అన్వేషించండి

Chinni Serial Today October 27th: చిన్ని సీరియల్: మ్యాడీ ప్రేమలో మునిగిపోయిన మధు! తలంటు స్నానంతో రొమాన్స్!

Chinni Serial Today Episode October 27th మధు మ్యాడీ కోసం డ్రస్ కుట్టి తలంటు స్నానం చేయించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Chinni Serial Today Episode మధుకి మ్యాడీనే మహి అని తెలిసిపోవడంతో మహితో తన చిన్ననాటి జ్ఞాపకాలు అన్నీ నెమరు వేసుకుంటుంది. సత్యంబాబు ఇంటికి, స్కూల్‌ ఇలా అన్నీ ప్లేస్‌లు తిరిగి చివరకు పానీ పూరీ తిని అన్ని చోట్లా సెల్ఫీలు తీసుకుంటారు.

మధు రాత్రి మ్యాడీ కోసం బట్టలు కుడుతుంది. చిన్నప్పుడు నువ్వు ఎక్కువ కుర్తాలు వేసుకునేవాడివి నీ కోసం ఇలా మొదటి సారి కుర్తా కుట్టడం నాకు చాలా సంతోషంగా ఉందని అనుకుంటుంది. చంటి చూసి ఏంటి అక్కా అర్థరాత్రి బట్టలు కుడుతున్నావ్ అంటే మీ అక్క రాత్రి నుంచి బట్టలు కుడుతుంది అని స్వరూప చెప్తుంది. నా కోసం రాత్రంతా కష్టపడి బట్టలు కుడుతున్నావా అని చంటి అడిగితే నీకు కాదురా మ్యాడీ కోసం అని మధు చెప్తుంది. 

మధు పెళ్లి కొడుకు బొమ్మ పట్టుకొని కుర్తా చూసి మహి  ఈ కుర్తాలో నువ్వు పెళ్లి కొడుకులా ఉంటావ్ అని అనుకుంటుంది. తర్వాత మ్యాడీ గదికి వెళ్లి పెళ్లి కూతురు బొమ్మ పట్టుకొని నువ్వే నేను నేనే నువ్వు నువ్వు కేవలం పెళ్లి కూతురు బొమ్మవి నేను మాత్రం మహి పక్కన ఉంటే పెళ్లి కూతుర్ని.. మహి తన ఫ్యామిలీతో సంతోషంగా కలిసిపోయిన తర్వాత నేనే చిన్ని అని మహికి చెప్తా అని అనుకుంటుంది. 

మ్యాడీ నిద్ర లేని ఏంటి మధు నువ్వు ఇక్కడ అంటే నిన్ను నిద్ర లేపి నీకు గిఫ్ట్ ఇవ్వాలి అనుకున్నా అని చెప్తుంది. ఏంటి గిఫ్ట్ అని మ్యాడీ అడిగితే ఈ డ్రస్ అని డ్రస్ చూపిస్తుంది. ఇంతలో చంటి వచ్చి ఈ అమెరికా అబ్బాయి కోసం ఈ ఇండియా అమ్మాయి తెల్లార్లు డ్రస్ కుట్టిందని చెప్తాడు. మ్యాడీ చాలా హ్యాపీగా ఫీలవుతాడు. మధు మ్యాడీతో తలంటి స్నానం చేయిస్తా త్వరగా రా అని పిలుస్తుంది. 

స్వరూప బట్టలు తీసుకెళ్తూ అందులో నుంచి మధుకి సంబంధించిన ఓ చున్నీ పడేస్తుంది. అందులో చిన్నప్పుడు మ్యాడీ ఇచ్చిన వాచ్ ఉంటుంది. మ్యాడీ ఈ చున్నీ తీయబోయే టైంకి చంటి వచ్చి నేను తీస్తా అమెరికా అబ్బాయ్ అని అంటాడు.  చంటీ తీసుకొని వెళ్లిపోతాడు.

లోహిత రెడీ అయితే వరుణ్ చూసి ఈ రోజు నువ్వు చాలా అందంగా కనిపిస్తున్నావ్ అని దీపావళి శుభాకాంక్షలు చెప్తాడు. లోహిత డల్ అయిపోతే వరుణ్ ఏమైందని అడుగుతాడు. ఇది మనకు మొదటి పండగ అయితే మీ ఇంట్లో చేసుకోవాలి లేదంటే మా ఇంట్లో చేసుకోవాలి కానీ ఇలా ఎక్కడో జరుపుకుంటున్నాం.. నా వల్లే నువ్వు నీ ఫ్యామిలీకి దూరం అయ్యావ్ అని లోహి అంటే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా త్వరలోనే మనం మన ఇంటికి వెళ్తాం మ్యాడీ బావ మనల్ని తీసుకెళ్తాడని వరుణ్ అంటాడు. 

