Karthika Deepam 2 Serial July 30th: కార్తీకదీపం 2 సీరియల్: జీవితాంతం కలిసే ఉందామని చేతిలో చేయేసి ప్రామిస్ చేసుకున్న కార్తీక్, దీప, పాప.. చూసేసిన జ్యోత్స్న!
Karthika Deepam 2 Serial Today Episode
Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode జ్యోత్స్న దగ్గరకు తన ఫ్రెండ్స్ వచ్చి నీ నిశ్చితార్థం క్యాన్సిల్ అయినందుకు బాధగా ఉందని అంటారు. ఇక జ్యో ఫ్రెండ్స్ నువ్వు అంటే నీ బావకి ఇష్టం లేదని అంటారు. మీకు ఎలా తెలుసని జ్యో వాదిస్తే నిన్ను గతంలో పార్టీలో నీతో పాటు డ్యాన్స్ వేయకుండా వదిలేశాడని, నిశ్చితార్థం చేసుకోకుండా ఎవరో పాప కోసం నిన్ను వదిలేశాడని అంటారు. జ్యోత్స్న కోపంతో రగిలిపోతుంది. జ్యోత్స్న, పాప ఇద్దరిలో నీకు ఎవరు ముఖ్యమని మీ బావని అడిగితే తనకి పాపని ఇష్టమే అని అంటాడని ఫ్రెండ్స్ రెచ్చగొడతాడు. పెళ్లి క్యాన్సిల్ చేసుకో అని అంటారు. ఇంతలో సుమిత్ర వచ్చి ఇక ఆపండి అని కోప్పడుతుంది.
నిశ్చితార్థం చెడిపోయి బాధ పడుతున్న మీ ఫ్రెండ్‌ని ఓదార్చాలి కానీ ఇలా మాట్లాడకూడదని తిడుతుంది. జ్యోత్స్న ఫ్రెండ్స్ వెళ్లిపోతారు. అర్థం చేసుకోవాలని ఇలా బావని అపార్థం చేసుకోవద్దని చెప్తుంది. చెప్పడం తేలికని భరించడం కష్టమని జ్యో అంటుంది. తన ఫ్రెండ్స్ మీద అరిచినట్లు దీప మీద అరిచుంటే బాగుండేదని అంటుంది. ఇక దీప దగ్గరకే వెళ్లి తేల్చుకుంటానని పారుని పిలుస్తుంది. ఇక నర్శింహని తిట్టినందుకు వాడు ఇంటికి రాలేదని శోభ అనసూయ మీద అరుస్తుంది. ఇక అనసూయ అయితే పిల్ల తండ్రి ఎవడూ అలా చేయడని అది కళ్లు తిరిగి పడిపోతే నీరు వేసి లేపకుండా భుజాన వేసుకోవాలని ప్రయత్నించాడని నర్శింహని తిడుతుంది. ఇక పాప కార్తీక్‌కి పుట్టిందని శోభ అంటే అనసూయ కోడలి చెంప పగలగొడుతుంది. హాస్పిటల్‌లో పాప ఎలా ఉందో అని అనసూయ ఆలోచిస్తుంది.
హాస్పిటల్‌లో దీప పాపకి టిఫెన్ తినిపిస్తుంది. కార్తీక్ పక్కనే ఉంటాడు. శౌర్య తనకు తండ్రిగా బూచోడు వద్దని అంటుంది. బూచోడు వస్తే నన్ను ఎత్తుకుపోతాడా అని శౌర్య అంటే కార్తీక్ ఎప్పటికీ బూచోడు రాడని పాపతో చెప్తే శౌర్య ప్రామిస్ వేయమని అంటుంది. కార్తీక్ ప్రామిస్ వేస్తే ఏం సమస్యలు వస్తాయా అని దీప పాప చేతిలో చేయి వేస్తే కార్తీక్ దీప చేతి మీద చేయి పెట్టి ఒట్టు పెడతాడు. ఇక కార్తీక్ పాపకి జాగ్రత్తలు చెప్పి బయటకి వస్తే జ్యోత్స్న, పారిజాతం నిల్చొని ఉంటారు. శౌర్యని చూడటానికి వచ్చావా అని కార్తీక్ అడిగితే అవునని కానీ అంత కంటే ముందు అంత కంటే గొప్ప సన్నివేశం చూశానని అంటుంది. ఇక దీప కూడా బయటకి వచ్చి జ్యోత్స్న వాళ్లని చూసి షాక్ అయిపోతుంది.
