Jagadhatri December 18th Episode: 'జగద్ధాత్రి' సీరియల్: ధాత్రి దంపతులను ఇంట్లోంచి బయటికి పొమ్మన్న సుధాకర్, నిషిక చెంప పగలగొట్టిన రాగిణి!
Jagadhatri Today Episode: ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్న కూతురి చెంప పగలగొట్టి అత్తింట్లో ఎలా మసులుకోవాలో రాగిణి చెప్పడంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకుంటాయి.
Jagadhatri Today Episode: ఈరోజు ఎపిసోడ్ లో ఇంట్లోంచి వెళ్ళిపోతాను అన్న వియ్యపురాలిని ఆగమని చెప్పి కౌషికిని తీసుకొని ధాత్రి దంపతులతో మాట్లాడటానికి వెళ్తాడు సుధాకర్.
సుధాకర్: మీరు ఇంటికి వచ్చిన దగ్గర నుంచి గొడవలు ఎక్కువ అవుతున్నాయి మీరు ఇంట్లోంచి వెళ్లిపోండి అంటాడు.
ధాత్రి :అదేంటి ఇంకో 15 రోజులు టైం ఉంది కదా అంటుంది.
కౌషికి: నిజమే కానీ మీరు ఇంట్లోకి వచ్చిన దగ్గరనుంచి గొడవలు ఎక్కువ అవుతున్నాయి, ఏ కుటుంబం కోసం నిజాన్ని దాచామో ఆ కుటుంబమే ఇప్పుడు ముక్కలైపోతుంది దయచేసి మీరు ఇంట్లోంచి వెళ్లిపోండి లేదంటే నా స్టైల్ లో డీల్ చేయాల్సి ఉంటుంది.
కేదార్: నాన్న ని నాన్న అని నిరూపించుకోకుండా ఇంట్లోంచి పంపించేస్తానంటే ఎలా..
సుధాకర్: మాట్లాడితే నాన్న అంటావు నిన్ను అలా పిలవద్దని చెప్పానా అయినా సాక్ష్యం చూపించి మాట్లాడు.
ధాత్రి: మా దగ్గర సాక్ష్యం లేదని ఎవరు చెప్పారు మా దగ్గర సాక్షం ఉంది, ఆయనే సూరి మామ అంటుంది.
ఆ మాటలకి ఒక్కసారిగా కంగారు పడతాడు సుధాకర్, అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు అని తడబడతాడు.
ధాత్రి : అతనికి మీకు సంబంధం ఉందని, అతను మీకు తెలుసు అని మేము అనలేదు కదా అంటుంది.
ఆ మాటలకి కంగారుపడిన సుధాకర్ కి ఆస్తమా వచ్చేస్తుంది. వెంటనే బయటికి తీసుకువచ్చి కౌషికి అతనికి ఇన్హేలర్ ఇస్తుంది.. అతను స్థిమిత పడిన తరువాత నిజంగానే మీకు సూరి తెలుసా అని అడుగుతుంది.
సుధాకర్: తెలియదు అంటే కౌషికి నమ్మదు అనుకొని తెలుసు నేను ఉద్యోగం చేసినప్పుడు నా కొలీగ్ ఇప్పుడు అతనితో కలిసి సాక్ష్యాలు సృష్టించడానికి ప్లాన్ చేస్తున్నట్లుగా ఉన్నారు అని అబద్ధం చెప్పేస్తాడు.
ఆ మాటలని నమ్ముతుంది కౌషికి, కానీ అప్పుడే వచ్చిన యువరాజ్ మాత్రం ఆ మాటలు నమ్మడు..
యువరాజ్: ఈయన మన దగ్గర ఏదో దాస్తున్నాడు, అసలు సూరి ఎవరు అంటూ నిలదీస్తాడు.
కౌషికి: నిజం ఎక్కడ బయటపడిపోతుందో అని యువరాజ్ కి అబద్దం చెప్తుంది.
యువరాజ్: అక్క ఖచ్చితంగా అబద్ధం చెప్తుంది అని మనసులో అనుకుంటాడు.
ఆ తర్వాత అందరూ కిందికి వస్తారు.
కౌశికి : వాళ్ళు ఇంకొక 15 రోజులు ఇక్కడ ఉంటారు ఆ తరువాత ఉంచమన్నా ఉంచను, నేనే బయటికి పంపించేస్తాను.
నిషిక: సరే అయితే తనని ఇంట్లో ఉండనివ్వండి నేను పుట్టింటికి వెళ్ళిపోతాను అంటుంది ఆ మాటలని రాగిణి సమర్థిస్తుంది.
ధాత్రి : ఏంటి పిన్ని మీరు కూడా తనని సమర్థిస్తున్నారు. పుట్టింటికి వెళ్లడం సులువే కానీ అత్తింటికి రావడం చాలా కష్టం.. అయినా తన జీవితాన్ని బాగు చేయవలసింది పోయి మీరు కూడా ఇలా మాట్లాడుతారు ఏంటి అంటుంది.
నన్నే తప్పు పడుతున్నావా అంటూ రాగిణి, ఆమెకి సపోర్ట్ చేస్తూ నిషిక ఆమె అత్త కూడా మాట్లాడతారు.
కౌషికి : ఇందాకటి నుంచి చూస్తున్నాను తప్పంతా ధాత్రిదే అన్నట్టు మాట్లాడుతున్నారు.. కూతురికి నచ్చ చెప్పాల్సింది పోయి ఇలా మాట్లాడుతారేంటి అంటూ మందలిస్తుంది.
నిషిక: చెప్పాను కదా మమ్మీ వీళ్ళు ఎంత చెప్పినా నా మాట వినరు, అందుకే యువరాజ్ కి విడాకులు ఇచ్చేసి శాశ్వతంగా పుట్టింటికి వచ్చేస్తాను అంటుంది. దాంతో కూతురు చెంప పగలగొడుతుంది రాగిణి. నిషికని పక్కకు తీసుకువెళ్లి ఆమెకి చివాట్లు పెడుతుంది.
నిషిక: అదేంటి ఇంతసేపు నువ్వు కూడా పుట్టింటికి తీసుకెళ్ళిపోతాననే కదా అన్నావు అంటుంది.
నిషిక అత్త : నిజంగా నిన్ను తీసుకువెళ్లిపోవటానికి రాలేదు.. వాళ్ళని బెదిరించడానికి అలాగే ఈ ఇంట్లో నీ మాట చెల్లుబాటు అయ్యేలాగా చేయడానికి వచ్చాము.
రాగిణి : ఎవరో ఏదో అన్నారని నీ కాపురాన్ని నువ్వు కూల్చుకుంటావా, కౌషికితో బంధాన్ని పెంచుకోమంటే ఇలా చేస్తున్నావ్ ఏంటి? బంధాలని నిలబెట్టుకోవడం చేతకాకపోతే కనీసం నిలబెట్టుకుంటున్నట్లు నటించు అంటుంది. ఆ కౌషికికి దగ్గర అయ్యేందుకు ప్రయత్నించు అని అంటుంది. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.
Also Read: అమర్‌దీప్, గీతూ, అశ్వినీ కార్లు ధ్వంసం, ఆర్టీసీ బస్సుపైనా దాడి - ఆకతాయి ఫ్యాన్స్ అరాచకం