Jagadhatri Serial Today August 28th: జగద్ధాత్రి సీరియల్: జగద్ధాత్రిపై మేఘన పగ: వంటలతో అల్లకల్లోం.. కేథార్ కోసం తిప్పలు!
Jagadhatri Serial Today Episode August 28th మేఘన జగద్ధాత్రి వంటలు పాడు చేయాలి అని తన వంటల్ని పాడు చేసుకోవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode మేఘన వంట చేస్తానని అంటుంది. జగద్ధాత్రి వద్దని చెప్తుంది. కానీ కేథార్ ఇవ్వమని అంటాడు. జగద్ధాత్రి హర్ట్ అయి వెళ్లిపోతుంది. మేఘన ముందు నేను వంట చేస్తానని అంటుంది. ఇక పంచధార, సాల్ట్ ప్లేస్ మార్చేస్తుంది. జగద్ధాత్రి వంటల్లో ఉప్పు బదులు షుగర్ వేసేస్తే జగద్ధాత్రి పరువు పోతుందని ప్లాన్ చేస్తారు.
కౌషికి నిషిక అందరూ కలిసి పూజ చేస్తారు. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా అందరూ మంగళ హారతిపాడమని చెప్తారు. మేఘనని పాడమని కౌషికి చెప్తుంది. మేఘన రాదని అంటుంది. జగద్ధాత్రి ఆ మాత్రం పాట రాదా అమ్మవారు నీ కోరిక తీరుస్తుందని సెటైర్లు వేస్తారు. జగద్ధాత్రి హరతి పాటు పాడుతుంది. అందరూ జగద్ధాత్రిని మెచ్చుకుంటారు. ఇక అందరూ తమ తమ కోరికలు అమ్మవారికి కోరుకుంటారు. మేఘన తనకు కేథార్ దక్కాలని కోరుకుంటే జగద్ధాత్రి మేఘనకు కేథార్ దగ్గరవ్వకూడదు అని కోరుకుంటుంది.
జగద్ధాత్రి, మేఘన ప్రసాదాల కోసం గొడవ పడతారు. నేను చేసిన ప్రసాదమే తినాలని మేఘన అంటుంది. నీకు ముగ్గు వేయడమే రాదు ఇక ప్రసాదాలు కూడానా అంటుంది. బామ్మ ముందు నేనే తింటా తర్వాత మీరు తినొచ్చని అంటుంది. బామ్మ నోటిలో పెట్టుకుని నోరు మూసుకొని బిత్తరపోతుంది. ఏమైనా తేడాగా ఉందా అని జగద్ధాత్రి అంటుంది. బాగుంది అని బామ్మ అంతే మళ్లీ తినమని అంటారు. మేఘన కంగారు పడతారు. మేఘన నిషికకు పెడుతుంది. నిషిక కంగారు పడుతుంది. ఒక స్పూన్ తిని ఉప్పు ఉండటంతో చిరాకు పడుతుంది. రెండో సారి ఇవ్వమని అంటే చీ చీ ఏం బాలేదు అని అంటుంది. అందరూ మేఘనని ఇలా చేశావేంటి అంటారు.
కౌషికి జగద్ధాత్రికి తెచ్చి ఇవ్వమని అంటుంది. అందరూ లొట్టలేసుకొని తింటారు. ఇక మేఘన వైజయంతి వాళ్లతో ఎలా ఉప్పు పంచధార మారిపోయావి అని అంటే నీకు సాయం చేయాలి అని మేమే మార్చామని కంగారు పడి చెప్తుంది. మేఘన షాక్ అయిపోతుంది. ఫ్లాష్ బ్యాక్‌లో జగద్ధాత్రిని ఇబ్బంది పెట్టాలని జగద్ధాత్రి ప్రసాదాలు చెడగొట్టాలని మేఘన ప్రసాదం చెడగొట్టేస్తారు. అందరి ముందు అవమాన పడ్డానని మేఘన కోపంతో రగిలిపోతుంది. జగద్ధాత్రిని వదిలి పెట్టను అని మేఘన అంటుంది. అందరూ గుడికి వెళ్తారు. జగద్ధాత్రి కాలికి కొబ్బరి చిప్ప తగులుతుంది. కేథార్ ఎత్తుకుంటా అంటే జగద్ధాత్రి వద్దని అనేస్తుంది. ఇక జగద్ధాత్రికి రాళ్లు గుచ్చుకోకుండా కేథార్ ముందు నడిచి తన అడుగుల్లో జగద్ధాత్రిని నడవమని అంటాడు. ఇద్దరూ అలా నడుస్తూ ప్రేమని ఫీలవుతూ ఒకరిని ఒకరు చూసి సిగ్గు పడుతూ ఉంటారు. ఇద్దరూ తమ లోకంలో ఉండి తమని తాము మర్చిపోతారు. అప్పుడే వాళ్లని మిగతా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు. జగద్ధాత్రి, కేథార్ నవ్వుకుంటూ ఉంటే వైజయంతి వాళ్లు అడ్డుకొని ఎందుకు ఆపేశారు నవ్వుకోండి మనం గుడికి వచ్చింది దర్శనానికి కాదు కదా మీరు నవ్వుకోవడానికే కదా ముందు నవ్వుకోండి తర్వాత మిగతా పనులు తర్వాత చూసుకుందాం అని సెటైర్లు వేస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















