అన్వేషించండి

Illu Illalu Pillalu Serial Today March 11th:  ధీరజ్‌ తనపై చూపించిన ప్రేమకి ఫిదా అయిన ప్రేమ...అమూల్య మెడలో తాళి ఎవరు వేసుకోమన్నారో శ్రీవల్లికి తెలిసిపోయిందా...?

Illu Illalu Pillalu Serial Today Episode March 11th: ధీరజ్‌ తనపై చూపించిన ప్రేమకి ఫిదా అయిన ప్రేమ...అమూల్య మెడలో తాళి ఎవరు వేసుకోమన్నారో శ్రీవల్లికి తెలిసిపోయిందా...?

Illu Illalu Pillalu Serial Today Episode: ప్రేమ పుట్టినరోజు సందర్భంగా  సర్‌ప్రైజ్ పార్టీకి ఏర్పాట్లు చేసిన ధీరజ్‌...ఆమెను రాత్రి 12 గంటలకు నిద్రలేపి కేక్‌ కట్ చేయిస్తాడు. ఈపార్టీకి ముగ్గురు అన్నదమ్ములతోపాటు నర్మద, శ్రీవల్లి కూడా వస్తారు. అందరూ కలిసి బర్త్‌డే పార్టీని బాగా ఎంజాయి చేస్తారు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మిగిలిన వాళ్లంతా ఎవరి గదుల్లోకి వాళ్లు వెళ్లిపోయినా...ధీరజ్‌ ప్రేమ అక్కడే ఉంటారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత ప్రేమకు ధీరజ్‌ లవ్‌ ప్రపోజ్‌ చేస్తాడు. తన గుండెల్లో ప్రేమపై ఎంత ప్రేమను పెంచుకున్నాడో తెలియజేస్తాడు. తనకు ఎంతో ఇష్టమైన వాళ్ల అమ్మ ఇచ్చిన ఉంగరాన్ని తీసి ప్రేమ వేలికి పెట్టి ఐలయూ అంటూ చెబుతాడు. ధీరజ్‌ తనపై చూపిస్తున్న ప్రేమకు ప్రేమ గాల్లో తేలిపోతుంది. ఇదంతా కల, నిజమా అర్థం కాదు. ఇన్నాళ్లు మనం ఎలా ఉన్నా ఇకపై ఇంతే ప్రేమతో ఉండాలని ధీరజ్ తన మనసులో మాట చెప్పడంతో ఆమె షాక్‌కు గురవుతుంది. తనపై ధీరజ్‌కు నిజంగానే ఇంత ప్రేమ ఉందా అని అనుకుంటుంది. ఇది కలో నిజమో తెలియని అయోమయంలో ఉండిపోతుంది. ధీరజ్‌ను గట్టిగా కౌగిలించుకుని తన ప్రేమను కూడా అతనికి చెబుతుంది ప్రేమ.
ఉదయం నర్మద ఆఫీసుకు రెడీ అవుతుండగా....తన గది తలుపు ఎవరో అదే పనిగా బాదుతుంటే...ఎవరో చూద్దామని  వెళ్లి తలుపు తీస్తుంది.ఎదురుగా ఉన్న ప్రేమ చూసి ఏంటి ఇంత హడావుడిగా ఉన్నావని అడుగుతుంది. అర్జెంట్‌గా నీకు ఓ విషయం చెప్పాలని అంటుంది.ఏంటంటే ఇక్కడ కాదు బయటకు వెళ్దామని లాక్కుని వెళ్తుంది.అప్పుడే రాత్రి మిగిలిపోయిన కేక్‌ మొత్తం ముందు పెట్టుకుని శ్రీవల్లి తింటుంది. ఈ కేక్‌ ఏదని ఎవరైనా అడిగితే....పిల్లి తిన్నదని చెబుతామంటూ గుంటనక్క ప్లాన్‌లు వేసుకుంటుంది.అప్పుడే అక్కడి నుంచి ప్రేమ, నర్మద బయటకు పరుగెత్తడం చూసి ఎందుకు వీళ్లిద్దరూ ఇంత ఆనందంగా ఉన్నారబ్బా అనుకుంటుంది ప్రేమ. విషయం ఏంటో కనుక్కుందామనుకుని చాటుగా వాళ్ల దగ్గరకు వెళ్తుంది.
గార్డెన్‌లోకి వచ్చిన తర్వాత నర్మద ప్రేమను అడుగుతుంది. ఈ ఆనందానికి కారణం ఏంటని ప్రశ్నిస్తుంది. సిగ్గుపడిపోతూ ప్రేమ రాత్రి జరిగిన విషయం చెబుతుంది. ధీరజ్‌ నాకు రింగ్‌ ఇచ్చి తన లవ్‌ను ప్రపోజ్‌ చేశాడని చెబుతుంది. ఐలయూ చెప్పేసరికి నాకు ఏం చేయాలో అర్థం కాలేదని అందుకే ఇంత ఆనందగా ఉన్నానని అంటూ నర్మదతో తన సంతోషాన్ని పంచుకుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన  శ్రీవల్లి వాళ్ల మధ్యలోకి దూరుతుంది. అదేంటి మీరు ఇద్దరూ పెళ్లికి ముందే పీకల్లోతు ప్రేమలోపడి దొర్లారని...ప్రేమించి పెళ్లి చేసుకున్నారని కదా ఇంట్లో అందరినీ నమ్మించారు.
 
