Janaki Kalaganaledhu August 17th: 'జానకి కలగనలేదు' సీరియల్: జానకి చూపించిన ఆ పచ్చబొట్టును రామ గుర్తుపట్టాడా? జానకికి అడ్డంగా దొరికిపోయిన కిషోర్?
కిషోర్ ఉగ్రవాదుల ఫైల్ కోసం జ్ఞానంబ ఇంట్లో చొరబడటంతో సీరియల్ ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Janaki Kalaganaledhu August 17th: ముగ్గురు కొడుకులు చెల్లెలు పెళ్లి చేయటానికి ముందుకు రావడంతో గోవిందరాజు దంపతులు సంతోషపడతారు. ఇక మల్లిక అక్కడి నుంచి చిరాకు పడి లోపలికి వెళ్ళిపోతుంది. జానకి వల్ల తన ఇద్దరు చిన్న కొడుకులు కూడా పెళ్లి బాధ్యతలకు ఒప్పుకున్నారని గోవిందరాజులు తెలుసుకొని జానకిని మెచ్చుకుంటాడు. మరోవైపు మల్లిక పుట్టింటికి వెళ్లడానికి బట్టలు సర్దుకుంటూ ఉంటుంది.
ఇక విష్ణు అక్కడికి రాగానే.. తనని ఇప్పుడు ఎలాగైనా ఆపుతాడు అని కలలు కంటుంది. కానీ విష్ణు ఏమి మాట్లాడకపోయేసరికి.. తనే పుట్టింటికి వెళ్తున్నాను అని చెప్పేస్తుంది. ఇక మళ్లీ ఎప్పటికీ తిరిగి రాను అనటంతో ఇన్ని రోజులకు మంచి పని చేస్తున్నావు అని అంటాడు విష్ణు. దాంతో మల్లికకు మరింత కోపం వస్తుంది. విష్ణు కూడా ఇప్పటినుంచి మొగుడుగా కాదు మగాడిలా ఉండాలి అనుకుంటున్నాను అని.. నువ్వు మీ పుట్టింటికి వెళ్లి మళ్లీ తిరిగి వస్తానంటే నేను ఇంట్లోకి కూడా రానివ్వను అని తనకు క్లాస్ పీకి అక్కడనుంచి వెళ్తాడు.
దాంతో మల్లిక చచ్చినట్లు అక్కడే ఉండిపోతుంది. మరోవైపు కిషోర్ తన గ్యాంగ్ కి ఫోన్ చేసి పోలీసుల నిఘా తమపై ఉందని.. జానకి దగ్గర తమకు సంబంధించిన ఫైల్ ఉందని.. ఎలాగైనా ఆ ఫైల్ తీసుకొస్తాను అని ఫోన్లో చెప్పి కట్ చేస్తాడు. ఇక ఇంట్లో జానకి ఉగ్రవాదుల ఫైల్లో వర్క్ చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఇక రామ వచ్చి అక్కడ పెళ్లి పనులు చేయాలి కదా అనటంతో ఇక్కడ తనకు అర్జెంట్ పని ఉందని చెబుతుంది.
ఇక వాళ్ళు కాసేపు అలా మాట్లాడుకున్న తర్వాత.. రామ ఉగ్రవాదుల ఫోటోలను చూస్తాడు. ఇక జానకి అందరి ఫోటోలు దొరికాయి మరొక ఉగ్రవాది చాలా జాగ్రత్తగా ఎస్కేప్ అవుతున్నాడు అని అంటుంది. ఆ ఫోటోలో ఉన్న వారి పచ్చబొట్టు కూడా చూపించి అందరికీ ఇదే పచ్చబొట్టు ఉంది అని మరో ఉగ్రవాదికి కూడా ఇదే ఉంటుంది అని చెబుతుంది. దాంతో రామ ఆ పచ్చబొట్టు ఈశ్వర్ కు ఉందని అంతగా గుర్తుపట్టలేక పోతాడు.
మీరు నిజంగానే చాలా కష్టపడుతున్నారు అని భార్యను మెచ్చుకుంటాడు రామ. ఇక చీకటి పడటంతో అందరు పడుకోగా కిషోర్ ఇంట్లోకి దూరుతాడు. మెల్లిగా జానకి గది దగ్గరికి వెళ్ళగా అక్కడ టేబుల్ పైన ఉన్న ఆ ఫైల్ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఆ ఫైల్ కింద పడిపోవడంతో వెంటనే జానకికి మెళుకువ వస్తుంది. దాంతో కిషోర్ అక్కడి నుంచి మెల్లిగా జారుకుంటుండగా.. వెంటనే జానకి ఎవరు నువ్వు అని ఆపుతుంది.
చూడగానే కిషోర్ ఉండటంతో షాక్ అవుతుంది. ఈ సమయంలో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అనడంతో.. వెన్నెల కోసం వచ్చాను అని అబద్ధం చెప్పి కవర్ చేస్తాడు. ఈ సమయంలో మీరు ఇలా వస్తే మీ పెళ్లి క్యాన్సిల్ అవుతుంది.. ఇంట్లో మీరు లవ్ చేసుకున్నట్లు ఎవరికీ తెలియదు అని అతడికి జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది. బయటికి వచ్చిన కిషోర్ ప్లాన్ వర్క్ అవుట్ కాలేదు అని చిరాకు పడతాడు.
ఇక ఉదయాన్నే పెళ్లి పనులు మొదలుపెడతారు ఇంట్లో వాళ్ళు. ఆ సమయంలో అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. వెన్నెలకు మంగళ స్నానం చేయించాలి కదా అనడంతో.. అక్కడ పెళ్ళికొడుకు వాళ్లు మొదలుపెట్టాకే ఇక్కడ మనం చేయాలని అంటుంది జానకి. అదే సమయంలో వెన్నెలకు కిషోర్ ఫోన్ చేసి తమ మంగళ స్నానం ప్రారంభించామని చెబుతాడు.
అదే విషయం వెన్నెల అందరికీ చెప్పగా వెంటనే జ్ఞానంబ తనకి ఎందుకు ఫోన్ చేశారు మనకి కదా చేయాల్సింది అని అంటుంది. దాంతో రామ ఎవరికో ఒకరికి చేశారు కదా ఆ టాపిక్ ను మరిచిపోయేలా చేస్తాడు. ఆ తర్వాత వెన్నెలను పెళ్లికూతురుగా తయారు చేయగా అక్కడికి వచ్చిన జెస్సి తన ఫోన్ లాక్కొని కాసేపు ఆట పట్టిస్తుంది.
ఇక తన అన్నయ్యలు ఎలాగైనా అత్తారింటికి వెళ్లి మమ్మల్ని మర్చిపోతావు కదా ఇప్పుడు మాతో కాసేపు సమయాన్ని కేటాయించవచ్చు కదా అని అంటారు. దాంతో వెన్నెల నాకు పెళ్లి వద్దు అని అంటుంది. ఏం జరిగిందని ఇంట్లో వాళ్ళు అనటంతో.. మరేంటి పెళ్లయ్యాక నేను మిమ్మల్ని ఎందుకు మర్చిపోతాను మిమ్మల్ని ఎప్పుడు నేను మర్చిపోను అని ఎమోషనల్ అవుతుంది.
also read it : Prema Entha Madhuram August 16th: ఛాయాదేవితో చేతులు కలిపిన మాన్సీ.. శత్రువు మాటలకు టెన్షన్ పడుతున్న అను?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial