Karthika Deepam 2 Serial Today January 18th: ‘కార్తీక దీపం 2’ సీరియల్ : శివనారాయణ ఇంటికి వచ్చిన కాశీ – రౌడీల నుంచి బాబును కాపాడిన దీప
Karthika Deepam 2 Today Episode: దాసు కోసం పారిజాతం దగ్గరకు వెళ్తాడు కాశీ. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Karthika Deepam 2 Serial Today Episode: రవిని కార్తీక్ డబ్బులు అడగడం చూసిన కాశీ వెళ్లి కార్తీన్‌ను డబ్బులు అవసరం ఉంటే నన్ను అడగొచ్చు కదా..? అసలు ఏమైంది అని కాశీ అడగ్గానే శౌర్య ఆరోగ్య పరిస్థితి గురించి నిజం చెప్తాడు కార్తీక్. నిజం తెలుసుకున్న కాశీ షాక్ అవుతాడు. డబ్బులు తాను ఇస్తానంటాడు. దీంతో అప్పుగా అయితే తీసుకుంటా అంటాడు కార్తీక్. సరే అంటాడు కాశీ కానీ ఈ విషయాన్ని దీపకు చెప్పొద్దంటాడు కార్తీక్. అక్క దగ్గర నేను ఎలా దాచగలను అంటాడు కాశీ. అయితే డబ్బులు వద్దంటాడు కార్తీక్. చెప్పనని కాశీ చెప్పాక ఈ డబ్బులు తీసుకుని ముందు శౌర్యను హాస్పిటల్ లో జాయిన్ చేస్తా అంటాడు కార్తీక్. ఇంతలో దాసు కనిపించడం లేదని చెప్తాడు కాశీ. ఫోన్ కూడా స్విచ్చాప్ వస్తుందని భయంగా ఉందనడంతో పోలీస్ కంప్లైంట్ ఇద్దామని కార్తీక్ అంటాడు. మరోవైపు జ్యోత్స్న ఆలోచిస్తుంది.
జ్యోత్స్న: దాసు ఏమయ్యాడో ఇంత వరకు కాశీ ఇంటి నుంచి ఫోన్ రాలేదు. టీవీ ఛానెల్లో కూడా ఎక్కడా న్యూస్ రాలేదు. దానును ఎవరైనా కాపాడారా, నేను కొట్టి దెబ్బకు అయితే బతకడం కష్టం. (అని మనసులో అనుకుంటుంది.)
పారిజాతం వస్తుంది.
పారిజాతం: నా కొడుడును ఏం చేశావే నిన్నే అడిగేది.. నా కొడుకును ఏం చేశావు.. దాసు ఫోన్ కలవలేడం. దాను కాళ్లు పట్టుకొని ఎందుకు బతిమాలావు.
జ్యోత్స్న: నీకు ఏదైనా డౌటుగా ఉంటే నీ కొడుకునే అడుగు. అతడే నిజాలు చెప్తాడు.
పారిజాతం: అడుగుదామంటే ఫోన్ స్విచ్చాప్ వస్తుంది.
అంతా గమనిస్తున్న ధశరథి జ్యోత్స్న అనుమానిస్తాడు. దాసు ఇంటికి వచ్చి ఏదో నిజం చెప్పాలనుకున్నాడు అందుకే జ్యోత్స్న ఈ పని చేసినట్టు ఉంది అని మనసులో అనుకుంటాడు. మరోవైపు కార్తీక్ తనతో ఏదో దాస్తున్నాడని దీప ఆలోచిస్తూ రోడ్డు వెళ్తుంది. ఇంతలో కొంత మంది రౌడీలు ఒక బాబును కిడ్నాప్ చేసి తీసుకెళ్తుంటే దీప కాపాడుతుంది. కంగారుగా శివనారాయణ ఇంటకి వస్తాడు కాశీ.
శివ: ఆగు అక్కడే ఎందుకొచ్చావు..
కాశీ: నాన్నమ్మతో మాట్లాడాలి..
శివ: ఫోన్లో మాట్లాడుకోవచ్చు కదా
దాసు కోసమే వచ్చి ఉంటాడని దశరధి అనుకుంటాడు
కాశీ: నాన్నమ్మ నేను ఇప్పుడు వచ్చింది నాన్న గురించి మాట్లాడడానికి.. నిన్నటి నుంచి నాన్న కనిపిచడం లేదు.
సుమిత్ర: బాబు కాశీ దాసుకు ఏం కాదులే..
ధశరథి: మనిషి మంచోడే.. కానీ రోజులే మంచిగా లేవు సుమిత్ర
సుమిత్ర: కాశీ వెళ్లి పోలీస్ కంఫ్లైంట్ ఇవ్వు ..
జ్యోత్స్న: చిన్న పిల్లాడు తప్పిపోయినట్టు పోలీస్ కంప్లైట్ ఇవ్వమంటావేంటి మమ్మీ.. ఆయన ఎక్కుడుంటాడో ఆయనకే తెలియదు
ధశరథి: నీకు తెలుసా.. నిన్నే అడిగేది
అని ధశరథి అడగ్గానే.. జ్యోత్స్న షాకవుతుంది. పారిజాతం వచ్చి పోలీస్ కంఫ్లైంట్ ఇవ్వమని చెప్తుంది. ఇంతక ముందే కంఫ్లైంట్ ఇచ్చి వచ్చానని చెప్తాడు కాశీ. దీంతో జ్యోత్స్న భయపడుతుంది. దాసును పోలీసులు కనిపెడితే నిజం తెలుస్తుంది. అప్పుడు నన్ను అరెస్ట్ చేస్తారని కంగారుపడుతుంది. దాసు ఆసుపత్రిలో ఉన్నాడని ఎవ్వరికీ తెలియదు కానీ తెలిస్తే పరిస్థి ఏంటని ధశరథి మనసులో కంగారు పడుతుంటాడు. దీంతో ఇవాళ్టీ ఏపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

