Nuvvunte Naa Jathaga Serial Today August 4th: నువ్వుంటే నా జతగా సీరియల్: డీజే టిల్లు అవతారంలో దేవా.. మండిపోతున్న జడ్జి.. ఈ అల్లుడు ఘరానామొగుడేనా?
Nuvvunte Naa Jathaga Serial Today Episode August 4th దేవా శారదకు కాల్ చేసి మిథున పుట్టింట్లో ఉండటం హాస్టల్‌లా ఉందని కష్టంగా ఉందని చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Nuvvunte Naa Jathaga Serial Today Episode దేవా మందు తాగి ఇంట్లో తూగుతూ ఉంటే త్రిపుర ఇదే ఛాన్స్ అని దేవాని బ్యాడ్ చేస్తుంది. దేవాలయం లాంటి ఈ ఇంట్లో మందు తాగడం ఏంటి మామయ్య.. ఇలాంటి వాడిని ఇంట్లో ఉంచుతారా.. క్యారెక్టర్ లేని వాడిని ఇంటి అల్లుడిగా అంగీకరిస్తారా అని హరివర్దన్‌ని ప్రశ్నిస్తుంది.
లలిత నట్టింట్లో గొడవ వద్దని రేపు చూసుకుందామని చెప్పి త్రిపురని తిడితే హరివర్ధన్ లలితను సైలెంట్‌గా ఉండమని అంటాడు. మిథునతో వీడు నీకు కరెక్ట్ కాదు అని నీకు ఇప్పటికైనా అర్థమైందా అమ్మ అని అంటాడు. ఈ ప్రమాదం రాకుండా కాపాడుకుంటాడు అని అన్నావ్.. ఒక్క ప్రశ్న అడుగుతా చెప్పమ్మా.. వీడు ఇలాగే తాగేసుంటాడు.. నువ్వు రోడ్డు మీద వెళ్తుంటే నీకు ఏదైనా జరిగితే సరిగ్గా నిల్చోలేని వీడు నిన్ను ఎలా కాపాడుతాడు. ఇందుకేనమ్మా ఈ తండ్రి భయపడేది.. ఈ తండ్రి భయం నీకు ఇప్పటికైనా అర్థమైందా అమ్మా.. ఇందాక భోజనం చేసేటప్పుడు ఎవరి ఆహార అలవాట్లు వాళ్లకి ఉంటాయి అన్నావ్.. ఆహారపు అలవాట్లు సర్దుకోవచ్చు కానీ ఇలా తాగే అలవాటుని కూడా సర్దుకోంటావా అమ్మ అని తండ్రి అడగటంతో మిథున తల దించుకుంటుంది. వీడే నీ భర్త అనుకొని నీ జీవితాన్ని శూన్యంలోకి నెట్టేస్తావో వీడు నీకు సరికాదు అని తెలుసుకొని వెలుగులోకి అడుగుపెడతావో నువ్వే తేల్చుకో అని చెప్పి వెళ్లిపోతారు.
మిథున దేవాని చూసి కోపంగా ఉంటుంది. దేవా వెళ్తూ వెళ్తూ సరిగా నడవ లేక పడిపోతాడు. ఓ చోట కూర్చొంటాడు. మిథున కాస్త దూరంలో కూర్చొని ఏడుస్తుంది. హరివర్ధన్ గదిలోకి వెళ్లి కోపంతో అన్నీ విసిరేస్తాడు. లలిత షాక్ అయి భర్తని కోపం తెచ్చుకోవద్దని ప్రశాంతంగా ఉండమని అంటుంది. నా బాధ కోపంగా కనిపిస్తుందా.. ఈ ఇంట్లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా.. ఆ ఇడియట్ తాగి నా పరువు తీసేశాడు. వాచ్‌మెన్‌తో మందు తెప్పించుకొని తాగాడు అంటే ఆ వాచ్‌మెన్ రేపటి నుంచి నన్ను ఎలా చూస్తాడు. నేను కట్టుకున్న గౌరవం అనే కోటని ఆ చెత్త వెధవ కూల్చిపడేశాడు. వాడిని మెడ పట్టుకొని బయటకు గెంటేయడమే ఉంది. అలాంటి వాడితోనా నా కూతురు సంతోషంగా ఉండేది.. ఈ తాగుబోతు వెధవ ఎప్పటికైనా నా కూతుర్ని నడిరోడ్డు మీద నిలబెట్టి ఏడ్చేలా చేస్తాడు. ఇక వాడిని వదలను అని సీరియస్ అవుతాడు. తెల్లారితే ఏం జరుగుతుందో అని భయంగా ఉందని లలిత అనుకుంటుంది.
