అన్వేషించండి

Nindu Manasulu Serial Today October 8th: నిండు మనసులు: ప్రేరణ తల్లికి అవమానం: కూతుళ్ల కన్నీళ్లు.. ఊహించని మలుపు!

Nindu Manasulu Serial Today Episode October 8th గణ ఇంట్లో పని మనిషిగా చేస్తున్న ఇందిరని ప్రేరణ నిలదీయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nindu Manasulu Serial Today Episode ఇందిర గణ ఇంట్లో పనిమనిషిగా చేస్తోందని ప్రేరణకి తెలిసిపోతుంది. ఇందిరను ఈశ్వరి తిడుతుంటే ప్రేరణ ఏడుస్తుంది. తర్వాత ప్రేరణ ఇంట్లోకి వెళ్తుంది. కూతుర్ని చూసి ఇందిర చాలా భయపడుతుంది.  ప్రేరణ కన్నీరు పెట్టుకుంటూ అలా చూస్తుంది. ఈశ్వరి ప్రేరణని ఉద్దేశించి పని మనుషులకే అనుకున్నా పనికి రానివాళ్లకి సిగ్గు లేదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు అని ఛీ కొడుతుంది. 

ఇంతలో గణ ఇస్తాడు. ఈ రోజు శనివారం కాదే గాలి ఏంటి ఇటు మళ్లింది అని అంటాడు. నాకు ఎప్పుడు చూడాలి అనిపిస్తే అప్పుడు వస్తా ఇది మానాన్న గారి ఇళ్లు అని అంటుంది. తల్లిని చూసి ఈవిడ ఎవరు కొత్తగా కనిపిస్తుంది అని అడుగుతుంది. వచ్చిన పని చూసుకొని వెళ్లు అని గణ అంటే.. ఇందిర కూతురితో నేను పెద్దయ్యగారి ఆరోగ్యం చూసుకోవడానికి వచ్చానమ్మా అంటుంది. ఓ మా నాన్నని చూసుకోవడానికి ఓ మనిషిని కూడా పెట్టారన్నమాట అని అంటుంది. చూసుకోండి అమ్మా.. మా నాన్నగారిని కాస్త దగ్గరగా చూసుకోండి.. కానీ ఈ ఇంట్లో వాళ్లకి మనుషులు అంటే లెక్క ఉండదు.. పనిమనుషులు అంటే అస్సలు లెక్క ఉండదు.. నేను మా నాన్నని చూసుకోవాలనే వచ్చా కానీ ఇప్పుడే తెలిసింది కదా మనిషిని పెట్టారని ఈ రోజుకి నేను చూడక్కర్లేదు అని వెళ్లిపోతుంది. 

ప్రేరణ బయటకు వెళ్తూ తల్లికి జరిగిన అవమానం గుర్తు చేసుకొని ఏడుస్తుంది. సిద్ధూ ప్రేరణ వెయిట్ చేయమన్న ప్లేస్‌లో వెయిట్ చేస్తూ ఇంకా రాలేదు ఏంటా అని అనుకుంటాడు. ప్రేరణ సిద్ధూని చూడకుండా వెళ్లిపోతుంది. సిద్ధూ పిలిచి ఇక్కడ ఉండమని వెళ్లిపోతున్నారేంటి అని అడుగుతాడు. మనకి బాగా నచ్చిన వాళ్లకి మన కళ్ల ముందే అవమానం జరగడం ఎంత బాధగా ఉంటోదో అని ఏడుస్తుంది. 

ఇంట్లో ప్రేరణ పంచాయితీ పెడుతుంది. అందరికీ విషయం తెలుస్తుంది. ఐశ్వర్య తల్లిని నిలదీస్తుంది. ఎందుకు నన్ను నాన్నకి దూరం పెడుతున్నారు. అక్క నాన్నతో మాట్లాడుతుంది. చూస్తుంది. నువ్వు కూడా నాకు తెలీకుండా నాన్న దగ్గరకు వెళ్లి వస్తున్నావ్ మరి నేను ఎందుకు వెళ్లకూడదు నాకు నాన్నని చూడాలి అని ఉండదా అమ్మ అని ఏడుస్తుంది. అమ్మా అడుగుతుంది చెప్పు.. అయినా తప్పు అంతా నాదే.. నాన్న పరిస్థితి తెలిస్తే నువ్వు తట్టుకోలేవని చెప్పకపోవడం నా తప్పు.. ఆ దుర్మార్గుడికి నీ గురించి తెలిస్తే ప్రమాదం అని వెళ్లొద్దు అన్నాను అయినా నీకు నా మాట కంటే నాన్న మీద మమకారం ఎక్కువ అయిపోయింది కదా అమ్మా.. తప్పు అనను కానీ నువ్వు ఎందుకు చేయకూడదు అంటే మేం నాన్నకి దూరం అయ్యాం.. కన్నతండ్రిని నాన్న అంటే ఒకడు మా మీద కక్ష కట్టాడు. వాడి దుర్మార్గానికి నువ్వు బలిఅయిపోతావ్ అని నిన్ను కాపాడుకుంటూ ఉంటే నువ్వు వాడి ఇంట్లో ఊడిగం చేస్తున్నావ్ అని ఏడుస్తుంది. 

