Jagadhatri Serial Today September 15th: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లే తన సవతి కూతురని తెలుసుకున్న వైజయంతి! చెల్లి కోసం ఒకటైన కేథార్, యువరాజ్!
Jagadhatri Serial Today Episode September 15th మాధురి భర్త వంశీ మాధురిని పుట్టింటికి దూరం చేయాలి అనుకోవడం, కేథార్, యువరాజ్ ఇద్దరూ వంశీని కొట్టడానికి వెళ్లడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode మాధురి ప్రగ్నెంట్ అని కౌషికి ఇంటికి వచ్చి అందరితో సంతోషంగా గుడ్ న్యూస్ పంచుకుంటుంది. ఇంతలో మాధురి భర్త వంశీ, మాధురి అత్త వస్తారు. మాధురి చెప్పకుండా వచ్చేసిందని కోప్పడతారు. వాళ్లు పంపించడం లేదని వచ్చేశా అని మాధురి అంటుంది.
జగద్ధాత్రి వంశీ వాళ్లతో పుట్టింటికి పంపకూడనంత తప్పు ఏం జరిగింది అని అడుగుతుంది. దానికి వంశీ యువరాజ్‌ని చూపించి ఇంట్లో ఒక నేరస్థున్ని పెట్టుకున్నారు. అందుకే ఇలాంటి క్రిమినల్స్ ఉన్న ఇంటితో మాకు సంబంధాలు వద్దని అనుకున్నాం అందుకే పంపలేదు అంటాడు. మాధురి భర్తతో మీ అన్నయ్య గురించి మాట్లాడుతున్నారు.. మీ నాన్న జైలుకి వెళ్లలేదా.. మీ నాన్నకి లేని తప్పు మా అన్నయ్య విషయంలో వచ్చిందా అని అడుగుతుంది. ఇంట్లో కూడా మా అన్నయ్యనే అంటున్నారు.. మీరు మా అన్నయ్యని ఎంత చీప్‌గా చూసినా నా దృష్టిలో మా అన్నయ్య గొప్పోడు అని అంటుంది. రోడ్డున పోయిన కుక్కలు చాలా వాగుతాయి వదిలేయ్ అని యువరాజ్ అంటాడు.
వంశీ యువరాజ్‌ని నన్నే అంటావా.. అని యువరాజ్‌ని తిడతాడు. మాధురి వంశీ చాలా గొడవ పడతారు. నా పుట్టింటిని నాకు దూరం చేయాలని చూస్తే ఊరుకోను అని మాధురి అంటే వంశీ మాధురిని కొట్టడానికి వెళ్లి చేయి ఎత్తుతాడు. ఇంతలో యువరాజ్, కేథార్ చెరోవైపు వంశీ చేయి పట్టుకుంటారు. మాధురి ఇద్దరు అన్నయ్యల్ని చూసి ఎమోషనల్ అయిపోతుంది. యువరాజ్ వంశీతో ప్రెగ్నెంట్ అని కనీసం ఇంకితం లేకుండా చేయి ఎత్తుతావా ఇంకోసారి చేయి ఎత్తితే చంపేస్తా అంటాడు. ఇంతలో కేథార్ మా చెల్లిని ఏమైనా అనాలి అంటే ముందు ఈ ఇద్దరు అన్నల్ని దాటాలి అని అంటాడు. అన్నదమ్ములు ఇద్దరూ ఏకం అయిపోయారా అని వంశీ అంటే ఎవరూ ఏకం కాలేదు నేను ఒక్కడినే నీకు చాలు అని అంటాడు.
సుధాకర్ యువరాజ్‌ని కొట్టి కేథార్, యువరాజ్ ఇద్దర్ని తిడతాడు. బావగారు అని లేకుండా ఇంత చేస్తారా అని కోప్పడతాడు. ఇద్దరితో వంశీకి సారీ చెప్పిస్తాడు. వంశీ సారీ అవసరం లేదని మీ చెల్లిని మా ఇంటికి ఎలా పంపిస్తారో నేను చూస్తా అని వదిలేసి వెళ్లిపోతుంటే కౌషికి ఆపి ఈ టైంలో తనకు నువ్వు అవసరం అని సర్ది చెప్తారు. వంశీకి సుధాకర్ కూడా సారీ చెప్పి మాధురినీ తీసుకెళ్లమని అంటే పుట్టింటితో శాశ్వతంగా దూరం అవుతా అని మాటిస్తే తీసుకెళ్తా అంటాడు. నేను పుట్టింటిని వదులుకోను అని మాధురి అంటుంది. జగద్ధాత్రి కూడా సర్ది చెప్పాలని చూస్తుంది. అన్న మీద కోపం అన్న మీద ఉండాలి.. చెల్లిని బాధ పెట్టడం ఏంటి.. మేం కూడా తనని చూడకుండా ఉండలేం కదా అని అంటుంది.
