జగధాత్రి సీరియల్: యువరాజ్ రంగాను కొట్టడంతో రక్తం.. కేథార్ తీసుకున్న సంచలన నిర్ణయం! | తాజా ఎపిసోడ్
jagadhatri Today Episode యువరాజ్‌ని కొట్టడానికి రంగ మనుషులు రావడం కేథార్ తానే రంగాని కొట్టానని చెప్పి వాళ్లతో దెబ్బలు కాయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

jagadhatri serial Today Episode కౌషికి కొడుకు నామకరణం పూజకు ఏర్పాట్లు జరుగుతుంటాయి. అందుకు ఇంట్లో సందడిగా ఉంటుంది. అందరూ సరదాగా ఆడుకోవాలి అనుకుంటారు. ఎవరి భార్యల్ని వాళ్లు ఎంత సేపు ఎత్తుకోగలరో అని పోటీ పెట్టుకుంటారు. పోటీ ప్రారంభంలోనే యువరాజ్ తాగి ఉండటం వల్ల స్లిప్ అయి పడిపోతాడు. దాంతో పనికి వచ్చిన రంగా అనే వ్యక్తి నవ్వుతాడు.
రంగ నవ్వడంతో యువరాజు కోపం పెంచుకుంటాడు. నిషిక యువరాజ్‌ని గదిలో పెట్టి రాగానే యువరాజ్ ఫుల్లుగా తాగేసి బయట ఉన్న రంగాని కొడతాడు. దాంతో రక్తం కారిపోతుంది. రంగని హాస్పిటల్‌కి తీసుకెళ్తారు. కౌషిక యువరాజ్‌ని తాగావా అని అడిగితే అవును తాగాను దానికి నీ పర్మిషన్ కావాలా అని అడుగుతాడు. రంగ వాళ్లు కేస్ పెడితే ప్రాబ్లమ్ అని కేథార్, జగధాత్రి జాగ్రత్తలు చెప్తారు. మీరే కావాలని మా ఆయన్ను పట్టించేలా ఉన్నారని నిషిక అక్క మీద ఫైర్ అయిపోతుంది. ఇక రంగ పరిస్థితి బాగానే ఉందని బుచ్చి వచ్చి చెప్తాడు. అంతా ఊపిరి పీల్చుకుంటారు. ఇంతలో రంగ మనుషులు ఇంటికి గొడవకు వస్తారు.
జగధాత్రి, కౌషిక, కేథార్ అంతా వాళ్లని గొడవ వద్దని బతిమాలుతారు. డబ్బు కూడా ఇస్తామని అంటారు. వాళ్లు మాత్రం కొట్టిన వాడిని ఇచ్చేస్తే మేం చూసుకుంటాం అంటారు. కేథార్ యువరాజ్‌తో వాళ్లకి క్షమాపణ చెప్పమని అంటే వజ్రపాటి యువరాజ్ వాళ్లకి క్షమాపణ చెప్పడం ఏంటి అని అంటాడు. ఇక కొంత మంది యువరాజ్‌ని చూపించి ఆయనే కొట్టారని అంటారు. దాంతో అందరూ కొట్టడానికి వెళ్తారు. కేథార్ వాళ్లని అడ్డుకుంటాడు. అందరూ కంగారు పడుతుంటే తమ్ముడిని కాపాడటానికి కేథార్ రంగాని కొట్టింది తానే అని అంటాడు. రంగ మనుషులు కేథార్‌ని కొడతాడు. జగధాత్రి అడ్డుకుంటుంది. ఆవేశంలో ఒకరు చేసిన తప్పు మీరు చేయొద్దు అని అంటుంది.
కౌషికి వాళ్లకి చేతులు పెట్టి దండం పెట్టి నా కొడుకు ఫంక్షన్ ఉంది ఇబ్బంది పెట్టొద్దు అని అనడంతో మీరు మాకు అన్నం పెట్టే వాళ్లు కాబట్టి ఏం అనకుండా వెళ్లిపోతున్నాం అని చెప్పి వెళ్లిపోతారు. నిషిక యువరాజ్‌ని గదిలోకి తీసుకెళ్తుంది. జగధాత్రి ఆరు బయట కేథార్‌కి కాపడం పెడుతుంది. నువ్వేమైనా హీరోవా మధ్యలోకి వెళ్లావని తిడుతుంది. జగధాత్రి కేథార్‌ని వాయించేయడం చూసి కౌషికి నవ్వుకుంటుంది. మీ ఇద్దరినీ ఓదార్చాలి అని వచ్చా కానీ అవసరం లేదు అంటుంది. నువ్వేమో కేథార్‌కి ఏమవుతుందా అని వెళ్లావ్.. కేథార్ బాబాయ్‌కి ఏమవుతుందా అని వెళ్లాడు అని అంటుంది. బాబాయ్ నిన్ను కొడుకులా అంగీకరించడం లేదు మరి నువ్వు ఆయన కొడుకు కోసం ఎందుకు వెళ్లావ్ అని కౌషికి అడిగితే ఆయన మా నాన్న వాడు నా తమ్ముడు అని అంటాడు. నీకు ఏమైనా అయుంటే అని కేథార్ తండ్రి వస్తే నాకు జన్మనిచ్చిన తండ్రి కోసం నేను ప్రాణాలు అయినా ఇస్తాను అంటాడు.
