అన్వేషించండి

Guppedantha Manasu November 22nd Episode: శైలేంద్రలో ఈ యాంగిల్ కూడా ఉందా - మహేంద్ర అనుపమ అల్లరి చూసి మరిసిన రిషిధార!

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలు సాగుతూనే ఉన్నాయి..ఇంకోవైపు అనుపమ ఎంట్రీ ఇచ్చింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu November 22nd Episode (గుప్పెడంతమనసు నవంబరు 22 ఎపిసోడ్)

 రిషి, మ‌హేంద్ర వ‌ల్లే జ‌గ‌తి చ‌నిపోయిందనే దేవయాని మాయమాటలు నమ్మేస్తుంది అనుపమ. మహేంద్రని-రిషిని కలిసి వారు బాధపడేలా మాట్లాడుతుంది.  అనుప‌మ వేసిన నింద‌ల‌తో మ‌హేంద్ర హ‌ర్ట్ అవుతాడు. రూమ్ లో ఉన్న మహేంద్ర దగ్గరకు వెళ్లి..మీ ఫ్రెండ్ ని అవైయిడ్ చేయ‌డం బాగా లేద‌ని తండ్రిని అంటాడు. నేనెందుకు పారిపోతానని మహేంద్ర అంటే.. మరి పదండి ఆమెతో మాట్లాడుదాం అంటాడు. నేను ఆమెను ఫేస్ చేయలేను అనేస్తాడు. 
రిషి: మరి పదండి..ఆమెను వెళ్లిపోమని చెబుతాం
మహేంద్ర: నేను అలా చెప్పలేను
రిషి:మీరు ఫ్రెండ్స్ అన్నారు..క్లోజ్ ఫ్రెండ్ ని ఇలా అవాయిడ్ చేస్తారా..మీరిలా చేస్తే ఆవిడ ఫీలవరా...ఇంతదూరం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తే ఇలా వదిలేస్తారా
మహేంద్ర: తనతో మాట్లాడాలని ఉంది కానీ తను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేను
రిషి:ఇలా గ‌ట్టిగా మాట్లాడేవాళ్లు, నిల‌దీసేవాళ్లు లేక‌పోవ‌డంతోనే నేను అమ్మ‌కు దూర‌మ‌య్యాన‌ు. అమ్మ బ‌తికి ఉన్న‌ప్పుడే ఆమె  మ‌న జీవితాల్లోకి వ‌స్తే ప‌రిస్థితులు వేరేలా ఉండేవి. మీరు నార్మల్ గా ఉండండి...ఆమె మాటల్లో అమ్మపై ప్రేమ కనిపిస్తోంది..మిమ్మల్ని కూడా చాలా అభిమానిస్తోంది...
రిషి మాటలకు రియలైజ్ అయిన మహేంద్ర..అనుపమతో మాట్లాడేందుకు సరే అంటాడు

Also Read: అనుపమ ప్రశ్నలకు రిషి, మహేంద్ర ఉక్కిరిబిక్కిరి - శైలేంద్రకి ధరణి బడితిపూజ!