ప్రేరణ ఏడుస్తూ మామయ్య అమ్మతో పాటు నువ్వు కూడా మోసం చేశావు కదా మామయ్య. అమ్మ చావు దగ్గరకు వెళ్లి పని చేస్తుంది అంటే నువ్వు సాయం చేశావ్.. మా అమ్మని బజారుది అన్నాడు మామయ్య మేం గాలికి పుట్టాం అన్నాడు మామయ్య అలాంటి వాడి ఇంట్లో నా తల్లిని పనిమనిషిని చేస్తావా.. నా కళ్ల ముందు ఆవిడ మా అమ్మని చెంప దెబ్బ కొట్టింది మామయ్య అని ఏడుస్తుంది. ఇందిర మామయ్య తప్పు లేదు అని అంటుంది. నువ్వు మా కన్న తల్లి అని తెలిస్తే జరిగే ప్రమాదం నువ్వు గుర్తించలేదు అని ప్రేరణ అంటే తెలుసు గుర్తించాను.. కానీ నాకు మరో దారి లేదు మీ నాన్నకి చూడకుండా బతికే శక్తి లేదు.. వెనకముందు ఆలోంచలేదు.. ఎందుకో తెలుసా మీ గురించి.. మీ నాన్న నోరు తెరిచి చెప్తేనే మీకు ఉనికి అని వాడు చెప్పాడు. అందుకే తెగించి వెళ్లా అని చెప్తుంది. మీనాన్నని మామూలు మనిషిని చేయాలి అని వెళ్లానే మిమల్ని మోసం చేయాలి అని కాదు అని ఇందిర ఏడుస్తుంది. 

ప్రేరణ ఏడుస్తూ అమ్మ నువ్వు మా అమ్మ అని వాడికి తెలిస్తే మా ముందుకు నీ శవం వస్తుంది ఇంత చిన్ని విషయం ఎలా మర్చిపోయావ్ అమ్మ అని ఏడుస్తుంది. నీకు ఏమైనా అయితే మేం తట్టుకోగలమా అమ్మా అని ఐశ్వర్య ఏడుస్తుంది. భయపడితే మన బతుకులు మారవు అని ఇందిర అంటుంది. నువ్వు ఎన్ని చెప్పినా నేను ఒప్పుకోను ఇక నుంచి నువ్వు ఆ ఇంటికి వెళ్తే నేను ఒప్పుకోను మామయ్య అమ్మకి గట్టిగా చెప్పు అని ప్రేరణ వెళ్లిపోతుంది. సిద్ధూ ప్రేరణకు కాల్ చేసి ఈ రోజు బ్యాంక్‌కి వెళ్లాలి అని అంటాడు. నేను వస్తా అని సిద్ధూ అంటే వద్దని ప్రేరణ వస్తానని అంటుంది. ప్రేరణ బయటకు వెళ్తే ఇందిర ప్రశ్నిస్తే ప్రేరణ కోపంగా మాట్లాడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Advertisement

వీడియోలు

అగార్కర్‌పై మహ్మద్ షమి కోచ్ సంచలన కామెంట్స్
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్‌గా రవీంద్ర జడేజా!
ఫార్మ్ లో లేడని తెలుసు  కానీ ఇలా చేస్తారని అనుకోలేదు: రికీ పాంటింగ్
ఇంకా అందని ఆసియా కప్ ట్రోఫీ.. నఖ్వీ షాకింగ్ కామెంట్స్..
బెంగళూరు to గోదావరి.. ఈ స్పెషల్ ట్రైన్ ఉందని మీలో ఎంతమందికి తెలుసు?
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Maoists Latest News: మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
మావోయిస్టుల్లో మిగిలింది 17 మందే! తెలంగాణ డీజీపీ సంచలన ప్రకటన 
Supreme Court: కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
కూర్చొని మాట్లాడి తేల్చుకోండి! తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు!
MLC Kavitha: బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
బోరున ఏడ్చేసిన ఎమ్మెల్సీ కవిత.. శాసనమండలిలో ఏడుస్తూనే స్పీచ్.. BRS పై సంచలన ఆరోపణలు
Electric vehicles : ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
ఎలక్ట్రిక్ వెహికల్ వాడుతున్నారా? ఈ 80-20 రూల్ గురించి తప్పక తెలుసుకోవాల్సిందే
Donald Trump: మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
మోదీ నన్ను సంతోషపెట్టడానికే రష్యా చమురు కొనుగోల్లు తగ్గించారు - ట్రంప్ కామెంట్స్ - కాంగ్రెస్ ఊరుకుంటుందా?
Pawan Kalyan : పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
పవర్ స్టార్... మార్షల్ ఆర్ట్స్ 'న్యూ చాప్టర్' - రిమైండ్ ద డేట్... ఫ్యాన్స్‌కు సస్పెన్స్?
Trump: ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
ఇండియన్స్ అమెరికాకు సంపాదించి పెడుతున్నారు - సంచలన జాబితా వెల్లడించిన ట్రంప్ - ఇవిగో డీటైల్స్
Anasuya Bharadwaj : హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
హీరోయిన్ రాశికి సారీ చెప్పిన అనసూయ - ఆ డైలాగ్‍పై క్షమాపణలు చెబుతూ పోస్ట్
Embed widget