అన్వేషించండి

Guppedantha Manasu November 16th Episode: రంగంలోకి దిగిన జర్నలిస్ట్ అనుపమ - దేవయాని,శైలేంద్రకి దబిడి దిబిడే!

Guppedantha Manasu Today Episode: రిషి-వసుధార మధ్య బంధం బలపడింది...మరోవైపు శైలేంద్ర కుట్రలు సాగుతూనే ఉన్నాయి..ఇంకోవైపు అనుపమ ఎంట్రీ ఇచ్చింది...ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే...

Guppedantha Manasu November 16th Episode (గుప్పెడంతమనసు నవంబరు 16 ఎపిసోడ్)

కిచెన్లో వంటచేస్తున్న రిషితో ఎందుకుసర్ ఇదంతా అంటుంది వసుధార. ఇంట్లో ఎక్కడెక్కడ ఏమున్నాయో కూడా మీకు తెలియదు అంటుంది. ఇదిగో ఉప్పు, ఇదిగో కారం అంటూ అన్నీ చూపిస్తూ..బియ్యాన్ని ఒంపేస్తాడు..అవి ఇద్దరిపై తలంబ్రాలులా పడతాయి.. కాసేపు ఇద్దరి కళ్లు కలుస్తాయి..సెల్ఫీలు తీసుకుని హ్యాపీగా టైమ్ స్పెండ్ చేస్తారు...

అనుపమ వచ్చిందని..మహేంద్రని కలిసిందని..దేవయాని టెన్షన్ పడుతుంటుంది. వాళ్లు అక్కడ ఉండిపోవడం వల్లే ఇదంతా జరుగుతోంది.. మన కళ్లముందు ఉండిఉంటే వాళ్ల ప్లాన్స్ ఏంటో తెలిసేవి అంటుంది. నువ్వు టెన్షన్ పడొద్దు..ఇకపై అక్కడ ఏం జరిగినా తెలిసి తీరుతుంది అంటాడు..ఇంతలో అక్కడకు వచ్చిన ఫణీంద్ర..లాగిపెట్టి కొడతాడు. 
ఫణీంద్ర: ఎప్పుడు చూసినా తీవ్రవాదుల్లా చర్చలు పెడుతూనే ఉంటారు..నీకు ఏం తెలియాలని శైలేంద్రపై ఫైర్ అవుతాడు. ధరణిని పిలిచి నీకు అప్పగించిన పని ఏం చేశావ్ అని అడుగుతాడు
ధరణి: నా ప్రయత్నం నేను చేస్తున్నాను కానీ వాల్లిద్దరూ మాట్లాడుకుంటునే ఉన్నారంటుంది
ఫణీంద్ర: ఇంట్లో అనర్థాలకు కారణం మీరిద్దరే అనిపిస్తోంది.. మహేంద్ర ఇంట్లోంచి వెళ్లిపోవడానికి కారణం మీరే...అసలు జగతి చావు వెనుక కూడా మీ హస్తం ఉందా ఏంటి
ఈ మాట వినగానే దేవయాని - శైలేంద్ర షాక్ అవుతారు...
నువ్వు ఫారిన్ వెళ్లి ఏం చేశావ్..ఏం నేర్చుకుని వచ్చావ్..అసలు నీ పెళ్లి జరిగి ఎన్నాళ్లైంది... వేళ్లు లెక్కలు పెడుతున్న శైలంద్రకి క్లాస్ వేస్తాడు ఫణీంద్ర.. రోజంతా ఎంత బిజీగా ఉన్నా భర్తతో గడిపిన పది నిముషాలు వారికి చాలా సంతోషాన్నిస్తుంది... పెళ్లై ఇన్నాళ్లైంది ఇంతవరకూ పిల్లలు లేరు..నీ ప్రవర్తనలో మార్పు రాకపోతే నువ్వు ఇక్కడ ఉండొద్దు మళ్లీ తిరిగి ఫారెన్ వెళ్లిపో అని హెచ్చరిస్తాడు. దేవయానీ నీకు మళ్లీ చెబుతున్నాను జాగ్రత్త అనేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు...
ధరణి: మావయ్య జాగ్రత్తలు చెప్పారు కదా అలాగే ఉండొచ్చు కదా అనేసి ధరణి వెళ్లిపోతుంది...
దేవయాని: జగతి చావు విషయంలో మన హస్తం ఉందంటున్నారు
శైలేంద్ర: అన్నిటికీ నా దగ్గర సొల్యూషన్ ఉంది 

Also Read: కిచెన్లో స్వతంత్రం కావాలంటున్న రిషి సర్, జగతి కేసు ఇన్వెస్టిగేషన్ మొదలెట్టిన అనుపమ!

