Illu Illalu Pillalu Serial Today October 8th: ఇల్లు ఇల్లాలు పిల్లలు: ప్రేమ-ధీరజ్ ముద్దు సీన్ సస్పెన్స్, బతుకమ్మలో కట్టలు తెంచుకున్న ఎమోషన్స్!
Illu Illalu Pillalu Serial Today Episode October 8th వేదవతి, ప్రేమలు పుట్టింటిలో బతుకమ్మ చేయలేకపోయాం అని ఏడిస్తే భద్రావతి చెల్లి, మేనకోడల్ని తలచుకొని ఏడ్వడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Illu Illalu Pillalu Serial Today Episode ప్రేమ నర్మదతో ధీరజ్‌కి తాను ముద్దు పెట్టిందో లేదో తెలుసుకోమని అడుగుతుంది. ప్రేమ తలుపు చాటు దాక్కుంటే నర్మద ధీరజ్‌ని ప్రశ్నిస్తుంది. పార్టీలో మీరిద్దరూ ఏదో చేశారంట అని అడుగుతుంది. అవును అని క్లారిటీగా అడగమని ధీరజ్ అంటాడు.
ధీరజ్ తలుపు చాటు ప్రేమని చూసి ఇక్కడే ఉందా అని వదినా అందరం కలిసి చాలా కబుర్లు చెప్పుకున్నాం అంటాడు. అది కాదు ఇంకేదో ఉంది అని నర్మద అంటే దానికి ధీరజ్ కరెంట్ పోయింది గుర్తు లేదు అని అనేస్తాడు. ప్రేమ టెన్షన్ అయిపోతూ ముద్దు పెట్టుకున్నాడా లేదా ఈ కన్ఫ్యూజ్‌కి పోయేలా ఉన్నానే అనుకుంటుంది.
రామరాజు, వేదవతి సమక్షంలో ముగ్గురు కోడళ్లు బతుకమ్మలు రెడీ చేస్తారు. భర్తలు ముగ్గురు కూర్చొని బాగుందని సైగలు చేస్తారు. ఇక వేదవతి ముగ్గురు కోడళ్లకి పసుపు గౌరమ్మ చేయమని చెప్పి బతుకమ్మ మీద పెట్టమని అంటుంది. అలా ఎందుకు అని వల్లి అడిగితే కారణం చెప్తుంది. నాకు కాబోయే భార్య ఎక్కడ పూజలు చేస్తుందో అని తిరుపతి అంటే నీకు పెళ్లి చేసుకోవడానికి ఎవరూ రారురా అని రామరాజు సెటైర్ వేస్తాడు. ఇక తిరుపతి అల్లుళ్ల మధ్యలో కూర్చొని ఇప్పుడు మీ భార్యలు ఎవరి బతుకమ్మ బాగుంది చెప్పమని అడుగుతారు అని అంటాడు. అంత లేదు అని అనేస్తారు.
ప్రేమ ముద్దు సీన్ గుర్తు చేసుకొని ఆలోచిస్తుంటే నర్మద ప్రేమతో ఆలోచించడం ఆపేయ్.. మీ ఇద్దరి బంధం ఇప్పుడు మొదలైంది.. ధీరజ్ మనసులో నీ మీద ప్రేమ ఉంది కానీ బయట పడటం లేదు.. అందుకే నువ్వు నీ మనసులో ప్రేమని ధీరజ్‌కి చెప్పు.. అమ్మవారు నీకు మంచి చేస్తుంది అని అంటుంది. సరే అని ప్రేమ అంటుంది. సాగర్ మామతో ఒకవేళ వాళ్లు ఎవరి బతుకమ్మ బాగుంది అని అడిగితే బుక్ అయిపోతాం ఏం చేయాలి అని అడుగుతారు. దానికి తిరుపతి సింపుల్‌గా మీ నాన్న మీద తోసేయండి.. మీ నాన్న చెప్పిన తర్వాత చెప్తామని చెప్పండి అంటాడు. సూపర్ మామయ్య అందుకే నీకు పెళ్లి కాలేదు అని సెటైర్ వేస్తారు.
ప్రేమ, నర్మద, వల్లి ముగ్గురు బతుకమ్మ రెడీ చేసి ముగ్గురిలో ఎవరి బతుకమ్మ బాగుంది అని అడిగిస్తారు. భర్తలు అడిగేశారురా బాబోయ్ అనుకుంటారు. తిరుపతి చెప్పినట్లు ముగ్గురు ఒకేసారి ఇంట్లో మంచి చెడు చెప్పేది నాన్నగారే కదా అందుకే నాన్ననే అడగండి అని అంటారు. రామరాజు మనసులో మీరు తప్పించుకోవడానికి నా మీద తోస్తారు కదరా మీ పని చెప్తా ఆగు అని అనుకుంటాడు. ప్రేమ వాళ్లు మామయ్యని చెప్పమని అడుగుతారు.
