Jagadhatri Serial Today August 4th: జగద్ధాత్రి సీరియల్: మీడియా ముందు కేథార్ ఏం చెప్పాడు? యువరాజ్ ప్లాన్ బెడిసికొట్టిందా?
Jagadhatri Serial Today Episode August 4th ఫ్లెక్సీ విషయంలో మేనేజర్ హస్తం ఉందని జగద్ధాత్రి నిరూపించడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode కేథార్ మీడియా ముందు తనకు వజ్రపాటి కుటుంబానికి ఏం సంబంధం లేదని, వజ్రపాటి సుధాకర్ గారికి తాను పెద్ద కొడుకు కాదని, ఆయనకు తనకు ఎలాంటి రక్త సంబంధం లేదని ఆ ఫ్లెక్సీ పెట్టి ఎవరో వాళ్లని టార్గెట్ చేశారని చెప్తాడు. యువరాజ్ చాలా సంతోషపడతాడు. తీరా చూస్తే ఇదంతా యువరాజ్ కల.
యువరాజ్ తేరుకొని ఓహో ఇదంతా కలా.. అయినా జరగబోయేది ఇదే కదా అని అనుకుంటాడు. ఇంతలో కేథార్ మీడియా ముందు కూర్చొని విషయం చెప్పే టైంకి జగద్ధాత్రి వచ్చి ఆపి కేథార్‌ని లోపలికి తీసుకెళ్తుంది. ఇప్పుడు ఎందుకు ఆపావ్ అని కుటుంబం మొత్తం జగద్ధాత్రిని అడిగితే నిజం చెప్పడానికి అని జగద్ధాత్రి అంటుంది. అందరూ షాక్ అయి చూస్తారు. ఫ్లెక్సీ వేసిన వాళ్ల కోసం చెప్తా.. దానికి మాకు ఏం సంబంధం లేదు.. దాన్ని దగ్గరుండి చేయించిన మనిషి ఇక్కడే ఉన్నారు అని జగద్ధాత్రి చెప్తుంది. ఎవరు ఆ పని చేయించిందని కేథార్ ఆవేశంగా అడుగుతాడు. యువరాజ్ కంగారు పడతాడు.
జగద్ధాత్రి మేనేజర్ దగ్గరకు వెళ్లి మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా అని అడుగుతుంది. కౌషికి కోపంగా అది నువ్వు పెట్టించావా అని అడుగుతుంది. జగద్ధాత్రి, కేథార్ నాటకాలు అడుతున్నారని కేథార్‌తో మీడియాకు నిజం చెప్పమని యువరాజ్ అంటే కౌషికి అరుస్తుంది. మేనేజర్‌ని కౌషికి నిలదీస్తుంది. దాంతో మేనేజర్ నాకేం సంబంధం లేదని తప్పించుకుంటాడు. దాంతో జగద్ధాత్రి పేపర్ మీద సంతకం చేసి ఆర్డర్ ఇవ్వడం గురించి పేపర్ చూపించి చెప్తుంది. పేపర్ చూపిస్తే నమ్మేస్తామా అని వైజయంతి అంటే మేనేజర్ షాప్‌కి వెళ్లిన ఫుటేజ్ జగద్ధాత్రి చూపిస్తుంది. కౌషికి మేనేజర్‌ని కోపంగా చూస్తుంది. నాకేం తెలీదు అని మేనేజర్ అంటే కౌషికి కొడుతుంది. మీడియాని పంపేయమని చెప్పి మేనేజర్‌ని క్యాబిన్‌కి పిలుస్తుంది.
సుధాకర్ కేథార్ దగ్గరకు వెళ్లి క్షమించమని అడగటానికి కూడా సిగ్గుగా ఉంది అని అంటాడు. మీరు మా పరిస్థితిలో ఉంటే మా కోసం ఆలోచించేవారు. మేం ఆలోచించలేకపోయాం అని సుధాకర్ అంటే మీరు మాకు ఆకాశం అంత ఎత్తులో ఉంటారు నాన్న అని కేథార్ అంటాడు. ఇక కౌషికి ఆ మేనేజర్‌ని ప్రశ్నిస్తుంది. ఆయన యువరాజ్ చేశాడని చెప్తాడు. కౌషికి మేనేజర్‌ని కొట్టి ఆ దివ్యాంక చేయమని చెప్పి యువరాజ్ పేరు చెప్పమని చెప్పిందా అని కొడుతుంది. మేనేజర్ కింద పడి గోడ తగిలి కింద పడిపోతాడు. ఉలుకు పలుకు లేకపోవడంతో కౌషికి కంగారు పడిపోతుంది.
కౌషికి జగద్ధాత్రికి కాల్ చేసి కేథార్‌ని తీసుకొని రమ్మని చెప్తుంది. నిజం అడిగి రెండు దెబ్బలు కొడితే ఉలుకు పలుకు లేదని చెప్తుంది. కేథార్ చూసి ప్రాణాలతోనే ఉన్నాడని అంటాడు. ఇక అతన్ని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తుంటే నిషిక వాళ్లు ప్రశ్నిస్తారు. విషయం చెప్పడంతో కౌషికి చంపేసిందా అని గోల గోల చేస్తారు. కేథార్, జగద్ధాత్రి, కౌషికిలు హాస్పిటల్‌కి తీసుకెళ్తుంటే మధ్యలో మేనేజర్‌కి మెలకువ వస్తుంది. తనని క్షమించమని మేనేజర్ వేడుకుంటాడు. కౌషికి అన్ని జాబ్ నుంచి తీసేస్తుంది.
యువరాజ్ రగిలిపోతాడు. కేథార్, జగద్ధాత్రి రోజు రోజుకి నాన్నకి అక్కకి దగ్గరైపోతున్నాడు ఈ సారి జాగ్రత్తగా ప్లాన్స్ చేసుకోవాలి అనుకుంటారు. ఇంతలో కాచి అక్కడికి వచ్చి ఎలా బతికారు కానీ ఇప్పుడు జగద్ధాత్రి వాళ్లకి భయపడటం చూసి జాలి పడుతున్నాను అంటుంది. అంత జాలి పడొద్దు జగద్ధాత్రిని గెంటేసిన తర్వాత జాలి పడుదువు అంటాడు. మీరేదో చేసి ఆస్తి మూడు వాటాలు కాకుండా చూస్తారంటే ఇలా చేస్తారేంటి అని అంటుంది. నువ్వేంటి ఇలా అంటే నేను ఎవరి వైపు లాభం ఉంటే వాళ్ల వైపు ఉంటాను అంటుంది. త్వరలోనే పాత యువరాజ్‌ని చూస్తావని యువరాజ్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