ఆదిత్య గదిలో ఉంటే త్రిపుర వెళ్లి ఆదేవాని వాడి పద్థతిలోనే దెబ్బకొట్టాలి అని అంటుంది. నా మిథునని నా నుంచి ఎవరూ దూరం చేయలేరు అక్క.. ఏ మామయ్య వాడిని ఇంట్లోకి రమ్మన్నారో ఆయనే వాడిని గెంటేయాలి.. ఏది ఏమైనా నాది కావాలి అక్క అని ఆదిత్య అంటాడు. బాగా ఆలోచించి వాడి అంతు చూడు అని త్రిపుర అంటుంది. ఉదయం లలిత మిథునతో మీ ఆయన్ను పిలుచుకురా అంటే ఆయన మందు తాగినందుకు నాకు ఆయన మీద కోపం ఉందని మిథున అంటే ఎప్పటి కోపం అప్పుడే వదిలేయాలి అని లలిత చెప్తుంది. మిథున సరే అంటుంది.
హరివర్ధన్, రాహుల్, త్రిపురలు టిఫెన్‌కి కూర్చొంటారు. వాడు వస్తాడు కదా వాడిని చూస్తూ తినలేం మనం తర్వాత తినేవాళ్లం కదా అని రాహుల్ త్రిపురతో అంటే రాత్రి అంత జరిగిన తర్వాత రోషం, పౌరుషం ఉన్న ఎవరైనా తినడానికి రారు అని అంటుంది. అప్పుడే దేవా లుంగీ కట్టుకొని ఎంట్రీ ఇస్తాడు. అందరూ బిత్తరపోతారు. దేవా డీజీ టిల్లు రేంజ్‌లో వచ్చి మామ ముందు కూర్చొని మిథున త్వరగా టిఫెన్ పెట్టు అని అంటాడు. హరివర్ధన్ అలా చూస్తూ ఉండిపోతాడు. లలిత భర్తతో ఏవండీ ప్లేట్ వైపు చూడండి అంటుంది. హా అని హరివర్ధన్ అంటే కావాలి అనడం లేదు ఆపమని చెప్పడం లేదు అని లలిత అంటుంది. దాంతో హరివర్ధన్ చాలు చాల్లే అని దేవాని చూసి చిరాకు పడి చెప్తాడు. సీన్ కామెడీగా ఉంటుంది.
దేవా దోసె తీసి రెండు చేతులతో పట్టుకొని దోసె చింపి నమిలేస్తాడు. దేవా తిండికి అందరూ చిరాకు పడతారు. అలంకృత నవ్వుకుంటుంది. నెల రోజుల నుంచి తిండి లేనోడు తిన్నట్లు ఆ తిండి చూడు వీడు తింటుంటే అసహ్యం వేస్తుందని త్రిపుర, రాహుల్ అనుకుంటారు. హరివర్ధన్ రగిలిపోతాడు. చిరాకుగా వెళ్లిపోతాడు. రాహుల్, త్రిపుర కూడా వెళ్లిపోతారు. త్రిపుర మామయ్య దగ్గరకు వెళ్లి ప్రస్తుతం మేం ఇంట్లో ఉండలేం నాలుగు ఐదు రోజులు వేరే ఎక్కడైనా ఉండి వస్తాం అని అంటుంది. ఇది మీ ఇళ్లు వాడికి భయపడి మీరు వెళ్లిపోవడం ఏంటి నేనే ఏదో ఒకటి చేస్తా వాడినే పంపేస్తా కాస్త ఓపిక పట్టండి అని జడ్జి అంటారు.
శారద ప్రమోదినితో దేవా గురించి చెప్పుకొని బాధపడుతుంది. దేవాకి కోపం ఎక్కువ కదా ఎలా ఉన్నాడో అని అనుకుంటుంది. ప్రమోదిని దేవాకి కాల్ చేస్తుంది. బాగున్నావా నాన్న అని శారద అడిగితే ఉన్నానులే అమ్మా ఏదోలా.. ఇంటికి ఎక్కువ జైలుకి తక్కువలా ఉంది.. జడ్జిగారి ఇల్లు కదా అందరూ జడ్జిలా ఉన్నారు హాస్టల్‌లో ఉన్నట్లు ఉందని అంటాడు. సరే నువ్వు ఉండలేవు కదా వచ్చేయ్‌రా అని అంటుంది శారద. దాంతో దేవా వద్దులే అమ్మా నేనే సర్దుకుంటా నేను వచ్చేస్తా మిథున బాధ పడుతుంది అంటాడు. శారద దేవాతో నాకు తెలుసులే నాన్న నీకు మిథున అంటే ఎంత ఇష్టమో నువ్వు ఆ జడ్జిగారి మనసు గెలిచి ఆశీర్వాదం తీసుకొని రా అని అంటుంది. అమ్మా నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావ్ ఈ రోజు గడిస్తే చాలు అని అంటాడు దేవా. సూర్యకాంతం త్రిపురకు కాల్ చేసి దేవా అల్లుడు అయిపోయాడా అంటే మా తమ్ముడు ఉన్నంత వరకు ఆ దేవా మా ఇంటి అల్లుడు అవ్వడు అని అంటుంది. కాంతం తనకు ఇప్పుడు తృప్తిగా ఉందని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















