Jagadhatri serial January 20th: కౌషికిపై కుట్ర చేస్తున్న కుటుంబం.. మరీ మూర్ఖంగా ప్రవర్తిస్తున్న నిషిక!
Jagadhatri Serial Today Episode: నిషికతో వాళ్లు నిన్ను మోసం చేస్తున్నారు అని ధాత్రి చెప్తున్నప్పటికీ కూడా నిషిక మూర్ఖంగా వాదిస్తుండడంతో కథలో కీలక మలుపులు ఏర్పడ్డాయి.
Jagadhatri Serial Today Episode: ఎపిసోడ్ ప్రారంభంలో ధాత్రి వాళ్ళని గవర్నర్ అప్రిషియేట్ చేసి వెళ్ళిపోతాడు. సీనియర్ కూడా ధాత్రి వాళ్ళకి ఫోన్ చేసి ప్రౌడ్ అఫ్ యు చెప్తాడు.
ఆ తర్వాత కౌషికి ఇంట్లో అందరూ కూర్చొని జరిగిన సంఘటన గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.
వైజయంతి: కాస్త లో ఎంత ప్రమాదం తప్పింది, తలుచుకుంటేనే భయం వేస్తుంది. ఆ దేవుడే మనల్ని రక్షించాడు అంటుంది.
సుధాకర్: రక్షించింది ఆ దేవుడు కాదు ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ అంటాడు.
కౌషికి : నిజమే ఆమె పంచ్ లో పవర్ చూస్తే ఎంత ధైర్యం కనిపించింది. అందరూ భయంతో వణికి పోతుంటే తను మాత్రం చావుకి ఎదురెళ్లింది అని పోలీస్ ఆఫీసర్ ని పొగుడుతుంది.
ఆ మాటలకి కేదార్, ధాత్రి నవ్వుకుంటూ ఉంటారు అది గమనిస్తుంది నిషిక.
నిషిక: వాళ్లని పొగుడుతుంటే నువ్వెందుకు మురిసిపోతున్నావు అయినా ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ ని చూస్తే అచ్చు నీలాగే అనిపించింది. పక్కనున్న అతను కూడా కేదార్ లాగే అనిపించాడు అంటుంది.
ఒక్క నిమిషం కంగారు పడిపోతారు కేదార్ దంపతులు.
నిషిక: ఆవిడని చూసి నేర్చుకో. నువ్వు బల్లికి కూడా భయపడి పోతావు అని ధాత్రిని అంటుంది.
ధాత్రి: ఆ విషయం గురించి మాట్లాడకుండా మీకు అన్నయ్య అంటే ప్రేమ లేకపోతే ఎందుకు ఆయనకి బాల్ ఇవ్వలేదు నిజం చెప్పండి వదిన మీ మనసులో ప్రేమ ఉంది కదా అంటుంది.
కౌషికి: నాకు ఎవరి మీద ఎలాంటి ప్రేమ లేదు అంటుంది. మరి అన్నయ్య కి ఎందుకు బాల్ ఇవ్వలేదు అన్న ధాత్రి ప్రశ్నకి సమాధానం చెప్పలేక పోతుంది.
నిషిక : ఆవిడ వద్దు అనుకుంటే మధ్యలో నీకెందుకు బాధ మా ఇంటి అల్లుడు సంగతి మేము చూసుకుంటాం నువ్వు ఇన్వాల్వ్ అవ్వద్దు అని ధాత్రి మీద కేకలు వేస్తుంది.
సుధాకర్ : ఆమె చెప్పింది నిజమే కదా మనసులో ప్రేమ లేకపోతే కౌషికి బాల్ ఇచ్చేసేది ప్రతిదీ మాటలతోనే చెప్పక్కర్లేదు కొన్ని అర్థం చేసుకోవాలి అంతే అంటాడు.
ధాత్రి : అర్థం చేసుకునే మనసుంటే వీళ్ళు వదిన బాధని ఎప్పుడూ అర్థం చేసుకునేవారు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
చూడండి అత్తయ్య ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని నిషిక అంటుంది ఆమె మాటలు పట్టించుకోకుండా ఆమెని లాక్కొని తన గదిలోకి వెళ్తుంది వైజయంతి.
వైజయంతి : ఇప్పుడు మనకి పెద్ద సమస్య వచ్చేలాగా ఉంది ఇప్పుడు కౌషికి, సురేష్ కలిశారు అంటే మనకే ముప్పు అంటుంది.
యువరాజ్ బాబాయ్: సురేష్ సామాన్యుడు కాదు మనం నొక్కేసిన డబ్బులు తాలూకా లెక్కలు కక్కమంటాడు అప్పుడు ఇద్దరికీ భయపడి బతకాల్సి వస్తుంది అంటాడు.
వైజయంతి: నిషికతో నువ్వు దివ్యాంకని రెచ్చగొట్టు ఎంత తొందరగా దివ్యాంకకి సురేష్ కి పెళ్లి అయితే మనకి అంత మంచిది అని చెప్తుంది.
అందుకు సరే అంటుంది నిషిక.
మరోవైపు డైనింగ్ టేబుల్ సర్దుతూ ఉండగా పేపర్ కనిపిస్తుంది ధాత్రి కి అందులో చందాలు వసూలు చేస్తున్న ముఠా గురించి చదువుతుంది. అంతలోనే చందాల కోసం వాళ్ళ ఇంటికి కొందరు వ్యక్తులు వస్తారు.
నిషిక: మీకు ఏం కావాలి అని అడుగుతుంది.
వచ్చినవాళ్లు : మేము ఆశ్రమం కడుతున్నాము చందా కావాలి ఎక్కువ డబ్బిస్తే పేర్లు శిలాఫలకం మీద రాయిస్తాము ఇంకా ఎక్కువ డబ్బు ఇస్తే శిలా విగ్రహం కూడా పెడతాము అంటారు.
నిషిక : ఆనందంతో ఉబ్బిపోయి మూడు లక్షలు ఇస్తాను అంటుంది.
ధాత్రి: నీకేమైనా పిచ్చా ఎవరో ఏమిటో తెలుసుకోకుండా అంత డబ్బు ఇవ్వటం ఏమిటి అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కౌషికి కూడా అదే చెప్తుంది.
నిషిక : వాళ్లు అబద్ధం చెప్తున్నారు అనడానికి ఏంటి రుజువు అంటుంది.
ధాత్రి: వచ్చిన వాళ్ళని మీ అనాధాశ్రమం పేరు ఏంటి అని అడుగుతుంది వాళ్ళు తడబడుతూ ఒక్కొక్కరు ఒక్కొక్క పేరు చెప్తారు. ఇంకా అనాధాశ్రమం గురించి డీటెయిల్స్ అడిగితే సరియైన సమాధానం చెప్పలేక పోతారు.
కౌషికి : ఇప్పటికైనా అర్థమైంది కదా అంటుంది.
నిషిక : అయినా కూడా నేను వాళ్లకి డబ్బులు ఇస్తానని మాట ఇచ్చాను ఇచ్చి తీరుతాను నా వాటాలో నుంచి డబ్బులు ఇస్తాను అంటుంది.
మూర్ఖంగా మాట్లాడొద్దు అంటుంది కౌషికి.. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.