నలుగురు ఎమోషనల్‌గా మాట్లాడుకుంటారు.
యువరాజ్ తల్లి మొత్తం చూసి అబ్బా కొడుకులు ఒక్కటైపోతున్నారన్నమాట అనుకుంటుంది. నిషిక యువరాజ్‌ని గదిలోకి తీసుకెళ్లి పడుకోమని అంటుంది. యువరాజ్ మళ్లీ మందు తాగుతుంఏట తల్లి కోపం మీద వచ్చి గ్లాస్ నీరు ముఖం మీద విసిరేస్తుంది. వాళ్లు మీ నాన్నకి దగ్గరైపోతుంటే నువ్వు మందు తాగుతూ ఉండు అని తిడుతుంది. మీ అక్క నాన్న కేథార్ దగ్గర ఉన్నారు అని తల్లి చెప్పడంతో యువరాజ్ ఆవేశంగా గన్ తీసి ఇప్పుడే వాడిని చంపేస్తా అని అంటాడు. చంపాలి కానీ మనిషిని కాదు మీ నాన్న మనసులో వాడి మీద ఉన్న ప్రేమ, వాళ్ల మీద నమ్మకం, నీ మీద కోపం చంపాలి అని అంటుంది.
జగధాత్రి రెడీ అయితే కేథార్ చూసి ఇంత సింపుల్‌గా ఉండొద్దు ఫంక్షన్‌లో నా పళ్లాం అందరి కంటే స్పెషల్‌గా ఉండాలి అని కేథార్ చీర సెలక్ట్ చేస్తాడు. అందరూ ఫంక్షన్‌కి రెడీ అయిపోతారు. కేథార్ తండ్రితో బావ బయల్దేరారో లేదో ఒకసారి అడగండి అని అంటే కౌషికి తాను చేస్తాను అని వెళ్తుంది. నిషిక అత్తయ్యతో దూరం దగ్గరైపోతుందని అంటుంది. సురేశ్ తన తల్లితో కలిసి కొడుకు బారసాల కార్యక్రమానికి బయల్దేరుతాడు. కౌషికి సురేశ్‌కి కాల్ చేస్తుంది. సురేశ్‌తో మాట్లాడుతుంది. అమ్మ కూడా వస్తుంది అని సురేశ్ అనడంతో కౌషికి మాట్లాడుతుంది. కోటీశ్వరురాలా ఏం చేస్తున్నావ్ అని ఆదిలక్ష్మీ మాట్లాడుతుంది. కౌషికి విషయం చెప్పడంతో ఆదిలక్ష్మీని మనం వాడుకోవచ్చని నిషిక అత్తతో చెప్తుంది.
ఇక యువరాజ్ తాయారుని హోంమంత్రిని చేశారని చెప్తాడు. జేడీ కేడీలు షాక్ అయిపోతారు. తమ పై అధికారి సాధు సార్‌కి కాల్ చేస్తారు. దొంగ చేతికి తాళాలు ఎలా ఇస్తున్నారు అని అడిగితే మీనన్, తాయారు మీద భయం వల్లే ఇదంతా సాధ్యం అని అంటారు సాధు. ఆమె దగ్గరకు మీరు రావొద్దు అని సాధుసార్ చెప్తారు. మీరు వస్తే తను ఏమైనా ప్లాన్స్ చేస్తుంది తన పవర్ వాడుకుంటుందని అంటారు. ఇంతలో ఐజీ గారు సాధుసార్‌కి కాల్ చేస్తారు. దాంతో సాధుసార్ కేడీ జేడీలకు కాల్ చేసి మమల్ని స్పెషల్‌గా తీసుకురమ్మని చెప్పారు కదా సార్ మేం రెడీ అని అంటారు. జేడీ రాలేదని తాయరు అనుకుంటుంది ఉంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: మహి కారుని ఆటోలా వాడేసుకున్న మధుమిత.. దేవా హోంమంత్రి.. శ్రియ ఎవరో తెలుసా!





















