Jagadhatri Serial Today August 26th: జగద్దాత్రి సీరియల్: జగద్ధాత్రి vs మేఘన: ఇరువురి భామల మధ్య ఇరుక్కున్న కేథార్!
Jagadhatri Serial Today Episode August 26th మేఘన, జగద్ధాత్రి ఇద్దరూ కేథార్ నా వాడు అంటే నా వాడు అని గొడవ పడటంతో ఇవాళ్టి ఎపిసోస్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode జగద్ధాత్రి కేథార్‌కి నలుగు పెట్టి తలంటుతానని తీసుకెళ్తుంది. నిషిక, వైజయంతిలు ఎప్పుడు ఏం ప్లాన్ చేసినా జగద్ధాత్రి, కేథార్లు నాశనం చేసేస్తున్నారని తిట్టుకుంటారు. వాళ్ల పని నేను చెప్తానని యువరాజ్ అంటాడు.
జగద్ధాత్రి కేథార్‌కి నలుగు రాస్తుంది. నీ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది జగద్ధాత్రి స్వర్గంలో తేలుతున్నట్లు గాల్లో ఎగురుతూ మేఘాల్లో తేలుతున్నట్లు ఉంటుందని అంటాడు. ఏంటి మేఘననా అని తిడుతుంది. దాంతో కేథార్ ఏంటి చంపేయాలి అని డిసైడ్ అయ్యావా కొంప తీసి డ్రమ్ దాచిపెట్టావా అంటే జగద్ధాత్రి దానికి డ్రమ్‌లో దాచిపెట్టడాలు ఎత్తైన కొండ మీద నుంచి తోసేయడాలు ఉండవు.. ఆరు బులెట్స్ అరసెకెన్‌లో దింపేస్తానని అంటుంది. ఇంకోసారి మేఘనని తలచుకున్నా తనని చూసి నవ్వినా ఊరుకోనని అంటుంది. మేఘన ఇక రాదు అని కేథార్ అంటాడు. ఇంతలో మేఘన ఎంట్రీ ఇస్తుంది.
మేఘన తన బామ్మతో వస్తుంది. జగద్ధాత్రి, కేథార్ చూసి షాక్ అయిపోతారు. జగద్ధాత్రి చేతిలో నన్ను చంపేయాలనే తలచుకోగానే వచ్చేసిందని కేథార్ అనుకుంటాడు. జగద్ధాత్రి కేథార్‌ని కోపంగా చూస్తుంది. మేఘన జగద్ధాత్రితో ఏం చేస్తున్నావ్ నా వాడు కేథార్ నాకు కాబోయే వాడు అంటాడు. ఇక ఇద్దరూ నా కేథార్ అంటే నా కేథార్ అని కొట్టుకుంటారు. వైజయంతి, నిషికలు వస్తారు. ఎందుకు మీరు సడెన్ ఎంట్రీ ఇచ్చారు అంటే శ్రావణ మాసం అని వచ్చామని నీ కోసం వరలక్ష్మీ వ్రతం చేసుకోవాలని నీకు దగ్గర అయిపోయి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని అంటుంది.
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మేఘన కేథార్‌కి ఒక్క రోజు భార్యగా ఉంటుంది. అప్పుడే ఒకర్ని ఒకరు అర్థం చేసుకుంటారని బామ్మ అంటుంది. నా పని అయిపోయింది అని కేథార్ అనుకుంటాడు. జగద్ధాత్రి బామ్మతో మీకు ఇంత వయసు వచ్చింది అలా అంటారేంటి అంటుంది. నేనేదో నీ భర్తకు పెళ్లంగా ఉంటానని అడిగానా నా వాడికే కదా అని అంటుంది. ఇక జగద్ధాత్రిని వెళ్లిపోమని కేథార్‌కి నలుగుపెడుతుంది. కేథార్ నవ్వుతాడు. సడెన్‌గా జగద్ధాత్రిని చూసి కంగుతింటాడు. జగద్ధాత్రి వెళ్లిపోమని అంటుంది. కేథార్ వెళ్లిపోతానని అంటే మేఘన వదలదు. ఆయిల్ పెడతా అని మేఘన అంటే చచ్చిపోతా వద్దు అని అంటాడు. కేథార్ పారిపోతాడు.
జగద్ధాత్రి రాత్రి కూడా కోపంగా ఉంటుంది. కేథార్ వెళ్తే నా కోపంతో నేకేంటి నీ తాపం తగ్గింది కదా అని మేఘనని గుర్తు చేసి కేథార్‌ని దెప్పిపొడుతుంది. కేథార్ రామచంద్రా అనుకొని తల బాదుకుంటాడు. ఇంతలో బామ్మ, మేఘన స్వీట్స్ చాప తీసుకొని వస్తుంది. వీటితో ఏంటి ఇక్కడికి వచ్చారు బామ్మ అని జగద్ధాత్రి అడిగితే వన్ డే వైఫ్‌లా సేవలు చేస్తుందని అంటారు. జగద్ధాత్రి కోపంతో రగిలిపోతుంది. మీద చేయి వేస్తాను. కాలు వేస్తాను ఇలా కేథార్ ఎన్ని అన్నా ఏం పర్లేదు నేను నీకు దాసోహం అయిపోయాను అని మేఘన అంటుంది.
జగద్ధాత్రి, మేఘన కేథార్‌ని చెరో వైపు పట్టుకొని కేథార్‌ని ఓ ఆట ఆడించి తోసేసి కేథార్‌కి నడుం పట్టేలా చేస్తారు. మళ్లీ కేథార్ దగ్గరకు వెళ్లి తోసేస్తారు. ఇక మేఘన కేథార్ మంచం మీద రివర్స్‌లో పడిపోయి ఉంటే మేఘన కేథార్ నడుంకి బామ్ రాస్తుంది. బామ్మ మురిసి పోతుంది. జగద్ధాత్రి కోపంతో బామ్మ కాలి కింద బామ్మ డబ్బా విసిరేసి కింద పడేలా చేస్తుంది. బామ్మ కూడా నడుం విరిగిపోయిందని అంటే జగద్ధాత్రి బామ్ రాస్తానని బామ్మ అంతు చూసేస్తుంది. బామ్మ మేఘనతో ఇది చంపేసేలా ఉందే నన్ను బయటకు తీసుకెళ్లు అంటుంది. దాంతో మేఘన బామ్మని బయటకు తీస్తుంది. వైజయంతి వాళ్లు చూసి ఏమైందని అడిగితే మేఘన మొత్తం చెప్తుంది. ఆ జగద్ధాత్రి ఇదంతా చేసిందని ఇద్దరూ ఎక్కిస్తారు. దాంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















