క్షీరాబ్ధి ద్వాదశి విశిష్టత ఏంటో తెలుసా!



కార్తీకమాసంలో నెలంతా అత్యంత పవిత్రమైనదే...ముఖ్యంగా కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకూ ఈ ఐదు రోజులు మరింత విశేషమైనవి



కార్తీక శుద్ద ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువు నిద్రనుంచి మేల్కొంటాడు..అందుకే దీనిని ఉత్థాన ఏకాదశి అని పిలుస్తారు.



ఆ మర్నాడు వచ్చే ద్వాదశిని చిలుకు ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని వివిధ రకాల పేర్లతో పిలుస్తారు.



యోగనిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు ఈ రోజు శ్రీ మహాలక్ష్మితో కలసి భూలోకానికి వస్తాడట.



అందుకే శ్రీ మహావిష్ణువు కొలువైన ఉసిరికి...శ్రీ మహాలక్ష్మి ఉండే తులసికి కళ్యాణం జరిపిస్తారు.



క్షీరాబ్ధి ద్వాదశి విశిష్టత గురించి భాగవతంలో అంబరీషుడి కథతో పాటూ కార్తీకపురాణంలో ప్రస్తావన ఉంది.



ద్వాదశి రోజ తులసి-ఉసిరి చెట్టును పూజించి అంబరీషుడి కథను విన్నా, చదివినా అనేక పాపాలు నశించి పుణ్యఫలం కలుగుతుందని కార్తీక పురాణంలో ఉంది.



Image Credit: Pinterest