Karthika Deepam 2 Serial October 7th: కార్తీకదీపం 2 సీరియల్: నాకు పూనకం వస్తే నువ్వు తట్టకోలేవు జ్యోత్స్న జాగ్రత్త: వంటలక్క వార్నింగ్!
Karthika Deepam 2 Serial Episode కార్తీక్, జ్యోత్స్నలకు పెళ్లి జరగాలని దీప శివనారాయణకు చెప్పడం ఆయన దీపకు స్వీట్ వార్నింగ్ ఇవ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode కార్తీక్, దీప ఇద్దరూ రావడంతో నర్శింహ ప్లాన్ ఫ్లాప్ అవుతుంది. కార్తీక్ తన ఇద్దరి పెళ్లాలను దూరం చేసి తను మాత్రం తన పెళ్లంతో తిరుగుతున్నాడని అనుకుంటాడు. ఇక నర్శింహ తన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో వెళ్లిపోతాడు. కార్తీక్ ఇంటి బయట నుంచే వెళ్లిపోతాడు. నర్శింహ వెళ్లిన తర్వాత పొదలు ఊగడంతో అనుమానం వచ్చి చూస్తాడు. తర్వాత దీపతో శౌర్య జాగ్రత్త అని చెప్పి బయటకు రావొద్దని శౌర్యకి చెప్తాడు. దీప పాపని తీసుకొని లోపలికి వెళ్లిపోతుంది. దీప దగ్గరకు జ్యోత్స్న, పారిజాతం వస్తారు. కార్తీక్ తనకు చాక్లెట్ ఇచ్చాడని దీపకి డ్రాప్ చేశాడని శౌర్య చెప్పడంతో జ్యోత్స్న, పారిజాతం కార్తీక వచ్చాడా అని షాక్ అయిపోతారు. దీప పాపని లోపలికి పంపేస్తుంది.
పారిజాతం: చంటి దాని నోరు మూయించినంత మాత్రాన మాకు ఏం తెలీదు అనుకుంటున్నావా.
దీప: మీరు ఏమైనా అడగాలి అనుకుంటే సూటిగా అడగండి అమ్మా. నాకు అవతల చాలా పనులున్నాయి.
జ్యోత్స్న: మా బావ తోనా. నిజాయితీగా బతికే వాళ్లకి కోపం వస్తే అర్థముంది. నీ లాంటి వాళ్లకి వస్తే ఏంటి అర్థం దీప.
దీప: పూనకం వచ్చేలా నన్ను రెచ్చగొడితే నువ్వు తట్టకోలేవు జ్యోత్స్న.
జ్యోత్స్న: గ్రానీ నువ్వు ఇక్కడి నుంచి వెళ్లిపో ఏం జరిగినా రాకు. దీప నీకు ఒకే ఒక ప్రశ్న అడుగుతా చెప్పు నీకు మా బావకు ఏంటి సంబంధం? నాకు ఒకటి అర్థమైంది కానీ నీ నోటితో చెప్తే వినాలి అని ఉంది. దీప, కార్తీక్ వాళ్లు ఫొటో చూపించి దీనికి నువ్వు చెప్పే సమాధానం ఏంటి?
దీప: అందులో తప్పేముంది మీ తమ్ముడు మరదలు కొత్త కాపురం మొదలు పెడితే మీ అత్తయ్యా , మీ బావ వచ్చి ఆశీర్వదించారు. వాళ్లతో పాటు పెళ్లి చేసిన పెద్దగా నేను వెళ్లాను అప్పుడే సరదాగా ఓ సెల్ఫీ తీసుకున్నాం అందులో తప్పేముంది.
జ్యోత్స్న: కాశీని మీ తమ్ముడు అంటుంది దీపకి నిజం తెలిసిపోయిందా. తమ్ముడేంటి.
దీప: దాసు మీకు చిన్నాన్న అయితే ఆయన కొడుకు నీకు తమ్ముడే కదా.
జ్యోత్స్న: దిక్కుమాలిన వరసలు కలపకు దీప ఆయనకే మా ఇంట్లో చోటు లేదని తాత చెప్పాడు ఇక ఆయన కొడుకు నాకు తమ్ముడేంటి. దీప ఇక నీ నాటకాలు ఆపేయ్ నీ మనసుని నేను పూర్తిగా చదివేశాను. నువ్వు మా బావని సొంతం చేసుకోవడానికే ఇవన్నీ చేస్తున్నావ్.
దీప: నువ్వు ఇక మారవా.