అనుపమ మాటలు గుర్తుచేసుకుని మహేంద్ర బాధపడుతూ ఉంటాడు..ఇంతలో అనుపమ కాల్ చేస్తుంది..
మహేంద్ర: కట్ చేస్తుంటే కాల్ చేస్తావేంటి..నువ్వు తెలుసుకోవాల్సింది బ్యాలెన్స్ ఉందా..నా కొడుకు అన్ని విషయాలు చెప్పాడు కదా..ఇంకా కాల్ చేస్తున్నావ్...నేను జగతిని చంపాను అన్నావ్ కదా..అలా ఎలా మాట్లాడుతున్నావ్
అనుపమ: ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు.. 
మహేంద్ర: చెప్పాలి అనిపించలేదు..చెప్పలేకపోయాను... ఏంటి అనుపమ..నీజర్నలిస్ట్ మైండ్ తో నన్ను ఇంటరాగేషన్ చేస్తున్నావా
అనుపమ: తెలుసుకోవాలి అనుకుంటున్నాను...
మహేంద్ర: నన్ను ఏమీ అడగొద్దు...పూర్తిగా తెలికుండా మాట్లాడకు..నీకు తెలిసింది గోరంత
అనుపమ: జగతి చనిపోయాక మీరంతా ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు..నేను జర్నలిస్ట్ గా అడగడం లేదు..ఫ్రెండ్ గా అడుగుతున్నాను
మహేంద్ర: ఈ విషయంలో నేను ఏదీ చెప్పలేను...అనుపమ ప్లీజ్..ఈ విషయం ఇంతటితో వదిలేయ్..
అనుపమ: నాకు జగతి గురించి అన్ని విషయాలు తెలియాలి
మహేంద్ర: జగతిని గుర్తుచేసి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నావ్..నేను బతికి ఉన్నాను కానీ నా మనసు నా దగ్గర లేదు..ఓ పట్టాన ఉండలేకపోతున్నాను..జగతితో గడిపిన జ్ఞాపకాలు తలుచుకుంటే నా గుండె ముక్కలైపోతోంది..జగతి నా ప్రాణం అని నీకు తెలుసుకదా..నా ప్రాణం నన్ను వదిలిపోయింది..ఇంకా నీకు ఏం చెప్పాలి
అనుపమ: జగతిని ఎవరు చంపారో తెలుసుకోవాలి లేదా..ఇన్ని రోజులనుంచి ఏం చేస్తున్నారు..తనే నీ ప్రాణం అనుకుంటే నువ్వు ఇలా ఉండవు, జగతి బతికి ఉన్నన్ని రోజులు దూరంగానే ఉన్నావు కదా..తను చనిపోయాక గుర్తొస్తుందా..
స్టాపిట్ అని మహేంద్ర అరుస్తాడు...ఇంతలో అక్కడకు వస్తారు రిషి, వసుధార..
అనుపమ: జగతి గురించి నిన్ను అడగకపోతే ఇంకెవర్ని అడగాలి
మహేంద్ర: నువ్వు ఏ హక్కుతో అడుగుతున్నావ్..నన్ను ఇరిటేట్ చేయకు
అనుపమ: మీ ఇద్దర్నీ ఒకటి చేసింది ఎవరు..
మహేంద్ర: నీ ప్రశ్నలకు నేను కూడా చావాల్సిందే.. అంతేకదా.. అని కాల్ కట్ చేస్తాడు 
అనుపమ కాల్ చేస్తే డాడ్ ఎందుకు ఫ్రస్ట్రేట్ అవుతున్నారని వసుధారతో మాట్లాడుతాడు రిషి... అనుపకి నిజం తెలిసినా కూడా డాడ్ ఎందుకు ఇరిటేట్ అవుతున్నారు..అమ్మ గురించి తెలిసి ఆవిడ కూడా తట్టుకోలేకపోతున్నారు వసుధారా అని రిషి అంటే..మేడంని ఇష్టపడని వాళ్లంటే ఎవ్వరూ ఉండరంటుంది వసుధార...

Also Read: జగతి చనిపోయిందని అనుపమకి తెలిసిపోయింది, రిషిధారకి క్లారిటీ వచ్చేసినట్టేనా!

అనుపమ-విశ్వం-ఏంజెల్

అటు అనుపమ...మహేంద్ర మాటలు తలుచుకుని బాధపడుతుంది. అసలు జగతి గురించి అడిగితే ఎందుకు చెప్పడం లేదు.. అసలు అక్కడ ఏం జరుగుతోంది, ఎందుకు అందరూ మౌనంగా ఉంటున్నారు..జగతి ఎలా చనిపోయింది, ఆ చావుకి కారణం ఎవరో నాకు తెలియాలి.. నాకు అన్ని విషయాలు తెలియాలంటే నేను మహేంద్ర వాళ్ల దగ్గరకు వెళ్లాలి... జగతికి సంబంధించిన ప్రతి విషయం తెలుసుకోవాలి.. ఇప్పుడే అక్కడకు బయలుదేరుతాను అనుకుంటూ కిందకు దిగుతుంది... 
బ్యాగ్ తీసుకుని బయలుదేరిన అనుపమని చూసి విశ్వం, ఏంజెల్ షాక్ అవుతారు.. ఎక్కడకు బయలుదేరావ్ అని అడుగుతారు.. తేల్చుకోవాల్సిన లెక్కలున్నాయి అందుకే వెళుతున్నా అంటుంది. నువ్వు ఇన్నాళ్లూ దూరంగా ఉన్నావ్ ఇప్పుడు వచ్చావ్ మళ్లీ వెళతానంటున్నావని బాధపడతాడు విశ్వం. ఇకపై మిమ్మల్ని బాధపెట్టను డాడ్ అని మాటిస్తుంది అనుపమ...
ఎపిసోడ్ ముగిసింది...

Also Read: మనిషిలో విషసర్పం శేతత్వం పొందేందుకే నాగుల ఆరాధన, పుట్టలో పాలు పోసే టైమ్ ఇదే!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget