Jagadhatri Serial Today February 19th: ‘జగధాత్రి’ సీరియల్ : చీరను తగులబెట్టిన నిషిక - వైజయంతి, నిషికలకు షాక్ ఇచ్చిన కౌషికి
Jagadhatri Today Episode: ధాత్రిని హోమంలో కూర్చోకుండా చేయడానికి ఆమె చీరను నిషిక, వైజయంతి తగులబెట్టడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తికరంగా జరిగింది.
Jagadhatri Serial Today Episode: జగధాత్రిని పూజలో కూర్చోనివ్వకుండా చేయాలని నిషిక, వైజయంతి కలసి కుట్ర చేస్తారు. అందులో భాగంగా ధాత్రి కట్టుకునే ఎర్ర చీరను కొట్టేయాలని ప్లాన్ చేస్తారు. ధాత్రి చీరను తాము కొట్టేస్తామని కాచి, బూచి చెప్పి ధాత్రి రూంలోకి వెళ్లి చీరను దొంగచాటుగా తీసుకుని వస్తారు. ఆ చీరను పెట్రోల్ పోసి తగులబెడుతుంది నిషిక. దీంతో తమ ప్లాన్ వర్కవుట్ అయిందని వైజయంతి, నిషిక హ్యాపీగా ఫీలవుతారు. కష్టపడి చీరను కొట్టేసింది మనం వాల్లేమో క్రెడిట్ నాది నీది అనుకుంటున్నారు అని బాధపడతారు కాచి, బూచి. రూంలో చీర కనిపంచడం లేదని ధాత్రి ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కేదార్ వస్తాడు.
కేదార్: ఇంకా ఇలాగే ఉన్నావేంటి రెడీ అవ్వలేదా?
ధాత్రి: నా రెడ్ శారీ కనిపించడం లేదు కేదార్. ఫోన్ వస్తే అక్కడికే వెళ్లి మాట్లాడాను. ఫోన్ కట్ చేశాక వెనక్కి తిరిగి చూస్తే శారీ కనిపించడం లేదు.
అంటూ ఇద్దరూ మాట్లడుకుంటుండగానే కౌశికి... ధాత్రి ఇంకా రెడీ కాలేదేంటి? అనుకుంటూ వస్తుంది. దీంతో తన రెడ్ శారీ కనిపించడం లేదని ధాత్రి చెప్పగానే ఇక్కడే ఎక్కడో ఉంటుంది. చూడు అంటుంది కౌషికి దీంతో అందరూ కలిసి శారీ వెతుకుతారు. మరోవైపు పూజకు అంతా రెడీ చేసిన పంతులు వైజయంతికి పూజలో కూర్చునే వారిని త్వరగా రమ్మనమని చెప్తాడు. వైజయంతి ధాత్రి రూంలోకి వస్తుంది.
వైజయంతి: ఏందమ్మీ నీ చీర కనిపించడం లేదా? అయ్యోరు త్వరగా రమ్మన్నారు. నీ చీర కనిపించడం లేదంటే ఇప్పుడేం చేసేది.
నిషిక: మీరేం కంగారుపడకండి అత్తయ్యా దీని జాతకమే అంత చిన్నప్పటి నుంచి ఒక్క పూజకు కూడా సరిగ్గా కూర్చోలేదు. ఎప్పుడూ దరిద్రాన్ని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నట్లు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది.
వైజయంతి: ఎర్రచీర లేకుంటే పూజలో కూర్చోకూడదు కదా పోనీలే ఈసారికి నిషిక వాల్లు కూర్చుంటారు.
