అన్వేషించండి

Guppedantha Manasu November 18th Episode: అనుపమను దారి మళ్లించే ప్రయత్నంలో దేవయాని, రిషిధార ఎలా చెక్ పెడతారు!

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలు సాగుతూనే ఉన్నాయి..ఇంకోవైపు అనుపమ ఎంట్రీ ఇచ్చింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu November 18th Episode (గుప్పెడంతమనసు నవంబరు 18 ఎపిసోడ్)

 అనుపమ కాలేజీకి వెళ్లి మహేంద్ర గురించి అడుగుతుంది. జగతి మేడం చనిపోయినప్పటి నుంచి ఆయన కాలేజీకి రావడం మానేశారని చెప్పడంతో జగతి గురించి ఎంక్వరీ చేస్తుంది. ఇంతలో అక్కడకు వచ్చిన శైలేంద్ర అనుపమని చూసి షాక్ అవుతాడు.  మమ్మీ చెప్పిన అనుపమ తనే కదా తనకి ఇక్కడ ఏం పని వాళ్లతో ఏం మాట్లాడుతుంది అని టెన్షన్ పడుతాడు. లెక్చరర్స్ తో మాట్లాడి అనుపమ వెళ్లిపోయిన తర్వాత వెళ్లి వాళ్లని కలసిన శైలేంద్ర  ఏం మాట్లాడిందా అని ఆరా తీసి..జగతి మేడం గురించి ఎంక్వైరీ చేశారని చెబుతారు. ఈ విషయం దేవయానికి కాల్ చేసి చెబుతాడు శైలేంద్ర...అయితే రిషివసుధారని కలిస్తే మొత్తం నిజాలు తెలిసిపోతాయని టెన్షన్ పడుతుంది దేవయాని...రిషి వసుని కలవకముందే అనుపమని మన ఇంటికి తీసుకురా.. తన ఆలోచన మార్చి దారి మళ్లించాలంటే ఇదే కరెక్ట్ అని సలహా ఇస్తుంది. 

Also Read: బాధను ఒంటరిగా అనుభవించడం నేర్చుకున్నవాడే లైఫ్ లో పైకొస్తాడు, ఏమోషన్ పిండేసిన రిషి!

శైలేంద్ర-అనుపమ-దేవయాని
వెళ్లి అనుపమను కలసిన శైలేంద్ర...మీరు ఎవరు ఇక్కడికి ఎందుకొచ్చారని ఆరా తీస్తాడు. నేను మహేంద్ర కోసం వచ్చానని చెప్పడంతో .. అవునా బాబాయ్ కోసమా అని అనడంతో నువ్వు దేవయాని కొడుకువా అంటుంది అనుపమ. మా మమ్మీ మీకు తెలుసా ఇప్పుడే కాల్ చేసి చెబుతానంటూ కాల్ చేసి...తనని ఇంటికి తీసుకురావాలా సరే నువ్వే మాట్లాడు అని ఫోన్ ఇస్తాడు. దొంగ ప్రేమ నటిస్తుంది. ఇన్నాళ్లూ ఎక్కడికి వెళ్లిపోయావ్, ఏమైపోయావ్, అవన్నీ ఇప్పుడు ఎందుకు ఇంటికి వచ్చేయి. ఇక్కడికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం అనడంతో నేను అందుకోసం రాలేదు రిషి వసుధారల కోసం వచ్చాను అని అంటుంది అనుపమ. అలా కాదు అనుపమ నువ్వు ఇక్కడికి వస్తే జగతికి సంబంధించిన చాలా విషయాలు నీకు చెప్పాలి అంటుంది. నువ్వు వస్తే జగతి గురించి చెప్పుకుని నా బాధ తగ్గించుకుంటానంటుంది. శైలేంద్ర తీసుకొస్తాడని చెప్పి కాల్ కట్ చేస్తుంది. అనుపమని ఇంటికి తీసుకెళ్లేందుకు శైలేంద్ర ప్లాన్ చేస్తాడు... రమ్మని అడుగుతాడు..అయితే ముందుగా రిషి వసుధారతో మాట్లాడాలి అంటుంది అనుపమ. వాళ్లు ఇవాళ లీవ్ అని అబద్ధం చెబుతాడు..అప్పుడే కాలేజీలోకి ఎంట్రీ ఇస్తారు రిషి, వసుధార. వాళ్లని చూసి షాక్ అయిన శైలేంద్ర.. అనుపమ వాళ్లని కలవకుండా వేరే దారిలో తీసుకెళ్తాడు. జగతి ఫొటో దగ్గరకు తీసుకెళ్లి పిన్ని అంటే నాకు ఇష్టం ప్రతిరోజు పూజలు చేస్తా అని లేని ప్రేమ నటిస్తాడు.  జగతి ఫోటో చూసి అనుపమ బాధపడుతుంది. 

