Karthika Deepam 2 Serial October 25th: కార్తీకదీపం 2 సీరియల్: ఒకే గదిలోకి చేరిన దీప, కార్తీక్‌లు.. త్వరలో ఆ శుభకార్యం కూడా!
Karthika Deepam 2 Serial Episode శౌర్య తల్లిదండ్రులతో కలిసి పడుకుంటానని దీపని కార్తీక్ గదిలోకి తీసుకెళ్లడం కార్తీక్ కూడా ఓకే చెప్పేయడంతో ముగ్గురు ఒక చోట చేరడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Karthika Deepam Idi Nava Vasantham Serial Episode జ్యోత్స్నని క్షమించమని అడగటానికి సుమిత్ర, దశరథ్‌లు వస్తారు. దానికి జ్యోత్స్న మిమల్ని క్షమిస్తే నేను వేరే వ్యక్తితో పెళ్లికి ఒప్పుకున్నట్లే అంటుంది. జీవితాంతం పెళ్లి చేసుకుండా ఉండిపోతావా అని అడిగితే నాకు ఎప్పుడో బావతో పెళ్లి అయిపోయిందని అంటుంది. ఎక్కడ చూసినా బావ, దీప నన్ను ఎగతాళి చేసినట్లు కనిపిస్తుందని అంటుంది. బావని మనసు నుంచి తుడవలేనని ఏం చేయాలో ఆలోచించడానికి నాకు కొంచెం టైం కావాలి అంటుంది. అది కూడా పెళ్లి చేసుకోవడానికి కాదు బావ కోసం అంటుంది.
ఇక దశరథ్ సుమిత్రని తీసుకొచ్చేస్తాడు. కోలుకోవడానికి కొంచెం టైం కావాలని అంటాడు. దీప మెడలో తాళి కట్టినప్పుడు నువ్వు కనీసం నా గురించి అయినా ఆలోచించాల్సింది కార్తీక్ అని సుమిత్ర అనుకుంటుంది. వదిన కూడా నా గురించి ఆలోచించలేదని అనుకుంటుంది. మరోవైపు అనసూయ కాంచనకు జ్యూస్ తీసుకెళ్తుంది.
కాంచన: మనం ఏమనుకున్నాం ఏదో ఒకటి చేసి దీపని కార్తీక్‌ని కలపాలి అనుకున్నాం కదా. ఈ రోజు రెండు పనులు చేశాం ఒకటి దీప వంట గదికి వెళ్లి ఇళ్లుని సొంతం చేసుకుంది. రెండోది కార్తీక్, దీప పక్కపక్కన కూర్చొన్నారు. కార్తీక్ దగ్గరకు వెళ్దాం పద. కార్తీక్ శౌర్య కోసమే నువ్వు పెళ్లి చేసుకున్నావ్ అని మాకు తెలుసు. ఎంతైనా మీరు ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు కదా మీరు ఎవరి గదిలో వాళ్లు ఉంటే కుదరదు. పెళ్లి తర్వాత కొన్ని తంతులు ఉంటాయిరా. మీ భార్యాభర్తలిద్దరితో సత్యన్నారాయణ వ్రతం చేయిస్తాం నీకు ఓకేనా.
కార్తీక్: మీ ఇష్టం అమ్మ కానీ దీపని ఇబ్బంది పెట్టొద్దు.
కాంచన: దీపతో నేను మాట్లాడుతానురా. పద అనసూయ.
అనసూయ: మీ ఆలోచన నాకు నచ్చిందమ్మా భార్యభర్తల్లా ఇద్దరూ పీటల మీద కూర్చొని వ్రతం చేసుకున్నారు అంటూ వాళ్ల మనసులు గదులు ఒక్కటైపోతాయి.
కాంచన: నువ్వు వెళ్లి తనతో మాట్లాడు.
అనసూయ: నేను మాట్లాడితే నా మాట వినదు.
కాంచన: నీ మాట పదును నాకు తెలుసు. నువ్వు వెళ్లు అనసూయ.
దీప: తండ్రి ఫొటో చూసి తన గతం మొత్తం గుర్తు చేసుకుంటుంది. బావ కోసమే పుట్టి బావ కోసమే పెరిగి బావ మీద ఆశలు పెంచుకున్న జ్యోత్స్న మెడలో పడాల్సిన తాళి నా మెడలో పడింది నాన్న ఇందులో నా తప్పు ఏం లేదు. అలా అని తెంపుకు పోయే ధైర్యం లేదు. నా బలహీనత నా కూతురు దాని కోసమే బతుకుతున్నాను దాని కోసమే భరిస్తున్నాను. కానీ మనసు ప్రశాంతంగా లేదు ఎవరికి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయాను. నన్ను ఆదరించిన సొంత తల్లి సుమిత్రగారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయాను. ఇక మీదట నా జీవితాన్ని కాలం ఎలా నడపబోతుందో కూడా నాకు అర్థం కావడం లేదు.
ఇంతలో శౌర్య వస్తుంది. నిద్రోస్తుందని చెప్పి మనం ఇక్కడ పడుకోకూడదు నాన్న గదిలోకి రా అంటుంది. వెళ్దాం రా అంటుంది. దీప వద్దు అంటే నువ్వు నేను నాన్న పడుకుందామని అంటుంది. ఇక అనసూయ వచ్చి దీపని వెళ్లమని చెప్తుంది. తండ్రిని నీ కూతురికి ఎందుకు దూరం చేస్తున్నావ్ అని అడుగుతుంది. ఇక పాపతో నువ్వు అమ్మా వెళ్లి నాన్న గదిలో పడుకోండి అని అంటుంది. దాంతో దీప వెళ్తుంది. ఇక దీప శౌర్యలు కార్తీక్ గదిలోకి వెళ్తారు. ఏమైనా మాట్లాడాలా అని కార్తీక్ అడిగితే మేం నాన్న గదిలో పడుకోవడానికి వచ్చామని అంటుంది. ఇక కార్తీక్ కూడా పర్మిషన్ ఇచ్చేస్తాడు. శౌర్య మధ్యలో పడుకొని కార్తీక్‌ని ఓ వైపు దీపని ఓ వైపు పడుకోమని అంటుంది. దీప, కార్తీక్ మధ్యలో శౌర్య పడుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: రూప చెల్లి, రాజు తమ్ముడి లవ్‌ట్రాక్‌ని జీవన్ వాడుకుంటాడా.. పోలీస్ గెటప్‌తో గ్యాంగ్!