Jagadhatri Serial Today July 4th: జగద్ధాత్రి సీరియల్: మీతిమీరుతున్న ఆదిలక్ష్మీ చేష్టలు.. మనవడికి డీఎన్‌ఏ టెస్ట్.. గొడ్రాలు అంటూ అవమానం!!
Jagadhatri Today Episode కౌషికి కొడుకు తన కొడుకు కాదని డీఎన్ఏ టెస్ట్ చేయించమని ఆదిలక్ష్మీ గొడవ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి నిషికతో ఏంటి నిషి చిట్టీలు మార్చడం నీకే తెలుసు అనుకున్నావా.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా జరుగుతున్న కార్యక్రమం చూడండి అంటుంది. సురేశ్, కౌషికి కలిసి బాబుకి నామకరణం పూజ జరిపిస్తారు. కౌషికి, సురేశ్ ఇద్దరూ ఒకే సారి బాబు చెవిలో మధుకర్ అని పేరు చెప్పి బాబుని ఆశీర్వదిస్తారు. తర్వాత అందరూ బాబుని ఆశీర్వదిస్తారు.
కౌషికి కొడుకుకి కౌషికి, సురేశ్ ఇద్దరిని కలిసి ఉయ్యాల వేయమని అంటారు. జగద్ధాత్రి మామయ్యతో మేం ఉయ్యాల తీసుకొచ్చాం అందులే మొదట వేస్తారా అని రిక్వెస్ట్ చేస్తుంది. దానికి సురేశ్ ఏంటి జగద్ధాత్రి బాబు నీ మేనల్లుడు ఆర్డర్ వేయాలి కానీ రిక్వెస్ట్ చేయకూడదు అంటారు. ఇక ఆదిలక్ష్మీ యువరాజ్‌తో నువ్వే కదా అసలు మేనమామవి నువ్వు ఊయల తీసుకురాలేదా.. ఏం వైజయంతి నువ్వు నీ కొడుకుకి చెప్పలేదా అంటుంది. దాంతో వైజయంతి కవర్ చేయడానికి జగద్ధాత్రి, కేథార్ తీసుకొస్తున్నారని తెలిసి ఆగిపోయాం అంటుంది. ఆదిలక్ష్మీ వాళ్లతో పోనీలే వాళ్లు అయినా తెచ్చారు అంటుంది. జగద్ధాత్రి ఊయల తీసుకురావడానికి వెళ్తుంది.
నిషిక, యువరాజ్, వైజయంతి బయటకు వెళ్లి ఇలా అయితే కష్టం ఆదిలక్ష్మీ కూడా చేయి జారేలా ఉందని ఆవిడే మనవడిని బయటకు పంపేలా చేయాలని వదిన ఆపలేక అత్తని ఎదురించలేక గుక్కపెట్టి ఏడ్వాలని అంటుంది. నిషిక వెంటనే దివ్యాంకకు కాల్ చేసి కౌషికికి కొడుకు పుట్టాడని కిడ్నాప్ సంగతి అన్నీ చెప్తుంది. ఇక న్యూస్‌లో ముష్టివాళ్లు తీసుకెళ్లిన పిల్లలు తమ పిల్లలేనా కాదా అని అందరూ టెన్షన్ పడుతున్నారని తమ పిల్లలు అవునో కాదో టెస్ట్ చేసుకొని కాకపోతే ఆ పిల్లల్ని పోలీస్ స్టేషన్‌లో అప్పగించాలని న్యూస్ వచ్చేలా చేయమని చెప్తుంది. దివ్యాంక సరే అంటుంది. బాబుని ఊయల్లో పడుకో పెట్టడానికి కాచి తీసుకొస్తుంటే ఆదిలక్ష్మీ ఆపి కౌషికితో బాబుని ఇంకా ఉయ్యాల్లో వేయనేలేదు ఎవరికి ఇచ్చామో అని తెలీదా.. కాచి పిల్లలు లేని గొడ్రాలు తన చేతికి బిడ్డను ఎలా ఇస్తావ్ అని అంటుంది. అందరూ షాక్ అయిపోతారు.
కాచి చాలా బాధపడుతుంది. జగద్ధాత్రి అలా అనొద్దు అని తను ప్రేమగా ఎత్తుకుంది అంటుంది. దానికి ఆదిలక్ష్మీ తనకి పిల్లలు లేరు అని దుర్భుద్ధితో ఏమైనా చేస్తే అని అంటుంది. కౌషికి అత్తతో అత్తయ్యా చాలు ఇప్పటికే కాచి మనసుని చాలా బాధ పెట్టారు అని అంటుంది. దాంతో ఆదిలక్ష్మీ నువ్వు జాగ్రత్తగా ఉంటే ఇలా అనను కదా అంటుంది. ఇక వైజయంతి ఆదిలక్ష్మీతో చాలా రోజుల తర్వాత వచ్చావని మర్యాదగా ఉన్నాం నోరు జారొద్దు అంటుంది. ఇక యువరాజ్ అయితే మా ఇంటికి వచ్చి మా ఆడపడుచుని అంటే ఊరుకోమని అంటాడు. దానికి ఆదిలక్ష్మీ నీ బామ్మర్ది నన్ను కొడతా అంటున్నాడురా అని సురేశ్‌కి చెప్తుంది. టైం అయిపోతుంది బాబుని ఉయ్యాల్లో వేద్దామని అంటారు. కాచి బాధ పడుతూ వెళ్లిపోతుంటే కేథార్ ఆపి ఇది నీ హక్కు కాచి ఎవరో ఏదో అన్నారు అని నువ్వు ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదు అని కాచిని ఆపుతాడు.
