Jagadhatri Serial Today February 24th: ‘జగధాత్రి’ సీరియల్: యువరాజ్ ను అరెస్ట్ చేసిన ధాత్రి – కేదార్ ఇంటి వారసుడని తెలుసుకున్న వైజయంతి
Jagadhatri Today Episode: కేదరా్ ను మీద హత్యాయత్నం చేసినందుకు యువరాజ్ ను ధాత్రి అరెస్ట్ చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా జరిగింది.
Jagadhatri Serial Today Episode: ధాత్రి యువరాజ్ దగ్గరకు వచ్చి బాంబు ఉన్న గిఫ్ట్ కేదార్‌కు పంపించింది నువ్వేనా అని అడుగుతుంది. లేదని యువరాజ్ చెప్పగానే ధాత్రి కోపంగా యువరాజ్‌ను కొడుతుంది. దీంతో నేనే బాంబు పెట్టించానని నీతో సాక్ష్యం ఉందా అని యువరాజ్ అడుగుతాడు. నిన్ను అందరి ముందు దోషి గా నిలబెట్టే సాక్ష్యం నాతో ఉంది. అబ్దుల్‌ను నేను కలిశాను అని ధాత్రి చెప్పడంతో యువరాజ్ షాక్ అవుతాడు. దూరం నుంచి గమనిస్తున్న వైజయంతి కోపంగా చూస్తుంటుంది. నాలుగు పీకితే నిజాన్ని నీ బతుకుని మాకు చెప్పాడు. అదే నిజాన్ని పోలీసులకు చెప్పడానికి ఒప్పుకున్నాడు. అంటూ ధాత్రి చెప్పగానే యువరాజ్ షాక్ అవుతాడు.
యువరాజ్: మీరు ఈ ఇంటికి మా కుటుంబాన్ని నాశనం చేయడానికి వచ్చారు. అది నేను చూస్తుండగా జరగదు. జరగనివ్వను.
కేదార్: నేను ప్రేమను వెతుక్కుంటూ వచ్చానురా! నా వాళ్లను వెతుక్కుంటూ వచ్చాను. నా రక్తాన్ని వెతుక్కుంటూ వచ్చాను. నాన్నని వెతుక్కుంటూ వచ్చానురా. నేను నీ అన్ననిరా..
యువరాజ్: ఒరేయ్ ఇంకొక్కసారి మా నాన్నని నాన్న అంటే ఇక్కడే చంపి పారేస్తా. మా నాన్నకి ఒక్కణ్ణే కొడుకుని. ఈ ఇంటికి వజ్రపాటి వంశానికి నేనొక్కణ్ణే వారసుణ్ణి.
ధాత్రి: కొడుకు కాదు అనే హక్కు, అధికారం ఈ ఇంట్లో ఎవ్వరికీ లేదు. కేదార్ సుధాకర్ మామయ్య కొడుకు. ఈ నిజాన్ని ఎవ్వరూ మార్చలేరు.
యువరాజ్: వీడు మా నాన్న కొడుకు కాదు.
ధాత్రి: అయితే నువ్వు సూరి మామ ఇంటికి ఎందుకు వెళ్లినట్లు..
యువరాజ్: వీడు కొడుకు అనే సాక్ష్యాలు తెస్తేనే ఎవరైనా నమ్ముతారు. కానీ సాక్ష్యాలకు ఇంట్లో వాళ్లకు మధ్య నేనుంటాను.
ధాత్రి: కేదార్‌ను చంపాలని చూసినందుకు నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. పద స్టేషన్‌కు
కేదార్: వద్దు ధాత్రి
ధాత్రి: తప్పు చేసిన వాడికి శిక్ష పడకపోతే నేను చదివిన ఐపీఎస్ కు కానీ చేస్తున్న డ్యూటీకి కానీ ఏంటి ఉపయోగం కేదార్.
యువరాజ్: అంటే నువ్వు?
ధాత్రి: జగధాత్రి ఐపీఎస్. అలియాస్ జేడీ. ఈ ఇంట్లో జగధాత్రిగా డ్యూటీ చేస్తుంది నేనే.. బయట జేడీగా అందరి భరతం పడుతుంది నేనే
కేదార్: వద్దు ధాత్రి నా కోసం నువ్వెవరో చెప్పొద్దు.
యువరాజ్: అంటే మా ఇంట్లో ఉన్న పోలీసులు నువ్వేనా?
ధాత్రి: ఎస్ నేనే ఇంటి బయట నీ ఆటలు, ఆ మీనన్ ఆటలు సాగనివ్వకుండా అడ్డుపడుతుంది నేనే మీ ప్లాన్స్ అన్నీ తిప్పికొట్టేలా చేస్తుంది నేనే. మీ చీకటి సామ్రాజ్యాన్ని నాశనం చేయబోయేది కూడా నేనే.
అని ధాత్రి యువరాజ్‌ను అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నట్లు కేదార్ కలగంటాడు. తీరా చూసేసరికి ధాత్రి కోపంగా యువరాజ్‌ను చూస్తూ ఉంటుంది.
యువరాజ్: మీరెలా చూసినా వీడు పుట్టుకతోనే అనాథ.. ఎప్పటికీ అనాథలాగే ఉంటాడు. ఈ నిజాన్ని ఎవ్వరూ మార్చలేరు.
అనగానే వైజయంతి వచ్చి యువరాజ్‌ను కొడుతుంది. నీకు మేము నేర్పింది ఇదేనా అంటుంది. యువరాజ్‌ను లోపలికి పంపించి వైజయంతి ధాత్రికి సారీ చెప్పి ఇక్కడ జరిగిందంతా కౌషికి చెప్పొద్దని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్తుంది. కేదార్‌ను ఎందకు ఇంత దిగజారావు అంటూ నిలదీస్తుంది. ఆ కేదార్ మీ నాన్నకు మొదటి కొడుకా? ఆయనకు ఇంకో భార్య ఉందా? అని వైజయంతి అడగ్గానే యువరాజ్ అవును అంటాడు. దీంతో వైజయంతి ఏడుస్తుంది. ఆ కేదార్ ఈ ఇంటికి ఎప్పటికీ వారసుడు కాకూడదు. వాడు అనాథగానే మిగిలిపోవాలి. అనగానే యువరాజ్ సరే అంటాడు. అది జరగకూడదంటే వాళ్లకు సాక్ష్యాలు దొరక్కూడదు. అలాగే ఈ విషయం ఎట్టిపరిస్థితుల్లో నిషికకు కానీ కౌషికి కానీ తెలియకూదడు అని మాట్లాడుకుంటుండగానే నిషిక అత్తయ్యా అంటూ లోపలికి వస్తుంది. దీంతో యువరాజ్, వైజయంతి షాక్ అవుతారు. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: కల్కీ మూవీ మళ్లీ వాయిదా? - ఒక్క పోస్ట్‌తో క్లారిటీ ఇచ్చిన టీం