Jagadhatri Serial Today January 20th: కేదార్ వారసత్వం నిరూపించే ఆధారం లభించిందా? హిమాలయాల నుంచి కేదార్‌ను చూడటానికి వచ్చిన వృద్ధుడు ఎవరు..?
Jagadhatri Serial Today Episode January 20th:కేదార్ వారసత్వం నిరూపించే ఆధారం లభించిందా? హిమాలయాల నుంచి కేదార్‌ను చూడటానికి వచ్చిన వృద్ధుడు ఎవరు..?

Jagadhatri Serial Today Episode: ఇంతమంది ఇంట్లో ఉండి జగధాత్రి, కేదార్‌ను బయటకు వెళ్లగొట్టలేకపోయారని యువరాజు, నిషికపై కమలాకర్ మండిపడతాడు. మేం ఎన్ని ఎత్తులు వేసినా...ఆ మొగుడు పెళ్లాలిద్దరూ కలిసి చిత్తుచేస్తున్నారని నిషిక అంటుంది.రేపటిలోగా వాళ్లు ఎలాగూ సాక్ష్యాలు సంపాదించలేరు కాబట్టి...రేపు వాళ్లను శాశ్వతంగా ఇంటి నుంచి బయటకు గెంటివేద్దామని అంటారు. వాళ్లతో నాకు పెద్దగా సమస్యలేవీ లేవని....మహా అయితే ఆస్తిలో వాటా కొంత తగ్గుతుందని కానీ వాడే ఈ ఇంటి వారసుడు అని నిరూపించుకుంటే....యువరాజుతో సహా మీరంతా రోడ్డునపడతారని కమలాకర్ హెచ్చరిస్తాడు. ఇంట్లో ఉన్న అమ్మాయి ఎవరని కమలాకర్ ఆరా తీయగా....ఆ విషయం మీ వదినని అడగండని...ఆమెకు సంబంధించిన అమ్మాయేనని నిషిక అంటుంది. వైజయంతి తన మరిదిని తీసుకుని నీతో చాలా విషయాలు మాట్లాడాలంటూ అక్కడ నుంచి వెళ్లిపోతుంది.
కమలాకర్ అన్న మాటలకు జగధాత్రి,కేదార్ ఎంతో బాధపడుతుంటారు. అందరూ ఉండి కూడా నేను అనాథగా మారాల్సి వచ్చిందని కేదార్ అంటాడు. నావల్ల అనవసరంగా నువ్వు కూడా మాటలు పడుతున్నావని జగధాత్రిని అంటాడు. నీ అభిమానం చంపుకుని నోరుమూసుకుని ఉండాల్సి వస్తోందని అంటాడు. ఎంత వెతికినా మనకు సరైన ఆధారం లభించేట్లు లేదని బాధపడుతుంటాడు. ఆ దేవుడే నీకు దారి చూపిస్తాడని జగధాత్రి అంటుంది. అప్పుడే సరిగ్గా మహల్ వాచ్‌మెన్ ఫోన్ చేసి కేదార్‌కు ఓ విషయం చెబుతాడు. మీ అమ్మవాళ్ల నాన్నగారు బతికే ఉన్నారని...మీ అమ్మ చనిపోయిన వెంటనే మహల్ వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోయారంటని చెబుతాడు.మీరు మహల్‌కు వచ్చిన విషయం తెలుసుకుని రేపు ఉదయం తిరిగి వస్తున్నారని అంటాడు. ఆయన్ను చూసేందుకు మీరు వెంటనే ఇక్కడికి రావాలని పిలుస్తాడు. ఈ మాటలు విన్న కేదార్ ఎంతో సంతోషిస్తాడు. తప్పకుండా వస్తామని అంటాడు. ఈ మాటలన్నీ చాటుగా కమలాకర్ వింటాడు.
తాతయ్యను చూడటానికి జగధాత్రితో కలిసి కేదార్ మహల్ వద్దకు వెళ్తాడు. వారి వెనకే యువరాజును తీసుకుని కమలాకర్ కూడా వస్తాడు. కేదార్ వాళ్ల తాత బతికే ఉన్నాడని...ఖచ్చితంగా అతని వద్ద ఏదో ఆధారం ఉండే ఉంటుందని అందుకే ముసలోడిని వెంటనే చంపేద్దామని అంటాడు. ఇంతలో కేదార్ వాళ్ల తాతయ్య కారులో మహల్ ముందుకు వస్తాడు. కేదార్,జగధాత్రితో మాట్లాడి మహల్ లోపలికి వెళ్తుండగా...యువరాజు, కమలాకర్ మంకీక్యాప్‌లు పెట్టుకుని అక్కడికి వస్తారు.కమలాకర్ కత్తితో కేదార్ వాళ్ల తాతయ్యను చంపేందుకు ప్రయత్నించగా....జగధాత్రి అడ్డుకుంటుంది. ఆ తర్వాత కేదార్ కూడా కమలాకర్‌ను కొట్టి పట్టుకునేలోపు యువరాజు వచ్చి అతన్ని తీసుకునిపారిపోతాడు. తాతయ్యకు ఏం కాలేదని లోపలికి తీసుకెళ్తారు. 25 ఏళ్ల తర్వాత హిమాలయాల నుంచి వచ్చిన మీపై దాడి చేసే అవసరం ఎవరికి ఉంటుందని తాతయ్యను జగధాత్రి ప్రశ్నిస్తుంది. అతను ఏం చెబుతాడా అని కిటికిలో నుంచి కమలాకర్, యువరాజు వింటుంటారు. ఇదంతా ఆ కమలాకర్ పనేనని ముసలాయన చెబుతాడు.





















