Jagadhatri Serial Today January 13th: ‘జగధాత్రి’ సీరియల్: మేనేజర్ ను చంపేయాలనుకున్న మంత్రి – వైజయంతి కోసం నాటు వైద్యుడిని తీసుకొచ్చిన ధాత్రి
Jagadhatri Today Episode : ధాత్రి తీసుకొచ్చిన నాటు వైద్యుడు ట్రీట్‌మెంట్ కోసం సూదులు, కాగుతున్న నూనె బయటకు తీయడంతో ఇవాళ్టీ ఏపిసోడ్ చాలా ఆసక్తిగా జరిగింది.

Jagadhatri Serial Today Episode: మేనేజర్ పరుగెత్తుకుని మినిస్టర్ దగ్గరకు వెళ్తాడు. పోలీసులు తనను పట్టుకోవడానికి వచ్చారని జరిగింది మొత్తం చెప్తాడు. నేను దొరికితే మీరు కూడా దొరికపోతారు సార్ అంటాడు.
మంత్రి బామ్మర్ది: చెప్పానా..? నేను చెప్పానా… జరగబోయేది ఇదే అని నేను చెప్పాను కదా..?
మంత్రి: ఏయ్ నువ్వు నోర మూయ్..
మేనేజర్: సార్ ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు సార్.
మంత్రి బామ్మర్ది: ఇంకేం చేస్తారు. నువ్వు వీడు కలిసి ఒక బొచ్చె పట్టుకుని అడుక్కు తినండి. ( అని మనసులో అనుకుంటాడు)
మేనేజర్: ఇంకోసారి వాళ్ల కంట పడితే తప్పించుకోడం చాలా కష్టం సార్.
మంత్రి: నువ్వు ఇక్కడ ఉంటేనే కదా వాళ్లు నిన్ను పట్టుకుంటారు. నువ్వు వెంటనే కేరళ వెళ్లు కేరళలో మనకు తెలిసిన వాళ్ల షూటింగ్ జరుగుతుంది. నువ్వు వాళ్ల దగ్గరకు వెళ్లిపో.. ఆ ప్రొడక్షన్ టీంతో కలిసిపో ఎవ్వరికీ అనుమానం రాదు. ఇక్కడ అంత సర్దుమణిగాక నేనే నిన్ను పిలుస్తాను.
మేనేజర్: సరే సార్ ఇవాళ నైట్‌కే కేరళ వెళ్లిపోతాను.
మంత్రి బామ్మర్ది: ఏం ప్లాన్ చేస్తున్నావు బావ. ఏంటా చూపు సీరియల్ కిల్లర్ లాగా.. అవునులే నువ్వు సీరియల్ కిల్లరువే కదా..?
మంత్రి: రేయ్ ఏంట్రా నోరు అదుపులో పెట్టుకో… ఎవరైనా వింటే ఏమనుకుంటారు.
మంత్రి బామ్మర్థి: నేను తెరవాల్సిన చోట నోరు తెరిస్తే.. నిన్ను మూసేస్తారని నాకు తెలుసు బావ. అయినా కూడా చేయట్లేదంటే నీ మీద నాకున్న ప్రేమ బావ.
మంత్రి: రేయ్ పక్కకు వెళ్లు..
అంటూ తిడతాడు. వీడి వరకు వచ్చిన పోలీసులు వీణ్ని తన్ని నా వరకు రావడానికి ఎక్కువ టైం పట్టదు. వీణ్ని తప్పిస్తే కానీ నేను తప్పించుకోలేను అని మనసులో అనుకుంటాడు మంత్రి. మరోవైపు ఇంట్లో ఎవరూ లేరని వైజయంతి వీల్ చైర్ లోంచి లేచి అటూ ఇటూ తిరుతుంది. ఏం యాక్టింగో ఏమో ఈ వీల్ చైర్‌లో కూర్చుని నిజంగానే పక్షవాతం వచ్చేలా ఉందని బాధపడుతుంది. మంచి తిండి తిని ఎన్నాళ్లు అయిపోయిందే ఏమో అంటూ నిట్టూరుస్తుంది.
అంతా బయటి నుంచి గమనించిన జగధాత్రి.. ఇక వైజయంతి నాటకానికి తెర దించాలనుకుంటుంది. అందుకోసం ఒక ప్రకృతి వైద్యుడిని తీసుకొచ్చి వైజయంతికి ట్రీట్‌మెంట్ ఇప్పించాలనుకుంటుంది. అనుకున్నట్టుగానే ఒక వ్యక్తిని ఇంటికి తీసుకొచ్చి పక్షవాతానికి అద్బుతమైన ట్రీట్ మెంట్ చేస్తాడని ఇంట్లో వాళ్లకు చెప్తుంది. ఇంతలో వైజయంతిని యువరాజ్, నిషిక కిందకు తీసుకొస్తారు. ధాత్రి నవ్వుతూ ఉండటం చూసిన వైజయంతి భయపడుతుంది.
వైజయంతి: అయ్యో ఈ అమ్మి నవ్వుతూ ఉంటే నాకు గుండెల్లో దడ పుడతా ఉందే..?
ధాత్రి: గురువు గారు నేను చెప్పాను కదా ఆవిడే.. మీరిక మీ వైద్యాన్ని మొదలు పెట్టండి..
అని ధాత్రి చెప్పగానే.. ఆ వైద్యుడు సూదులు, కాగుతున్న నూను.. ఐస్ గడ్డలు బయటకు తీస్తాడు. వాటిని చూసిన వైజయంతి, యువరాజ్, నిషిక షాక్ అవుతారు.
నిషిక: ఈ సూదులేంటి.. ఈ ఐస్ ఏంటి.. ఆ నూనె ఏంటండి..?
బూచి: పకోడీలు వేస్తారేమో..?
నిషిక: ఏంటి వదిన మీరేం మాట్లాడరేంటి..?
కౌషికి: ఆయన వీటిల్లో ఎంత ఎక్స్‌ఫర్ట్ అయితే జగధాత్రి వీళ్లను పిలుస్తుంది.
ధాత్రి: అవును..
వైజయంతి: వైజయంతి.. చిత్తూరులో మొదలైన నీ కథ ఈ పొద్దు ఇట్టా ఈడ ముగిసిపోతా ఉండాదే..( అని మనసులో అనుకుంటుంది.)
ధాత్రి: ఇవాళ ఎందుకులే లేచి నిల్చోరో నేను చూస్తాను అత్తయ్య గారు
అని ధాత్రి మనసులో అనుకుంటుంది. వైజయంతి కూడా ఏడ్వడం మొదలుపెడుతుంది. దీంతో ఇవాల్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!





















