అన్వేషించండి

Guppedantha Manasu November 24th Episode: ప్రేమలో పంతాలు ఉండవు ప్రేమ మాత్రమే ఉంటుంది, ఏకాంతంలో రిషిధార - అంతలోనే ట్విస్ట్!

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలు సాగుతూనే ఉన్నాయి..ఇంకోవైపు అనుపమ ఎంట్రీ ఇచ్చింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu November 24nd Episode (గుప్పెడంతమనసు నవంబరు 24 ఎపిసోడ్)

ధరణి-ఫణింద్రని టూర్ పంపించేందుకు ప్లాన్ చేసిన ఫణీంద్ర ఇంట్లో పనిమనిషిని పెడతాడు. దానిపై దేవయాని ఫైర్అవుతుంది. 
ఫణీంద్ర: ఇంతకాలం ధరణి ఇంట్లోనే నాలుగు గోడల మధ్యలోనే ఖైదీలాగే ఉండిపోయింది, ఆమెకు కూడా చిన్న చిన్న ఆశలు ఉంటాయని, అవి తీర్చే బాధ్యత భర్తపై ఉంటాయి. ఇప్పుడిప్పుడే శైలేంద్ర ధరణిని అర్థం చేసుకుంటున్నాడని, ఇలాంటి సమయంలో భార్యను బయటకు తీసుకువెళ్లి, కొంతకాలం గడిపితే వాళ్లిద్దరి మధ్య సాన్నిహిత్యం బాగా పెరుగుతుంది
నేను అదే చేద్దాం అనుకున్నా డాడ్ అంటాడు శైలేంద్ర...ధరణి ప్రయాణానికి రెడీ అవు అని చెబుతాడు..

Also Read: ఆనందంలో రిషిధార, అయోమయంలో అనుపమ, దేవయానికి షాకిచ్చిన ఫణీంద్ర!

వసుధార ఒంటరిగా కూర్చుని చందమామను చూస్తూ...కాలేజీలో ప్రేమజంట గొడవ గురించి ఆలోచిస్తుంటుంది. ఇంతలో రిషి అక్కడకు వస్తాడు. ఏం ఆలోచిస్తున్నావ్ అంటే, కాలేజీలో చిత్ర గురించి ఆలోచిస్తున్నాను అంటుంది. 
రిషి: అసలు ఆ అబ్బాయి అలా ఎలా ప్రవర్తిస్తాడు? మనం ప్రేమించినవాళ్లు, మనల్ని ప్రేమించకపోయినా వారిని ఇబ్బంది పెట్టకూడదు 
వసుకి..గతంలో రిషి ప్రపోజ్ చేసిన విషయం గుర్తుకువస్తుంది. అప్పుడు తాను లవ్ ప్రపోజల్ రిజక్ట్ చేసినప్పుడు బాధపడ్డారా అని అడుగుతుంది. చాలా బాధపడ్డానని చెబుతాడు. ఆ తర్వాత  నువ్వు ప్రపోజ్ చేయడం కలో నిజమో తెలియలేదు..ఆ క్షణం తన జీవితంలో అందమైన రోజు అని చెబుతాడు. ( ఈ సీన్స్ అన్నీ బ్యాగ్రౌండ్ లో వస్తాయి)
వసు: ఆ రోజు ప్రపోజ్ చేసే సమయంలో నాకు చాలా భయం వేసింది
రిషి: ఎందుకు 
వసు: మీరు ప్రపోజ్ చేసినప్పుడు నేను రిజక్ట్ చేశానని, నేను ప్రపోజ్ చేస్తే, మీరు కూడా రిజెక్ట్ చేస్తారని అనుకున్నాను
ప్రేమలో పంతాలు ఉండవు..ప్రేమ మాత్రమే ఉంటుందంటాడు రిషి...
బాగా చలిగా ఉందని వసు అంటే...వెంటనే ఆ చలి పోగొట్టేస్తానంటూ ప్రేమగా హగ్ చేసుకుంటాడు. (బ్యాగ్రౌండ్ లో దడదడమని హృదయం శబ్ధం సాంగ్ ) 
ఆ తర్వాత వసుధార కిచెన్లో వాటర్ బాటిల్ తీసుకుని లోపలికి వెళ్తుంటే వసుకి ఏదో ఫోన్ వస్తుంది. అది కాలేజ్ స్టూడెంట్ చిత్ర నుంచి. వెంటనే కాల్ బ్యాక్ చేస్తుంది. ఫోన్ కలవదు. ఏదో ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకుని తనను ఎలాగైనా రక్షించాలని అనుకుంటుంది.

