Jagaddhatri Serial February 8th: అక్క ముందు అడ్డంగా దొరికిపోయిన నిషిక.. చెల్లెలి చెంప పగలగొట్టిన ధాత్రి!
Jagadhatri Serial Today Episode: ధాత్రి నిషిక చెంప పగలగొట్టడంతో తర్వాత ఏం జరుగుతుందో అనే ఉత్కంఠత కధలో ఏర్పడుతుంది.
Jagadhatri Serial Today Episode: ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలో కాచి, బూచి నిషిక కి బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు.
బూచి: అధికారం మొత్తం వదిన తీసుకుంటుంది లేదంటే ఆ అధికారం ధాత్రి వాళ్ళకి అప్పగిస్తుంది అందుకే మావయ్య గారి ప్లేస్ లో నువ్వే కూర్చోవాలి సిస్టర్ అంటాడు.
సరే నేను మావయ్య వచ్చాక మాట్లాడుతాను అంటూ అత్తయ్యకి భోజనం తీసుకు రమ్మని బూచి కి చెప్తుంది నిషిక.
ఇంతలో కౌషికి వాళ్ళు ఇంటికి రావడంతో హడావిడిగా వాళ్లకి ఎదురెళ్ళి ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చారు, బెయిల్ విషయంలో ఏమైనా ఇబ్బంది ఎదురయిందేమో అని భయపడిపోయాను అని కంగారుగా మాట్లాడుతూ కాచితో దిష్టినీళ్లు తీసుకొని రా ఆయనకి దిష్టి తీయాలి అంటుంది వైజయంతి.
కౌషికి వాళ్ళ మొహాలు డల్ గా ఉండటం చూసి ఏం జరిగింది అని అడుగుతుంది.
జరిగిందంతా చెప్తుంది ధాత్రి. దాంతో ఏడుస్తూ కూలబడిపోతుంది వైజయంతి. చీమకు కూడా అపకారం చేయని మనిషికి ఇలాంటి కష్టం వచ్చింది అంటూ ఏడుస్తుంది.
ధాత్రి : మీరేమీ కంగారు పడకండి సాక్ష్యాలు అన్ని మనకి వ్యతిరేకంగా ఉండటం వలన ఈరోజు మనం ఒక అడుగు వెనక్కి వేయవలసి వచ్చింది. రేపు కచ్చితంగా బెయిల్ దొరుకుతుంది అని ధైర్యం చెప్పి వైజయంతిని ఆమె గదికి పంపిస్తుంది.
అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. నిషిక కూడా అక్కడి నుంచి వెళ్లిపోబోతుంటే ధాత్రి కేదార్ తో మాట్లాడుతూ పోయిన పెన్ డ్రైవ్ అంత త్వరగా దొరుకుతుంది అనుకోలేదు అంటుంది.
ఆశ్చర్యపోయిన నిషిక ఏం పెన్ డ్రైవ్ అని అడుగుతుంది.
ధాత్రి: మినిస్టర్ కి సంబంధించిన సాక్ష్యాలు ఉన్నాయి కదా ఆ పెన్ డ్రైవ్ అంటుంది.
నిషిక: ఆ పెన్ డ్రైవ్ ఇది అయ్యే అవకాశం లేదు, అది ఇది కాదు అంటుంది.
ధాత్రి: అంత నమ్మకంగా చెప్తున్నావు అంటే అసలు పెన్ డ్రైవ్ ఎక్కడ ఉందో నీకు తెలుసా అని అనుమానంగా అడుగుతుంది.
నోరు జారానని అప్పుడు గ్రహిస్తుంది నిషిక నాలుక కరుచుకొని మాట మార్చేస్తుంది.
నిషిక : నాకెలా తెలుస్తుంది,అయినా పట్టుకెళ్ళిన వాళ్ళు అంత జాగ్రత్తగా మీకు అప్పజెప్తారా అందుకే అది ఇది అయ్యే అవకాశం లేదు అని చెప్పాను అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది.
ధాత్రి : దీన్ని బట్టి నీకు ఏమనిపిస్తుంది కేదార్ అని అడుగుతుంది.
కేదార్: కచ్చితంగా ఇది నిషిక పనే, నిషిక దివ్యాంక కి పెన్ డ్రైవ్ ఇచ్చి ఉండాలి అంటాడు.
ధాత్రి: సాక్ష్యాధారాలతో సహా సహా కనిపెడదాం అంటుంది.
తరువాత దొంగ చాటుగా నిషిక రూమ్ లోకి వెళ్లి ఆమె ఫోన్ తీసుకువచ్చేస్తుంది ధాత్రి. ఆ ఫోన్ తో దివ్యాంకతో చాటింగ్ మొదలు పెడుతుంది.
దివ్యాంక : ఫోన్ చేయకుండా చాట్ చేస్తున్నావ్ ఏంటి అని అడుగుతుంది.
ధాత్రి: పక్కనే కౌషికి వదిన ఉంది అందుకే చాటింగ్ చేస్తున్నాను అయినా ఆ పెన్ డ్రైవ్ సేఫె కదా అని మెసేజ్ పెడుతుంది.
దివ్యాంక : సేఫ్ గానే ఉంది, దీనంతటికీ కారణం నువ్వే అని మెచ్చుకునేలాగా మాట్లాడుతుంది.
నిజం నిర్ధారణ అయినందుకు కోపంతో పగిలిపోతారు ధాత్రి దంపతులు. నేరుగా నిషిక దగ్గరికి వెళ్లి ఎందుకు ఇలా చేశావు, ఆ పెన్ డ్రైవ్ దివ్యాంకకి ఎందుకు ఇచ్చావు అని నిలదీస్తారు.
నిషిక : నేను ఇవ్వటం ఏమిటి నాకు అవసరం లేదు అని దబాయిస్తుంది.
ధాత్రి: మా దగ్గర ఉన్నాయి, నిజంగా నువ్వు ఆ పెన్ డ్రైవ్ తీయకపోతే ఇప్పుడే దివ్యానికి ఫోన్ చేసి పెన్ డ్రైవ్ సేఫా అని అడుగు అంటుంది.
నిషిత : మా దగ్గర సాక్ష్యాధారాలు ఉన్నాయి అనేసరికి కంగారుపడుతుంది. మళ్లీ తమాయించుకొని నాకు ఎలాంటి ఫోను చేయవలసిన అవసరం లేదు ఒకవేళ పెన్ డ్రైవ్ తీసినా అది నా ఇష్టం,ఇది నా ఇల్లు అంటుంది.
ఆ మాటలకి కోపంతో రెచ్చిపోయిన ధాత్రి నిషిక చెంప పగలగొడుతుంది. అక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.
Also Read: 'విరూపాక్ష'తో పోలికలు... పెళ్లి పుకార్లు... 'ఊరు పేరు భైరవకోన' సంగతులు... వర్ష బొల్లమ్మ ఇంటర్వ్యూ