Jagadhatri Serial Today October 8th: జగద్ధాత్రి సీరియల్: కేథార్‌ను అవమానించిన మాధురి.. చీర విసిరేసిన వంశీ! అసలు కారణం ఇదేనా?
Jagadhatri Serial Today Episode October 8th కేథార్‌ని మాధురి అవమానించి ఇంటి నుంచి పంపేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode వంశీని నిషిక రెచ్చగొడుతుంది. కేథార్‌ని కూడా ఫంక్షన్‌లో లేకుండా చేయమని అంటుంది. వంశీ కేథార్ కూడా ఫంక్షన్‌లో ఉండొద్దని బయటకు వెళ్లిపోమని అంటుంది. సుధాకర్ వంశీకి సర్దిచెప్పాలని చూస్తే వైజయంతి అడ్డుకుంటుంది. కేథార్‌తో స్తంభంలా పాతుకుపోయింది చాలు ఇక్కడ నుంచి కదులు పోరా అని అంటుంది.
జగద్ధాత్రి కేథార్‌ని తీసుకొని వెళ్లిపోతుంది. కేథార్ వెళ్లిపోవడం మంచిదైంది అని వైజయంతి నిషికతో అంటే నేనే మొత్తం చేశా అని నిషిక చెప్తుంది. ఇప్పుడు కడుపు నిండా తిండి తినాలి అనిపిస్తుందని వైజయంతి అంటుంది. మాధురి మనసులో సారీ అన్నయ్య నిన్ను అన్ని మాటలు అంటున్నాం ఏం అనలేకపోతున్నా అని అనుకుంటుంది.
కేథార్ గదిలో బాధ పడుతుంటే కౌషికి వెళ్లి ఓదార్చాలని చూస్తుంది. కేథార్ కౌషికితో పర్లదు అక్క.. నా వల్ల చెల్లి సీమంతం ఆగిపోకూడదు కానీ చెల్లికి చీర పెట్టాలి అనుకున్నా.. అది ఒక్కటి ఇచ్చేస్తా అని చీర తీసుకొస్తాడు. కౌషికి కేథార్ని తీసుకొని వెళ్తుంది. శ్రీవల్లి అన్నయ్య బాధ పడుతుంటాడు ఎంత అవమానించారని అంటుంది. ఇంతలో కేథార్ మళ్లీ వస్తే నిన్ను కనపడొద్దు అన్నా కదా ఎందుకు వచ్చావ్ అని అడుగుతాడు వంశీ. బావ ప్లీజ్ బావ ఒక్క నిమిషం అని కేథార్ మాధురి దగ్గరకు వెళ్లి నీ సంతోషం నాకు కావాలి.. నీ సీమంతం ఏం ఆటంకం జరగకుండా జరగాలి.. ఇది నీకోసమే అమ్మ ఈ అన్నయ్య నీకు ఇస్తున్నా కానుక సీమంతంలో నువ్వు ఇది కట్టుకోవాలి.. అన్నయ్య ఇచ్చిన బహుమతి నా చెల్లి తీసుకుందనే సంతోషం నాకు చాలు తీసుకుంటావా అమ్మ అని కేథార్ అడిగితే తప్పకుండా అని మాధురి తీసుకోబోతే వంశీ విసిరేస్తాడు.