Also Read: శైలేంద్రలో ఈ యాంగిల్ కూడా ఉందా - మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార!

మర్నాడు ఉదయం ఇంట్లో రిషి, మహేంద్రలకు టిఫిన్ పెడుతూ ఉంటుంది. మహేంద్రను కాలేజ్ కి రమ్మని రిషి అడిగితే, దానికి ఆయన సరే అంటాడు. ఆ తర్వాత వసుని రిషి, రాత్రి ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు. దానికి వసు సమాధానం చెప్పేలోగా, రిషికి  SI నుంచి కాల్ వస్తుంది.  మీ కాలేజీలో చదివే చిత్ర అనే అమ్మాయి సూసైడ్ అంటెప్ట్ చేసిందని, ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉందని చెబుతారు. దీంతో, వీళ్లు వెంటనే బయలుదేరి ఆస్పత్రికి వెళతారు. ఇక, హాస్పిటిల్ లో చిత్ర తల్లిదండ్రులు ఏడుస్తూ ఉంటారు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు.  ఈలోగా రిషి వాళ్లు అక్కడికి వచ్చేస్తారు. చిత్ర ఆత్మహత్యా ప్రయత్నం  చేయడానికి వీళ్లే కారణం అని రిషి, వసులను చూపిస్తూ ఆమె బాయ్ ఫ్రెండ్ ఆరోపణలు చేస్తాడు. మీ వల్లే జరిగిందంటూ ఆరోపిస్తాడు. ఈ లోగా బయటకు వచ్చిన డాక్టర్ ట్రీట్మెంట్ జరుగుతోందని చెబుతాడు... ఈ విషయం మీడియాకు తెలిసిపోయిందని, ఈ విషయం మీరే హ్యాండిల్ చేసుకోవాలని సలహా ఇస్తుంది.

ALso Read: అనుపమను దారి మళ్లించే ప్రయత్నంలో దేవయాని, రిషిధార ఎలా చెక్ పెడతారు!

వసుధారని దోషిని చేసే ప్లాన్
ఆ తర్వాత మహేంద్ర అసలు ఏం జరిగింది రిషి అని అడుగుతాడు. రిషి, కాలేజీలో జరిగిన విషయం చెబుతాడు. చిత్ర బాయ్ ఫ్రెండ్ మాత్రం దీనంతటికీ వసునే కారణం అని ఆరోపిస్తాడు. వసు.. చిత్రను బెదిరించిందని, అందుకే అలా చేసిందని అంటాడు. రిషి మాత్రం ఆ అబ్బాయిని బెదిరిస్తాడు. ఈలోగా పోలీసులు హాస్పిటల్ కి వచ్చి వసుధారను అరెస్టు చేస్తున్నామని చెబుతారు.  చిత్ర సూసైడ్ అంటెప్ట్ చేయడానికి కారణం వసుధార అనే  ఫిర్యాదు వచ్చిందని, అందుకే ఇలా వచ్చామని పోలీసులు చెబుతారు. ఈలోగా ఆ చిత్ర బాయ్ ఫ్రెండ్ కూడా వసుధార మేడమ్ కారణంగానే చిత్ర అలా చేసిందని అంటాడు.ఏ ఆధారాలతో వసుని అరెస్ట్ చేస్తారని రిషి ప్రశ్నిస్తాడు కానీ దానికి పోలీసులు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, తమ వద్ద సూసైడ్ లెటర్ ఉందని  చెబుతారు. ఆ సూసైడ్ లెటర్ లో తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోకుండా, వసుధార మేడమ్ అడ్డుకుంటున్నారని, అందుకే తాను సూసైడ్ చేసుకుంటానని రాసిందని పోలీసులు చెబుతారు. ఇదంతా అబద్ధం అని రిషి అనగా, లెటర్ మాత్రమే కాదని, తమ వద్ద వీడియో కూడా ఉందని పోలీసులు చెబుతారు.

Also Read: క్షీరాబ్ధి ద్వాదశి రోజు తప్పనిసరిగా చదువుకోవాల్సిన వ్రత కథ!

