Gautam Ghattamaneni: ఒక వైపు స్విమ్మింగ్.. మరోవైపు జిమ్‌లో కసరత్తులు - మహేష్ బాబు కొడుకు గౌతమ్ వర్కవుట్స్ వీడియో షేర్ చేసిన నమ్రత
Gautam Ghattamaneni: తన పిల్లలు సితార, గౌతమ్‌కు సంబంధించిన ఎలాంటి విషయం అయినా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు నమ్రత. అలాగే తాజాగా గౌతమ్ వర్కవుట్ వీడియోను షేర్ చేశారు.
Gautam Ghattamaneni: మామూలుగా స్టార్ హీరోల వారసులు ఎప్పుడెప్పుడు వెండితెరపై అడుగుపెడతారా అని వారి ఫ్యాన్స్ ఎదురుచూస్తూ ఉంటారు. అందుకే హీరోలకు సంబంధించినవి మాత్రమే కాకుండా వారి వారసులకు సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. మహేశ్ బాబు విషయంలో కూడా అదే జరుగుతుంది. తమ కుమారుడు గౌతమ్ ఘట్టమనేనికి సంబంధించిన పర్సనల్ లైఫ్ విషయాలను అప్పుడప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు నమ్రత. తాజాగా ఒక స్పెషల్ వీడియో షేర్ చేయగా అందులో గౌతమ్.. భారీ వర్కవుట్స్ చేస్తూ కనిపించాడు.
గౌతమ్ వర్కవుట్స్..
తన పిల్లల గురించి, పర్సనల్ లైఫ్ గురించి మహేశ్ బాబు ఎక్కువగా సోషల్ మీడియాలో బయటపెట్టరు. కానీ నమ్రత మాత్రం ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ యాక్టివ్‌గా ఉంటూ సితార గురించి, గౌతమ్ గురించి పోస్టులు పెడుతుంటారు. అలాగే తాజాగా గౌతమ్ ఘట్టమనేనికి సంబంధించిన ఒక వీడియోను షేర్ చేశారు. అందులో తను ట్రైనర్‌తో కలిసి వర్కవుట్స్ చేస్తూ కనిపించాడు. అంతే కాకుండా మధ్యమధ్యలో గౌతమ్ స్విమ్మింగ్ చేయడం కూడా ఈ వీడియోలో ఉంది. దీంతో మహేశ్ ఫ్యాన్స్ అంతా వారసుడు వచ్చేస్తున్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అసలు తండ్రి ఎవరు, కొడుకు ఎవరు అని గుర్తుపట్టలేనంతగా మహేశ్, గౌతమ్ ఒకేలా ఉంటారని అంటున్నారు.
View this post on Instagram
మంచి స్విమ్మర్..
గౌతమ్ ఘట్టమనేనికి స్విమ్మింగ్ అంటే చాలా ఇష్టమని ఇప్పటికే ఎన్నోసార్లు బయటపెట్టారు నమ్రత. అంతే కాకుండా తను ఇప్పటికే పలుమార్లు స్విమ్మింగ్ పోటీల్లో పాల్గొని ప్రైజ్‌లు కూడా సంపాదించుకున్నాడు. గౌతమ్ అలా ప్రైజ్ గెలుచుకున్న ప్రతీసారి దాని గురించి పోస్ట్ చేసేవారు నమ్రత. ఇటీవల గౌతమ్ తన గ్రాడ్యుయేషన్‌ను పూర్తి చేసుకున్నాడు. ఆ సందర్భంగా మహేశ్, నమ్రత ఎంతో సంతోషంతో ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు వారు తల్లిదండ్రులుగా ఎంత గర్వపడుతున్నారో చెప్పుకొచ్చారు. ప్రస్తుతం హాలీడేస్‌ను ఎంజాయ్ చేస్తున్న గౌతమ్.. వర్కవుట్స్‌తో బిజీ అయినట్టు నమ్రత షేర్ చేసిన వీడియో ద్వారా తెలుస్తోంది.
తల్లిదండ్రులే ఇన్‌స్పిరేషన్..
నమ్రతకు కూడా వర్కవుట్స్ చేయడం, జిమ్‌కు వెళ్లడం చాలా ఇష్టం. అందుకే అప్పుడప్పుడు తను వర్కవుట్ చేస్తున్న వీడియోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. ఇక మరోవైపు రాజమౌళి సినిమా కోసం మహేశ్ కూడా భారీగానే వర్కవుట్స్ చేస్తున్నట్టు తెలుస్తోంది. తల్లిదండ్రుల బాటలోనే ఇప్పుడు గౌతమ్ కూడా నడుస్తున్నాడు. దీంతో త్వరలోనే గౌతమ్ కూడా తండ్రిలాగా మరింత ఫిట్‌గా అవ్వబోతున్నాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మహేశ్ కూతురు సితార తను హీరోయిన్ అవ్వాలనుకుంటున్న విషయం ముందే బయటపెట్టింది. కానీ గౌతమ్ విషయంలో మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు.
Also Read: డైరెక్టర్ చెప్పాడని బ్లాక్ కలర్ అండర్‌వేర్ కూడా వేసుకోవడం లేదు: హీరో సుధీర్ బాబు