లోపలకు వెళుతుంది. ఇంతకు ముందు నేను నాలా ఉండేదాన్ని కానీ ఈ మధ్యేంటో రిషి సార్ ని ఇంప్రెస్ చేయాలని చూస్తున్నాను అనుకుంటుంది.
మరోవైపు దేవయానికి కాల్ చేసిన సాక్షి..ఆంటీ నేనిప్పుడే కాలేజీకి వచ్చాను నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి అంటుంది. ఆల్ ది బెస్ట్ సాక్షి నీవెనుక నేనున్నాను అంటుంది. ఇంతలో అటెండర్ ఎదురవడంతో ఎవరైనా వచ్చారా అని సాక్షి అడిగితే నేను ఇప్పుడే వచ్చానమ్మా చూడలేదు అంటాడు. ఆ తర్వాత వసుధారకు ఎదురుగా వెళతాడు అటెండర్. స్టోర్ రూమ్ తాళాలు కావాలని అడిగితే తీసే ఉందని చెబుతాడు. వసుధార వెళుతుంది.
రిషి-వసు
స్టోర్ రూమ్ లో ఒకర్నొకరు చూసుకుని నువ్వెందుకు వచ్చావ్ అంటే నువ్వెందుకు వచ్చావ్ అనుకుంటారు. అక్కడ సిజర్ ఉంటుంది తీసుకొస్తావా అనగానే చూసుకోకుండా కుర్చీ తన్నుకుని పడిపోతోబోతుంటుంది.. వసు కిందపడకుండా రిషి పట్టుకుంటాడు. నెట్ చుట్టూ చుట్టేసుకోవడంతో తీసే ప్రయత్నాల్లో ఉంటారు. ఇదంతా చాటునుంచి వీడియో తీస్తుంది సాక్షి.
వసు: ఏం జరిగింది సార్
రిషి: నువ్వొచ్చావ్ స్టోర్ రూమ్ పరిస్థితే మారిపోయింది
సాక్షి: మీ ఇద్దరి మధ్యా చిచ్చు నేను పెడతానుగా అనుకుంటూబయటకు వెళుతుంది సాక్షి.. స్టోర్ రూమ్ లో స్టోరీ టైటిల్ బావుంది. వసు అంటే రిషి..రిషి అంటే వసు..వీళ్లద్దరూ తామేదో అమర ప్రేమికులం అంటూ బిల్డప్ ఇస్తారు ఇప్పుడేం జరుగుతుంది. వసుధారా నీ గురించి నువ్వు ఏదో అనుకుంటావ్ కదా ఇప్పుడు కొట్టు ఫోజులు.. రిషి నాకు భలే దొరికావ్..ఇక ఆట నాదే..గెలుపూ నాదే..
Also Read:స్టోర్ రూమ్ లో వలలో చిక్కుకున్న రిషి-వసు, వీడియో షూట్ చేసి కుట్రకు తెరతీసిన సాక్షి
కాలేజీకి వచ్చిన జగతి-మహేంద్ర..రిషి ఇంత పొద్దున్నే వచ్చాడంటే ఏదో ఇంపార్టెంట్ వర్క్ ఉండి ఉంటుంది కదా అంటే అవును జగతి మేడం..రిషి వెంట ఎందుకు పడతావ్ అంటావని అనలేదు. నాకు కాల్ చేస్తే వచ్చి సహాయం చేస్తాను కదా అని మహేంద్ర అంటే ఇప్పుడు వెళ్లి అడుగు అంటుంది. ఇంతలో సాక్షి కనిపిస్తుంది. సాక్షి వచ్చిందేంటని మహేంద్ర అంటే నాకేం తెలుసు అంటుంది జగతి.
మహేంద్ర: రిషి రమ్మన్నాడా సాక్షి
సాక్షి: కొన్ని పనులకు పిలిస్తే వెళ్లాలి కానీ కొన్ని పనులకు పిలవకుండానే వెళ్లాలి దాన్నే ప్రేమ అంటారు. రిషి కోసమే వచ్చాను.. రిషి రమ్మని పిలిచేవరకూ ఆగుతానా ఆంటీ..నా ఆలోచనలేవో నాకుంటాయి కదా.. ఎడ్యుకేషన్ సమ్మిట్ గురించి మాట్లాడుతున్నాను..అవసరమైతే మీ హెల్ప్ తీసుకుంటాను..