వసుధార అరెస్ట్!
ఆ వీడియో చూపిస్తారు. ఆ వీడియోలో వసు చిత్ర కుటుంబ సభ్యులతో మాట్లాడుతూ ఉంటుంది... ఏం మాట్లాడింది అనేది మాత్రం వినపడలేదు. ఆ వీడియో ఆధారంగానే వసుని అరెస్టు చేయడానికి వచ్చామని పోలీసులు చెబుతారు.  ఇది చూసి రిషి కూడా షాకౌతాడు. నాకు తెలీకుండా నువ్వు చిత్రను కలిశావా? అని అడుగుతాడు . కలిశాను అని చెబుతుంది. ఈ లోగా, మీడియా వాళ్లు రావడం, చిత్ర బాయ్ ఫ్రెండ్ మరింత హడావుడి చేస్తాడు. తమ ప్రేమను అందరి ముందు ఫ్రేమ్ చేసి, మీడియా ముందు చెప్పి, పరువు తీస్తానని వసుధార మేడమ్ బెదిరించిందని, అందుకే చిత్ర సూసైడ్ చేసుకుందంటాడు. వాళ్ల కాలేజీ స్టూడెంట్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే, తమ కాలేజీకి చెడ్డ పేరు వస్తుందని ఇలా చేశారని ఆరోపిస్తాడు. అప్పటికీ, తాను కాళ్లావేళ్లా పడి బతిమిలాడామని చెబుతాడు. అయితే, వసు అదంతా అబద్ధం అని చెబుతుంది. వీడియోలో తాను మాట్లాడింది వేరు అని చెబుతుంది. వాళ్లు నిజంగా ప్రేమించుకుంటే తాను ఎందుకు కాదంటానని పోలీసులకు అర్థమయ్యేలా చేసే ప్రయత్నం చేస్తుంది. చిత్ర పేరెంట్స్ కూడా వసుధార బెదిరించడం వల్లే ఇలా చేసుకుందని చెబుతారు. అది విని అందరూ షాకౌతారు.  
ఎపిసోడ్ పూర్తయ్యింది. 

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply

క్షీరాబ్ధి ద్వాదశి పూజా విధానం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నటి తమన్నాని ప్రశ్నించిన ఈడీ, మనీ లాండరింగ్ కేసులో విచారణహమాస్ చీఫ్ సిన్వర్ హతం, కీలక ప్రకటన చేసిన ఇజ్రాయేల్సల్మాన్ ఖాన్‌కి మరోసారి బెదిరింపులు, వాట్సాప్‌లో మెసేజ్‌అంబానీ Vs మస్క్: బిలియనీర్స్ మధ్య వార్ ఎందుకు!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana latest News: మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
మూసీ నిర్వాసితుల వద్దకు ఇద్దరం వెళ్దామని రేవంత్‌కు హరీష్‌ సవాల్‌- నది చుట్టూ రిటైనింగ్ వాల్ నిర్మించాలని కిషన్ రెడ్డి డిమాండ్
Talliki Vandanam News: ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
ఆంధ్రప్రదేశ్‌లో జనవరి నుంచి తల్లికి వందనం పథకం అమలు- ఎవరెవరికి ఇస్తారంటే?
HYDRA Updates: మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
మరో బిగ్ ఆపరేషన్‌కు సిద్ధమవుతున్న హైడ్రా- ట్రాఫిక్ పోలీసు అధికారులతో సంప్రదింపులు
Ticket Reservation Update: ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
ట్రైన్ టికెట్ల అడ్వాన్స్‌ బుకింగ్‌ గడువు తగ్గించడానికి కారణమేంటీ? మేలు ప్రయాణికులకా? రైల్వేశాఖకా?
Suriya 44: సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
సూర్య గ్యాంగ్‌స్టర్ కాదు... కొత్త సినిమా బ్యాక్‌డ్రాప్ మీద క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
Tirumala Darshan Ticket For January 2025: తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
తిరుమల భక్తులకు గుడ్ న్యూస్- కొత్త ఏడాదిలో స్వామి దర్శన టికెట్లపై కీలక అప్‌డేట్ 
Yahya Sinwar: చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
చావు కోసం ఎదురు చూస్తూ కసితో కత్తి దూసిన సిన్వార్‌ - సినిమా సీన్‌ను తలపిస్తున్న వీడియో
IND vs NZ: బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
బెంగళూరు టెస్టులో భారత్‌పై సెంచరీతో కదం తొక్కిన రచిన్ - తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌కు 356 పరుగుల ఆధిక్యం
Embed widget