Jagadhatri Serial Today February 28th: ‘జగధాత్రి’ సీరియల్: నిషికను అవమానించిన దివ్యాంక – దివ్యాంకకు బుద్ది చెప్పిన ధాత్రి
Jagadhatri Today Episode: ఎంగేజ్ మెంట్ కు వచ్చిన నిషికను దివ్యాంక అవమానించడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: కేసు విషయంలో బయటకు వెళ్తున్న ధాత్రి, కేదార్‌లకు కౌషికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్తుంది. ఎందుకని ధాత్రి అడగ్గానే చెప్తాను మీరైతే ఇంటికి రండి అని చెప్పగానే సరే వస్తున్నాం అని కేదార్, ధాత్రి చెప్తారు. వారి కోసం ఎదురచూస్తూ దివ్యాంక మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ కౌషికి బయటే నిలబడుతుంది. ఇంతలో వైజయంతి, యువరాజ్, నిషిక లోపలి నుంచి రెడీ అయ్యి వస్తారు. కౌషికిని వెళ్దాం పద అని అడగ్గానే ధాత్రి, కేదార్ వస్తున్నారు వాళ్లు వచ్చాక వెళ్దాం అని కౌషికి చెప్తుంది. దీంతో యువరాజ్, వైజయంతి సీరియస్ అవుతారు.
వైజయంతి: వాళ్లకోసం మనం వెయిట్ చేయడం ఏంటి అమ్మి. వాళ్లేమైనా మన కుటుంబమా?
కౌషికి: కుటుంబ కాకపోవచ్చు పిన్ని కానీ ఈ కుటుంబానికి కావాల్సిన వాళ్లు పిన్ని.
యువరాజ్: ఈ మధ్య వాళ్లు మా కన్నా నీకు ఎక్కువైపోయారక్క.
కౌషికి: విషయం ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ అని కాదు యువరాజ్. మన కష్టాల్లో మనకు ఎవరు అండగా ఉన్నారన్నదే ముఖ్యం.
ఇంతలో కేదార్, ధాత్రి వస్తారు.
కౌషికి: త్వరగా రెడీ అయ్యి రండి
ధాత్రి: సరే వదిన.. ఎక్కడికి వెళ్తున్నాం వదిన
యువరాజ్: ఏయ్ ఏంటి మీ ఎంక్వైరీలు. వచ్చిందే లేటు. వెళ్లి త్వరగా రెడీ అయ్యి రండి.
కౌషికి: దివ్యాంక ఇంట్లో జరుగుతున్న తన ఎంగేజ్‌మెంట్‌కు జగధాత్రి.
అని కౌషికి చెప్పగానే అసలు జరుగుతున్న తప్పును ఆపకపోవడమే తప్పు. మళ్లీ మనం వెళ్లడమా? అంటూ ధాత్రి ప్రశ్నిస్తుంది. దీంతో మీనన్ ఫోన్ చేసి పెన్‌డ్రైవ్ కోపం బయపెట్టిన విషయం గుర్తు చేసుకుంటుంది కౌషికి. ధాత్రి కౌషికిని గట్టిగా అడుగుతుంటే వైజయంతి మా కౌషికిని మేమే ప్రశ్నించము నువ్వేంటి ఇలా ప్రశ్నిస్తున్నావు అంటుంది. నేను చేసేది ప్రతిది ఆలోచించే చేస్తాను. అది నమ్ముతేనే నాతో రండి అంటూ కౌషికి చెప్పగానే నువ్వు చెబితే రాకుండా ఉంటామా అక్కా అంటూ ఇప్పుడే రెడీ అయి వస్తామని చెప్పి లోపలికి వెళ్లి రెడీ అయి వస్తారు. ఇంటికి వచ్చిన యువరాజ్, వైజయంతి, నిషికిలకు గ్రాండ్‌గా వెల్‌కం చెబుతూ ధాత్రి, కేదార్, కౌషికిని పట్టించుకోనట్లు వెళుతుంది దివ్యాంక. దీంతో ధాత్రి చిన్న నాటకం ఆడటంతో దివ్యాంక బతిమాలి అందరినీ లోపలికి ఇన్‌వైట్ చేస్తుంది. లోపలికి వచ్చిన వారిని అందరికీ గొప్పగా పరిచయం చేస్తుంది. అలాగే కేదార్‌ను తన ఇంటిపేరు చెప్పమని దివ్యాంక అడుగుతుంది. దీంతో ధాత్రి కలగజేసుకుని మా ఆయన పేరు వజ్రపాటి కేదార్ అని చెప్తుంది. దీంతో అందరూ షాక్ అవుతారు.
నిషిక: ఏంటి వజ్రపాటినా? అయితే తండ్రి పేరేంటి? తండ్రి అనగానే నోట్లో నుంచి మాట రావడం లేదు. ఇంటి పేరంటే ఎవరింట్లో ఉంటే వాళ్లింటి పేరును తగిలించుకోవడం కాదు.
కేదార్: నా గుర్తింపుని నలుగురిలో నిరూపించుకోవాల్సిన అవసరం నాకు లేదు నిషి. చెప్పాల్సిన రోజు సందర్భం వచ్చినప్పుడు ప్రపంచం అంతా వినేలా అరచి చెప్తాను.
దివ్యాంక: అరే నా బెస్ట్ ఫ్రెండ్‌ను పరిచయం చెయ్యడమే మరచిపోయా? అయినా ఇంట్రడక్షనే అవసరం లేని కటౌట్ నీది. లగడపాటి కౌషికి వైఫాప్ సురేష్ లగడపాటి.
కౌషికి: నా పేరు వజ్రపాటి కౌషికి దివ్యాంక.
దివ్యాంక: ఓ మర్చిపోయా కౌషికి. సురేష్ నిన్ను వదిలేశాడు కదా? అందుకే పాపం వేరే దిక్కు లేక నీ పుట్టింటి పేరు పెట్టుకున్నావు.
అని దివ్యాంక వెటకారంగా మాట్లాడుతుంటే మా బాబాయి కోసం నిన్ను ఏమీ అనలేకపోతున్నాను అని మనసులో అనుకుని కౌషికి కామ్‌గా ఉండిపోతుంది. ఇంతలో ధాత్రి కోపంగా దివ్యాంక అదిరిపోయే కౌంటర్ ఇస్తుంది. ఇంతలో దివ్యాంక, నిషికి పక్కకుపోయి ధాత్రిని సైడ్ చేయాలని ప్లాన్ చేస్తారు. మరోవైపు ధాత్రి ఇక్కడి నుంచి వెళ్లిపోదామని కౌషికిని అడుగుతుంది. పార్టీ అయిపోయేవరకు ఉందామని కౌషికి చెప్తుంది. మరోవైపు యువరాజ్, వైజయంతి పక్కకు వెళ్లి కేదార్ ఇంటిపేరు చెప్పుకోవడం ఏంటి అని మాట్లాడుకుంటారు. నిషిక వచ్చి వైజయంతిని దివ్యాంక వద్దకు తీసుకువెళ్లి జగధాత్రిని వంట చేయడానికి ఒప్పించమని చెప్తారు. సరేనని దివ్యాంక, నిషిక, వైజయంతి కలిసి ధాత్రి దగ్గరకు వెళ్లి వంట వాళ్లు రాలేదని నువ్వు వంట చేయాలని అడుగుతారు. ధాత్రి చేయనని చెప్పడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: మహేష్ బాబు కోసం ఆ హాలీవుడ్ దర్శకుడిని రంగంలోకి దింపుతున్న జక్కన్న