అన్వేషించండి

Jagadhatri Serial Today April 2nd: ‘జగధాత్రి’ సీరియల్‌: ధాత్రి, కేదార్‌‌‌లను తన ఫ్రెండ్స్‌‌గా పరిచయం చేసిన పార్వతి - హేమ గదిలోకి వెళ్లిన యువరాజ్‌

Jagadhatri Today Episode: మాస్కులో ఉన్న ధాత్రిని పార్వతి గుర్తుపడుతుంది. కేదార్, ధాత్రి తన ఫ్రెండ్స్ అని పార్వతి పరిచయం చేయడంతో ఇవాళ్టీ ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా జరిగింది.

Jagadhatri Serial Today Episode: హేమను పార్వతి, నిషిక కలిసి రెడీ చేస్తుంటారు. నిషిక, హేమ ఇద్దరూ ఎలా తప్పించుకోవాలా? అని చిన్నగా మాట్లాడుకుంటుంటారు. ఇంతలో హేమను ఏం కావాలని పార్వతి అడగ్గానే జ్యూస్‌ అని చెప్తుంది. దీంతో జ్యూస్‌ తీసుకెళ్తున్న ధాత్రిని పార్వతి ఆపి జ్యూస్‌ తీసుకెళ్లి హేమకు ఇస్తుంది. మరోవైపు రౌడీలు ఎక్కడకు పోయారని యువరాజ్‌ వెతుకుతూ బయటకు వస్తాడు. బయట చెట్టుచాటున ఉన్న రౌడీలు యువరాజ్‌ ను పిలిచి జేడీ టీం వచ్చిందని ఇక మనం చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తారు. దీంతో యువరాజ్‌ ఎవరొచ్చినా అమ్మాయిని కిడ్నాప్‌ చేయాల్సిందేనని చెప్తాడు. మరోవైపు రౌడీలకు ఎదురుగా వెళ్తుంది ధాత్రి.

ధాత్రి: ఫంక్షన్‌ ఇక్కడే జరుగుతుంది. మీక కావాల్సిన వాళ్లు లోపలే ఉంటే మీరు బయటకు ఎందుకు వెళ్తున్నారు నాన్నా..పారిపోతున్నారా?

కేదార్‌: రేయ్‌ కాసేపు దొంగా పోలీసు ఆట ఆడుకుందామనుకుంటే ఇంత ఈజీగా దొరికేశారేంట్రా? ఇన్ని సార్లు మా దగ్గర దెబ్బలు తిన్నారు బుద్ది రాలేదేంట్రా?

ధాత్రి: ఫంక్షన్‌ జరుగుతుంది. డిస్టర్బ్‌ చేయడం మాకు అస్సలు ఇష్టం లేదు. గొడవ చేయకుండా మాతో బయటకు రండి

అనగానే రౌడీలు తప్పించుకుని హేమ రూంలోకి వెళ్తారు. కత్తులు చూపించి నిషికను బెదిరించి హేమను ఎత్తుకెళ్లిపోతుంటారు. ఇంతలో ధాత్రి వస్తుంది. హేమను తప్పించి రౌడీలను కొడుతుంది. ఇంతలో పార్వతి అక్కడికి రాగానే రౌడీ పార్వతిని అడ్డుపెట్టుకుని మా వాళ్లను వదిలేయ్‌ అంటాడు. ధాత్రి రౌడీలను వదిలేస్తుంది. పార్వతి కూడా రౌడీని చితకొడుతుంది.

పార్వతి: పోలీస్‌ అయ్యావని తెలుసు కానీ ఇట్టా పగటి వేషాలు వేస్తున్నావని నాకెప్పుడు చెప్పలేదు. జగధాత్రి ఐపీఎస్‌. (అంటూ పార్వతి ధాత్రికి ఉన్న మాస్క్‌ తీస్తుంది.) వేషం మారిస్తే గుర్తు పట్టలేను అనుకున్నావా?

ధాత్రి: ఎన్ని రోజులైంది పార్వతి నిన్ను చూసి .

పార్వతి: రోజులు కాదు సంవత్సరాలు. ఎలా ఉన్నావు. నీ జాబ్‌ ఎలా ఉంది.

ధాత్రి: బాగానే ఉంది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నానులే..

అంటూ ముగ్గురు మాట్లాడుకుంటారు. ఇంకెన్నాళ్లు ఈ అజ్ఞాతవాసం అని పార్వతి అడుగుతుంది. దీంతో మా అమ్మను నిజాయితీ గల పోలీసాఫీసరుగా నిరూపించే వరకు అని ధాత్రి చెప్తుంది. నువ్వు ఎలాగైనా సాధిస్తావని పార్వతి అంటుంది అయినా మీరు ఇలా వచ్చారేంటి? ఫంక్షన్‌కు అని అడుగుతుంది. మీనన్‌ను పట్టుకోవడానికి ఇలా వచ్చామని చెప్తారు. దీంతో పార్వతి చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మరోవైపు యువరాజ్‌ ఎలాగైనా పెళ్లికూతురుని కిడ్నాప్‌ చేసి భాయ్‌కి అప్పగించి ఆ జేడీ టీంను కనిపెట్టాలి అని హేమ రూం దగ్గరకు వెళ్తాడు. మరోవైపు దివ్యాంక అఖిలాండేశ్వరి ఫంక్షన్‌ కు వస్తుంది. తన స్టాఫ్‌ను పిలిచి స్పై కెమెరాలు రెడీగా పెట్టుకోమని చెప్తుంది. మరోవైపు పార్వతి, కేదార్‌, ధాత్రిని తీసుకొచ్చి  తన ఫ్రెండ్‌ ధాత్రి అంటూ పరిచయం చేస్తుంది. దీంతో నిషిక, కౌషికి, వైజయంతి షాక్‌ అవుతారు.

నిషిక: సారీ ఆంటీ ఇలా అంటున్నాను అని ఏమీ అనుకోకండి. మీ ఫంక్షన్‌ అనగానే మీ రేంజ్ లో ఉంటుంది. చాలా కాస్ట్‌ లీ గా ఉంటుంది అనుకున్నాను.

అఖిల: ఇప్పుడు పార్టీలో ఏం లోటు జరిగింది నిషిక. ఎక్కడ పొరపాటు జరిగింది.

నిషిక: ఇక్కడే మీ కళ్లముందే జరుగుతుంది కదా అంటీ..  అనాథల్ని, అనామకుల్ని మాతో పాటు సమానంగా కూర్చోమనటం మాకేమాత్రం నచ్చటం లేదు.

దేవ: అదేంటి నిషిక అలా అంటావ్‌ వాళ్లు పార్వతి ఫ్రెండ్స్‌ అంటే ఈ ఇంటికి మాకు కావాల్సిన వాళ్లేనని అర్థం.

నిషిక: అదే నా ప్రాబ్లమ్‌ కూడా కావాల్సిన వాళ్లు ఇంత చీప్‌ వాళ్లు ఎలా అయ్యారు. ముందు వాళ్లను మనతో పాటు కాకుండా ఒక మూలన కూర్చోమనండి.

పార్వతి: అదేటండి అలా అంటారు జగధాత్రి మీ అక్కే కదా?

అనగాగే నిషిక కోపంగా దాన్ని నన్ను కలిపి మాట్లాడితే బాగుండదని చెప్తుంది. దానికి నాకు ఏ సంబంధం లేదు. ఉండదు కూడా అంటుంది. దీంతో కౌషికి నిషికను తిడుతుంది. వాళ్లు ఇక్కడ కూర్చుంటే నేను ఇక్కడ కూర్చోను. అనగానే ధాత్రి, కేదార్‌ పక్కకు వెళ్లబోతుంటే అఖిలాండేశ్వరి ఆగండి అంటుంది. దీంతో ఇవాళ్టీ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ - పుష్ప మాస్ జాతర అప్డేట్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కరెంట్ పోల్ ఎక్కిన యువకుడు, సీరియస్ క్లాస్ పీకిన జగ్గారెడ్డిసినిమా వాళ్లకి మానవత్వం లేదా, సీఎం రేవంత్ ఆగ్రహంనేను సీఎంగా ఉండగా సినిమా టికెట్‌ రేట్లు పెంచను, సీఎం రేవంత్ షాకింగ్ కామెంట్స్చనిపోయారని తెలిసినా చేతులూపుకుంటూ వెళ్లాడు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Look Back 2024 - Sequels: ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
ఇండియన్ ఫిల్మ్స్‌లో 2024లో సీక్వెల్స్ హవా... బాక్స్ ఆఫీసును రూల్ చేసిన సినిమాలు ఇవే
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
AP Gun Fire: అన్నమయ్య జిల్లాలో వ్యాపారులపై కాల్పులు, ఇద్దరికి తీవ్రగాయాలు - హాస్పిటల్‌కు తరలించిన పోలీసులు
Telangana News: భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
భాషా ప్రాతిపదికన షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఉద్యోగ నియామకాలు- సీఎంను కోరిన ఆదివాసీ ఎమ్మెల్యేల
Nara Lokesh: కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
కడప స్కూల్ విద్యార్థుల సమస్యపై స్పందించిన మంత్రి నారా లోకేష్, అధికారులకు ఆదేశాలు
Telugu TV Movies Today: ‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
‘జనక అయితే గనక’, ‘35 - చిన్న కథకాదు’ to చిరు ‘ఠాగూర్’, ధనుష్ ‘రాయన్’ - ఈ ఆదివారం (Dec 22) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Telangana Assembly Sessions: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా, 8 కీలక బిల్లుల ఆమోదం
Kidney Health : కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
కిడ్నీ సమస్యలున్నా, కిడ్నీలో రాళ్లు రాకూడదన్నా.. ఈ ఫుడ్స్​ని డైట్​లో చేర్చుకోవాలట
Year Ender 2024: టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
టీమిండియాలో కొత్త ముఖాలు- సత్తా చాటితే పాతుకుపోవడం ఖాయం, టీ20లో అద్భుత అవకాశాలు
Embed widget