జ్యోత్స్న: మీ వల్ల ఎవరు ఏమైపోయినా మీరు బాగానే ఉంటారు. నేను చూసిన గొప్ప సన్నివేశం ఏంటా అని అడగవా బావ.
పారిజాతం: మీ బావ ముఖం చూస్తే వీళ్లిద్దరూ ఇక్కడికి ఎందుకు వచ్చారురా అని అన్నట్లు పెట్టారు. ఇంకేం అడుగుతారు. నువ్వే చెప్పు.
జ్యోత్స్న: జీవితంలో ఎప్పుడూ వాడిని నీ దగ్గరకు రానివ్వను నేను నీతోనే ఉంటాను అని ఎవరితో ప్రామిస్ చేస్తున్నావు బావ. పిల్లతోనా తల్లితోనా.
కార్తీక్: జ్యోత్స్న.
జ్యోత్స్న: ఎందుకు అరుస్తావ్ బావ నేను చూసే టైంలో నీ చేయి తల్లి చేతిలో ఉంది. అంటే నువ్వు తల్లికి ప్రామిస్ చేసినట్లా లేక ఇద్దరికీ చేసినట్లా.
దీప: నువ్వు చాలా తప్పుగా అర్థం చేసుకుంటున్నావ్ జ్యోత్స్న.
జ్యోత్స్న: నేను అంతే దీప నాకు బుద్ధి లేదు.
కార్తీక్: అవును నీకు నిజంగానే బుద్ధి లేదు. అందుకే ఇలా అపార్థం చేసుకోవు. ఇద్దరూ గొడవ పెట్టుకోవడానికి ఇక్కడికి వచ్చారా. మీ మాట్లాడిన విధానం ఉద్దేశం రెండూ తప్పే.
దీప: కార్తీక్ బాబు ఏం మాట ఇవ్వలేదు ఇవ్వకుండా ఆపింది నేనే.
జ్యోత్స్న: ఒక్కటి గుర్తు పెట్టుకో నా నిశ్చితార్థం ఆగిపోయింది మాత్రం నీ వల్లే.
ఇక పాపకి తగ్గినా ఇక్కడే ఎందుకు ఉన్నావని అడిగితే పాప కోసం ఉన్నానని చెప్తాడు. ఇక ఎవరి కోసం ఎన్నిఆపినా పెళ్లి మాత్రం జ్యోత్స్ననే చేసుకోవాలి అని పారు అని వెళ్లిపోతారు. ఇక దీప కార్తీక్‌తో నిశ్చితార్థం ఆపుకొని ఎందుకు వచ్చారని దీప ఏడుస్తుంది. ఇంట్లో ఎవరూ తప్పుగా అనుకోరని పారు మాటలు పట్టించుకోవద్దని కార్తీక్ అంటాడు. ఇక దీప మీరు చూపించే జాలి నా వ్యక్తిత్వానికి మచ్చ పడుతుందని ఇప్పటి వరకు తన బిడ్డకు తోడు ఉన్నది చాలని ఇక వెళ్లిపోమని అంటుంది. తన కూతుర్ని తానే కాపాడుకుంటానని దీప అంటుంది. జ్యోత్స్న భోజనం చేద్దామని పారుని పిలిస్తే రాను అనేస్తుంది. నిశ్చితార్థం జీవిత ఆశయం అని అంటుంది. ఇంట్లో అందరూ భోజనం చేస్తుంటారు. అది చూసిన జ్యోత్స్న పిలవకుండానే అందరూ భోజనం చేసేస్తున్నారని మనకంటే ఎవరికీ బాధ లేదని అనుకుంటారు. ఇంతలో సుమిత్రకు కార్తీక్ కాల్ చేస్తాడు. సుమిత్రని హాస్పిటల్‌కి రమ్మని పిలుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.