జ్యోత్స్న: మా బావని నువ్వు వదిలేయాలి అంటే ఏం చేయాలో చెప్పు. మా బావ మనసు మార్చేసినట్లు మా అత్త మనసు మార్చేశావు. ఇంకెందుకు ఆలస్యం మా అత్త ఇంటికి వెళ్లిపో. స్వప్న కాశీకి నువ్వు పెళ్లి చేసినట్లు నీకు మా బావకి అత్త దగ్గరుండి ఏ గుడిలోనో పెళ్లి చేస్తుంది.
దీప: జ్యోత్స్న నువ్వు ఇన్ని మాటలు అన్నా నిన్ను కొట్టకుండా ఆగిపోవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి నువ్వు సుమిత్రమ్మ కూతురివి అని రెండు నువ్వు నన్ను ఇంటికి తీసుకొచ్చావ్ అని లేదంటే కొడితే దవడ పళ్లు రాలిపోతాయ్
పారిజాతం: అమ్మ దీప ఎంత మాట అన్నావే.
దీప: జ్యోత్స్న నీకు ఇంతకు ముందే చెప్పాను మళ్లీ చెప్తున్నాను నీకు మీ బావకి పెళ్లి చేసే ఇక్కడి నుంచి వెళ్తాను. నా జీవితంలో నా కూతురు తప్ప మరో మనిషి ఉండరు. నేను స్వప్న, కాశీల పెళ్లి వల్లే రెండు కుటుంబాలు
విడిపోయావి అన్నావు కదా నువ్వే రెండు కుటుంబాల్ని కలుపు. ఇప్పుడు నీకు ఒక ప్రశ్న అడుగుతా చెప్పు. మీ బావ మనసులో నువ్వు ఉన్నావా. ముందు అది తేల్చుకో. అది తేల్చుకొని మీ బావని పెళ్లి చేసుకొని రెండు కుటుంబాల్ని కలుపు. అప్పుడు నేను బ్యాగ్ సర్దుకొని వెళ్లిపోతా.
జ్యోత్స్న దీప మాటలు తలచుకొని కోపంతో రగిలిపోతుంది. ఒకరి మీద కోపం మరొకరితో చూపిస్తే ఎలా అని పారిజాతం అడుగుతుంది. బావ నా వాడు అని కానీ దీప మాట వింటున్నాడని అంటుంది. దానికి పారిజాతం నీకు గారాభం ఎక్కువైందని అన్నీ నీ కాళ్ల దగ్గరకే వస్తున్నాయని అంటుంది. నువ్వు కూడా దీప రూట్‌ని ఫాలో అవ్వు అని అంటుంది. కార్తీక్ దగ్గరకు నువ్వు వెళ్లు అని చెప్తుంది. మీ బావని మీ అత్తని నిలదీయాలని ఇచ్చిన మాట ఎలా మధ్యలో వదిలేస్తారని అడగమని అంటుంది. సుమిత్ర బాధగా ఉంటే దీప అక్కడికి వెళ్తుంది. మన అనుకున్నవాళ్లు పరాయి వాళ్లు అయిపోతే ప్రశాంతత ఎలా ఉంటుందని అంటుంది దీప. పెద్దాయనకి అడగమని అంటుంది. పెద్ద వాళ్లు తప్పు చేస్తే పిల్లలకు ఎందుకు శిక్ష అని అంటుంది. దానికి శివనారాయణ వచ్చి పెద్దల ఆస్తులకే కాదు అన్నింటికీ పిల్లలు వారసులని అంటాడు.
పిల్లలకు మాట ఇచ్చారని వాళ్లు బాధ పడతారని దీప అంటుంది. కోరుకున్నది ఇవ్వకపోతే వాళ్లు బాధ పడుతారని అంటుంది. దానికి శివనారాయణ నీ కూతురు కూడా తండ్రిని అడిగింది కానీ వాడు చెడ్డొడు కదా అని చెప్తే పాప దూరం అయింది కాదా. దానికి దీప కార్తీక్ బాబు లేకుండా జ్యోత్స్న ఉండలేదని అంటుంది. దానికి మేమే కారణం అని నీతోనే బావ పెళ్లి అని చెప్పడం వల్ల దానికి వేరే ఆలోచన లేదని అంటాడు. జ్యోత్స్న మర్చిపోతుందని అంటే అది జరగదని వాళ్లకి పెళ్లి చేయాలని దీప అంటుంది. మీరు ఈ పెళ్లి చేయకపోతే వాళ్లకి అన్యాయం చేసినట్లే అని దీప అంటుంది. దానికి శివనారాయణ దీపతో నిన్ను ఇప్పటి వరకు పరాయి దానివి అనుకోలేదు అనుకునేలా చేయొద్దని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.