మ్యాడీకి తలంటి స్నానం చేయిస్తామని మధు, చంటిలు వెంటపడితే మ్యాడీ వద్దని పరుగులు తీస్తుంటాడు. లోహిత, వరుణ్ అది చూస్తారు. మ్యాడీ మొత్తం పరుగులు పెడుతుంటే మధు, చంటి పట్టుకొని లాక్కొచ్చి స్నానం చేయిస్తారు. మధు తలకు ఆయిల్ రాసి ఒళ్లంతా నలుగు పెట్టి కుంకుడు కాయలతో తలస్నానం చేయిస్తుంది. ఛీ అనుకుంటూ లోహిత వెళ్లిపోతుంది. మ్యాడీ కళ్లు ఎర్రగా ఉండటంతో కళ్ల ఉప్పు బుగ్గలో పెట్టుకో ఎరుపు తగ్గిపోతుందని మ్యాడీకి చెప్తుంది. నీలాంటి మంచి ఫ్రెండ్ దొరకడం నా అదృష్టం అని మ్యాడీ అంటాడు. మధు తనలో తాను నా ఫ్రెండ్ నా లవర్‌ నా మహి అందరూ ఒక్కరే అయినందుకు నేను చాలా లక్కీ అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

టాప్ హెడ్ లైన్స్

Godavari Today July 6th: 'గోదావరి' సీరియల్: నందు పెళ్లి క్యాన్సిల్! కాళ్లు పట్టుకున్న మురళీ! సూర్యకి ప్రపోజ్ చేసిన జాను!
'గోదావరి' సీరియల్: నందు పెళ్లి క్యాన్సిల్! కాళ్లు పట్టుకున్న మురళీ! సూర్యకి ప్రపోజ్ చేసిన జాను!
Godavari Serial Today July 6th: 'గోదావరి' సీరియల్: ప్రేరణ తాళి తెంపేసిన ఈశ్వరి! ఆ పని చేసే మళ్లీ పెళ్లి చేసుకుంటామని సిద్ధూ, ప్రేరణ ఛాలెంజ్!
'గోదావరి' సీరియల్: ప్రేరణ తాళి తెంపేసిన ఈశ్వరి! ఆ పని చేసే మళ్లీ పెళ్లి చేసుకుంటామని సిద్ధూ, ప్రేరణ ఛాలెంజ్!
Karthika Deepam 2 Serial Today July 6th: కార్తీకదీపం 2 సీరియల్: దక్షిణామూర్తికి సూరజ్‌కి నిజంగా సంబంధం ఉందా! పెద్దాయన సూరజ్‌ని కొట్టడానికి కారణం అదేనా!
కార్తీకదీపం 2 సీరియల్: దక్షిణామూర్తికి సూరజ్‌కి నిజంగా సంబంధం ఉందా! పెద్దాయన సూరజ్‌ని కొట్టడానికి కారణం అదేనా!
Nuvvu leka Neanu Lenu Serial Today July 6th:రామచంద్రానికి రక్తం ఇవ్వడానికి వచ్చిన రాధ... రాధను గదిలో పెట్టి తాళం వేయించిన దమయంతి...
నువ్వులేక నేను లేను: రామచంద్రానికి రక్తం ఇవ్వడానికి వచ్చిన రాధ... రాధను గదిలో పెట్టి తాళం వేయించిన దమయంతి...

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sugali Parvathi Devi On Pawan Kalyan: సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
సుగాలి ప్రీతి కేసులో బిగ్ ట్విస్ట్! మోసం చేశారని పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు!
Nizamabad Crime News: నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
నిజామాబాద్ జిల్లాలో భర్తను భవనంపై నుంచి తోసేసిన భార్య! చనిపోలేదని హార్పిక్‌ ఇంజెక్ట్ చేసి దారుణహత్య! 
Allu Arjun : సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
సంధ్య థియేటర్ ఘటన - అల్లు అర్జున్‌కు స్వల్ప ఊరట
Revamped Gold Monetization Scheme: ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
ఇళ్లలోని ఇన్‌యాక్టివ్ గోల్డ్‌కు మోక్షం - సరికొత్త గోల్డ్ మానిటైజేషన్ పాలసీతో కేంద్రం భారీ స్కెచ్!
Aha Series OTT : కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
కమల్ హాసన్ మూవీ టైటిల్‌తో న్యూ సిరీస్ - ఈ స్టోరీ మీదే కావొచ్చు... ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Vizag Fishermen Missing: విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లిన ఆరుగురు మత్స్యకారులు గల్లంతు, మరో వ్యక్తిని కాపాడిన సిబ్బంది
Warangal Crime News: భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
భార్యకు వీడియో కాల్‌లో చూపిస్తూ రైలు కింద పడి భర్త ఆత్మహత్య.. వరంగల్ జిల్లాలో ఘటన
Mavigun vs Amaravati Political Impact: అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
అధినేత మావిగన్ నినాదం.. సొంత కేడరే లైట్ తీసుకుందా? సైలెన్స్ వెనుక అసలు వ్యూహం ఏంటి?
Embed widget