అప్పుడెప్పుడో ప్రేమించుకుంటే మళ్లీ ఇప్పుడు ఐలయూ చెప్పుకోవడం ఏంటి...? నువ్వు ఏదో ఇప్పుడే ఆ మాట విన్నట్లు  గాల్లో తేలిపోవడం ఏంటని నిలదీస్తుంది. ఆల్రెడీ ఒకసారి ప్రేమించుకున్నారు కదా...మళ్లీ ఇప్పుడే కొత్తగా ప్రేమ పుట్టినట్లు ఈ హడావుడి అంతా ఏంటని ప్రశ్నిస్తుంది. నీ వాలకం చూస్తుంటే...గతంలో నీప్రేమ, పెళ్లి మీద అనుమానం వస్తుందని రకరకాలుగా ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది శ్రీవల్లి.. ఆమె మాటలకు ప్రేమ కొంచెం కంగారుపడగా....నర్మద నేనున్నానన్నట్లు హామీ ఇస్తుంది.  వెంటనే శ్రీవల్లి మాటలకు అడ్డుపడి... నువ్వు,మీ అమ్మానాన్న ఎన్నో కుట్రలు,కుతంత్రులు చేసి మా చందుబావను పెళ్లి చేసుకున్నారు కదా అని అంటుంది. పోనీ ఆ తర్వాత అయినా మీ కుట్రలు ఆగాయా లేదు కదా అని నిలదీస్తుంది.
 
