Guppedantha Manasu 25th Episode: 'గుప్పెడంత మనసు' సీరియల్: వసుధారని అరెస్టు చేసిన పోలీసులు, ఆఖరి నిమిషంలో ఊహించని ట్విస్ట్
Guppedantha Manasu November 25th Episode: వసుధారని పోలీసులు అరెస్ట్ చేయటంతో కథలో కీలక మలుపులు చోటు చేసుకున్నాయి.
Guppedantha Manasu Telugu Serial November 25th Episode: ఫోన్ లో సాక్షాధారాలు చూసిన వసుధార షాక్ అవుతుంది.
చిత్ర తల్లి : తన వల్లే నా కూతురు ఈ పరిస్థితులలో ఉంది.
చిత్ర బాయ్ ఫ్రెండ్ : మా ఇద్దరినీ విడదీయాలనే తను ఇలా చేసింది.
వాళ్ల మాటలు సాక్షాధారాలు చూసిన పోలీసులు వసుధార ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా అరెస్టు చేసి తీసుకు వెళ్తూ ఉంటారు. అంతలోనే అక్కడికి అనుపమ వస్తుంది.
అనుపమ: నీకు ఇది న్యాయంగా ఉందా, ఒక కాలేజీ ఎండివి అయి ఉండి, కాలేజీ పరువు ప్రతిష్టలు నిలబెట్టడం కోసం ఒక అమ్మాయి బ్రతుకుతో ఆడుకుంటావా అని నిలదీస్తుంది.
వసుధార : ఇందులో నా తప్పేమీ లేదు, అసలు నేనేమీ చేయలేదు.
అనుపమ: అలాంటప్పుడు ఆ సమయంలో నువ్వెందుకు అక్కడ ఉన్నావు.
వసుధార : తనని సేవ్ చేయమని చిత్ర మెసేజ్ పెట్టింది అందుకే వెళ్ళాను.
అనుపమ: అయితే ఆ మెసేజ్ లు చూపించు.
వసుధార : ఆ మెసేజ్లు చూపిద్దామని ఫోన్ తీసేసరికి అవి డిలీట్ అయి ఉంటాయి అదే విషయాన్ని అనుపమకి చెప్తుంది.
రిషి కూడా వసుధారని సపోర్ట్ చేస్తూ మాట్లాడతాడు.
అనుపమ: ఏ సాక్ష్యము లేనప్పుడు మీరు చెప్పింది ఎలా నిజం అవుతుంది, ఆలస్యం ఎందుకు అరెస్టు చేయండి అని పోలీసులకి చెప్తుంది.
రిషి, మహేంద్ర ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా పోలీసులు వసుధారని అరెస్టు చేసి తీసుకు వెళ్ళిపోతారు.
అనుపమ : తను ఇలా చేస్తుందనుకోలేదు జగతి పరువు తీస్తుంది, ఒక ఆడపిల్లై ఉండి మరొక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటుందా..
రిషి : కోపంగా ఇంకా ఆపండి, తన గురించి మీకేం తెలుసు అని అలా మాట్లాడుతున్నారు. తను ఒక స్టూడెంట్ గా ఈ కాలేజీలో జాయిన్ అయి ఎండి స్థాయికి వచ్చింది తన కెరీర్ గ్రాఫ్ చూస్తే తెలుస్తుంది తను ఏమిటో.
అనుపమ: అలా అని మీరు చెప్తే సరిపోదు సాక్షిలన్నీ ఆమెకి వ్యతిరేకంగానే ఉన్నాయి.
మహేంద్ర: మరి, నీలా బురద జల్లితే నింద నిజం అయిపోతుందా, నీకు తనమీద నమ్మకం లేకపోవచ్చు కానీ నా కోడలు ఎలాంటిదో మాకు తెలుసు. అయినా తన గురించి తప్పుగా మాట్లాడితే జగతిని అవమానించినట్లే, వసుధార జగతి శిష్యురాలు తన లక్షణాలన్నీ పుణికి పుచ్చుకున్న అమ్మాయి. తను తప్పు చేయలేదని మేము నిరూపిస్తాము అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు తండ్రి కొడుకులు.
దారిలో వెళ్తూ చాలామంది పోలీసులకి ఫోన్లు చేసి వసుధార బెయిల్ విషయం మాట్లాడుతారు కానీ ఎవరు వారికి సపోర్ట్ చేయరు, మా వల్ల కాదంటూ చేతిలో ఎత్తేస్తారు. పోలీస్ స్టేషన్కు వెళ్లిన తర్వాత వసుధార దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్తాడు రిషి.
వసుధార : చిత్రకి ఎలా ఉంది.
రిషి : ఈ సమయంలో కూడా తన గురించే ఆలోచిస్తున్నావా అంటూ ప్రస్తుతం తను ఐసీయూలో ఉంది. అయినా నువ్వేమీ బాధపడకు తను బాగుంటుంది నువ్వు కూడా బెయిల్ మీద బయటకు వచ్చేస్తావు డాడ్ పోలీసులతో మాట్లాడుతున్నారు కదా అంటాడు.
వసుధార : నింద ఎంత భయంకరంగా ఉంటుంది అనేది ఇప్పుడే అర్థమవుతుంది ఆరోజు నీ మీద వేసిన నిన్నటి ఈరోజు ఫలితం అనుభవిస్తున్నాను.
రిషి: అప్పటి విషయాలు ఇప్పుడు ఎందుకు అని ఆమెకి ధైర్యం చెప్తాడు.
మరోవైపు మహేంద్ర వసుధారని వదిలేయమని పోలీసులని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. రిషి కూడా ఎస్ఐ దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తాడు. కానీ వాళ్ల ప్రయత్నాలు ఏవి వర్క్ అవుట్ అవ్వవు ఈ లోపు ఒక లాయర్ వచ్చి వసుధారకి బెయిల్ ఇప్పిస్తాడు.
రిషి: మీరు ఎవరు?
లాయర్: నేను అనుపమ మేడం గారు పంపిస్తే వచ్చాను అని చెప్పి వాళ్లని తీసుకొని బయటికి వెళ్తాడు.
అక్కడ అనుపమ ఉంటుంది. ఆమెకి మహేంద్రవాళ్లు థాంక్స్ చెప్తారు.
అనుపమ: నేను వసుధారని నమ్మి ఇవ్వలేదు జగతి శిష్యురాలు అన్నారు కదా అందుకే ఇప్పించాను.
రిషి: మీకు మా అమ్మ మీద ఎంత అభిమానం ఉందో తెలుస్తుంది కానీ అందుకోసం మిగిలిన వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకండి.
అనుపమ: ఇప్పుడు మీరు చేయవలసింది చిత్రకి ఏమీ కాకూడదు అని దేవుడని ప్రార్థించటమే ఎందుకంటే ఆమె ఇచ్చే స్టేట్మెంటే వసుధారని కాపాడగలదు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ పూర్తవుతుంది.