Also Read:  రంగంలోకి దిగిన జర్నలిస్ట్ అనుపమ - దేవయాని,శైలేంద్రకి దబిడి దిబిడే!

దేవయాని - అనుపమ
దేవయాని: మీ పిన్నికి తను క్లోజ్ ఫ్రెండ్..వాళ్ల  పెళ్లి దగ్గరుండి జరిపించిందని శైలేంద్రకి చెబుతుంది. 
అనుపమ: మీకు ఆ పెళ్లి ఇష్టం లేదు కదా
దేవయాని: మనుషులు ఎప్పుడూ ఒకేలా ఉండరు కదా..జగతిని మొదట్లో ఇష్టపడని నేను ఆ తర్వాత మనస్ఫూర్తిగా అంగీకరించాను.. తన మంచితనం, నడవడిక అంతలా ఆకట్టుకున్నాయి..నా బిడ్డలా చూసుకున్నాను
అనుపమ: అంతబాగా చూసుకున్నారు..మరి ఇల్లు వదిలి వెళ్లిపోతే ఏం చేశారు
దేవయాని: తన ఆత్మాభిమానం సంగతి తెలిసిందే కదా..ఇల్లు వాకిలి భర్త కొడుకు కాదనుకుని వెళ్లిపోయింది పాపం ఒంటరిది అయిపోయింది
. అప్పుడు నేను ఎంత బాధపడ్డానో..జగతి సంతోషం కోసం నువ్వు ఎదిరించి వాళ్ల పెళ్లిచేశావ్ కానీ తనకి ఆ సంతోషమే దక్కకుండా పోయింది.  మహేంద్ర కూడా ఏ రోజూ తిరిగి తీసుకురాలేదు..
శైలేంద్ర: బాబాయ్ పిన్నితో బాగానే ఉండేవాడు కదా
దేవయాని: అది ఈ మధ్యే..మొన్నటి వరకూ పట్టించుకోలేదు..మీ బాబాయ్ గొడవల్ని భూతద్దంలోంచి చూసి పెద్దవి చేశాడు
దేవయాని: మీరైనా మహేంద్రకి నచ్చచెప్పాలి కదా..భార్య భర్త మధ్యలో తలదూర్చితే ఇబ్బందని చెప్పి నేనే గమ్మున ఉండిపోయాను
ధరణి కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది....
దేవయాని: ధరణి తను జగతి ఫ్రెండ్ అని పరిచయం చేసి..అనుపమ ముందు ధరణిని పొగిడేస్తుంది. 
అనుపమ: అంటే మీరు చెప్పిన మాట వింటుంది కాబట్టి మీకు నచ్చుతుందా
దేవయాని: అలా అని కాదు..చాలా మంచి అమ్మాయి అని చెబుతున్నా..ఎప్పుడూ పని ధ్యాసే కానీ వేరే ఆలోచన ఉండదు
అనుపమ: మీకు పని కల్పించడం లేదు కాబట్టి మంచి అమ్మాయి...
శైలేంద్ర: నిజంగానే మా ఆవిడ చాలా మంచిది..
దేవయాని: తనేదో తమాషాగా అంటోంది శైలేంద్ర అనేసి..నువ్వెళ్లి పనిచూసుకో అంటుంది
అనుపమ: అసలు జగతి ఎలా చనిపోయింది
దేవయాని: ఎవడో రిషిని చంపబోతుంటే జగతి అడ్డుపడి పోయింది..అసలు ఏం జరిగిందో ఎవ్వరికీ తెలియదు.. అక్కడ స్పాట్ లో ఉన్నది ఆ ముగ్గురే.. రిషి-వసుధార-జగతి...
శైలేంద్ర: అంతకు ముందునుంచీ ప్రమాదాలు ఎదురవుతూనే ఉన్నాయి కదా..పిన్ని ఎండీగా చేసినప్పటి నుంచీ అంతే.. ఆ ఎండీ సీట్ విషయంలో ఎన్నో గొడవలు...దాని గురించి వసుధార-పిన్ని గొడవలు పడ్డారు..వాళ్ల ఆర్గుమెంట్స్ తీర్చలేక రిషి నలిగిపోయాడు...
అనుపమ: మీరెప్పుడూ ఎండీసీట్ కావాలి అనుకోలేదా...ఎవరికైనా ఆశ ఉంటుంది కదా..
శైలేంద్ర: డాడ్ లానే నేనూ కాలేజీకి వెళతాను ...నా పనులు చూసుకుని వచ్చేస్తాను 
దేవయాని: ఎండీ సీట్లో కూర్చున్నప్పటి నుంచే జగతికి కష్టాలు...తన చుట్టూ ఎన్నో కుట్రలు చేశారు...
అనుపమ ఆలోచనలో పడుతుంది....
ఎపిసోడ్ ముగిసింది...

ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

వీడియోలు

Virat Kohli 71st PoTM Award | తన తల్లితో అనుబంధాన్ని, సచిన్ పై ప్రేమను మరో సారి చాటిన కోహ్లీ | ABP Desam
Virat Kohli Reached Second Place | సంగక్కరను దాటేసి...సచిన్ తర్వాతి స్థానంలో విరాట్ | ABP Desam
Pawan kalyan induction into Kenjutsu | జపాన్ కత్తిసాము కళలోకి పవన్ కళ్యాణ్ కు అధికారిక ప్రవేశం | ABP Desam
MI vs DC WPL 2026 Highlights | ముంబై ఘన విజయం
Vaibhav Suryavanshi India vs Scotland U19 | వార్మప్ మ్యాచ్‌లో అదరొట్టిన వైభవ్!

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Good news for Telangana government employees: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ - ఒక డీఏ ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
Andhra IAS Transfers: ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
ఏపీలో 14 మంది ఐఏఎస్‌ల బదిలీ - పలు చోట్ల మున్సిపల్ కమిషనర్లు మార్పు
Hatao Lungi Bajao Pungi: ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
ముంబైలో హటావో లుంగీ, బజావో పుంగీ నినాదం - రాజ్ ఠాక్రే పై అన్నామలై విమర్శలు
Kishan Reddy: పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయహోదా సాధ్యం కాదు - ఉపాధి హామీ పథకం బలోపేతం - కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
AP CM Chandrababu: పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
పుష్కరాలలోపు పోలవరం ప్రాజెక్టు పూర్తి, 25 శాతం విదేశీ పెట్టుబడులు ఏపీకే: సీఎం చంద్రబాబు
Guntur Latest News:గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
గుంటూరు జిల్లాలోని రావిపాడు గ్రామ ఆరోగ్య కేంద్రంలో కాలం చెల్లిన మందులు- ఎమ్మెల్యే ఆగ్రహం
Rapido Driver Selling Ganja: హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్
హైదరాబాద్‌లో గంజాయి దందా.. బంజారాహిల్స్‌లో ర్యాపిడో డ్రైవర్ అరెస్ట్, మరోచోట సైతం గంజాయి సీజ్
Mana Shankara Varaprasad Garu : 'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్లో విషాదం - మూవీ చూస్తూ కుప్పకూలిన అభిమాని
'మన శంకరవరప్రసాద్ గారు' థియేటర్లో విషాదం - మూవీ చూస్తూ కుప్పకూలిన అభిమాని
Embed widget