Jagadhatri Serial Today December31th: ఇన్‌స్పెక్టర్ అశ్వని దాచిన ఫైల్ జేడీ చేతికి దొరుకుందా లేదా..? శ్రీవల్లిని ఇంట్లో నుంచి పంపడానికి వైజయంతి వేసిన ప్లాన్ ఏంటి.?
Jagadhatri Serial Today Episode December 31th: తన తల్లి దాచిపెట్టిన ఫైల్ తీసుకుని వెళ్తున్న జేడీ,కేడీని తాయరు మనుషులు అడ్డగిస్తారు. వారిని కేడీ, జేడీ ఇరగ్గొడతాడు.

Jagadhatri Serial Today Episode: పాత కేసుల రికార్డుల గురించి జేడీ, కేడీ వచ్చి అడగ్గా....రాయదుర్గం ఎస్‌ఐ తొలుత కొంచెం బెట్టు చేసినా....వాళ్లు చేసిన హెల్ఫ్‌తో రికార్డుల రూమ్ చూపిస్తాడు. దీంతో జేడీ వాళ్ల అమ్మ దాచిపెట్టిన ఫైల్ కోసం ఇరువురు వెతుకుతారు. అయితే ఈ విషయాన్ని ఆ ఎస్‌ఐ హోంమినిష్టర్‌కు చేరవేస్తాడు. ఇన్‌స్పెక్టర్ కావ్య కేసు గురించి ఎవరో అధికారులు వచ్చి ఎంక్వయిరీ చేస్తున్నారని చెబుతాడు. జేడీ మేడం వచ్చారని చెబుతాడు. పాతికేళ్ల క్రితం ఓ కేసు విషయంలో కావ్య మేడం ఫైల్‌తో పనిపడిందని చెప్పి...రికార్డు రూం తనిఖీ చేస్తున్నారని చెబుతాడు. జేడీని రికార్డుల రూమ్‌లోకి వెళ్లనివ్వద్దని హోంమినిస్టర్ చెప్పగా...ఆల్రెడీ ఆమె వెళ్లి సోదాలు చేస్తోందని చెబుతాడు. వాళ్లకు ఫైల్ దొరికితే తీసుకుని వెళ్లనివ్వమని....వాళ్ల సంగతి మా వాళ్లు చూసుకుంటారని తాయరు చెబుతుంది.
ఇంతలో జేడీకి వాళ్ల అమ్మ దాచిపెట్టిన ఫైల్ దొరుకుతుంది.అందులో ముఖ్యమంత్రిపై జరిగిన దాడికి సంబంధించిన వివరాలు ఉంటాయి. అయితే అమ్మ ఈకేసు గురించి ఎంక్వయిరీ చేస్తోందని తెలిసే చంపి ఉంటారని జేడీ అనుమానిస్తుంది. అమ్మ చనిపోయినరోజే సీఎం ముంబయిలో చనిపోయాడని...ఏదో కుట్రప్రకారమే ఇదంతా జరిగినట్లు అనిపిస్తోందని కేదార్ అంటాడు. ముఖ్యమంత్రితో పాటు ముగ్గురు అధికారులను చంపారంటే....ఇది కేవలం నిధుల కోసం చేసిన హత్యలు కాదని ఇంకా ఏదో ఉందని ధాత్రి అంటుంది. ఈ ఫైల్ తీసుకెళ్లి పూర్తిగా ఎంక్వైయిరీ చేద్దామని చెప్పి కేడీ,జేడీ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అమ్మ చావును వెతుక్కుంటూ వెళ్లిన మనకు సీఎం చావు గురించి తెలిసిందని జేడీ అంటుంది.అంటే మనకు తెలిసిన కథ కన్నా తెలియని విషయాలు చాలా ఉన్నాయని అంటుంది. జేడీ,కేడీ వెళ్తున్న కారు వెంట హోంమినిష్టర్ తమ్ముడు అభి తన మనుషులతో ఫాలో అవుతుంటాడు. వీరిపై దాడికి ప్రయత్నిస్తుంటాడు. ఓవర్‌టేక్ చేసి జేడీ కారుకు తమ కారును అడ్డుపెట్టి ఆపుతారు. దీంతో రౌడీలతోపాటు అభిని జేడీ,కేడీ తుక్కుతుక్కుగా కొడతారు. దీంతో అభి తన మనుషులను తీసుకుని అక్కడి నుంచి పారిపోతాడు.
శ్రీవల్లికి లవ్‌లెటర ఇవ్వడానికి పెట్టిన మనిషిని పట్టుకుని వైజయంతి ఉతికేస్తుంది. ఒక అమ్మాయికి లెటర్ ఇవ్వడం చేతగానివాడిని నువ్వేమి మనిషివిరా అంటూ కొడుతుంది. ఆ అమ్మాయి అదే సమయానికి పక్కకు వెళ్లిపోతే నేనేం చేయాలని అంటాడు. ఈసారి చెప్పిన పని చెప్పినట్లు చేస్తానని అంటాడు. ఇంతలో అక్కడికి నిషి కూడా వస్తుంది. ఇంటి వెనక తలుపు తెరిచి ఉంచుతానని...అందరూ పడుకున్న తర్వాత వచ్చి శ్రీవల్లి ఉన్న గదిలోకి వెళ్లాలని చెబుతుంది. ఈసారి ప్లాన్ ఫెయిల్ అయితే నీను నిన్ను చంపేస్తానని నిషిక అంటుంది. అందరూ పడుకున్న తర్వాత శ్రీవల్లి గదిలో లైట్ వేసి ఆర్పేస్తానని అప్పుడు నువ్వు వచ్చి ఆ గదిలో దూరాలని చెబుతుంది. ఈసారి ఆ శ్రీవల్లి తప్పించుకోలేదని అత్తా కోడళ్లు అనుకుంటారు.
మనచేతికి ఫైల్ వచ్చిన 10నిమిషాల్లోనే మినిష్టర్ మనుషులు వచ్చారంటే...తాయరు మన కదలికలను చాల్ క్లోజ్‌గా అబ్జర్వ్ చేస్తోందని జగధాత్రి అంటుంది. మనం జాగ్రత్తగా లేకపోతే మనం ఎవరో కూడా మినిష్టర్‌కు తెలిసే ఛాన్స్ ఉందని కేదార్ అంటాడు. ఇకపై మనం ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత అందరూ ఎవరి గదుల్లోకి వారు వెళ్లి పడుకుంటారు. శ్రీవల్లి కూడా తన రూమ్‌లోకి వెళ్లిపోయి గడి పెట్టుకుంటుంది. దీంతో తమ ప్లాన్ వర్కవుట్ అవ్వదని అత్తా కోడళ్లు తెగ బాధపడిపోతుంటారు. వైజయంతి వెళ్లి డోర్‌కొట్టి ఆమెను నిద్రలేపుతుంది. గదికి లాక్ వేసుకోవద్దని చెబుతుంది. దీంతో శ్రీవల్లి సరేనని అంటుంది. అందరూ ఎవరి గదుల్లో వారు నిద్రపోతుంటారు. ఇంతలో శ్రీవల్లి కోసం వచ్చిన వ్యక్తి మెల్లగా గోడదూకి లోపలకి వస్తాడు.





