రామరాజు లేచి ముగ్గురిది చూస్తాడు. వాళ్లకి పెళ్లిళ్లు కాకపోయి ఉంటే నేను చెప్పేవాడిని వాళ్లకి పెళ్లిళ్లు అయ్యాయి కదా మీరే గట్టిగా వాళ్లని అడగండి అని వెళ్లిపోతాడు. మీ నాన్న రివర్స్ గేర్ వేశాడురా.. మిమల్ని ఇరికించేసి వెళ్లిపోయాడని తిరుపతి అంటాడు. ప్రేమ వాళ్లు మళ్లీ అడగటంతో ఒకర్ని ఒకరు తోసుకుంటారు. ఇక సాగర్ వెళ్లి ప్రేమ చేసిన బతుకమ్మ బాగుంది అంటాడు. ధీరజ్ వెళ్లి వల్లీ బతుకమ్మ బాగుందని, చందు నర్మద బతుకమ్మ బాగుందని చెప్పి తిట్టుకొని కొట్టుకున్నట్లు వెళ్లిపోతారు. ముగ్గురూ కలిసి బాబాయ్ మీరు చెప్పండి అని అంటే నన్ను వదిలేయండి అమ్మ అని పారిపోతాడు. వేదవతి కోడళ్లతో చక్కగా దండం పెట్టుకొని కలిసి పూజ చేయండి అని చెప్తుంది.
భద్రావతి, మరదలితో కలిసి బతుకమ్మ చేస్తూ వేదవతి తాను చిన్నప్పుడు బతుకమ్మ రోజు చేసే సందడి గుర్తు చేసుకొని ఏడుస్తుంది. విశ్వ, వాసు వాళ్ల చూసి బాధ పడతారు. రామరాజు వల్ల నా చెల్లి నాకు దూరం అయిపోయింది. ఇద్దరం కలిసి బతుకమ్మ చేసి సందడిగా బతుకమ్మ ఎత్తేది నా చెల్లి నన్ను వదిలేసి వెళ్లిపోయింది. నా చెల్లి వెళ్లిపోయిన తర్వాత నా మేనకోడలిలో చెల్లిని చూసుకున్నా.. నా మేనకోడలు బతుకమ్మ ఎత్తేది ఇప్పుడు ఆ సంతోషం కూడా నాకు లేకుండా ఆ రామరాజు చేసేశాడు అని ఏడుస్తుంది.
ప్రేమ, వేదవతిలు ఇంటి బయట నుంచి చెరోవైపు నుంచి పుట్టింటిని చూస్తూ బాధ పడతారు. భద్రావతి చాలా ఏడుస్తుంది. నాచెల్లి నా మేనకోడలు ఇక నాకు లేరు అనే నిజాన్ని ఎలా తట్టుకోవాలి అని ఏడుస్తుంది. విశ్వ అత్త చేతిలో చేయి వేసి అత్త ఈ బతుకమ్మ సాక్షిగా చెప్తున్నా వచ్చే బతుకమ్మ నాటికి ప్రేమ బతుకమ్మలా మన ఇంటికి వస్తుంది. బతుకమ్మ పట్టుకుంటుంది. మనం అనుభవించే బాధే ఆ రామరాజు కూడా అనుభవిస్తాడు. ఇది పక్కా అని అంటాడు. వేదవతి, ప్రేమ ఇద్దరూ పుట్టింటిని చూడటం నర్మద చూసి ఏమైంది ఇద్దరూ పుట్టింటిని చూస్తున్నారు అని అడుగుతుంది. ఇద్దరూ ఏడుస్తారు. వేదవతి నర్మదతో అక్కకి నాకు బతుకమ్మ అంటే చాలా ఇష్టం నా చేతుల మీదగా తీసుకెళ్లేదాన్ని అని ఏడుస్తుంది. అత్త తర్వాత నేను ఆ బాధ్యత తీసుకున్నా కానీ ఇప్పుడు ఇద్దరం ఆ ఇంట్లో లేం అక్కడ ఏదో మొక్కబడిగా చేస్తుంటారు. నర్మద ఇద్దరితో నా దగ్గర ఐడియా ఉంది.. మీ ఇద్దరి నుంచి ఎవరో ఒకరు బతుకమ్మ తీసుకెళ్తారు అది నేను చూసుకుంటా అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















