Jagadhatri Serial Today October 27th: జగద్ధాత్రి సీరియల్: శ్రీవల్లి తల్లి వైజయంతి? షాకింగ్ ట్విస్ట్! సుధాకర్ ప్రశ్నలతో వైజయంతి ఏం చెప్తుంది!
Jagadhatri Serial Today Episode October 27th శ్రీవల్లి వైజయంతి కూతురు అని ఇంట్లో అందరూ వైజయంతిని అసహ్యించుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి, కేథార్ శ్రీవల్లిని తీసుకొని ఆశ్రమానికి వెళ్తారు. వైజయంతి శ్రీవల్లిని వదిలేస్తే మరి ఆ ఫొటో ఎవరిది అని శ్రీవల్లి సుహాసిని ఫొటో గురించి అడిగితే వైజయంతి గారు బిడ్డను కని వదిలించుకోవడానికి ఆ ఫొటో ఇచ్చుంటారు. కచ్చితంగా వైజయంతినే నీ కన్న తల్లి అని శ్రీవల్లితో గురువుగారు అంటారు.
శ్రీవల్లి కేథార్‌తో వైజయంతి అమ్మగారే నా కన్నతల్లా నేను కచ్చితం మా అమ్మని చూడాలి ఇంటికి తీసుకెళ్లు అంటుంది. కేథార్, జగద్ధాత్రి శ్రీవల్లిని ఇంటికి తీసుకెళ్తారు. సుధాకర్, కౌషికి శ్రీవల్లి గురించి ఆలోచిస్తూ ఉంటారు. శ్రీవల్లి ఓ దొంగ దాని ఊసు ఇంట్లో వద్దని వైజయంతి అంటుంది. ఇంతలో కేథార్ శ్రీవల్లిని తీసుకొని వస్తాడు. దీన్ని మళ్లీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చారు.. అయినా నువ్వు ఎందుకే వచ్చావ్ నీకు బుద్ది లేదా అని వైజయంతి తిడుతుంది. దాంతో శ్రీవల్లి మా అమ్మ ఎవరో తెలిసింది అందుకే వచ్చాను అని చెప్తుంది. వైజయంతి షాక్ అయిపోతుంది.
సుహాసిని కన్న తల్లి అని తెలిసిపోతే నా భర్తని నాన్న అని వెళ్లి హగ్ చేసుకోవాలి కదా నన్నేంటి ఇలా చూస్తుంది అని వైజయంతి అనుకుంటుంది. ఎవరు మీ అమ్మ అని వైజయంతి అడిగితే నువ్వే మా అమ్మవి అని శ్రీవల్లి చెప్తుంది. అందరూ బిత్తరపోతారు. నాకు జన్మనిచ్చిన తల్లివి నువ్వే.. నన్ను అనాథాశ్రమంలో వదిలేసిన నా తల్లివి నువ్వే అని శ్రీవల్లి వైజయంతిని హగ్ చేసుకుంటుంది. వైజయంతి మనసులో ఇదేంటి కథ ఇలా మారిపోతుంది అని అనుకుంటుంది.
శ్రీవల్లి ఏడుస్తూ ఎందుకమ్మా నన్ను దూరం చేశావ్,, నన్ను ఎందుకు వదిలేశావ్ అని ఏడుస్తుంది. ఏయ్ వదిలేయ్‌వే నన్ను అమ్మా అమ్మా అని అన్నిసార్లు అనకు కంపరంగా ఉంది.. నేను నీకు అమ్మని ఏంటి పళ్లు రాల గొడతా అని అంటుంది. నువ్వే మా అమ్మ అని శ్రీవల్లి అంటే నాకు ఈ రచ్చేంటి అని వైజయంతి ఫుల్ ఫైర్ అయిపోతుంది. ఎవరే నేను నీకు అమ్మని అని చెప్పారు అని అడుగుతుంది. అనాథాశ్రమంలో గురువు గారు చెప్పారు.. అని అంటుంది.
