అన్వేషించండి

Jagadhatri Serial Today June 14th: ‘జగధాత్రి’ సీరియల్‌: మీనన్ ను పట్టుకున్న జేడీ – సాధును బెదిరించిన కమలాకర్

Jagadhatri Today Episode: యువరాజ్ ను కోర్టుకు తీసుకెళ్తున్నట్టు నాటకం ఆడి కేడ, జేడీ ఇద్దరూ కలిసి మీనన్ ను పట్టుకుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ చాలా ఆసక్తికరంగా జరిగింది.

Jagadhatri  Serial Today Episode: స్టేషన్‌ నుంచి యువరాజ్‌ను కోర్టుకు తీసుకెళ్తున్నారని కౌషికి, కమలాకర్‌, వైజయంతి స్టేషన్‌ వెళ్తున్నామని. కోర్టు నుంచి యువరాజ్‌ను తీసుకొస్తామని నిషికకు చెప్పి నువ్వు ఇంట్లోనే ఉండు అంటారు. మరోవైపు కేడీ, జేడీ ఇద్దరూ యువరాజ్‌ను కోర్టుకు తీసుకెళ్లడానికి స్టేషన్‌కు వెళ్తారు. రెండు గంటల్లో నేను నడుచుకుంటూ మీ కళ్ల ముందే ఇంటికి వెళ్లిపోతానని చెప్తాడు యువరాజ్. యువరాజ్‌ను కోర్టుకు తీసుకెళ్తుంటే కౌషికి, కమలాకర్‌, వైజయంతి వస్తారు.

వైజయంతి: అబ్బోడా ఎట్టా ఉన్నావురా నీకేం కాలేదు కదరా?

కమలాకర్‌: యువరాజ్‌ నీకేం కాలేదు కదా? బాగానే ఉన్నావు కదా?

 కౌషికి: ఇవాళ కోర్టులో బెయిల్‌ వస్తుంది. ఇంటికి వెళ్లిపోదాం.. కాసేపు ధైర్యంగా ఉండు చాలు.

కేదార్‌: మేడం ప్లీజ్‌ అడ్డు జరగండి మా పని మమ్మల్ని చేసుకోనివ్వండి.

వైజయంతి: అయ్యో ఎవరికి ఏ పాపం చేసి ఉండామని నా కొడుకుని ఇట్టా కొట్టి ఉండారు. మీకసలు మనసాక్షి అనేది ఉందా?

ధాత్రి: కోర్టుకు టైం అవుతుంది. మమ్మల్ని వెళ్లనివ్వండి.

కమలాకర్‌: తప్పుడు కేసులు పెట్టి, దొంగ సాక్ష్యాలు చూపించి మా ఇంటి వారసుణ్ని అరెస్ట్ చేసి మా పరువు తీయాలని చూసిన మిమ్మల్ని వదిలిపెట్టేదే లేదు.

  అనగానే మీరు కోర్టులో చెప్పుకోండి అని జేడీ వెళ్తుంటే కౌషికి ఆపుతుంది. నా తమ్ముణ్ని ఏం చేయబోతున్నారు అంటూ నిలదీస్తుంది. దీంతో సాధు వచ్చి కౌషికి వాళ్లను అరెస్ట్‌ చేయమంటాడు. దీంతో కమలాకర్‌ కోపంగా సాధు దగ్గరకు వెళ్లి కాలర్‌ పట్టుకుని వార్నింగ్‌ ఇస్తాడు. దీంతో ధాత్రి కమలాకర్‌ను కొడుతుంది. మాకు అడ్డుపడితే మిమ్మల్ని అరెస్ట్‌ చేస్తామని బెదిరిస్తుంది. యువరాజ్‌ను తీసుకుని వెళ్లిపోతారు.

వైజయంతి: కౌషికి నాకెందుకో భయంగా ఉంది. వాళ్లు యువరాజ్‌ను కోర్టుకే తీసుకెళ్తారా?

కమలాకర్‌: అవును కౌషికి వాళ్ల మాటల్లో మనల్ని బెదిరించడం కంటే ఎక్కడ మనం వాళ్ల వెనకాల వెళ్తామనే భయమే ఎక్కువ ఉంది.

కౌషికి: వాళ్ల వెనక మనం వెళితే అదే కారణం చెప్పి మనల్ని అరెస్ట్‌ చేస్తారు బాబాయ్‌.

