Jagadhatri Serial Today August 27th: జగద్ధాత్రి సీరియల్: మేఘన మోసం బయటపడిందా! బామ్మ ప్లాన్ ఫెయిల్, జగద్ధాత్రి విజయం!
Jagadhatri Serial Today Episode August 27th అందరి ముందు మేఘనని కేథార్‌కి భార్యగా తగిన అమ్మాయి అని నిరూపించాలని బామ్మ, నిషిక, వైజయంతిలు ప్లాన్ చేయడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Jagadhatri Serial Today Episode మేఘన, బామ్మ జరిగింది మొత్తం నిషిక, వైజయంతికి చెప్పడంతో ఇదంతా జగద్ధాత్రి చేసిందని అంటారు. జగద్ధాత్రి పని చెప్తానని బామ్మ అంటుంది. మీ వెనక మేం ఉంటామని వైజయంతి అంటుంది.
జగద్ధాత్రి వరలక్ష్మీ వ్రతం చేసినప్పుడు అందరి ముందు అవమానించాలని అందుకు అందరి కంటే మందు నువ్వు లేచి పనులు చేసేస్తే కేథార్‌కి నువ్వే భార్యగా కరెక్ట్ అని అందరూ అనుకునేలా చేద్దాం అని నిషిక చెప్తుంది. మనవరాలిని అందరి ముందు మంచిదానిలా చిత్రీకరించడానికి బామ్మ జగద్ధాత్రి పెట్టుకున్న అలారం ఆపేస్తుంది. బామ్మతో మేఘన నాకు పనులు రావు కదా బామ్మ ముగ్గులు అస్సలు వేయడం రాదు అని అంటే దానికి బామ్మ మనుషుల్ని పురమాయిస్తానని అంటుంది. ఉదయం బామ్మ ఇద్దరు మనుషులతో ముగ్గులు వేయిస్తుంది. బామ్మ, మేఘన వాళ్ల ముందు కూర్చొని ఉంటారు. త్వరగా పని చేయమని అంటారు.
కేథార్ నిద్ర లేచి చూసే సరికి టైం 7 అవుతుంది. జగద్ధాత్రిని లేపి ఏంటి ఇంతలేట్ అందరూ లేచే సరికి కనీసం స్నానం అయినా చేయ్ వెళ్లు అని పంపిస్తాడు. మేఘనకు బామ్మ ముగ్గు వేసినట్లు బిల్డప్ ఇవ్వమని చెప్తుంది. జగద్ధాత్రి ముగ్గు వేద్దామని బయటకు వెళ్లే సరికి కౌషికి ఏంటి ఇంకా స్నానం లేదు అని అడిగితే వైజయంతి వచ్చి పండగ పూట కనీసం ముగ్గు కూడా లేదు ఒక్క మాట మాకు చెప్పి ఉంటే మేం చూసుకునే వాళ్లం అని అనుకుంటారు. ఇక కౌషికి జగద్ధాత్రిని ఏం అనొద్దని అంటుంది. మేఘన, బామ్మ గురించి అడిగితే పొద్దున్నే లేచి ముగ్గులు వేసేసిందని చెప్పి కౌషికి వాళ్లకి చూపిస్తారు.
వైజయంతి మేఘనని పొగిడేస్తుంది. కౌషికి కూడా పొగుడుతుంది. జగద్ధాత్రి మేఘనతో నిజంగా నువ్వు వేశావా అని అంటుంది. వైజయంతి మేఘననే వేసింది అని నువ్వు ఏ ఇంటికి కోడలు అయితే ఆ ఇంటికి పండగే అని చెప్పి జగద్ధాత్రిని చూసి నేర్చుకోమని అంటారు. జగద్ధాత్రి బామ్మ, మేఘన చేతులకు రంగులు లేకపోవడంతో అనుమానిస్తుంది. పక్కనే ఉన్న వాళ్ల చేతులు రంగులు చూసి డౌట్ వచ్చి అడుగుతుంది. బామ్మ కవరింగ్‌కి వాళ్లని నేనే రమ్మని చెప్పానని అంటుంది. కౌషికి బామ్మకి మీరు రంగులు వేస్తే రంగులు లేవు ఏంటి అని అంటుంది. కడుక్కొని వచ్చామని అంటారు. ఇక ఇద్దరూ లేడీలు మేఘనని పొగిడేస్తారు.
జగద్ధాత్రి కౌషికితో ముగ్గు వాళ్లు వేయలేదు అని వేరే ఇద్దరు వేశారని చెప్తుంది. కౌషికితో చేతులు కలిపిన జగద్ధాత్రి ముగ్గుల పోటీలో ఎవరు విన్ అయితేవాళ్లకి లక్ష ఇస్తారని కౌషికి చెప్పిందని అంటుంది. మేఘన ముగ్గు బాగుంది దీనికే ఫస్ట్ అని కౌషికి అంటుంది. దాంతో ఆ ఇద్దరూ డబ్బుకోసం ఆ ముగ్గు మేం వేశామని చెప్తారు. చేతులు కూడా చూపిస్తారు. మేఘనకు కౌషికి క్లాస్ ఇస్తుంది. చేతకాని పనులు చేయమని నేను చెప్పలేదు కదా ఇంకెప్పుడూ ఇలాంటి పనులు చేయొద్దు మీ స్థాయికి సరికాదు అని అంటుంది. జగద్ధాత్రి బామ్మ, మేఘనని ఉడికిస్తుంది.
కౌషికి జగద్ధాత్రితో మేఘన వాళ్లు మన ఇంటి దగ్గర ఎందుకు పూజ చేస్తున్నారని అడిగితే వైజయంతి అత్తయ్య వాళ్ల వల్లే అని చెప్తుంది. మరోవైపు వైజయంతి వాళ్లు జగద్ధాత్రి పరువు తీయాలని అనుకుంటారు. జగద్ధాత్రి వంటలు చేస్తుంటే మేఘన వంట చేస్తాను అంటే జగద్ధాత్రి వద్దని అంటుంది. ఇప్పటికే లేట్ అయింది వద్దు అంటుంది. మేఘన ఒప్పుకోదు. నేనే చేస్తానని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.





















