Meghasandesam Serial Today October 27th: ‘మేఘసందేశం’ సీరియల్: కేపీని హాస్పిటల్ లో చూసిన భూమి, శారద - నిజం ఎవ్వరికీ చెప్పకూడదన్న భూమి
Meghasandesam serial today episode October 27th: కేపీకు బుల్లెట్ గాయాలు అయ్యాయని తెలిసి ఆయన బతికే ఉన్నాడన్న విషయం ఎవ్వరికీ చెప్పకూడదని శారదకు చెప్తుంది భూమి. దీంతో ఇవాళ్లీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది

Meghasandesam Serial Today Episode: ఎస్పీ సూర్యకు వార్నింగ్ ఇచ్చిన చెర్రి గగన్ దగ్గరకు వెళ్తాడు. అన్నయ్య ఎన్ని అనుకున్నా నువ్వు నాన్నకు పెద్ద కొడుకువి కాబట్టి ఆయనకు నువ్వే తల కొరివి పెట్టాలి రా అని పిలుస్తాడు.
గగన్: ఎక్కడికి రా వచ్చేది ఎవరికి తలకొరివి పెట్టేది. నీ దృష్టిలో మీ నాన్నకు ఇంకా ఇద్దరు కొడుకులు ఉన్నారనేది నీ ఉద్దేశమా..?
చెర్రి: అదేంటి అన్నయ్యా అలా మాట్లాడుతున్నావు.. మనిద్దరం ఆయన కొడుకులమే కదా..?
గగన్: నీ దృష్టిలో నేను పెద్ద కొడుకునేమో కానీ మా నాన్న దృష్టిలో కాదురా..?
చెర్రి: అన్నయ్య నాన్న నీ గురించి, పెద్దమ్మ గురించి, పూరి గురించి ఎంత తపన పడేవారో ఎంత తపన పడేవారో నేను కళ్లారా చూసేవాణ్ని అన్నయ్య.. దయచేసి ఆయన్ని తప్పుగా అనుకోవద్దు అన్నయ్య.. నువ్వుంటే ఆయనకు చచ్చేంత ప్రాణం అన్నయ్య.. అసలు కొడకంటే నా గగన్ రా అని గర్వంగా చెప్పుకునే వారు. ఎప్పటికైనా నీతో కలిసి ఉండాలని ఆయన తప్పించి పోని రోజు లేదు..
గగన్: ఏంట్రా నీకు తెలిసింది.. నువ్వు చూసింది. ఆయన మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయాక జీవితం ఎంత దుర్లభంగా ఉంటుందో నేను మాత్రమే చూశాను. నిజంగా నువ్వు చెప్పినట్టు ఆయనకు మా మీద అంత ప్రేమే ఉంటే మమ్మల్ని నడిరోడ్డు మీద వదిలేసి వెళ్లిపోయేవాడు కాదు. నిజమైన ప్రేమ నా మీద కాదు నీ మీద ఉంది. అందుకే కట్టుకున్న భార్యను చిన్న పిల్లలు అని చూడకుండా వదిలేసి మీ అమ్మకు చేరువయ్యాడు. నీకు జన్మను ఇచ్చి నీతో జీవితాంతం ఉన్నాడు. మేము కాదురా నిజమైన పిల్లలు అంటే మీరే.. కొడుకు నువ్వు ఒక్కడివే వెళ్లు వెళ్లి మీ నాన్నకు తలకొరివి పెట్టు..
చెర్రి: నేను వెళ్లను అన్నయ్య.. అసలు అవతల మనిషే లేడు అన్నయ్యా.. ఇప్పుడు కూడా నీ మొండితనం ఏంటి అన్నయ్యా.. అసలు ఆయన బతికి ఉన్నంత కాలం నీతో పూరితో, పెద్దమ్మతో కలిసి ఉండలేకపోయాననే బాధతో బతికారు. ఎప్పటికైనా నువ్వు ఆయన్ని నాన్న అని పిలుస్తావని పరితపించారు అన్నయ్య.. ఆయన మాత్రం కోరిక తీరకుండా వెళ్లిపోయారు అన్నయ్య.. కనీసం సోసైటీ కోసమైనా రా అన్నయ్య
గగన్: ఆకలి వేసినప్పుడు అన్నం ముద్ద పెట్టని ఈ సొసైటీ గురించి నేను ఏనాడు ఆలోచించలేదు. ఆలోచించను కూడా
చెర్రి: అన్నయ్య నేను నీకు దండం పెడతాను అన్నయ్యా.. ఫ్లీజ్ అన్నయ్యా రా అన్నయ్యా..
గగన్: చెర్రి నా మాట విను చెర్రి నీ దృష్టిలో ఈ రోజు మీ నాన్న చచ్చిపోయి ఉండొచ్చు కానీ నా దృష్టిలో ఏ రోజైతే మమ్మల్ని అందర్ని కట్టుబట్టలతో సహా అదే రోజు అదే నడిరోడ్డు మీద ఆయన్ని ఆయన జ్ఞాపకాలను తగులబెట్టేశాను. ఒక్కసారి తగులబెట్టిన మనిషిని ఎన్నిసార్లు తగులబెట్టమంటావురా.. వెళ్లు.. మీ నాన్నకు కొడుకుగా తలకొరివి పెట్టు..
అంటూ చెప్పి గగన్ లోపలికి వెళ్లిపోతాడు. చెర్రి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. మరోవైపు కేపీ హాస్పిటల్‌లో ఉన్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్తారు శారద, భూమి. ఆపరేషన్ జరుగుతున్న కేపీని చూసి శారద ఇక్కడ ఆయన ఉంటే అక్కడ ఉన్న శవం ఎవరిది అని భూమిని అడుగుతుంది. అయితే ఈ విషయం వెంటనే ఇంట్లో వాళ్లకు చెప్పాలని భూమి అంటుంది. ఇంతలో నర్సు ఒకతనితో వచ్చి మీ మామయ్యకు బుల్లెట్ దిగి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఈయనే తీసుకొచ్చి ప్రాణాలు కాపాడారు అని చెప్తుంది. తర్వాత భూమి ఈ విషయం ఇంట్లో వాళ్లకు చెప్తా అన్నావు కదా చెప్పు అని శారద చెప్పగానే.. వద్దు అత్తయ్య మామయ్యకు బుల్లెట్ ఎందుకు ఉంటుంది. ఎవరో కావాలని చంపాలని చూశారు. అందుకే మామయ్య బతికి ఉన్నారన్న విషయం మనం ఎవ్వరికీ చెప్పకూడదు అని చెప్తుంది. శారద కూడా సరే అంటుంది. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















