karthika deepam serial parijatham: కార్తీక దీపం 2 పారిజాతం: సీరియల్ విలన్ రియల్ లైఫ్‌లో ఇలానా? డాన్స్ వీడియోలతో షాకిచ్చిన పారు!
parijatham mindblowing dance reels కార్తీక దీపం 2 సీరియల్ విలన్ పారిజాతంలో ఇంత అద్భుతమైనా టాలెంట్ ఉందా.. షూటింట్ టైంలో రీల్స్ చేస్తూ ఎలా సందడి చేస్తుందో చూశారా..

parijatham reel vs real life నటకుమారి.. అని చెప్పగానే ఎవరా అనుకునే వాళ్లంతా కార్తీక దీపం 2 సీరియల్‌లో పారు అన్నా పారిజాతం అన్నా ఇట్టే గుర్తు పట్టేస్తారు. సీరియల్ ప్రారంభ ఎపిసోడ్‌లోనే బిడ్డల్ని తారు మారు చేసేసి వామ్మో అనిపించి ఇంత దారుణంగా ఉందేట్రా బాబోయ్ అని ప్రేక్షకులు అనుకునేలా చేసిన పారిజాతం రియల్ లైఫ్‌లో ఎలా ఉంటుందో తెలుసా. ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఒక సీరియల్‌లో పద్ధతిగా ఉండే వాళ్లు బయట కూడా అలాగే ఉంటారని.. విలన్స్ బయట కూడా అవే కుట్రలు చేస్తారేమో తిట్టుకుంటుంటాం. ఇక చాలా మందికి అయితే వీళ్లు రియల్ లైఫ్‌లో ఎలా ఉంటారా అనే సందేహం ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఇక ఈ కార్తీకదీపం సీరియల్‌లో పారిజాతం తన సొంత మనవరాలు అయిన జ్యోత్స్నని మాత్రమే అమితంగా ఇష్టపడుతూ జోత్స్న మెదడులో విషం నింపి దీప జీవితాన్ని నాశనం చేసి.. ఆమెకి తల్లిదండ్రుల్ని లేకుండా చేసిన పారిజాతం.. నటనలో మేటి అయిన పారులో మస్త్ టాలెంట్ ఉంది. జ్యోత్స్నతో పాటు కుట్రలు చేస్తూ మిగతా అందర్ని తిట్టుకుంటూ ఉంటుంది. బయట కూడా వీళ్లు ఇద్దరే కలిసి ఉంటారా.. దీప, సుమిత్ర, కాంచన, కావేరి వీళ్లతో పారిజాతం దూరం దూరంగానే ఉంటుందా అని మీకు ఎప్పుడైనా అనిపించిందా.. అలా అనుకుంటే పొరపాటే సీరియల్‌లో ఎవరికీ గిట్టని పారిజాతం సెట్స్‌లో మాత్రం అందరితో కలిసి సరదాగా ఉంటూ రచ్చ రచ్చ చేస్తుంది. అంతే కాదండోయ్ ఓల్డ్ టూ లేటెస్టే పాటలకు అదిరిపోయే స్టెప్పులేస్తూ వీడియోస్ కూడా చేస్తుంటుంది. పారుకి ఇన్‌స్టాలోనూ అధిక సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఇక పారు నిత్యం ఇన్‌స్టాలో తన షూటింగ్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటుంది.
సీరియల్‌లో భర్తని పిసినారోడు అని తిట్టుకుంటూ దీప, కార్తీక్‌ల మీద రకరకాల కుట్రలు చేస్తూ అల్లుడు శ్రీధర్ రెండు పెళ్లిళ్లు చేసుకున్నాడని సెటైర్లు వేస్తూ కస్సుబుస్సులాడే పారు షూటింగ్‌లో అందరితో కలిసి వీడియోలు చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. ఆమె చేసే డ్యాన్స్ చూస్తే అబ్బబ్బా.. ఈ వయసులోనూ ఏం గ్రేసూ.. ఏం గ్రేసూ అనుకోవడం పక్కా. పారు అడుగు పెడితే స్టేజ్ షేక్ అయిపోవాల్సిందే. కార్తీకదీపం 2 సీరియల్‌లో విలనిజం పండిస్తున్న పారిజాతం స్పీడ్ డాన్సర్. కార్తీకదీపం కంటే ముందు చాలా సీరియల్స్‌లో నటిచింది. ఇక దేవత సీరియల్‌లో హీరోయిన్‌గా తల్లిగా నటించింది. సీరియల్‌లో బామ్మ క్యారెక్టర్ చేస్తున్న పారు రియల్ లైఫ్‌లో మాత్రం ఇంకా యంగే. కార్తీక్‌కి అమ్మమ్మలా నటిస్తోంది కానీ నిజానికి రియల్‌గా అయితే ఇద్దరిదీ దాదాపు ఒకే వయసు. ఇక పారు ఇన్ స్టాగ్రామ్ చూస్తే మాత్రం ఆమె డ్యాన్స్‌కి నోరెళ్లపెట్టాల్సిందే. ఆ వీడియోస్ చూసేయాలి అని ఉందా.. అయితే ఓ లుక్ ఇచ్చుకోండి మరి..
మోనికా మోనికా లవ్‌యూ మోనికా అనే పాటకు పారు, అనసూయ అదిరిపోయే సెప్పులు చూసేయండి..
https://www.instagram.com/reel/DM4YkAlvK9h/?igsh=MTZwM2Y1NXZxOGhzMQ%3D%3D
పారు తన ఇంట్లో నైట్ డ్రస్ వేసుకొని అలనాటి టింగు రంగ చక్కనమ్మ చెక్కిలింత అనే పాటకు అదిరిపోయే మూమెంట్స్ వేస్తూ హవ్వా అని పించింది.
https://www.instagram.com/reel/DMmjkUpRHdc/?igsh=MW1zdXl6NGltdzgxeA%3D%3D
కార్తీక దీపం షూటింగ్ టైంలో వర్షం పడుతుంటే పారు, జోత్స్న, సుమిత్రలు వీడియో తీసుకుంటూ సందడి చేశారు. అందరికీ విష్ చేస్తూ వీడియో తీసుకుంటారు. సుమిత్ర పారుని వర్షంలో తడవడానికి వెళ్దామా అక్కా అంటూ పిలవడం సరదాగా ఉంటుంది.
https://www.instagram.com/reel/DMO_DqEz8-u/?igsh=ZXh6Z25mbGFvMmoz
సీతయ్య సినిమాలో ఒక్క మగాడు సాంగ్‌కి చేతిలో ఫోన్ పట్టుకొని ప్యాంటూ షర్ట్‌లో మైమరిపించే స్టెప్పులేసిన పారు.
https://www.instagram.com/reel/DLzQX-gxXyp/?igsh=Z3dsNWNnemV3NTJk
పాలబుగ్గ మీగడ.. పంచదార జల్లెడ అంటూ కావేరి, స్వప్న, పారిజాతం డ్యాన్స్ చేస్తూ అదరగొట్టేశారు.
https://www.instagram.com/reel/DLPDc5rx_aZ/?igsh=MTV0YTQ4aXk3c2ZhZQ%3D%3D





















