(Source: ECI | ABP NEWS)
Nuvvunte Naa Jathaga Serial Today October 8th: నువ్వుంటే నా జతగా: దేవా రౌడీయిజం వదిలేస్తాడా! ఆదిత్య, పురుషోత్తం మాటలు దేవా విన్నాడా!
Nuvvunte Naa Jathaga Serial Today Episode October 8th ఆదిత్యను పురుషోత్తం దగ్గర చూసిన దేవా ఆదిత్యను ప్రశ్నించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode ఇంట్లో అందరూ భయపడుతూ ఉంటే మిథున అత్తామామలతో దేవా నన్ను కాపాడుకుంటాడు.. ఆ నమ్మకం నాకు ఉంది అని చెప్తుంది. ఆ నమ్మకం మాకు ఉంది కానీ ప్రతీసారి దేవుడు ఇలా నీకు ఎందుకు ప్రమాదాలు సృష్టిస్తున్నాడు ఎందుకో అని అంటుంది.
ప్రమోదిని అత్తతో దేవాకి మిథున అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసేలా చేయడానికి ఇలా చేస్తున్నాడు ఆ దేవుడు అని చెప్తుంది. కాంతం అత్తవాళ్లతో దేవా రౌడీ అవ్వడం వల్లే ఇదంతా జరుగుతుంది.. దేవా రౌడీయిజం మానేయడం అనేది జరగదు.. మరి మిథున పరిస్థితి ఏంటో అని అంటుంది. దానికి మిథున నా భర్తని నేను రౌడీయిజానికి దూరం చేస్తా అది అతి త్వరలోనే జరుగుతుందని అంటుంది. ఇంతలో దేవా వస్తాడు.
మిథున దేవాని ఆపి నేను ప్రమాదంలో ఉన్న ప్రతీసారి నువ్వు కాపాడుతావని నాకు తెలుసు కానీ అసలు నా ప్రాణాల మీదకు రాకుండా ఉండాలి అంటే నువ్వు రౌడీయిజం మానేయాలి అని అంటుంది. దేవా కోపంగా చూస్తాడు. సత్యమూర్తి దేవాతో తెలిసో తెలీకో రౌడీయిజంలో అడుగు పెట్టావ్ దాని వల్ల నీ కన్నవాళ్లగా మేం ప్రతీక్షణం కన్నీరు పెట్టుకున్నాం.. ఇప్పుడు మాతో పాటు నీ భార్య చేరింది.. ఇంత మందిని బాధ పెట్టి నువ్వేం సాధిస్తావ్రా.. రౌడీయిజం మానేయరా అని చెప్తాడు. శారద కొడుకుతో చిన్న విషయాలకే భర్తని వదిలేసి వెళ్లిపోయే భార్యలు ఉన్న ఈరోజుల్లో నీ వల్ల ప్రాణహాని ఉందని తెలిసి కూడా మిథున నిన్ను వదలడం లేదు ఇంత మంచి భార్యని వదులుకోవద్దురా.. రౌడీయిజం వదిలేసి మిథునతో సంతోషంగా ఉండరా అని అంటుంది. దేవా ఆలోచనలో పడతాడు.
పురుషోత్తం మిథున గురించి ఆలోచిస్తూ ఆ మిథున నా దేవాని నా కుడి భుజాన్ని నా నుంచి దూరం చేయొచ్చు ఆ మిథున మిస్ అయిపోయింది.. ఈ సారి అలా కాదు అని అనుకుంటాడు. ఇంతలో ఆదిత్య వచ్చి పురుషోత్తం కాలర్ పట్టుకొని ఎందుకు మిథునని చంపేయాలని చూశావ్ అని నిలదీస్తాడు. ఎందుకంటే దేవా నా గుప్పెట్లో నుంచి జారిపోకుండా చేయడానికి.. దేవా నా పక్కనే ఉంటే ఈ ఎలక్షన్‌లో ఏంటి ప్రతీ ఎలక్షన్‌లో నేనే గెలుస్తా అందుకే మిథునని చంపేయాలని అనుకున్నా అని చెప్తాడు. ఇంతలో దేవా వచ్చేస్తాడు. అన్నా అనగానే ఏంటి వినేశాడా అని ఆదిత్య అనుకుంటాడు.
దేవా ఆదిత్య దగ్గరకు వచ్చి నువ్వేంటి ఇక్కడ.. నీకు పురుషోత్తం అన్నతో పని ఏంటి అని ప్రశ్నిస్తాడు. దాంతో పురుషోత్తం దేవాతో ఈయన పెద్ద క్రిమినల్ లాయర్ కదా.. నా మీద ఉన్న పాత కేసుల విషయంలో ఈయన్ను పిలిచానని అంటాడు. దేవా పురుషోత్తంతో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు అన్న.. నా శత్రువులు అయితే నన్ను చంపాలి అని చూస్తారు.. కానీ మిథునని చంపాలి అనుకోవడం ఏంటి.. దీని వెనక ఏదో పెద్ద కుట్ర ఉంది.. బాగా తెలిసిన వాళ్లే మిథునని చంపాలి అనుకుంటున్నారు.. అదే తెలుసుకుంటా తేల్చుకుంటా అని అంటాడు. పురుషోత్తం, ఆదిత్య కంగారు పడతారు.
దేవా రాత్రి ఇంటికి వచ్చి వడ్డించమని అమ్మని పిలిస్తే మిథున భోజనం తీసుకొని వస్తుంది. ఇప్పుడే అనుకున్నా అప్పుడే వచ్చేశావ్.. నేను అంటే ఎంత ప్రేమ నీకు దేవా అని మిథున అంటుంది. ఇంట లేటుగా వస్తే అమ్మకి ఇబ్బంది అని తెలీదా.. పైగా పెళ్లి తర్వాత భోజనం పెట్టమని అడగాల్సింది భార్యని కదా అని అంటుంది. మిథున వడ్డిస్తా అంటే నాకేం వద్దు నేను వడ్డించుకుంటా అని దేవా అంటే ఏంటి ఎక్కువ చేస్తున్నావా.. నాలుగు తగిలించి అయినా తినిపిస్తా అని మిథున దేవాకి భోజనం పెడుతుంది. దేవా చేతికి గాయం అవడంతో తినడానికి ఇబ్బంది పడతాడు.
మిథున తినిపిస్తా అంటే దేవా వద్దని స్పూన్‌తో తింటాడు. మిథున దేవాతో రౌడీయిజం మానేయమని చెప్పా కదా ఏం ఆలోచించావ్.. నువ్వు రౌడీయిజం మానేస్తే మా నాన్నకి బెంగ ఉండదు.. మనం కలిసి సంతోషంగా ఉండొచ్చని అంటుంది. నేను నా మనఃసాక్షి తప్ప ఎవరు చెప్పినా వినను అని దేవా అంటాడు. మిథున దేవా దగ్గరకు వెళ్లి అమ్మా మనఃసాక్షి నా మొగుడు గారిని రౌడీయిజం నుంచి మానేయమని చెప్పు అంటుది. రౌడీయిజం మాన్పించేస్తానని దేవాతో అంటుంది. కాంతం పుట్టింటి వాళ్లు పండగ చేయడంతో ఫోన్ చేసి ఇంటిళ్లపాది రమ్మని పిలుస్తారు. సత్యమూర్తి, శారద మాట్లాడి వస్తామని చెప్తారు. దేవాని కూడా శారద రమ్మని పిలుస్తుంది. దాంతో కాంతం మరిది వస్తే ఓకే కానీ మిథున రాకూడదు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