కిచెన్లో కాఫీ కలుపుకుంటూ వసుధారతో మాట్లాడుతూనే ఎంక్వైరీ కొన‌సాగిస్తుంది అనుప‌మ‌. స్టూడెంట్‌గా కాలేజీలోకి అడుగుపెట్టి రిషిని లైన్‌లో పెట్టి ఇప్పుడు డీబీఎస్‌టీ కాలేజీకి వ‌సుధార‌ ఎండీ అయ్యింద‌ని వ‌సుధార గురించి దేవ‌యాని అన్న మాట‌లు గుర్తుచేసుకుంటుంది. నీ కంటే ముందు ఎండీ ప‌ద‌విలో ఎవ‌రు ఉండేవారు అని వ‌సుధార‌ను అడుగుతుంది అనుప‌మ‌. జ‌గ‌తి అని చెబుతుంది. ఆమె ప్లేస్‌ను నువ్వు భ‌ర్తీ చేశావా? అని మ‌రో ప్ర‌శ్న అడుగుతుంది అనుప‌మ‌.
వసు: జ‌గ‌తి మేడ‌మ్ ప్లేస్‌ను నేను భ‌ర్తీ చేయ‌లేన‌ు
అనుపమ: డ‌బ్బు హోదాల‌లో దేనికి ప్రాముఖ్య‌త‌నిస్తావ‌ు
వసు: ఆ రెండింటి కంటే ప్రేమ‌కే ప్రాముఖ్య‌త‌నిస్తాన‌ు...డ‌బ్బు మ‌నిషికి అవ‌స‌రం మాత్ర‌మే...హోదా అన్న‌ది మ‌నిషిలో ఉండే భావ‌న మాత్ర‌మేన‌ని వ‌సుధార చెబుతుంది.
అనుపమ: ఏది ఏమైనా నీకు తెలియ‌కుండానే నువ్వు ఏండీ అయ్యాన‌ని అంటావు అంతేనా 
వసు: మీరు జ‌గ‌తి మేడ‌మ్ ఫ్రెండ్ అంటున్నారు. మేడ‌మ్ నాకు ఏంతో మీరు నాకు అంతే అని వ‌సుధార బ‌దులిస్తుంది. 
వ‌సుధార చాలా తెలివైంద‌ని అనుప‌మ అనుకుంటుంది.
అనుప‌మ, మ‌హేంద్ర పోటీప‌డి ఒక‌రికి ఇష్ట‌మైన వంట‌కాల్ని మ‌రొక‌రు వ‌సుధార‌కు చెబుతారు. వాటిని సిద్ధం చేయ‌మ‌ని ఆమెతో అంటారు.

ALso Read: అనుపమను దారి మళ్లించే ప్రయత్నంలో దేవయాని, రిషిధార ఎలా చెక్ పెడతారు!

శైలేంద్ర డ్రామా
ధ‌ర‌ణి వంటగదిలో బిజీగా ఉంటుంది...నాటకంలో భాగంగా శైలేంద్ర ఆమె దగ్గరకు వెళ్లి డ్రామా స్టార్ట్ చేస్తాడు. నువ్వు ఇలా క‌ష్ట‌ప‌డితే చూడ‌లేక‌పోతున్నాన‌నూ బాధ‌ప‌డ‌తాడు. పనిమనిషిని పెట్టనా అని అడుగుతాడు. అదంతా నటన అని తెలుసుకోలేకపోయిన ధరణి...ఎక్కువ ఫీలైపోతుంది. మొన్నటి వరకూ అంతా కష్టంగా అనిపించేది కానీ మీరు నాపై ప్రేమను చూపిస్తుంటే ఇవేమీ కష్టంగా అనిపించడం లేదంటుంది. శైలేంద్ర చేతిలో ఏదో ఉండడం చూసి ఏంటది అని అడుగుతుంది. ప్రేమగా నీకో  గిఫ్ట్ తీసుకొచ్చానని చెప్పి చీర ఇస్తాడు. ఆ రేంజ్ లో ప్రేమను తట్టుకోలేక ధరణి కన్నీళ్లు పెట్టుకుంటుంది. మా ఆయనేంటి ఇలా గిఫ్ట్ తీసుకొచ్చాడని అనుకుంటున్నావా అని మళ్లీ డైలాగ్స్ స్టార్ట్ చేస్తాడు. ప్రేమ, మాయ, మబ్బులు అని ధరణిని నిండా ముంచే పనిలో పడ్డాడు..ధరణి మాత్రం ఇదంతా నిజమే అనుకుంటోంది.నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటే నా గుండె తట్టుకోలేదు..ఇంకా ముందు ముందు నిన్నింకా సంతోషంగా చూసుకుంటాను...మనస్ఫూర్తిగా చెబుతున్నాను..నువ్వు ఇక్కడున్నావ్ అని మరో నాలుగు డైలాగ్స్ వేస్తాడు.. థ్యాంక్స్ అని ధరణి అంటే..అంతేనా అని కొంటెగా అడుగుతాడు. కాఫీ ఇవ్వనా అంటే..ఈ టైమ్ లో ఏం కావాలో తెలియదా అని ...వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి వెళ్లిపోతాడు. ధరణి మాత్రం మురిసిపోతుంది...మా ఆయన మంచి మనిషిలా అయ్యేలా చూడు స్వామీ అనుకుంటుంది...

