అన్వేషించండి

Pushpa 2 The Rule: బన్నీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ - పుష్ప మాస్ జాతర అప్డేట్!

Pushpa 2 The Rule Update: 'పుష్ప 2' చిత్రం నుంచి ఓ క్రేజీ అప్డేట్ ఇవ్వడానికి మేకర్స్ రెడీ అయ్యారు. పుష్ప మాస్ జాతర ప్రారంభం కానుందని సోషల్ మీడియాలో ప్రకటించారు.

Pushpa 2 The Rule Update: ఐకాన్ స్టార్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్న సినిమా ‘పుష్ప 2: ది రూల్’. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా యాక్షన్ మూవీపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 'పుష్ప 1' చిత్రం ఎవరూ ఊహించని విజయం సాధించడంతో.. ఇప్పుడు రెండో భాగం చుట్టూ భారీ హైప్ క్రియేట్ అయ్యింది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఓ క్రేజీ అప్డేట్ తో వస్తున్నారు. 

పుష్ప మాస్ జాతర...‘పుష్ప 2’ అప్డేట్ కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏప్రిల్ 8వ తేదీ అల్లు అర్జున్ పుట్టిన రోజు కావటంతో.. తప్పకుండా అప్డేట్ వస్తుందని అందరూ ఫిక్స్ అయిపోయారు. అయితే ఎలాంటి కంటెంట్ బయటకు వస్తుందని అంతా చర్చించుకుంటున్న సమయంలో.. "రేపు పుష్ప మాస్ జాతర ప్రారంభం కానుంది" అంటూ మేకర్స్ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఏప్రిల్ 2న ఎగ్జైటింగ్ అనౌన్స్‌మెంట్ లోడింగ్ అవుతోంది.. వేచి ఉండండి అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మరోసారి రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చారు.

'పుష్ప: ది రూల్' నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులని విశేషంగా ఆకట్టుకుంది. ఫస్ట్ గ్లింప్స్ అంచనాలను రెట్టింపు చేసింది. వచ్చే వారం బన్నీ బర్త్ డే స్పెషల్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అవుతుందని భావిస్తున్నారు. అదే సమయంలో ఫస్ట్ సింగిల్ విడుదల చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అంటున్నారు. వీటిల్లో ఏ కంటెంట్ బయటకు వస్తుందో తెలియదు కానీ, దీంతో పుష్ప మాస్ జాతర మొదలవుతుందని మేకర్స్ స్పష్టం చేశారు. ఏదేమైనా ఈసారి బన్నీ పుట్టినరోజు మరింత ప్రత్యేకంగా మారబోతోందని అర్థమవుతోంది.

'పుష్ప 2' చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తోంది. ఫహాద్ ఫాజిల్ విలన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేనీ, యలమంచిలి రవిశంకర్ భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తున్నారు. 

'పుష్ప: ది రూల్' చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్ గా 2024 ఆగష్టు 15న తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 'పుష్ప: ది రైజ్' మూవీ అల్లు అర్జున్ కు నేషనల్ ఫిలిం అవార్డ్ తెచ్చిపెట్టడమే కాదు, ఆయన్ను పాన్ ఇండియా స్టార్ గా మార్చేసింది. మేడమ్ టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం పెట్టేంత గుర్తింపు వచ్చేలా చేసింది. ఇప్పుడు 'పుష్ప 2' సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చెయ్యాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 

Also Read: ఎన్టీఆర్ నుంచి నిఖిల్ సిద్దార్థ వరకు - పాలిటిక్స్‌లో మన టాలీవుడ్ స్టార్స్, హిట్ కొట్టింది కొందరే!

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Sandeep Reddy Vanga : సుమంత్ ప్రభాస్, అనంతిక మూవీ టైటిల్ ఫిక్స్ - సందీప్ వంగా సమర్పణలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్
సుమంత్ ప్రభాస్, అనంతిక మూవీ టైటిల్ ఫిక్స్ - సందీప్ వంగా సమర్పణలో యూత్ ఫుల్ ఎంటర్టైనర్
Raakh Series OTT : ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి మీర్జాపూర్ ఫేం క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ రాఖ్ - ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
The Mummy OTT : ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ది మమ్మీ - తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్ ది మమ్మీ - తెలుగులోనూ స్ట్రీమింగ్

వీడియోలు

RR vs GT IPL 2026 Preview | RR vs GT ఐపీఎల్ మ్యాచ్ ప్రివ్యూ
Archer Comments on Vaibhav Suryavanshi | వైభవ్ సూర్యవంశీ పై జోఫ్రా ఆర్చర్ కామెంట్స్
Bhuvneshwar Kumar Comments on Virat Kohli | విరాట్ పై భువి ఫన్నీ కామెంట్స్
Ashwin Angry Comments on SRH Defeat | SRH ప్లేయర్స్‌ పై అశ్విన్ తీవ్ర ఆగ్రహం
Ambati Rayudu Comments on Yashasvi Jaiswal | యశస్వి జైస్వాల్‌ కు రాయుడు సలహా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IPL 2026 GT In Final: ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
ఆర్సీబీ వ‌ర్సెస్ గుజ‌రాత్, ఫైన‌ల్ కు పోరుకు సిద్ధం.. క్వాలిఫ‌య‌ర్ 2లో రాయ‌ల్స్ పై జీటీ గ్రాండ్ విక్ట‌రీ.. గిల్ సెంచ‌రీ, సుద‌ర్శ‌న్ ఫిఫ్టీ
Telangana Employee Dues: తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!
IMAX Hyderabad Return: 12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?
Supreme Court Guidelines: సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
సొంతంగా సెక్స్ వర్కర్లుగా మారడం నేరం కాదు, వారికి ఆధార్ కార్డులు జారీ చేయాలి: సుప్రీంకోర్టు
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
రైలు టాయిలెట్‌లో వంటపాత్రల క్లీనింగ్.. IRCTCకి నోటీసులు జారీ చేసిన FSSAI
Beer for Kidney Stones : బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
బీర్ తాగితే కిడ్నీలో స్టోన్స్ బయటకి వచ్చేస్తాయా? ఇది ఎంతవరకు నిజం?
Vaibhav Suryavanshi: చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
చిచ్చర పిడుగు సూర్యవంశీ రికార్డు.. 25 బంతుల్లోనే సెంచరీ!
Vaginal Health : యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
యోని ఆరోగ్యాన్ని కాపాడే డ్రింక్స్ ఇవే.. మహిళలు రెగ్యులర్‌గా తీసుకుంటే మంచిది
Embed widget