Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today August 4th: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: సీక్రెట్‌గా సహస్ర స్థానంలో వ్రతం చేసేసిన లక్ష్మీ.. యమున ఏం చేయనుంది?
Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode August 4th సహస్రతో యమున వరలక్ష్మీ పూజ చేయించాలని అనుకుంటే లక్ష్మీ కూడా ఎవరికీ తెలీకుండా పూజ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమున సహస్రతో ఈ ఇంటి కోడలిగా నువ్వు విహారి కోసం వ్రతం చేయాలి అని స్వామీజీ చెప్పారు అని అంటుంది. దానికి సహస్ర బావ కోసం ఈ ఇంటి కోసం నేను ఏమైనా చేస్తాను అని సహస్ర చెప్తుంది. దాంతో యమున రేపు ఉదయమే తల స్నానం చేసి గుమ్మానికి పూజ చేసి గౌరీ దేవిని చేసి ముత్తయిదువుకి తాంబూలం ఇచ్చి నీ భర్త దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలమ్మా సాయంత్రం వరకు ఉపవాసం ఉండి చీకటి పడిన తర్వాత పూజ ముగిస్తే మంచిది అని చెప్తుంది.
అంబిక సహస్రతో నువ్వు ఇవన్నీ చేయగలవా అనుకుంటుంది. నా బావ కోసం నేను ఏమైనా చేస్తానని సహస్ర అంటుంది. ఇక వసుధ మనసులో లక్ష్మీ కదా ఇదంతా చేయాలి అనుకుంటుంది. పద్మాక్షి వరలక్ష్మీ వ్రతానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లును యమునతో పాటు వసుధని చూసుకోమని చెప్తుంది. సహస్ర మనసులో పొద్దున్నే లేవలేను అనుకుంటుంది.
విహారి లక్ష్మీ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. పద్మాక్షి సహస్రని విహారికి అప్పగించడం, గౌరీ లక్ష్మీని అప్పగించడ గుర్తు చేసుకొని బాధగా ఉంటాడు. ఇంతలో లక్ష్మీ విహారి దగ్గరకు వచ్చి ఏమైంది అని అడుగుతుంది. విహారి లక్ష్మీతో అంతా అయిపోయిన తర్వాత బాధ పడటం తప్ప నేనేం చేయలేకపోతున్నా అని విహారి అంటాడు. అందరి ముందు మీరు మన బంధం గురించి చెప్పేసుంటే ఇలా అందరూ సంతోషంగా ఉండటం చూసేవాళ్లా.. మీరు నిజం చెప్పుంటే ఈ కుటుంబం ముక్కులు ముక్కలు అయిపోయి అందరూ ఎంత బాధ భరించేవాళ్లో ఒక సారి ఆలోచించండి అని అంటుంది. ఈ విషయంలో నాలో నేను చాలా సంఘర్షణ పడుతున్నా అని విహారి అంటాడు. మీకు నా కంటే మీ అమ్మగారు సహస్రమ్మ ముఖ్యం వాళ్లతో కలిసి ఉండటం ముఖ్యం .. దీనికి మించి మీరు ఏం ఆలోచించకండి నాకోసం అస్సలు ఆలోచించొద్దు నేను ఇలా హాయిగా ఉన్నాను ఉంటాను అని లక్ష్మీ అంటుంది. లక్ష్మీ ఏడుస్తూ మన బంధం గురించి నిజం చెప్పొద్దని వేడుకుంటుంది. ఏది ఏమైనా నువ్వే నా భార్యవి నువ్వే నా ఊపిరి నువ్వు లేకుండా నేను లేను ఏదో ఒక రోజు నిజం చెప్పి నిన్ను నా భార్యగా స్వీకరిస్తాను అని విహారి అంటాడు.
లక్ష్మీ గదిలో ఏడుస్తూ ఉంటే వసుధ వచ్చి రేపు నువ్వు వరలక్ష్మీ వ్రతం చేయాలి అని యమున సహస్రకు చెప్పినవన్నీ లక్ష్మీకి చెప్తుంది. అంతా నేను చూసుకుంటాను అని నువ్వు పూజ చేయ్ అని వసుధ అంటుంది. లక్ష్మీ వద్దని అన్నా వసుధ చేయమని అంటుంది. ఎవరికీ తెలీకుండా నేను చూసుకుంటా నువ్వు వ్రతం చేయ్ అని వసుధ చెప్పడంతో లక్ష్మీ సరే అంటుంది. యమున వేకువన 5 గంటలకు లేచి సహస్రని లేపే టైంకి లక్ష్మీ లేచి స్నానం చేయి పూజ చేయడానికి బయటకు వెళ్తుంది. యమున చూసి ఈ లక్ష్మీ ఎక్కడికి వెళ్తుంది అనుకుంటుంది. సహస్ర దగ్గరకు వెళ్లి చూసే సరికి సహస్ర పడుకొని ఉంటుంది.
యమున సహస్రని లేపి గాబరా పెట్టి లేపుతుంది. ఇక వసుధ లక్ష్మీతో పూజ చేయిస్తుంది. గడపకు పసుపు రాసి ముగ్గులు పెట్టిస్తుంది. యమున వచ్చి చూసే టైంకి లక్ష్మీ, యమున ఇద్దరూ తులసి కోట దగ్గరకు వెళ్లిపోతారు. తర్వాత లక్ష్మీతో తులసి కోట దగ్గర గౌరమ్మను చేయించి పూజ చేయిస్తుంది. లక్ష్మీ తులసి కోటకు పూజ చేసేస్తుంది. ఇక యమున అన్నీ రెడీ చేసి సహస్ర కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. సహస్ర నిద్ర మత్తులోనే వస్తుంది. ఇక యమున సహస్రని తీసుకొని గుమ్మం దగ్గరకు వెళ్తుంది. అప్పటికే అక్కడ పూజ చేసి ఉండటం యమున చూసి ఇదేంటి ఎవరో పూజ చేశారు అంటుంది. అనుమానం వచ్చింది యమున అడిగితే ఇది ఎవరో ఎప్పుడో చేసుంటారు అని అంటుంది. ఇక యమున సహస్రతో మళ్లీ పూజ చేయిస్తుంది. సహస్ర చూసి ఇది చూస్తే ఆ లక్ష్మీ పూజ చేసినట్లు ఉంది. అంతే అది ఫస్ట్ చేస్తే నేను సెకండ్ చేసినట్లా అంటే మా బావకి కూడా అది ఫస్ట్ నేను సెకండ్‌నా అని సహస్ర అనుకుంటుంది. తులసి కోట దగ్గర కూడా గౌరమ్మని చూసిన యమున లక్ష్మీ ఉదయం ఎదురు రావడం చూసి ఇదంతా ఆ లక్ష్మీనే చేసిందని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