అమూల్య, విశ్వ మధ్య రాయభారం నడిపడం, దొంగ సర్టిఫికేట్లు తేవడం, రైస్‌మిల్లు కొట్టేయడానికి ప్లాన్స్ వేయడం ఇవన్నీ ఆపలేదు కదా అని అనడంతో శ్రీవల్లి ముఖం మాడ్చుకుంటుంది. మీరు కుట్రలు ఎలాగైతే ఆపలేదో....వాళ్ల మధ్య ప్రేమ కూడా అలాగే ఆగలేదని చెబుతుంది. ప్రేమిస్తున్నంతకాలం ప్రేమ పెరుగుతూనే ఉంటుంది తప్ప తరగదని అంటుంది. దీంతో శ్రీవల్లి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా....ప్రేమ నర్మదతో ఓ మాట అంటుంది. అమూల్య మెడలో తాళి వేసుకోమని నేనే చెప్పిన సంగతి ధీరజ్‌కు తెలిస్తే ఈ ప్రేమ ఉంటుందో ఉండదోనని భయపడుతుంది.ఆ మాటలు కాస్త శ్రీవల్లి చెవిలోపడతాయి. అయితే అమూల్యకు ఈ ఐడియా ఇచ్చింది నువ్వే అన్నమాట అని అనుకుంటుంది.
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nindu Manasulu Serial Today April 20th: నిండు మనసులు: రంజిత్, ఐశ్వర్యలకు కొత్త బాధ్యతలు! సిద్ధూ చేయి పట్టుకొని ప్రేరణ ఏం చెప్పింది?
నిండు మనసులు: రంజిత్, ఐశ్వర్యలకు కొత్త బాధ్యతలు! సిద్ధూ చేయి పట్టుకొని ప్రేరణ ఏం చెప్పింది?
chinni serial today April 20th: చిన్ని సీరియల్: నాగవల్లిని చంపాలని చూసిన చిన్న, దేవా! వీడియో తీసిన లోహిత!
చిన్ని సీరియల్: నాగవల్లిని చంపాలని చూసిన చిన్న, దేవా! వీడియో తీసిన లోహిత!
Nindu Noorella Saavasam Serial Today April 20th: ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి అనుమానాస్పద పార్శిల్‌ - ఆకాష్‌ కోసం భాగీ ఎమోషనల్‌ 
‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: అమర్‌ ఇంటికి అనుమానాస్పద పార్శిల్‌ - ఆకాష్‌ కోసం భాగీ ఎమోషనల్‌ 
Meghasandesam Serial Today April 20th:  ‘మేఘసందేశం’ సీరియల్‌: శారద రూంలోకి వెళ్లిన కేపీ – గగన్ ను కిస్‌ చేసిన భూమి  
 ‘మేఘసందేశం’ సీరియల్‌: శారద రూంలోకి వెళ్లిన కేపీ – గగన్ ను కిస్‌ చేసిన భూమి  
Advertisement

వీడియోలు

Vaibhav Suryavanshi Angry vs KKR IPL 2026 | వైరల్ అవుతున్న వైభవ్ ఔట్
KKR vs RR IPL 2026 Highlights | వరుస ఓటములకు చెక్ పెట్టిన కేకేఆర్
LSG vs PBKS IPL 2026 Highlights | చరిత్ర సృష్టించిన పంజాబ్ కింగ్స్
IPL 2026 GT vs KKR Highlights | గుజ‌రాత్ హ్యాట్రిక్ విజ‌యం
IPL 2026 KKR vs Gujarat Titans Cameron Green Supet Six | కామెరూన్ దెబ్బకు కారుకు డెంట్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Tamil Nadu Tour: ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఎన్డీఏ సీఎం ప్రమాణస్వీకారానికి వస్తా - తమిళనాడులో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
AP Weather Updates: ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
ఏపీలో వింత వాతావరణం - ఓవైపు వడగాలులు, మరోవైపు వర్షాలు.. ఆ జిల్లాలకు పిడుగుల వార్నింగ్
BRS Politics: జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
జగిత్యాల కేసీఆర్ సభ సమయంలోనే డిల్లీకి హరీష్ - కాంగ్రెస్ మైండ్ గేమ్ షురూ !
Venkatrami Reddy dismissed: ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి డిస్మిస్ - ప్రభుత్వ సంచలన నిర్ణయం
Iran US War: బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగింపు - చర్చలకు ఇరాన్ నో - తర్వాత ఏం జరగబోతోంది?
Pachpadra Refinery: రూ. 79,450 కోట్ల రిఫైనరీ - మోదీ ప్రారంభించాల్సిన ముందురోజే బుగ్గి - ఎక్కడంటే?
రూ. 79,450 కోట్ల రిఫైనరీ - మోదీ ప్రారంభించాల్సిన ముందురోజే బుగ్గి - ఎక్కడంటే?
Purusha: సంసారాన్ని ఈదే సూపర్ హీరోస్... రెడీ అవుతున్న 'పురుషః' టీం
సంసారాన్ని ఈదే సూపర్ హీరోస్... రెడీ అవుతున్న 'పురుషః' టీం
Japan Tsunami Alerts: జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ, 3 మీటర్ల ఎత్తుకు అలలు!
జపాన్‌లో 7.4 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ, 3 మీటర్ల ఎత్తుకు అలలు!
Embed widget