సుధాకర్ కోపంగా శ్రీవల్లి నువ్వు చెప్పింది నిజమా తనే నిన్ను అనాథాశ్రమంలో వదిలేసిందా అని అడిగితే కాదు అని వైజయంతి అడిగితే కాదు అనొద్దు అని ఫొటో చూపిస్తారు. అందరూ షాక్ అయిపోతారు. వైజయంతి మనసులో ఈ ఫొటోతో తనని నా కూతురు అంటున్నారా అని అనుకుంటుంది. సుధాకర్ వైజయంతిని ప్రశ్నిస్తాడు. పెళ్లికి ముందే ఓ ఆడపిల్లకి జన్మనిచ్చి ఆ రహస్యం ఎవరికీ తెలీకుండా చేయాలని ఇలా చేశావా అని అడుగుతారు. వైజయంతి బిత్తరపోతుంది. నువ్వు కన్న తల్లి కాకపోతే అనాథాశ్రమంలో ఆ పురిటిలో బిడ్డని ఎందుకు చేర్చావు అని అడుగుతాడు సుధాకర్. దాంతో రోడ్డు పక్కన పడుంటే అనాథాశ్రమంలో చేర్పించాను అంటుంది.
పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారా అని అడుగుతుంది జగద్ధాత్రి. దాంతో తెలీదు గుర్తు లేదు అని వైజయంతి అంటుంది. దానికి కౌషికి ఫొటో ఎలా ఇచ్చారు.. ఆ ఫొటో ఎవరిది అని అడుగుతుంది. నా తల్లి ఇలాంటి పని చేసింది అంటే నాకు నా మీద అసహ్యంగా ఉంది అని అంటాడు. నిషిక, యువరాజ్ వైజయంతిని అసహ్యించుకుంటారు. మీరు కూడా మామయ్యలా పెళ్లికి ముందే తప్పు చేశారు అని నిషిక అసహ్యించుకుంటుంది. డబ్బులు కూడా శ్రీవల్లి బ్యాగ్‌లో కావాలనే పెట్టారు అందుకు కీర్తి సాక్ష్యం అని జగద్ధాత్రి చెప్తుంది. కన్న బిడ్డను దొంగని చేసి తన పట్ల అంత అమానుషంగా ప్రవర్తించడానికి మనసు ఎలా వచ్చిందే రాక్షసి అని సుధాకర్ తిడతాడు. అందరూ వైజయంతిని అసహ్యించుకుంటారు. మాకు నీతులు చెప్తారు. మీరు ఎంత అపవిత్రమో ఛీ అని బూచి తిడతాడు. కాచి కూడా తిట్టి వెళ్లిపోతుంది.
వైజయంతి ఏడుస్తూ ఇలాంటి అగ్ని పరీక్ష వస్తుందని కలలో కూడా అనుకోలేదు అని వైజయంతి ఏడుస్తుంది. ఎంత నింద వేశారు దేవుడా అని ఏడుస్తుంది. అమ్మని నేను నచ్చచెప్తా అని శ్రీవల్లి వెళ్తుంది. అవసరం అయితే ఇంటి నుంచి వెళ్లిపోతా అని అనుకుంటూ వైజయంతి దగ్గరకు వెళ్తుంది. అందరిలో చెప్పేశా క్షమించు అమ్మ,, నువ్వు బయట పెట్టకూడదు అనుకున్నావ్ నేను బయటకు వెళ్లిపోతా అంటుంది. నేను నీ కన్న తల్లిని కాదే అని శ్రీవల్లి జుట్టు పట్టుకొని ఈడ్చుకొని బయటకు విసిరేస్తుంది. అందరూ చూసి షాక్ అయిపోతారు. నన్ను దోషిలా చేయడానికే ఈ కథ అల్లింది అని అంటుంది. శ్రీవల్లి మీ కూతురు కాకపోతే తను ఎవరు ఎవరి కూతురు మీకు ఎక్కడ దొరికింది అని జగద్ధాత్రి ప్రశ్నిస్తుంది. ఆ ఫొటోలో ఉంది ఎవరు అని అడుగుతుంది. సుధాకర్ ఫొటో అడుగుతాడు. నా పని అయిపోయింది అని వైజయంతి అనుకుంటుంది. ఇక నుంచి శ్రీవల్లి నీ కూతురిగా ఈ ఇంట్లోనే ఉంటుంది. నువ్వు శ్రీవల్లిని కూతురిలా చూస్తావో లేదో కానీ నేను కూతురులానే చూస్తా అని అంటాడు సుధాకర్. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