సురేశ్, కౌషికిలు బాబుని ఉయ్యాల్లో వేస్తారు. నిషికి న్యూస్ వేస్తుంది. ఎవరు టీవీ వేశారని అంటే ఏదో టచ్ అయిపోయింటుందని అనుకొని రిమోట్ వెతుకుతారు. న్యూస్‌లో నిషిక చెప్పినట్లు ముష్టివాళ్ల దగ్గర నుంచి తీసుకున్న పిల్లలు తమ పిల్లలో కాదో మరో సారి చూసుకోమని అంటారు. అందరూ కంగారు పడతారు. ఆదిలక్ష్మీ ఏమైంది మీరు అలా చూస్తున్నారు అంటే జగద్ధాత్రి బాబుని కిడ్నాప్ చేసిన విషయం చెప్తారు. దాంతో ఆదిలక్ష్మీ ఇప్పుడు ఆ బిడ్డ కౌషికి కాదా అని అడుగుతుంది. దాంతో కౌషికి వీడు నా కొడుకే అంటాడు. గ్యారెంటీ ఏముందని వైజయంతి అడుగుతుంది. నేను ధాత్రినే తీసుకొచ్చా వాడు అక్క కొడుకే అని కేథార్ చెప్తాడు.
ఆదిలక్ష్మీ కౌషికిని నిలదీస్తుంది. వాడు తన మనవడు కాదు అనే అనుమానం ఉంది అవునో కాదో అనే అనుమానం ఉందని అంటుంది. కౌషికి తను నా కొడుకే అని అంటుంది. నా మీద అరుస్తున్నావేంటి అని ఆదిలక్ష్మీ అంటుంది. సురేశ్ తల్లితో నేను కౌషికి మాట నమ్ముతున్నా కౌషికిని ఇబ్బంది పెట్టొద్దు అంటాడు. మీ అనుమానం పోవాలి అంటే మేం ఏం చేయాలి అని కౌషికి బాబాయ్ అడిగితే నిషికి డీఎన్ఏ టెస్ట్ చేయిద్దామని అంటుంది. నిషికి వాళ్లు క్లారిటీ కోసం చేయించాలని అంటారు. ఆదిలక్ష్మీ వాళ్లతో డీఎన్ఏ టెస్ట్‌లో మన వాడు అని తెలిస్తే ఒకే లేదంటే పోలీస్ స్టేషన్‌కి ఇచ్చేద్దాం అంటారు.
కౌషికి బాబాయ్ కౌషికితో అందరి అనుమానం తీరిపోవాలి అంటే టెస్ట్ చేయించాలి అంటారు. వెంటనే డాక్టర్‌కి కాల్ చేస్తారు. జగద్ధాత్రికి యువరాజ్, నిషికల మీద అనుమానం ఉంటుంది. డాక్టర్ సాంపిల్స్ తీసుకెళ్లి రెండు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయని అంటారు. ఆ బిడ్డ ఫంక్షన్‌కి మనం ఉండొద్దు వెళ్లిపోదాం అని ఆదిలక్ష్మీ సురేశ్‌తో అంటుంది. నేను తర్వాత వస్తాను అని సురేశ్ అంటే ఇప్పుడు నువ్వు రాకపోతే ఇప్పటి వరకు నీకు నాన్న లేడు ఇక అమ్మ కూడా ఉండదు అంటుంది. కౌషికి భర్తలో అప్పటికీ ఇప్పటికీ ఏం తేడా ఉంది అత్తింటి నుంచి అవే అవమానాలు అని వెళ్లిపోతుంది. జగద్ధాత్రి సురేశ్‌కి వెళ్లిపోమని చెప్పి కౌషికి వదినను నచ్చచెప్తామని అంటుంది.
యువరాజ్ వాళ్లు రిపోర్ట్స్ మార్చేయాలి అనుకుంటారు. బాబుకి ఇలా ఎందుకు అవుతుందని కౌషికి తన బాబాయ్ వైజయంతి మాట్లాడుతారు. ఇక కాచి, బూచి వచ్చి కౌషికికి పది లక్షలు అడుగుతారు. బ్యాక్ డోర్ నుంచి ఉద్యోగం తెచ్చుకున్నానని బూచి అంటాడు. వైజయంతి మన కంపెనీల్లో చేసుకుంటే మంచిది అంటే బయట అయితేనే గ్రోత్ ఉంటుందని మనం అయితే తప్పులకు ఏం అనమని అంటారు. కౌషికి పొద్దున్న చెక్ ఇస్తా అంటుంది. జగద్ధాత్రి మొత్తం విని పవన్‌ని గుర్తు చేసుకొని బూచి పవన్‌కి డబ్బులు ఇవ్వాలని అనుకుంటున్నారని అంటుంది. బూచి, కాచిలను అడుగుతారు. పవన్ పది లక్షలు కాదు 30లక్షలు ఇవ్వమని అన్నారని ఇప్పటికే 20 లక్షలు ఇచ్చామని అంటారు. అలా ఎవరు ఇవ్వమని చెప్పినా నమ్మేస్తారా ఒక్క జాబుకి అంత కట్టడం ఏంటి అని కేథార్, జగద్ధాత్రి అడుగుతారు. అతను ఫేక్ అని రేపు మేఘనని పవన్‌ని తీసుకురమ్మని చెప్దాం మీరేం టెన్షన్ పడొద్దు అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్ ప్రోమో: విరూపాక్షి గ్యాంగ్ గెలిచిందోచ్.. ఈ సారి తల్లిదండ్రుల చేతుల మీదగా 'రూపాకల్యాణం'





