వైజయంతి: అయితే అబ్బోన్ని అలా ఒంటరిగా వదిలేస్తామా? అమ్మి ఏదో ఒకటి చేయ్‌ అమ్మి

అనగానే వాళ్లు అలా చేస్తారనే నా ప్లాన్‌ లో నేను ఉన్నాను. అని ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి అంటుంది. మరోవైపు యువరాజ్‌ను కోర్టుకు తీసుకెళ్తుంటారు. ఆఫీసుకు వెళ్లిన కౌషికి యువరాజ్‌ ను తీసుకెళ్తున్న వ్యాన్‌కు జీపీఎస్‌ ఉన్న కెమెరా పెట్టి ఉటుంది అది ఓపెన్‌ చేసి లైవ్‌లో చూస్తుంటుంది. మరోవైపు మీనన్‌ యువరాజ్‌ను తప్పించడం కోసం ప్రయత్నిస్తుంటాడు. యువరాజ్‌ ను తీసుకెళ్తున్న వ్యాన్‌ డ్రైవర్‌ మనవాడేనని మీనన్‌ మనిషి చెప్తాడు. టైం చూసి యువరాజ్‌ ఉన్న వ్యాన్‌ను దారి మళ్లీస్తాడని చెప్తాడు. కొద్దిసేపటికి వ్యాన్‌ దారి మళ్లుతుంది. లైవ్‌లో చూసున్న కౌషిక, వైజయంతి, కమలాకర్‌ కంగారు పడతారు. వ్యాన్‌కు ఎదురుగా మీనన్‌ కారు ఆగుతుంది. వ్యాన్‌ లోని పోలీసులు పారిపోతారు.

మీనన్‌: పాపం యువరాజ్‌ కోసం జేడీ రోడ్ల మీద పిచ్చిదానిలా వెతుక్కుంటూ ఉంటుంది. ఈ మీనన్‌ ఏం చేయగలడో ఆ జేడీకి ఈపాటికే అర్థం అయ్యి ఉంటుంది. ఓపెన్‌ చేయ్‌

అనగానే దేవ  వ్యాన్‌ డోర్‌ ఓపెన్‌ చేసి చూసి షాక్‌ అవుతాడు. ఏంటని మీనన్‌ చూడగానే లోపల జేడీ, కేడీ ఉంటారు.

జేడీ: నా ఫేస్‌లో ఎక్స్‌ ప్రెషన్స్‌ ఏంటో కానీ నీ ఫేస్ లో ఎక్స్‌ ప్రెషన్స్‌ నా ఎక్స్‌పెక్టేషన్‌ మించి పోయింది మీనన్‌

అని యువరాజ్‌ను వ్యాన్‌ లోంచి ఎలా మార్చింది చెప్తుంది జేడీ. దీంతో మీనన్‌ షాక్‌ అవుతాడు. యువరాజ్‌ను కోర్టుకు తీసుకెళ్లే ఉద్దేశ్యమే మాకు లేదు.. ఇదంతా నీకోసం మేము వేసిన సెటప్‌ అని చెప్పగానే మీనన్‌ మనుషులు జేడీ, కేడీల మీదకు వస్తారు. రౌడీలను కొట్టిన జేడీ, కేడీలు మీనన్‌ ను పట్టుకుంటారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.  

ALSO READ: ఒక వైపు స్విమ్మింగ్.. మరోవైపు జిమ్‌లో కసరత్తులు - మహేష్ బాబు కొడుకు గౌతమ్ వర్కవుట్స్‌ వీడియో షేర్ చేసిన నమ్రత

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఇజ్రాయేల్‌పై ఇరాన్ భీకర దాడులు, నెతన్యాహు స్ట్రాంగ్ వార్నింగ్తిరుమలలో పవన్‌ చిన్న కూతురు పొలేనా అంజనా డిక్లరేషన్తొలిసారి మీడియా ముందుకి పవన్ కల్యాణ్ రెండో కూతురుతిరుమల ఆలయంలో పవన్ చేతిలో రెడ్‌బుక్‌, అందులో ఏముంది..?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP CM Chandrababu: బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
బందరు పోర్టు 2025 నాటికి పూర్తి, తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు ప్రయోజనం: చంద్రబాబు
YS Sharmila Vizag : చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల -  విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
చంద్రబాబుకు 48 గంటల డెడ్‌లైన్ పెట్టిన షర్మిల - విశాఖలో నడిరోడ్డుపై దీక్ష
Prakash Raj: ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు... మంత్రి కొండా సురేఖ కామెంట్స్‌కు ఇచ్చి పడేసిన ప్రకాష్ రాజ్ 
High Mileage Affordable Bikes: రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
రూ. లక్ష లోపు బెస్ట్ మైలేజీ - టాప్-3 బైక్స్ ఇవే!
Delhi Drugs: ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
ఢిల్లీలో భారీగా డ్రగ్స్‌ స్వాధీనం, రూ.2వేల కోట్ల విలువైన కొకైన్‌ సీజ్ - నలుగురి అరెస్ట్
Japan :  రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు  !
రెండో ప్రపంచయుద్ధంలో అమెరికా వేసిన బాంబు ఇప్పుడు పేలింది - జపాన్ ఎయిర్‌పోర్టులో తప్పిన ముప్పు !
Royal Enfield New Bikes: కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
కొత్త బైక్‌లు లాంచ్ చేయనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ - మూడు సూపర్ బైక్స్ రెడీ!
AP CM Chandra Babu: ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
ఏపీ ప్రజలకు దసరా కానుక- డ్వాక్రా సంఘాలకు సంక్రాంతి గిఫ్ట్‌ - గుడ్ న్యూస్‌లు చెప్పిన చంద్రబాబు
Embed widget