Jagadhatri December 25th Episode: అందరి ముందు నేరాన్ని ఒప్పుకున్న నిషిక.. యువరాజ్ దంపతులని ఇంట్లోంచి బయటికి పొమ్మన్న కౌషికి!
Jagadhatri Today Episode: ఇంట్లో రచ్చ చేసి ఆఫీస్ కి వెళ్ళటానికి కౌషికి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటుంది నిషిక. ఆఫీస్ కి వెళ్ళిన తర్వాత నిషిక ఎలాంటి కుట్రలు చేయబోతుంది అనే క్యూరియాసిటీ కథలో ఏర్పడుతుంది.
Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అని నిషికని అడుగుతుంది ధాత్రి.
నిషిక: నిద్ర పట్టక తిరుగుతున్నాను, ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ చెప్పకు.
ధాత్రి : ఎందుకు అని అనుమానం గా అడుగుతుంది.
నిషిక: మళ్లీ ఇది పద్ధతి కాదు ఇలా చేయకూడదు అని రాద్ధాంతం చేస్తారు అయినా నువ్వేంటి ఈ టైంలో వచ్చావు.
ధాత్రి: మంచినీళ్లు కోసం వచ్చాను.
నిషిక: తీసుకున్నావు కదా ఇంక వెళ్లి పడుకో నేను కూడా వెళ్లి పడుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
మరుసటి రోజు తెల్లవారుజామునే పూజ చేస్తున్న నిషిక ని ఇంట్లో వాళ్ళందరూ షాక్ అవుతారు. తను పూజ చేస్తుందా అంటూ ధాత్రితో సహా అందరూ ఆశ్చర్యపోతారు.
నిషిక తల్లి : తను పుట్టింట్లో ఉండేటప్పుడు రోజు ఇలాగే పొద్దున పూట లేచి పూజ చేసేది, వాళ్లకంటే తెలియదు ద్ధాత్రి నీకు కూడా తెలియదా అని అడుగుతుంది.
కేదార్: మీరు నిషిక గురించే చెప్తున్నారా అత్తయ్య అని వెటకారం గా అడుగుతాడు.
అతని వైపు సీరియస్ గా చూస్తుంది నిషిక తల్లి. అంతలోనే నిషిక హారతి తీసుకుని వచ్చి మామగారికి ఇవ్వబోతూ కింద పడేస్తుంది. వాళ్ల నాయనమ్మ మందలించి ధాత్రిని హారతి తీసి పక్కన పెట్టమని చెప్తుంది.
నిషిక : మరొక ఐదు నిమిషాల్లో ఇంట్లో పెద్ద యుద్ధం జరగబోతుంది అని మనసులో ఆనందపడుతుంది. సుధాకర్ తో ఈరోజు ఏదో పెద్ద మీటింగ్ ఉన్నట్టుంది కదా మామయ్య అంటుంది.
సుధాకర్: అవునమ్మా, మినిస్టర్ గారితో మీటింగ్ ఉంది అందుకే కౌషికి ఏడు గంటలకే వెళ్ళిపోయింది ఈ కాంట్రాక్ట్ వస్తే కోట్లలో లాభంతో పాటు గవర్నమెంట్ ది కావటంతో మంచి పేరు కూడా వస్తుంది అంటాడు.
ధాత్రి: ఇందాక ముగ్గు పెట్టినప్పుడు వదిన కారు బయటే ఉంది ఆవిడ వెళ్ల లేనట్లుగా ఉన్నారు అని అనుకొని బయటకు వెళ్లి చెక్ చేస్తుంది. అక్కడ కారు చెప్పులు ఉండటం చూసి వదిన వెళ్లలేదు మావయ్య ఇంట్లోనే ఉన్నట్టున్నారు అంటుంది.
అయితే కౌషికి నిజంగానే ఇంట్లో ఉంటుంది 4:00కి పెట్టుకున్న అలారం ని 9:00కి మార్చేస్తుంది నిషిక. దాంతో 9 గంటలకి లేచిన కౌషికి కంగారుపడి కిందికి వస్తుంది.
నిషిక : అదేంటి వదిన మీరు ఏడు గంటలకే మీటింగ్ కి వెళ్ళిపోయారు అనుకుంటున్నాము మీరు కూడా నాకులాగే ఒళ్ళు బద్ధకం పెరిగిపోయిందా అని వెటకారంగా అడుగుతుంది.
కౌషికి : అదేమీ కాదు నేను నాలుగు గంటలకే అలారం పెట్టుకున్నాను కానీ ఎవరో 9 గంటలకి మార్చేశారు అంటుంది.
అప్పుడు ధాత్రి కి కౌశికి గది ముందు నిషిక ఎందుకు ఉందో అర్థమవుతుంది. నిషికని పక్కకు తీసుకువెళ్లి అలారం నువ్వే కదా మార్చావు అని అడుగుతుంది.
నిషిక : నాకు అంత అవసరం లేదు.
ధాత్రి : నీకే ఆ అవసరం ఉంది ఆ కాంటాక్ట్ చేయి జారిపోతే వదిన వల్లే జరిగిందని ఇంట్లో అందరి ముందు రచ్చ చేయవచ్చని నీ ఆలోచన అంటుంది.
అంతలోనే అక్కడికి వచ్చిన కౌషికి నా గదిలోకి వచ్చి నువ్వే కదా అలారం చేంజ్ చేశావు మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు అంటుంది.
నిషిక : అమ్మ మీద ఒట్టు అనేసరికి భయపడుతుంది నేనే అలా చేశాను అని ఒప్పుకుంటుంది.
కౌషికి : కోపంతో నిషిక చంప పగలగొడుతుంది. ఎంత పని చేసావు ఇప్పుడు టైం సెన్స్ లేదని ఆ కాంట్రాక్టు వాళ్ళు మనకి ఇవ్వరు.నా కుటుంబం పరువు పోతుంది అంటే నేను చూస్తూ ఊరుకోలేను నువ్వు నీ భర్త ఇంట్లోంచి తక్షణమే వెళ్ళిపోండి.
తనది చిన్న పిల్ల మనస్తత్వం ఏదో కోపంతో అలా చేసింది ఈసారి కి క్షమించమని బ్రతిమలాడుతారు నిషిక అమ్మ, అత్త.
వైజయంతి: తను తప్పు చేసింది అంటున్నారు కానీ ఎందుకు తప్పు చేసిందో ఎవరు అడగటం లేదు తనని కూడా ఆఫీసుకు తీసుకువెళ్తే ఇలా చెయ్యదు కదా అంటుంది. సుధాకర్ కూడా నిషికని ఆఫీసుకు తీసుకు వెళ్తేనే మంచిది అంటాడు.
కౌషికి : ఇంతమంది చెప్తున్నారు కాబట్టి ఆఫీస్ కి రావటానికి ఒప్పుకుంటున్నాను అక్కడ పిచ్చిపిచ్చి వేషాలు వేస్తే ఊరుకునేది లేదు అని హెచ్చరించి వెళ్ళిపోతుంది.
తర్వాత గదిలో చూసావా అమ్మ వద్దు అన్న వదిన నోటితోనే ఆఫీస్ కి రమ్మనే లాగా చేశాను అంటుంది నిషిక.
నిషిక తల్లి : ఏ మాత్రం తేడా జరిగిన వీధిలో కూర్చొని ఈపాటికి ఏడ్చేదానివి.
నిషిక: ఇదంతా ధాత్రి వల్లే తనే పక్కకు తీసుకొని వెళ్లి అడగకపోయి ఉంటే ఇదంతా జరిగేది కాదు అంటుంది.. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.