అంటూ చెప్పగానే.. ఇక్కడ ఉన్న చీర ఎవరో తీశారు అని ఇళ్లంతా వెతికితే ఎక్కడో ఒకచోట దొరుకుంతుందని కౌశికి బయటకు వెళ్లి చీర తగులబడటం చూసి ధాత్రిని పిలుస్తుంది. ధాత్రి, కేదార్ బయటకు వెళ్లి మంటను చూసి చీర తగులబెట్టారని అర్థం చేసుకుని అందరూ కలిసి లోపలకి వస్తారు. నిషిక చేయి వాసన చూస్తుంది. నిషిక చేయి కిరోసిన్ వాసన రావడంతో ధాత్రి, కౌషికి నిషికనే చీర తగులబెట్టిందని అర్థం చేసుకుని గట్టిగా అడుగుతారు. దీంతో నిషిని వైజయంతి వెనకేసుకొస్తుంది. ఇంతలో కౌషికి తను కొన్న కొత్త ఎర్ర చీరను తీసుకొచ్చి ధాత్రికి ఇస్తుంది. త్వరగా రెడీ అయి రండి అని కౌషికి చెప్పగానే..
నిషి: కుదరదు నేను ఒప్పుకోను వీళ్లిద్దరూ హోమంలో కూర్చోవడానికి నేను ఒప్పుకోను.
వైజయంతి: అమ్మీ ఈ పూజ చేయడమే ఇంట్లో ఉన్న చెడు పోవడానికి కదా? ఈ పూజ చేయడానికి కూడా గొడవెందుకు చెప్పు.
ధాత్రి: పరువాలేదులే వదిన నిషి వాళ్లనే పూజ చేయనివండి. మేము అక్కడ పక్కనే ఉంటాము.
కౌషికి: సరే మీ ఇష్టం వచ్చినట్లు కానివ్వండి.
వైజయంతి: వెళ్లు అమ్మీ వెళ్లి రెడీ అయ్యిరాపో..
హోమం దగ్గర నుంచి కౌషికి బాధతో లోపలికి వెళ్ళిపోతుంది. దీంతో ధాత్రి, కేదార్ లోపలికి వెళ్లిపోతారు.
కౌషికి: ఇంతకు ముందు ఇలా లేదు. నిషి వచ్చిన్నప్పటి నుంచే ఎప్పుడు ఇలా మారిపోయిందో తెలియదు. కానీ ఏదీ ముందులా లేదు.
ధాత్రి: నా చెల్లి తరుపున నేను క్షమాపణ చెప్తున్నాను వదిన. నిషికది చిన్నపిల్లల మనస్తత్వం.
కేదార్: పరాయివాళ్లు అయితే చేసిన తప్పుకు క్షమించొచ్చు అక్క. కానీ మనవాళ్లే తప్పులు చేస్తుంటే దాన్ని దగ్గరుండి సరిచేయాలి. అది మన బాధ్యత.
ధాత్రి: నిషికి నేను అర్థం అయ్యేలా చెప్తాను. ప్లీజ్ మీరు బాధపడకండి.
మరోవైపు హోమం వెలిగించడానికి నిషిక, యువరాజ్ కలిసి ప్రయత్నిస్తే హోమం వెలుగదు అగ్గిపుల్ల చల్లారిపోతుంది. దీంతో పంతులు షాక్ అవుతారు. ఇంకో రెండుసార్లు ప్రయత్నించినా వెలుగదు. దీంతో పంతులు ఇక వద్దని మళ్లీ మంచి రోజు చూసుకుని చేద్దామని వెళ్లిపోతుంటే లోపలి నుంచి కౌషికి, ధాత్రి, కేదార్ వస్తారు. ఒక్కసారి ధాత్రి, కేదార్‌లను కూర్చోబెట్టి ప్రయత్నిద్దామని చెప్తుంది కౌషికి. దీంతో వైజయంతి, నిషిక వద్దని వాళ్లతో చేయించడం ఏంటని నిలదీస్తారు. కోపంగా కౌషికి అందరినీ తిడుతుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
Also Read: వాలెంటైన్స్ డేకు లావణ్య ఎం గిఫ్ట్ ఇచ్చారు - వరుణ్ తేజ్ ఏం చెప్పాడంటే!