వైజయంతి రెండు చేతులు జోడించి మా గురించి ఆలోచించి పుట్టింటితో బంధం తెంచేయకండి అని బతిమాలుతుంది. వంశీ తల్లి కడుపుతో ఉన్నప్పుడు చేసిన ఫంక్షన్లలో యువరాజ్ ఉండకూడదు అని అంటారు. అందరూ షాక్ అయిపోతారు. కూతురి కాపురం కోసం సుధాకర్ మాధురికి జరిగిన ఏ ఫంక్షన్‌లోనూ యువరాజ్ ఉండడు అని చెప్తాడు. కూతుర్ని అల్లుడితో పంపిస్తాడు. జరిగిన దానికి యువరాజ్ చాలా బాధ పడతాడు. కౌషికి యువరాజ్‌తో ఫంక్షన్లు ఇప్పుడే ఏం చేయం కదా.. బాధ పడకు అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దాం కానీ నాకు ఒకటి నచ్చింది సందర్భం కాకపోయినా.. మీ ఇద్దరూ అన్నదమ్ముల్లా ఒక్కటిగా అండగా ఉండటం చూసి చాలా సంతోషంగా అనిపించింది. మీ ఇద్దరూ అలా మనస్ఫూర్తిగా ఎప్పుడు కలిసిపోతారా అని వేయి కళ్లతో ఎదురు చూస్తున్నా అని చెప్తుంది. అది ఈ జన్మకు జరగదు అక్క అని యువరాజ్ వెళ్లిపోతాడు.
వైజయంతి శ్రీవల్లి సంగతి తేల్చాలి అని అనాథాశ్రమానికి బయల్దేరుతుంది. శ్రీవల్లి కేథార్‌ని చూసి ఈయనకు నా కంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నట్లు ఉన్నాయ్ అని అనుకుంటుంది. 20 ఏళ్ల క్రితం అనాథాశ్రమానికి రంగారావు అనే మేనేజర్ ఉండే వాడు తెలుసా అని ఒకాయన్ని అడుగుతుంది. ఆయన మేనేజరే కాదు ఈ ఆశ్రమ ఫౌండర్ నాకు తెలుసు అని ఆయన్ను పిలిచి తీసుకొని వస్తారు. వైజయంతి 20ఏళ్ల క్రితం నేను ఒక పాపని వదిలేశా తను ఎవరో తెలుసా అని అడుగుతుంది. జనవరి 19, 2004 అని డేట్ చెప్పి ఆ రోజు నిండు పున్నమి పొత్తిళ్లలో ఉన్న బిడ్డని అప్పగించానని అంటుంది. ఆయన ఫైల్ చెక్ చేసి ఆ అమ్మాయి పేరు శ్రీవల్లి అని చెప్తారు.
వైజయంతి షాక్ అయి అంటే అది సుహాసిని స్వయానా కూతురా.. కేథార్‌కి సొంత చెల్లా.. అని అనుకుంటుంది. కేథార్ దగ్గరకు జగద్ధాత్రి వెళ్లి శ్రీవల్లి అనాథాశ్రమం పేరు చెప్పగానే అత్తయ్య షాక్ అయిపోయారు.. ఈ రోజు చాలా ప్రశ్నలు అడిగారు..ఏదో అనుమానంగా ఉందని చెప్తుంది. శ్రీవల్లిని అడిగితే తెలిసిపోతుందని అడుగుదామని వెళ్తుంది. శ్రీవల్లి తల్లి ఫొటో చూస్తూ ఎమోషనల్ అవుతుంది. ఇంతలో కౌషికి బాబు ఏడ్వడంతో శ్రీవల్లి బాబుని తీసుకెళ్తుంది. జగద్ధాత్రి శ్రీవల్లి కోసం ఆ గదికి వస్తుంది. అక్కడే ఉన్న కేథార్ తల్లి ఫొటో వైపు జగద్ధాత్రి వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