జగతి: మంచి పనులకు మా బ్లెస్సింగ్ ఎప్పుడూ ఉంటాయి సాక్షి..వంకర పనులకు మాత్రం ఆశించవద్దు..
Also Read: అలలెగసే కలవరమాయె తనలో నిను చూసే - సరికొత్తగా మళ్లీ వసుకి ప్రపోజ్ చేసిన రిషి
రిషి క్యాబిల్లో
రిషి: అనవసరంగా తిరుగుతూ టైం వేస్ట్ చేసుకుంటున్నావేంటి
వసు: చదువుల పండుగను గ్రేట్ గా చేయాలని వచ్చాను
రిషి: ఏం చేస్తావ్
వసు: స్పెషల్ సింబల్ లేదా ఫ్లాగ్ డిజైన్ చేస్తే బావుంటుంది అనిపిస్తోంది
రిషి: ఏం నచ్చితే అది చేసేస్తావా..నన్ను అడగవా
వసు: అభిప్రాయాలు షేర్ చేసుకుందామా అంటే.. వద్దులెండి...
రిషి: అయిపోయిందా ఇంకేమైనా ఉందా
వసు: మీరు మారిపోయారు సార్..మారిపోయారు
రిషి: కొందరు మారిపోతారు..కొందరు మార్చబడతారు..అసలేంటి గట్టిగా మాట్లాడుతున్నావ్..నువ్వు ఆ స్టోర్ రూమ్ కి ఎందుకొచ్చావ్..
వసు: ఎడ్యుకేషనల్ సమ్మిట్ కోసం.. ఓజెండా డజైన్ చేసి కాలేజీపై ఏగరేస్తే బావుంటుంది కదా.. నేను ఎలా డిజైన్ చేస్తానో చూపిస్తాను ఆగండి..
రిషి:ఇలాంటిదేనా..అని ఫోన్లో పిక్ చూపిస్తాడు
వసు: ఇలాంటిదేనా ఏంటి సార్..ఇదే నేను అనుకున్నది. నిజం చెప్పండి నా ఐడియా మీరు కాపీ కొట్టారు కదా . నేను చెబుతానంటే వద్దని చెప్పి మీరు నా ఐడియా కాపీ కొట్టి చూపించారు. కావాలంటే చూపిస్తాను...
ఇంతలో జగతి-మహేంద్ర క్యాబిన్ కి వస్తారు...
మహేంద్ర: వసు నీకు ఈ విషయం తెలుసా..రిషి ఓ ఫ్లాగ్ ఐడియా చెప్పాడు
వసు: ఇప్పుడే చూశాను..
రిషి: మేడం మీరు ఇంకా పెండింగ్ వర్కులు ఏమున్నాయో చూడండి అని చెప్పేసి వెళ్లిపోతాడు...
వసు: మా ఇద్దరికీ ఒకే ఐడియా ఎలా వచ్చింది..మా ఆలోచనలు కలుస్తున్నాయంటే..త్వరలో మా మనసులు కూడా...
Also Read: రిషి పెట్టిన పరీక్షలో గెలుపెవరిది, వసు-సాక్షిలో రిషి అసిస్టెంట్ ఎవరు
గౌతమ్ కాలేజీకి ఎంట్రీ ఇస్తూ..ఎవరు చేయాల్సిన పని ఏంటన్నది లిస్టులు తయారయ్యాయ్ అనుకుంటాడు. ఎదురుపడిన సాక్షిని పలకరిస్తాడు. మీతో ఓ విషయం మాట్లాడొచ్చా అనేసి..ఇప్పుడు కాదు ఇంకెప్పుడైనా మాట్లాడుతాను అంటాడు..
రేపటి( మంగళవార) ఎపిసోడ్ లో
పెన్ డ్రైవ్ ఇవ్వు అని రిషి అడిగితే..లేదంటుంది వసుధార. బాధ్యతలేనివాళ్లను నీ పక్కనపెట్టుకుని చదువుల పండుగ ఏం చేస్తావ్ రిషి అన్న సాక్షి...పనిష్మెంట్ ఇవ్వాలంటుంది. తప్పుచేసిన వారికి తప్పకుండా పనిష్మెంట్ ఇస్తానంటాడు రిషి...