కేథార్ ఎమోషనల్ అయిపోతూ నా చెల్లికి ఒక్క చీర పెట్టకూడదా అని అంటాడు. చెల్లి చెల్లి అని అనకు కంపరంగా ఉంది.. నువ్వు ఏమైనా మా మామయ్య కొడుకువా మా అత్తయ్య సంతానమా.. ఎవరికి పుట్టావు నువ్వు ఒక అనాథవి అని కేథార్ పుట్టుక గురించి తప్పుగా మాట్లాడుతాడు. నువ్వు ఇచ్చిన చీర అది కడితే దాని ప్రాణం కూడా తీయడానికి వెనకాడను అని వంశీ అంటాడు. నా చెల్లిని అలా అనకు తట్టుకోలేను ఊరుకోను అంటాడు కేథార్. నీకేం హక్కు ఉందని ఈ ఇంట్లో ఉంటున్నావ్.. అని అంటాడు. జగద్ధాత్రి వంశీతో పడుతున్నాం అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడొద్దు అంటుంది. కేథార్ చీర తేవడం వల్లే ఇదంతా అయింది. ఎవరికి పుట్టాడో తెలీనోడు నా కళ్ల ముందే ఇలా చీర ఇస్తే నాకు నచ్చదు అంటాడు. కేథార్ వంశీ కాలర్ పట్టుకొని పడుతున్నా కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను.. నా పుట్టక గురించి మాట్లాడితే బావ అని కూడా చూడను అంటాడు.
వంశీ కోపంతో నా కాలరే పట్టుకుంటావా నువ్వు ఇక ఈ ఇంట్లో కూడా ఉండకూడదు అని అంటాడు. మాధురి కేథార్‌తో నా కళ్ల ముందు నా భర్త కాలర్ పట్టుకుంటావా.. గెస్ట్‌లా ఉన్న వారు గెస్ట్‌లా ఉండండి.. మీకు ఇచ్చిన స్థానంలో మాత్రమే ఉండండి.. మీరు మీ హద్దులు దాటితే ఊరుకోను.. ఇంకొక్క క్షణం ఇక్కడే ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు వెళ్లు అని కేథార్‌ని తిట్టి పంపేస్తుంది. అందరూ మాధురి మాటలకు చాలా బాధ పడతారు. నా చెల్లి నన్ను ఇలా అంటుంది. నన్ను అనాథలా చూస్తుంది ఇది నమ్మలేకపోతున్నా అని కేథార్ అంటే.. నమ్మాలి కేథార్ వద్దు అన్న చోట ఉండకూడదు అని కేథార్‌ని జగద్ధాత్రి తీసుకెళ్లిపోతుంది.
కేథార్ బాధ పడుతూ కింద పడిన గాజులు, చీర తీసుకొని బాధగా వెళ్లిపోతాడు. నిషిక, వైజయంతి హ్యాపీగా ఫీలవుతారు. జరిగింది తలచుకొని కేథార్ బాధ పడతాడు. మాధురి ఇలా మాట్లాడుతుందని బాధగాఉందని అంటాడు. జగద్ధాత్రి కేథార్ని బాధ పడొద్దని అంటుంది. అమ్మ గుర్తొస్తుందని కేథార్ ఏడుస్తాడు. జగద్ధాత్రి కేథార్తో మాధురి ఎప్పటికీ అలా మాట్లాడకూడదు కేథార్.. అలా మాట్లాడింది అంటే ఏదో బలమైన కారణం ఉంది.. వంశీ నిన్ను బయటకు వెళ్లిపోమంటే నువ్వు ఇంటి నుంచి వెళ్లకూడదు అలా మాట్లాడింది అని అంటుంది. మాధురి వచ్చి నిజమే అన్నయ్య అతను మూర్ఖుడు. అతన్ని ఎలాగూ మార్చలేను.. అందుకే నిన్ను బాధ పెట్టాను నన్ను క్షమించు అన్నయ్య అని కాళ్లు పట్టుకుంటుంది. నువ్వు కాదమ్మా నా బంగారు తల్లిని అర్థం చేసుకోలేకపోయినందుకు నేను సారీ చెప్పాలి.. అని అంటాడు. జగద్ధాత్రి మాధురి ఏడ్వొద్దని చెప్తుంది. మాధురి చీర తీసుకొని నీ కోరిక చెల్లి తీర్చకుండా ఉండదు.. నువ్వు తెచ్చిన ఈ చీర నేను కట్టుకుంటా అని అంటుంది. నోరేసుకొని పడిపోవడమే తప్ప నేను ఏం చీర కట్టుకుంటానో తను చూడరు అని భర్త గురించి చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