Also Read: ఈ 4 రాశులవారికి ఈరోజు అదిరింది, నవంబరు 22 రాశిఫలాలు

మరోవైపు అందరూ కలసి భోజనం చేస్తుంటారు..నేను వడ్డిస్తానని మహేంద్ర..అనుపమకి వడ్డిస్తాడు.. అనుపమ హ్యాపీగా ఫీలవుతుంది... అనుపమ-మహేంద్ర ఇద్దరూ కొసరి కొసరి వడ్డించుకోవడం చూసి రిషి-వసు మురిసిపోతారు. డైనింగ్ టేబుల్ దగ్గర మహేంద్ర-అనుపమ కాలేజ్ డేస్ లో ఉన్నట్టే బాగానే అల్లరి చేస్తారు. ఇద్దరూ కాలేజీ విషయాలు మాట్లాడుకుంటారు..జగతిని గుర్తుచేసుకుంటారు. ఇంతలో వసుధార... మేడం మీ హస్బెండ్ ఏం చేస్తారు, పిల్లలు ఎంతమంది అని అడుగుతుంది..అనుపమ ఒక్కసారిగా డల్ అయిపోతుంది...మహేంద్ర మాట్లాడుతున్నా సైలెంట్ గా ఉండిపోతాడు... ఏంటిది వసుధారా అని రిషి వసుని మందలిస్తాడు. భోజనం అయ్యాక ఐస్ క్రీం తీసుకొచ్చి ఇస్తాడు మహేంద్ర.నీకింకా నా ఇష్టాలు గుర్తున్నాయా అని అనుపమ అడిగితే..నేను ఏవీ మర్చిపోలేదు నువ్వే నన్ను అర్థంచేసుకోక తప్పుపడుతున్నావ్ అంటాడు. నాకు నిజాలు తెలియాలని అడుగుతున్నానంతే అంటుంది అనుపమ. ఆ తర్వాత అనుపమ బయలుదేరుతుంది..
అనుపమ: ఇంతకుముందు నువ్వు నన్ను ఓ క్వశ్చన్ అడిగావ్..నేను ఇప్పుడు దానికి సమాధానం చెబుతాను. నేను పెళ్లి చేసుకోలేదు.. ఒంటరిగానే ఉన్నాను..మీ మేడం పెళ్లి చేసుకుని ఒంటరిగా ఉంది..నేను పెళ్లిచేసుకోకుండా ఒంటరిగా ఉన్నాను..
అనుపమా...అని గట్టిగా అరిచిన మహేంద్ర..నువ్వు మళ్లీ రావద్దు అనేసి లోపలకు వెళ్లిపోతాడు...
రిషి: డాడ్ అలానే అంటారు మేడం..మీరు వస్తూ ఉండండి
అనుపమ: నువ్వు వద్దన్నా వస్తూనే ఉంటాను.నువ్వు అడిగావు కదా మీ అమ్మ బాధలోంచి డాడీని బయటకు తీసుకురమ్మని కచ్చితంగా ఆ పని చేస్తాను..అనేసి వెళ్లిపోతుంది...

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
IND vs SA 4th T20I Highlights: తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
తిలక్ వర్మ, శాంసన్ సెంచరీలతో దక్షిణాఫ్రికాపై భారత్ ఘన విజయం, 3-1తో టీ20 సిరీస్ కైవసం
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
Mike Tyson vs Jake Paul Boxing Live Streaming: 58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
58 ఏళ్ల మైక్ టైసన్, 27 ఏళ్ల జేక్ పాల్‌ నేటి బాక్సింగ్ మ్యాచ్‌పై ఉత్కంఠ, స్ట్రీమింగ్ ఎక్కడంటే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
Musi River: అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
అచ్చం మూసీలాగే దక్షిణ కొరియాలోని హాన్ నది - పరిశీలించిన తెలంగాణ శాసన బృందం
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Embed widget