Jagadhatri Serial Today October 7th: ‘జగధాత్రి’ సీరియల్: కేదార్ మాల విరమించేందుకు నిషిక ప్లాన్ – నిషిక ప్లాన్ ను ప్లాప్ చేసిన ధాత్రి
Jagadhatri Today Episode: ఉల్లిపాయలను కలపిన వడలను కేదార్ చేత తినిపించాలని నిషిక ప్లాన్ చేయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.
![Jagadhatri Serial Today October 7th: ‘జగధాత్రి’ సీరియల్: కేదార్ మాల విరమించేందుకు నిషిక ప్లాన్ – నిషిక ప్లాన్ ను ప్లాప్ చేసిన ధాత్రి Jagadhatri serial today episode October 7th written update Jagadhatri Serial Today October 7th: ‘జగధాత్రి’ సీరియల్: కేదార్ మాల విరమించేందుకు నిషిక ప్లాన్ – నిషిక ప్లాన్ ను ప్లాప్ చేసిన ధాత్రి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/10/07/41e716ab1b8fa2d336beaec7b6f7a9d71728280063665879_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Jagadhatri Serial Today Episode: ధాత్రి, కేదార్ వెళ్లి అబ్బులును ఎంక్వైరీ చేస్తారు. అబ్బులు చెప్పిన గోపాల కృష్ణ ఇంటికి వెళ్తారు. ఆయన చనిపోయి 20 ఏళ్లు అవుతుందని ఆయన భార్య చెప్పడంతో ధాత్రి, కేదార్ షాక్ అవుతారు. ఆ విషయం తెలియక వచ్చామని చెప్పి వెళ్లబోతూ గోపాల కృష్ణ చనిపోయిన డేట్ తెలుసుకుని అబ్బులు మనకు అబద్దం చెప్పాడని వెంటనే అబ్బులు ఇంటికి వెళ్లగానే ఇల్లు తాళం వేసి ఉంటుంది. దీంతో కేదార్, ధాత్రి ఇంటికి వెళ్తారు. మరోవైపు నిషిక, యువరాజ్‌ను తీసుకుని కిచెన్ లోకి వెళ్లి బూచి, కేదార్ తినే వడల్లో ఉల్లి, వెల్లుల్లి కలుపుతానని అవి తిన్న వాళ్లిద్దరినీ ఇంట్లో వాళ్లే మాల తీసేయమని చెప్తుంది. ఇదంతా పై నుంచి విన్న కాచి, బూచి జాగ్రత్తగా ఉండాలనుకుంటారు.
నిషిక: ఇదిగో స్వామి ఇవి వాళ్లకు పెట్టాల్సినవి. ఇవి మీరు తినాల్సినవి. గుర్తు పెట్టుకోండి స్వామి నేను ఇచ్చిన వడలు మాత్రమే మీరు తినాలి.
యువరాజ్: సరే స్వామి అలాగే..
నిషిక: అదిగో జగధాత్రి వాళ్లు వస్తున్నారు. నువ్వు వెళ్లు స్వామి నేను జగధాత్రి వడలు తీసుకుని వస్తాము. గుర్తు పెట్టుకోండి స్వామి నేను ఇచ్చిన వడలు మాత్రమే మీరు తినాలి.
యువరాజ్ వెళ్లిపోతాడు. జగధాత్రి వస్తుంది.
ధాత్రి: నిషి నువ్వు వంటింట్లో ఏం చేస్తున్నావు.
నిషిక: ఇదిగో దేవుడికి నా చేతులతో వడలు వేద్దామని వచ్చాను.
ధాత్రి: నువ్వు వడలు చేయడానికి వచ్చావా?
నిషిక: అంటే ఏంటో వంట నాకు రాదనా..? నేను చేయలేననా?
ధాత్రి: చేస్తే ఎవ్వరూ చేయలేరని..
అనగానే ఇప్పుడు కాదే యువరాజ్ దీక్ష అయిపోయాక చెప్తాను అని మనసులో అనుకుంటూ బయటకు వెళ్తుంది. ధాత్రి కూడా బయటకు వెళ్తుంది. అందరూ పూజలో పాల్గొంటారు. పంతులు పూజ చేసి వెళ్లిపోతాడు. ఇంతలో నిషిక యువరాజ్‌కు ఉల్లి లేని వడలు పెట్టి బూచికి ఉల్లి ఉన్న వడలు పెట్టబోతుంటే వద్దని నాకు అవే కావాలని నిషికను అడిగి మరీ తింటాడు. కేదార్ మాత్రం ఉల్లి కలిపిన వడలు తింటాడు. దీంతో దోషం జరిగిపోయిందని కేదార్ మాల విరమించాలని యువరాజ్, నిషిక చెప్తారు.
ధాత్రి: మాల విరమించుకోవాల్సింది కేదార్ స్వామి కాదు యువరాజ్. నువ్వు బూచి అన్నయ్య.
బూచి: మేమా..?
ధాత్రి: మీ ఇద్దరి దృష్టి కేదార్ మీద ఉండటంతో మీరు ఏం తింటున్నారో కూడా మీకు అర్థం అయినట్టు లేదు. ఒక్కసారి మీ ప్లేట్స్ చూసుకోండి.
వైజయంతి: అయ్యో..
బూచి: నేను ఒప్పుకోను..
నిషిక: అసలు నువ్వు ఈ వడలు ఎందుకు తిన్నావు యువరాజ్.
యువరాజ్: నువ్వే కదా నువ్వు ఇచ్చిన వడలు తినమన్నావు
కౌషికి: అసలు ఏం జరుగుతుంది. ఎందుకు కన్పూజన్. నిషిక ఇంట్లో పూజ జరుగుతుంది ప్రసాదాలు చేసేటప్పుడు కొంచెం చూసుకోవాలి కదా?
వైజయంతి: పండుగ అయ్యేదాకా ప్రసాదాల సంగతి జగధాత్రి చూసుకుంటుందిలే.. ఎవరూ మధ్యలోకి రాబాకండి. లేక లేక నా బిడ్డ మాల వేసుకుంటే దీక్ష మొత్తం నాశనం చేసుండారు.
యువరాజ్: అంటే అమ్మా ఇప్పుడు మాల విరమించాలా?
ధాత్రి: కచ్చితంగా తీసేయాలి యువరాజ్. వెళ్లి ఇద్దరూ మాల తీసేసి రండి.
వైజయంతి: ఓరే అబ్బి అరిష్టం రా.. మాల తీసేయాల్సిందే.. వచ్చే సంవత్సరం చూసుకుందాములే రా అబ్బోడా..
కేదార్: అందుకే గణేషా ఒకరి మంచి చూడాలి కానీ ఒకరిని ముంచేయాలి. అనుకోకూడదు.
అని చెప్పి ఎలా జరిగింది ధాత్రి అని అడుగుతాడు. దీంతో జరిగింది మొత్తం చెప్తుంది జగధాత్రి. మరోవైపు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బును బయటకు తీయలేకపోతున్నాము అని యువరాజ్, నిషిక బాధపడుతుంటారు. ఇంతలో మీనన్ ఫోన్ చేసి యువరాజ్‌కు డబ్బులు ఇంకా తీయలేదా? అంటూ వార్నింగ్ ఇస్తాడు. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: ఈ రాశిలో జన్మించినవారు ఆత్మలతో మాట్లాడతారా! వీరికి అతీంద్రీయ శక్తులు సైతం
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)