(Source: ECI | ABP NEWS)
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today October 27th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: లక్ష్మీని కిడ్నాప్ చేసింది అంబికానా! ఎమర్జెన్సీ కాల్ పట్టిస్తుందా!
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode October 27th లక్ష్మీ ఎమర్జెన్సీ కాల్ చేయడం విహారి, సంధ్యలు లక్ష్మీ కోసం వెతకడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక, వీర్రాజు, అమ్మిరాజు మీటింగ్ పెడతారు. అమ్మిరాజు విహారి తనని కొట్టాడని రగిలిపోతాడు. విహారి ఓకే కానీ లక్ష్మీతో కూడా దెబ్బలు తింటావా అని అంబిక అంటుంది. లక్ష్మీ, విహారి మధ్య ఏమైనా సంబంధం ఉందని అమ్మిరాజు అంటే అలాంటిది ఏం ఉండదు అని అంబిక అంటుంది.
లక్ష్మీని అసలు ఎవరు కిడ్నాప్ చేసుంటారు అని వీర్రాజు అడిగితే తెలీదు దానికి ఊరంతా శత్రువులే అని అంబిక అంటుంది. లక్ష్మీ, విహారి మధ్య ఏదో సంబంధం ఉంది అది తెలుసుకోవాలని వీర్రాజు కొడుకు అమ్మిరాజుతో చెప్తాడు. లక్ష్మీని బంధించిన రౌడీలు పక్కనే ఆడుకుంటూ ఉంటారు. ఓ రౌడీ నీరు తాగడానికి బయటకు వెళ్తాడు. ఇంకొకడికి ఫోన్ వచ్చి బయటకు వెళ్లడంతో లక్ష్మీ పక్కనే ఉన్న తన ఫోన్ చూస్తుంది.
అంబిక మరో రౌడీకి కాల్ చేసి లక్ష్మీని ఒకే చోట ఉంచొద్దని ఎలా అయినా లక్ష్మీ చేత రెండు వందల ఎకరాల డాక్యుమెంట్స్ మీద సంతకం పెట్టించమని చెప్తుంది. లక్ష్మీతో ఎందుకు సంతకం పెడుతుందో తెలీకూడదు అని అంటుంది. మరోవైపు లక్ష్మీ మెల్లగా ఫోన్ తీసుకుంటుంది. ఫోన్ తీసుకొని ఎమర్జెన్సీ కాల్ కింద పోలీస్ స్టేషన్‌కి కాల్ చేస్తుంది. పోలీసులకు అర్థమయ్యేలా ఎవర్రా మీరు నన్ను వదిలేయండి అని అంటుంది. సంతకం పెడితే వదిలేస్తాం అని రౌడీలు అంటారు. నేను ఎందుకు పెట్టాలి అని లక్ష్మీ అడుగుతుంది. సంతకం పెడితే ఓకే లేదంటే ఇక్కడే చంపేస్తాం అని రౌడీలు అంటారు.
విహారి గారు కనక మహాలక్ష్మీ కోసం కచ్చితంగా వస్తారు అని పోలీసులకు తను కనక మహాలక్ష్మీ అని అర్థమయ్యేలా చెప్తుంది. కానిస్టేబుల్ వెంటనే రామచంద్రాపురం పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసి విషయం చెప్తాడు. సంధ్య, విహారి లక్ష్మీ కోసం వెతుకుతూనే ఉంటారు. రామచంద్రాపురం ఎస్‌ఐ సంధ్యకి కాల్ చేసి ఎస్‌ఓఎస్ నుంచి కంట్రోల్ రూంకి కాల్ చేసింది అని లొకేషన్‌కి పంపిస్తున్నామని చెప్తారు.
సంధ్య లొకేషన్‌కి బయల్దేరుతుంది. విహారికి కాల్ చేసి లక్ష్మీ గురించి చెప్తాడు. నాకు లొకేషన్ షేర్ చేయమని విహారి చెప్తాడు. సంధ్య విహారికి కూడా లొకేషన్ పంపిస్తుంది. విహారి చూసి అటు వెళ్తాడు. లక్ష్మీ చేతిలో ఫోన్ ఉండటం రౌడీలు చూసేస్తారు. లక్ష్మీ ఎమర్జెన్సీ కాల్ చేసిందని తెలుసుకుంటారు. మరోరౌడీ వెంటనే అంబికకు కాల్ చేసి ఎస్‌ఓఎస్ అని లక్ష్మీ నొక్కిందని చెప్తుంది. అది ఫోలీస్ కంట్రోల్కి వెళ్తుందిరా .. లక్ష్మీని వెంటనే మార్చండి అంటుంది. అంబిక రౌడీలతో మాట్లాడటం సహస్ర వినేస్తుంది. ఇన్ని రోజులు ఈ విషయం చెప్పకుండా ఎలా ఉన్నావ్ పిన్ని.. పోలీసులకు ఎలా చెప్పావ్ అని అంటుంది.
లక్ష్మీ మీద అనుమానం ఉంది.. తనకు ఫ్యామిలీ ఉందని పోలీసులు ఇన్వాల్స్ అయితే దానికి సంబంధించిన అన్ని విషయాలు తెలిస్తాయని అంటుంది. లక్ష్మీ కిడ్నాప్ గురించి ఇంట్లో తెలిస్తే బావ ఊరుకోడు కదా అని సహస్ర అంటే ముందే దాన్ని వదిలేస్తా అంటుంది. విహారి, సంధ్య లొకేషన్‌లకు వెళ్తుంటారు. లక్ష్మీని రౌడీలు మార్చాలని తీసుకెళ్తారు. విహారి, సంధ్య వచ్చేలోపు లక్ష్మీని తీసుకెళ్లిపోతారు. ఇద్దరూ చెరో వైపు లక్ష్మీని వెతకాలి అని వెళ్తారు. ఓ చోట విహారి సంధ్యకి కాల్ లక్ష్మీ ఇక్కడే ఉన్నట్లు ఉందని చెప్పి కారు వెళ్లడం చూస్తాడు. అందులో లక్ష్మీ చేయి బయటకు పెడుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















